నిజానికి మనుగడలో ఉండే చిన్న పత్రికలు ఈనాడూ ఆనాడూ ఏ నిజాల కోసం, సత్యాలకోసం అచ్చు కాబడవు, పెద్ద పత్రికలూ అంతేననుకోండి! వాటి గురి పెద్ద ప్రయోజనాలు నెరవేర్చుకోడంలో ఉంటుంది. చిన్న పత్రికలు కేవలం నాలుగు డబ్బులు గిట్టుబాటు కావడం కోసం మాత్రమే అచ్చవుతాయి. ఈ చిన్న పత్రికలవారికి అతి ముఖ్యంగా కావలసినవి అడ్వర్‌టైజ్‌మెంట్లు. ఇలాంటి పత్రికలు నిజంగా పత్రికల్లా ఉండవు.

మహాకవులు ఇలాంటి కథలు ఎందుకు వ్రాస్తారో నాకు అర్థం కాదు. శివపూజ చేస్తే పాపాలు పోతాయి అని చెప్పడానికి ఇంత మహా పాపాల్ని చేయించాల్నా? కనీసం భక్తి అనేదే లేక, అనాలోచితంగా జరిగిపోయిన పనులే పూజలుగా భావింపబడి–వినటానిక్కూడా అసహ్యం అనిపించే తనయాగమనం లాంటి భ్రష్టకార్యాలు కూడా మానవుడి ప్రయత్నం గానీ, కనీసం పశ్చాత్తాపం గానీ లేకుండా మాసిపోయేటట్లయితే–ఇక భక్తి దేనికి, సత్కర్మాచరణ ఎందుకు?

అల్లదివో సూశారా! అనపడతాంది కాలవ, ఆయ్! అది మాసేలకి నీల్ల కోసం తెల్లోళ్ళు తొవ్వించినదండి. ఇది పంట కాలవండి. పెద్ద కాలవమీద మాకోసమే లాకోటి కట్టిచ్చారండి. రెండు పంటలకి నీటికి కొఱవ లేదండి. ఆయ్! ఇక్కడ మొదలండి, ఇదిగిదిగో! ఇటు సూడండి. అల్లదిగో సింతసెట్టండి, అది దచ్చిన సరద్దండి, అల్లాపడతన్నాది కొబ్బరి సెట్లొరస, అదండి పచ్చిమ సరద్దు, ఆయ్! ఇటు సూడండి తాడిసెట్ల గుంపు, అదండి ఉత్తర సరద్దు.

కౌగిలించుకు
బతుకునిచ్చే నవ్వూ, మాటా,
ప్రతి కొత్త కోరికా
నువ్వేనని
నీ తొలి అడుగుకై
ప్రతి పడిగాపూ నాదే

“మొదటిసారి సుజాత ఇచ్చిన పాయసం వల్ల నా ప్రాణలు నిలిచి గౌతముడినైన నేను జ్ఞానోదయంతో ధర్మాన్ని కనుక్కోగలిగాను. ఆ రోజు సుజాత పాయసం ఇచ్చి ఉండకపోతే తథాగతుడే లేడు. బుద్ధత్వం పొందాక ప్రారంభించిన ధర్మ చక్ర పరివర్తనం ఈ రోజుకి దాదాపు పూర్తైంది. సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు; ప్రతీ ప్రాణీ అంతమై తీరుతుంది. ఆ క్రమంలోనే ఈ పరివర్తనం అనేది ఎప్పుడో ఒకసారి అంతమవ్వవల్సిందే కదా?”

కానీ ఈ పాటైనా, తక్కిన కృష్ణమ్మా గోపాలబాలా కృష్ణమ్మా హరి హరి గోవింద బాలా కృష్ణమ్మా, ఓ యశోద ఏమి చేయుదమే, నందగిరి బంగారుమామ చంద్రగిరి చీరలంపేవా, పాటల కైనా సాహిత్యాన్ని ఇవ్వటం కష్టమైన పని. సాధ్యంకాని పని అని చెప్పాలేమో! ఈ ఆడియోలో పాడిన పాఠం మీకు పుస్తకాలలో కనపడే పాఠాలకి భిన్నంగా ఉంటే ఆశ్చర్యం లేదు.

క్రితం సంచికలోని గడినుడి-29కి మొదటి ఆరు రోజుల్లోనే ఆరుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారు: 1. శైలజ/ఆగడి ప్రతిభ, 2. వైదేహి అక్కిపెద్ది, 3. అనూరాధా శాయి జొన్నలగడ్డ, 4. బండారు పద్మ, 5. ప్రణీత, 6. కోడిహళ్ళి మురళీమోహన్. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-29 సమాధానాలు, వివరణ.

అడ్డం ఒక సంవత్సరం సంతోషం (3) సమాధానం: ఆనంద పుట్టలో పుట్టిన కవి? (3) సమాధానం: వాల్మీకి ఎటునుండి చూసినా ఎక్కువే (3) సమాధానం: […]

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

ఈమాట జులై 2007 సంచికతో మొదలై నిరాఘాటంగా షుమారు పన్నెండేళ్ళు సాగిన నాకు నచ్చిన పద్యం శీర్షిక అనివార్య కారణాల వల్ల వచ్చే సంచిక నుండీ ఆగిపోతున్నదని చెప్పడానికి చింతిస్తున్నాం. కేవలం ఒక పద్యానికి అర్థం చెప్పడమే కాదు, ఆ పద్యం ఎందుకు మంచి పద్యమో, అందులో కవి గొప్పతనమేమిటో, ఇలా వివరించి చెప్తూ పద్యకవిత్వపు లోతులని నేటి పాఠకులకు అందజేయడం ద్వారా వారికి పద్యాన్ని, తద్వారా కవిత్వాన్ని చదవడం ఎలాగో కూడా తెలియజెప్పిన శీర్షిక ఇది. మొదలైన నాటినుండీ ఎందరో పాఠకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన శీర్షిక ఇది. ఈ శీర్షికను ఇన్నేళ్ళపాటు సమర్థవంతంగా పాఠకాదరణకు ఇంతగా నోచుకొనేలా నిర్వహించిన చీమలమర్రి బృందావనరావు, భైరవభట్ల కామేశ్వరరావులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రతీ సంచికకూ కాకపోయినా, ఇక ముందు కూడా వారికి నచ్చిన పద్యాలను అప్పుడప్పుడు ఈమాట పాఠకులతో పంచుకుంటూ ఉంటారని, ఉండాలని ఆశిస్తున్నాం. ఇదే సందర్భంలో, ఈ శీర్షికను ఇక ముందు కొనసాగించటానికి, ఇదే ధోరణిలో తమకు నచ్చిన పద్యాలను పాఠకులకు పరిచయం చెయ్యడానికి, ఇతర కవిపండితరచయితలను సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

ఇటాలియన్ ఆపెరాలను తెలుగులో యక్షగానాలుగా పునఃసృజిస్తున్న తిరుమల కృష్ణదేశికాచార్యుల మరొక నాటిక సేవికయే నాయిక; నలభై అయిదేళ్ళకు పైగా అమెరికా విశ్వవిద్యాలయాలలో తన తెలుగు సాహిత్య పరిశోధనలో భాగంగా రాసిన వ్యాసాలే కాక ఎన్నో అనువాదాలు కూడా చేసిన ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు అమోఘమైన కృషిని తెలుగువారికి పరిచయం చేసే ఉద్దేశ్యంతో పరుచూరి శ్రీనివాస్ ఆయనతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం కోసం జరిపిన ఇంటర్‌వ్యూ; ఇటీవల మరణించిన విశిష్ట కథకుడు కవనశర్మ స్మృతిలో దాసరి అమరేంద్ర నివాళితో పాటూ ఆయన కథలు; ఇతర రచనలు, గడి నుడి…ఈ సంచికలో.

లా సెర్వ పద్రోనా అనునది జెన్నర్ ఆంతోనియో ఫ్రెదెరికో అను రచయిత ఇటాలియను భాషలో వ్రాసిన గేయరూపకమునకు ఇటాలియను సంగీతకర్త యగు జ్యోవానీ బత్తిస్తా పెర్గొలేసీ అను నతడు సంగీతరచన చేసిన లఘుసంగీతరూపకము. లోగట ఈమాటలో ప్రచురింపబడిన నారెండు ఆపెరాలవలెనే, ఇందులో గూడ సులువైన పదములుగల కంద, గీత, ఆటవెలదులను, గేయములను వ్రాసినాను.

ఈ మాటంటే చాలామందికి తీవ్రమైన అభ్యంతరం ఉండొచ్చు కాని, తెలుగు సాహిత్యం గురించి తెలుగు వాళ్ళకే ఎక్కువ తెలియదు. మనకి కొన్ని ముఖ్యమైన పుస్తకాల పేర్లు, వాటిని గురించిన పొగడ్తలు, ఆ పుస్తకాలు రాసిన కవుల గురించి చాలా వివరాలు తెలుసు. కానీ, దాని సాహిత్యార్థం ఇది; ఆ పుస్తకం చదివితే వచ్చే ప్రశ్నలు ఇవి, ఆ పుస్తకం చదవాల్సిన మార్గం ఇది, అని వివరించి చెప్పే వ్యాసాలు తెలుగు సాహిత్యంలో చాలా పుస్తకాల మీద రాలేదు.

దాదాపు కుష్యంత్‌సింగ్‌ను కలిసిన సమయంలోనే నాకు కవనశర్మతో మొట్టమొదటి సంపర్కం. అప్పటికి పాతికేళ్ళుగా ఆయన కథలూ నవలలూ వ్యంగ్య రచనలూ చదివి ఇష్టపడిన నేపథ్యంలో విశాఖ ద్వారకానగర్‌ లోని కందులవారింటికి వెళ్ళి కలిసి ఓ గంట గడిపి వచ్చాను. అప్పటికాయన ఏభైలు దాటుకొని అరవైకేసి వెళుతున్నారు. కానీ, ఆ మనిషిలోని వాడీ వేడీ వగరూ చూస్తే నాకు పాతిక ముప్పై ఏళ్ళ మనిషి అనిపించారు.

తెలుగు పెండ్లిళ్ళలో స్నాతకమనీ, నాగబలి అనీ, తలంబ్రాలు అనీ, మాంగల్యధారణ అనీ ఉండేవి కేవలం లాంఛనాలు అయితే కావచ్చునేమో గాని అప్పగింతల సమయం మాత్రం గొప్ప హృదయస్పర్శి అయిన సన్నివేశం. పెండ్లి చూడ్డానికి వచ్చినవాళ్ళకు అదొక తంతుగా కనిపించొచ్చు గాని, వధువుకూ, ఆమెని కన్నవారికీ మాత్రం అది వారికే అనుభవైకవేద్యమైన బాధ.

ఇది తెలుగులో ఎలా పుట్టింది? మీకు తెలియనిది ఒకటి ఉంది. అదేమిటంటే ఇదే సమయంలో అమెరికన్లు కూడా మీలానే ఇదే ప్రశ్న వేసుకుంటున్నారు. ఇక ర్యాండమ్ హౌస్, మెక్‌మిలన్, పెంగ్విన్, హార్పర్ కాలిన్స్ వంటి పెద్ద పెద్ద ప్రచురణ సంస్థల్లోని పెద్ద తలకాయలెన్నో తెగిపడబోతున్నాయి. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం వారికీ తెలియక, అవసరం తీరేలోపు వారికది దొరకక.

రాజు-మహిషిలోని లంబాచోడా ప్రసాద్ తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి చెరువుకు పరిగెత్తిన రాత్రి కురిసిన గాలీ వర్షాన్ని నేను ఎన్నడూ మరచిపోలేను. ఎక్కడో లాటిన్ అమెరికాలో ఎడతెరిపి లేకుండా కొన్ని వందల రోజులు కురిసిన వర్షాన్ని నేను చూడలేదుగానీ దానిని గార్షియా గాబ్రియెల్ మార్క్వెజ్ వర్ణించాడు. అందులో నేను దర్శించిన, చూచిన, తడిచి ముద్దయిన ఆ నా చూడని వర్షాన్ని కూడా నేను మరువలేను.

“ఎవరు మీరు? ఏం కావాలి?” అడుగుతుంది వరండాలోకి వచ్చిన ఆమె. ఆమెని గుర్తు పట్టాడు. “మీతో మాట్లాడాలి!” నిలబడలేక అక్కడే ఉన్న కుర్చీ వైపు చూస్తుంటే, “కూర్చోండి!” అని చెప్పింది. “మీరు కూడా కూర్చోండి!” కూచుంది అతని వైపే చూస్తూ “ఏ విషయం? కాలేజ్ విషయమయితే మీరు ఆఫీసుకు వచ్చి అక్కడే మాట్లాడండి.” “కాదు. పర్సనల్. మీకు నాగేంద్ర గుర్తున్నాడా? డిగ్రీ మొదటి ఏడు.”

మనం అంటున్నావ్. మనం అంటే ఎవరు? నువ్వూ, నేనూ మన పిల్లలూనా? మన పిల్లలు పెద్దవాళ్ళయ్యాక, వాళ్ళకి తల్లిదండ్రులమైన మనల్ని వాళ్ళ లిస్టు లోంచి తీసేస్తారు. కనుక మన లిస్టులో వాళ్ళని వేసుకున్నా వాళ్ళు మనల్ని వేసుకోరు. ఇంక మిగిలింది నువ్వూ నేనూ. ఇప్పుడు ఆలోచిద్దాం. నన్ను కన్న తల్లిదండ్రులు నా కుటుంబ పరిధిలోకి రారు. నేను కన్న పిల్లలు నన్ను వాళ్ళ పరిధిలోకి రానీయరు. ఇంక కేవలం నువ్వు మిగిలావ్.

తుఫాను గుప్పిట దాగిన సముద్రాన్నీ
ఇంద్ర ధనువైన ఆకాశాన్నీ
ఒకేలా ప్రేమించగలనని నేనంటే
అసలు నీకు ప్రేమంటేనే తెలియదంటావ్

శ్రీనివాసరావు కాకుండా ఆరోజు మరో ఇద్దరు బాగ్దాద్ నుంచి అదే విమానంలో బొంబాయి వెళ్తున్నారు. అందులో శివస్వామి తెలుగువాడే. “కల్సే వెళ్దాం” అన్నాడు శ్రీనివాసరావుతో. శ్రీనివాసరావు “మనం కల్సిరాలేదు. కల్సి వెళ్ళడం ఎందుకు?” అన్నాడు. శివస్వామి అసలే నాస్తికుడు. ఇనుముతో ఉన్న నిప్పుకి సమ్మెట పోట్లు తప్పవు. అతని దురదృష్టం తనకి అంటుకొంటుంది అనుకొన్నాడు శ్రీనివాసరావు.