ఎక్కిన వాళ్ళందరూ ఆ రైలు వాళ్ళదే అనుకుంటారు. వాళ్ళకే కాదు వాళ్ళ సామాన్లు పెట్టుకోడానికి స్థలం కోసం కొట్లాడతారు. కొంచెం స్థిరపడ్డాక కొత్తవాళ్ళు ఎక్కితే, మేము ముందే ఎక్కాం, రైలు మాది అని ఏదో అధికారం చూపే చూపులతో కాల్చేస్తారు. దిగేటప్పుడు ఒక్క నిమిషంలో అప్పటిదాకా వాళ్ళతో ప్రయాణించిన వాళ్ళందరిని ఒక్క క్షణంలో వదిలేసి గమ్యం వచ్చిందని ఆనందంగా వెళ్ళిపోతారు.

చదవడానికీ, రాయడానికీ మధ్య లింకు ఇంకా నేను కనుక్కోవలసే ఉంది. చదివితే ఆలోచన వస్తుంది. కానీ చదివినదాన్లోంచి రాదు. ఈ తేడా చాలా ముఖ్యం. ఎక్కడో ఒక కొనను పట్టుకుని పాక్కువెళ్ళడం లాంటిది. లేదా అది మనలోని నిద్రాణంగా ఉన్నదాన్ని దేన్నో తట్టిలేపుతుంది కావొచ్చు. అసలు ఏం జరిగి ఆలోచన వస్తుందో చెప్పలేం.

వచ్చినట్టే వెళ్ళిపోయింది, తన పన్నెండో ఏట, మొన్నటి ప్రేమికుల రోజున, ఎవరో పిలిచినట్టు, వచ్చిన కారణానికి పోయే ముహూర్తానికి లంకె ఏదో ఉందని తెలుపడానికి అన్నట్టు. ఆ అమ్మాయి తన స్నేహితుడితో మాట్లాడుతూ అంది, “మనవాళ్ళు చచ్చిపోవడం నన్ను పెద్ద ఇబ్బంది పెట్టే విషయమేమి కాదు ఇపుడు. సమయం వస్తే వెళ్ళిపోతారు కదా. కానీ ఇదే ఎందుకో కొత్త లోతుతో గుచ్చుకుంటోంది” అని.

అంతా ప్రేమే
నువ్విచ్చినవన్నీ వద్దన్నందుకు
నా నిద్రమీద మంటేసి ఎండుచేపలు ఆరేసిన చీర కాల్చిన చప్పుడు గుండెల్లోకి తన్నుతున్నావు చూడూ అంతా అదంతా ప్రేమే.

గుణింతాలనుంచి పిళ్ళారి గీతాలదాకా
పూనిన బాలూ నుంచి పేలిన శివమణి దాకా
గ్రక్కున మింగిన మది గుక్కలనుంచీ
(సీ-తమ్మకు చేయిస్తీ చింతాకూ పతకమూ రామచంద్రా)
ప్రక్కకి పిలిచిన అన్-కోని అల దాకా…

ఉత్తర సర్కారులోని నిజాముగారి జమీందారులు చాలా దౌర్జన్యము చేసిరని పిండారీలు, మరాటీ దండ్లు దేశమును కొల్లగొట్టుచుండెనని, హైదరాబాదు రాజ్యమున ప్రతిదినము బందిపోట్లు, దొంగతనములు జరుగుచుండెనని, రోహిలాలగుంపులు, దొంగలగుంపులు గ్రామములను దోచుకొనుచుండెనని బిల్‌గ్రామీగారు తమ గ్రంథమున వ్రాసినారు.

మేనక అను ఈ ఆపెరా ఈకోవలో నేను చేసిన ఏడవరచన. ఇది మసెనే ఆపెరాకంటె అనేకవిషయములలో భిన్నముగా నున్నది. ఇతివృత్తమును భారతసంస్కృతికి అన్వయించుచు వ్రాయుటకై ఈభిన్నత్వ మవసరమైనది. అందుచే మాసినో ఆపెరాకు అనువాదముగాఁ గాక అనుసృజనగా, అనేకమైన మార్పులతో, నూతనసన్నివేశ పరికల్పనలతో చేసిన స్వతంత్రరచన యిదని గ్రహింపవలెను.

ఆ నిముషం ఎవరికీ తెలీని రసహ్యమేదో గుసగుసలాడుతూ
ఊపిరి వేగం పెంచుతున్నప్పుడు
కునుకు మరచిన రేయి లాలనగా ఊ కొడుతుంది
ఎదురుచూపులు పలవరింతలైన వేళ
ఒక సూర్యోదయం చురకలు వేస్తూ సర్ది చెబుతుంది.

వాన చివరి చెమ్మగాలివంటి నిర్వేదం
మిణుగురు చుట్టూ ముసిరిన రాత్రిలాంటి నిరాశ
దేనినీ మొదలు పెట్టనీయని, ముగించనీయని
వెలిగీ వెలగని దీపం లాంటి ఒంటరితనం
నిన్ను నీ ప్రక్క లాలనగా కూర్చోబెడతాయి

కదలని శిలగా నిలిపిన కాలాన్ని
కమ్మనికల ఒకటి నిదురగా ప్రవహింపజేసినట్టు

నైరాశ్యపు నీడన
ఎంతకీ ఎదగని ఒక చిన్నారి ఆశ
ప్రేమై చుట్టిన చేతుల గూటిలో
వటవృక్షమై విస్తరించినట్టు

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

రాజిరెడ్డి చెప్పేవాటిలో చాలా మటుకు సబ్బునురగలాంటి తేలికపాటి సంగతులే. గాలిబుడగలను చిట్లించినంత సరదాగా రాసుకొస్తాడు వాటి గురించి. ఆ సంఘటనలు అతి సామ్యానమైనవి, ఏ ప్రత్యేకతా లేనివి, అసలు చెప్పేందుకేమీ లేనివే కూడా కావచ్చు కాక. అతని మాటలనే అరువు తెచ్చుకుంటే ‘ఉత్తి శూన్యమే’. కానీ, శూన్యంలో ఏదీ లేదని ఎలా అనగలం?!

అడ్డం సోమదేవుని సంస్కృత రచన. మొదటి భాగం అలవాటులో పొరపాటుగా త్వరపడి కంచికి వెళ్ళి పోయింది. (6) సమాధానం: సరిత్సాగరము ఓమము, దర్భలు అని […]

సంస్కృతంలోని మాటలు తెలుగులో ఎలా మార్పు చెందుతాయో, చక్కగా స్పష్టంగా తెలుగు ఎంత భిన్నమైనదో, ఎట్లా సంస్కృత పదాలను మార్చుకుందో వివరించిన కేతన భాషా వ్యవస్థలలో మాటలు, వ్యాకరణం ఈ రెండు భాషల్లో ఎంత తేడా ఉందో నిరూపించారు.

సాహిత్యసృష్టి చాలా చిత్రమైనది, ప్రత్యేకమైనది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపగల శక్తి కలది. శతాబ్దాలుగా సాహిత్యకారులు, ఎన్నో విభిన్నమైన జీవననేపథ్యాల నుండి వచ్చి కూడా, అంతకు ఎన్నోరెట్లు విభిన్నమైన జీవనపార్శ్వాలని గమనిస్తూ కూడా, జీవితానికి ఏ లక్షణాలు ప్రాథమికమనుకుంటామో అవే సాహిత్యంలోనూ ప్రతిఫలింపజేయడం ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. సమాచారప్రసారాలు సంక్లిష్టమైన కాలంలో కూడా యుద్ధం-శోకం, ప్రేమ-పగ ఆకలి-కోరికల చుట్టూ తిరిగిన దేశదేశాల కథల మధ్య, క్లాసిక్స్ అని చెప్పబడ్డ మహోత్కృష్ట సాహిత్యం మధ్య గల సామ్యాలను విమర్శకులు విశ్లేషిస్తూనే ఉన్నారు. జీవనవిధానాలు, దేశకాలసంస్కృతులూ ఎంత విభిన్నమైనవయినా సాహిత్యకారులు స్పందించే తీరులోని ఏకత్వాన్ని ఈ విశ్లేషణలు ఎత్తిచూపుతాయి. ఇప్పుడు, ప్రపంచం లోని ఏ మూల ఉన్న విషయమైనా చూపుడువేలి చివరే దొరికే ఈ రోజుల్లో, కథల్లో సామ్యాలు కనపడం మరింత సహజం. ఇవన్నీ ఒకే ఆలోచనకు చెందినవనుకోవడం మరింత సులువు. అంతమాత్రాన అవన్నీ ఒకే కథలనుకోవడం తగనిపని. కథావస్తువులో ఎంతటి ఏకత్వమున్నా శైలీశిల్పాల విన్యాసమే భిన్నత్వానికి దారులు వేస్తుంది. అదే ఒక మామూలు విషయాన్ని కథగా కళగా మారుస్తుంది. ఒకే కథను వేయి గొంతులలో వినిపిస్తుంది. ఏ కథకు ఆ కథనే ప్రత్యేకంగా నిలుపుతుంది. అందుకే, ఇప్పుడు మనం వెదుక్కోవాల్సింది కథావస్తువుల్లోని సామ్యాలను కాదు. కథనాలలోని భిన్నత్వాన్ని. ఒకే వస్తువును సాహిత్యం ఎన్ని రకాలుగా, ఎన్ని కోణాలలో ప్రతిఫలించగలదో గమనించాలి. వస్తువులోని సామ్యత కాదు, అది ప్రకటించే విధానంలోని వైవిధ్యాన్ని గుర్తుపట్టాలి. ప్రతీ కథ ఒకేలా ముగియదని, ముగియనక్కరలేదని, ఏ కథ ముగింపు ఆ కథే వెతుక్కుంటుందని గుర్తించి, ఆ మలుపులను, ముగింపులను అర్థం చేసుకోవడం, గౌరవించడం ముఖ్యం. రచయితలకైనా, విమర్శకులకైనా ఆ సూక్ష్మదృష్టి, ఆ వివేచన కొరబడినప్పుడు, వస్తుసామ్యమే ప్రాతిపదికగా కథలను పోల్చుకుంటూ, తమ భావజాలానికి, తమ అవసరాలకు సరిపోయినట్టుగా మాత్రమే ఆ కథను వివరించాలని ప్రయత్నించినప్పుడు, అన్ని కథలకూ ఒకే ముగింపు బలవంతపు అవసరం అవుతుంది. ఈ మూస ఇందులో ఇమడని జీవితాలను వెక్కిరిస్తుంది. విస్తరించుకుపోవడమే ప్రధాన లక్షణమైన సాహిత్యాన్ని పరిధి గీసి దాటనివ్వని ప్రమాదకర ధోరణి ఇది. గుంపుగా కాక మనలేని సాహిత్యసమాజంలో ఏకాకుల గొంతులు వినపడవు. వాటిని ఆహ్వానించి వినడం వినిపించడం నేర్చుకోని సాహిత్యసమాజానికి ఆరోగ్యకరమైన ఎదుగుదల ఉండదు.

దాన్తె ఇటాలియన్ భాషలో తెలుగులో నన్నయలాంటివాడు. అతనికి పూర్వం ఒకరిద్దరు ఆ భాషలో కవులున్నా, దాన్తె కావ్యంతో ఆ భాషకు గొప్ప గుర్తింపు వచ్చింది. హోమర్ గ్రీకు, వర్జిల్ లాటిన్‌తో సాటిగా దాన్తె ఇటాలియన్ గుర్తింపు పొందింది. దాన్తెకు మనమేమీ బిరుదులివ్వనవసరం లేదు. ఆయనకు బోలెడంత ఆత్మవిశ్వాసం. తిక్కనకేమీ తీసిపోడు.

స్టాఎల్ ప్రణయ జీవితం కేవలం ప్రణయ జీవితమైతే చెప్పుకోవాల్సిన పనిలేదు. తన రాజకీయాలతో అనుసంధానం చేసి, అప్పటి రాజకీయనాయకులకు ప్రేరణను కలిగిస్తూ, వారి ద్వారా చాణక్యుడి తరహాలో రహస్య చర్యలు చేపడుతూ సామాజిక, రాజకీయ జీవితంలో తన కార్యక్రమాల నిర్వహణకు ఆ ప్రణయసంబంధాలను ఉపయోగించుకుంది.

జగదేకవీరుని కథ సినిమాలో ’దేవకన్యలు రాత్రిపూట వచ్చి జలకాలాడే ఒక తటాకం’ అన్న చక్కని కల్పన ఉంది. బహుశా ఏ స్టూడియోలోనో ఆ తటాకపు సెట్టువేసి ‘ఏమి హాయిలే హలా’ అని ఆ పూల్‌గర్ల్స్‌తో పాడించి ఉంటారు. కానీ కె. వి. రెడ్డిగారు, మాధవపెద్ది గోఖలేగారూ ఈ వాదీదర్బత్ చూసి వుంటే ఆ సెట్టూ గిట్టూ ఆలోచన పెట్టుకోకుండా ఆ సన్నివేశాన్ని ఇక్కడే చిత్రించి ఉండేవారు.