రాత్రి పడుకున్నప్పుడు మంచాలను ఎత్తి, అందరూ కిందే చాపలు పరుచుకుని పడుకున్నారు. ఉన్న ఒంటి పరుపును మాత్రం ఒకవైపు వేశారు. ఆ సాకుగా బుజ్జిదీ, పిల్లాడూ అందులో పడుకునేట్టుగా; తనూ, భార్యా పక్కపక్కనే ఉండేట్టుగా ఎత్తువేశాడు రాజారామ్. తల్లి ముందటింట్లో మంచం వేసుకుంది. చాలా రోజుల దూరం కాబట్టి, అతడికి ఆత్రంగానే ఉంది. కానీ భార్య పడనియ్యలేదు. బుజ్జిదాన్ని పక్కలో వేసుకుని పడుకుంది.
Category Archive: సంచికలు
తాణప్పన్న, లీలక్కతో మాట్లాడుతున్నప్పుడు లీలక్క నాలుగు దిక్కులూ చూడ్డం, అప్పుడప్పుడు ఫక్కుమని నవ్వడం, తలొంచుకోడం నిన్న వాళ్ళు గుడికి వెళ్ళేప్పుడు చూశాను. కప్పకళ్ళోడు “తెలిసిందిలే నెలరాజా…” అని పాడుకుంటూ కొబ్బరి చెట్టెక్కాడు. నన్ను చూసి కన్నుకొట్టాడు. అణంజి వంగి తాణప్పన్నను పరీక్షగా చూసింది. చేత్తో అతని లుంగీ పక్కకు తీసి చూసింది. నేను చేతులడ్డం పెట్టుకుని నవ్వాను. “ఏందా నవ్వు? విత్తనం సత్తువ చూడాలిగా!” అంది అణంజి.
ఆమె ఇంటికి తరచు వెళ్ళడం అలవాటైంది. ఉండేకొద్దీ ఆమెతో కాసేపు గడిపిరావడం బాగా అనిపించేది. అప్పుడప్పుడు తెలీసీ తెలీనట్లు ఆమె చేతివేళ్ళను తాకడం, భుజాన్ని తడుతూ మాట్లాడటం జరుగుతుండేది. అదేదో కావాలని చేసినట్లు కాదు కానీ అలా అవుతుండేది. ఆ మొక్కల మధ్య ఇల్లు అరణ్యంలో ఇల్లులా ఉండేది. అక్కడికి వచ్చినప్పుడు నా ఉనికి ఆ మొక్కలకి నచ్చనట్లు అనిపించేది. అప్పుడప్పుడు ఊపిరాడనట్లు అనిపించేది.
ఇక్కడ ఋతువులు మారుతుంటే, చరాచర జీవరాశి మొత్తం దాంట్లో భాగమవుతుంది. సడన్‌గా చీర మార్చుకునే తెలుగు సినిమా హీరోయిన్‌లా ప్రకృతి రంగులు మార్చుకుంటుంది. పక్షుల కిలకిలారావాలు మారతాయి. సూర్యుడి వేళలు మారతాయి. ఇంతెందుకు సంవత్సరానికి రెండు సార్లు గడియారంలో సమయం కూడా మార్చుకోవాలి. కొత్త బట్టలు రోడ్డెక్కుతాయి. సెలవులకి పిల్లల కేరింతలు మార్మోగుతాయి. ఇండియాలో అయితే ఉష్ణోగ్రత, కరెంట్ బిల్లు మార్పు డామినేట్ చేస్తాయి.
ఒక వేళ రాకపోతే? అప్పుడు తానే పిలవవలెనా అస్పష్ట సమాధానము భయంకరమై ఉండెను. గౌరవ భంగమని పిలవడము వీలు కాదు. అట్లని ఒకతే పండుకోవడమూ సాధ్యం కాదు. వస్తున్న నొప్పులు ఒక్కోసారి ఆమె నిశ్చయాన్ని సడలిస్తుండెను. ధైర్యమును జారుస్తుండెను. ‘థూ, పాడునొప్పి’ అనుకుంటుండగానే నొప్పి తగ్గి ముందు ముందు తాను ఎదుర్కోవలసిన దృశ్యమును కల్పించుకొన్నప్పుడు వళ్ళంతా సిగ్గుతో ముడుచుకుని పోయెను.
ఈ అపార్టుమెంటు బ్లాకులోనే ఓ ప్లాటులో ఆయన చాలా కాలంగా అద్దెకి ఉన్నారు. ఆయన గురించి పనిమనిషి – తాను పని చేసే అందరి ఇళ్ళల్లో చెబుతూ ఉండేది. ఈ పనిమనిషిని పనిలో పెట్టుకోవడానికి ముందు ఆయన పదిమందిని మార్చారట. ఈమెకి ఆయన గురించి చెప్పినతను – ఆయన చాదస్తం గురించి కూడా చెప్పాడట. కానీ ఆమెకు పని అవసరం, పైగా దాసుగారు కూడా తరచూ పనిమనుషులను మార్చి విసిగిపోయారు.
లక్షల సంవత్సరాలపాటు తీపి వస్తువు అంటే విషవస్తువు కాదు అని ఎరిగిన మానవులు, ఈ మధ్య కాలంలో అసలు ఒక పదార్థం తియ్యగా ఉండటానికి కారణమైన వస్తువేదో కనుక్కున్నారు. దాన్నే తయారు చెయ్యడం నేర్చుకున్నారు. వంటకాల్లో అమితంగా వాడటం మొదలుపెట్టారు. మితిమీరి తిని, షుగర్ జబ్బు తెచ్చుకున్నారు.
కోకిల పాట వినిపించి
తురాయి చెట్టు పూసింది
జాజుల వాసన తగిలి
ఆమె జడ అల్లుకుంటోంది
ఇంద్రధనుస్సు రెక్కలమీద
కొంగలు బారు కట్టేయి
ఇదే మనిషిలో వేరే వారిని చూపించమని
అడగలేకపోయినందుకు ఆమె విచారిస్తుంది
ఇదే తరహాలో వేరే మనిషిని చూపించమని
అడగలేకపోయినందుకు కూడా ఆమె చింతిస్తుంది
స్నేహితులుగానో
రక్తబంధాలుగానో
ఆఖరికి శత్రువుగానో
ఎప్పుడో అప్పుడు
ఎక్కడో అక్కడ
పెదవులపై పేరై వెలుగుతారు
మాటల్లో నలుగుతారు
చూరునుంచి జారుతూ
మత్తుగా నానుడు వాన
కురవదు నిలవదు
నానిన గడ్డి వాసన
ఎవరిదో పిలుపు
పలకలేని మొద్దుతనం
ఆ నది ముందున్న చెట్టు మీద
వాన చినుకులా వాలిన పిట్ట
గాథా సప్త శతిలా ధ్వనిస్తోంది
కూత కూతకి గొంతు
సానబెట్టిన కత్తి అంచులా
మోగుతోంది
కరుణశ్రీకి దక్కిన అరుదైన అదృష్టం ఘంటసాల తొలినాళ్ళలో కొన్ని ఖండికలని పాడి రికార్డులుగా విడుదల చెయ్యటం. అలా ఘంటసాల మధురగంభీర గళంలో ఉదయశ్రీ పద్యాలు తెలుగునాట మారుమోగాయి. ముఖ్యంగా పుష్పవిలాపం, కుంతీకుమారి, వినని తెలుగువారు అప్పట్లో లేరు. ఉదయశ్రీ పద్యాలు ఘంటసాలకి పేరు తెచ్చాయా, లేక ఘంటసాల గానం ఉదయశ్రీకి గుర్తింపు తెచ్చిందా అనేది సహేతుకమైన ప్రశ్న.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
ఒకప్పుడు తెలుగులో సాహిత్యమంటే అగ్రవర్ణ సమాజపు పేర్లు, వారి కథలే ప్రధానంగా వినపడేవి. కాలక్రమేణా మార్పులు వచ్చాయి. దళిత, మైనారిటీ, శ్రామిక, స్త్రీవాద తదితర గొంతుకలు నేటి సాహిత్యంలో బలోపేతం అయ్యాయి. ఇన్నేళ్ళూ సాహిత్యంలోకి రాని ఎన్నో జీవితాలను, ఎన్నో సంఘర్షణలనూ కొంతకాలంగా తెలుగు సాహిత్యంలో గమనిస్తున్నాం. ఇప్పటిదాకా సమాజం వినని, వినదల్చుకోని గొంతుకలను, గుర్తించడానికి కూడా ఇష్టపడని పాయలను ఇప్పుడు మనం సాహిత్యంలో కలుపుకోగలుగుతున్నాం. ముఖ్యంగా, ఎన్నాళ్ళగానో గొంతుల్లోనే నొక్కివేయబడ్డ కథలకు, నిరసనలకు, ఆశలకు ఇప్పటి సాహిత్యం ఒక స్వరాన్నిస్తోంది. ఇలా నాణానికి ఆవలి వైపుని, తరాలు మారినా చల్లారని లోపలి ఆవేదనలని, ఇప్పటి సాహిత్యం చూపించగలుగుతోంది. ఇవన్నీ నిస్సందేహంగా ఆయా జీవితాల పట్ల మిగతా సమాజానికి కొత్త చూపుని, కొత్త అవగాహననీ ఏర్పరిచేవే. లిపి కూడా లేని బంజారాల జీవితాలను కథలుగా మలిచిన రమేశ్ కార్తీక్ నాయక్ ఇందుకు ఒక ఉదాహరణ. మారుతున్న సమాజపు పోకడలను ఇలా తెలుగు సాహిత్యంలోకి యువరచయితలు తేవడం తప్పకుండా అవసరం, అభిలషణీయం. గత కొంతకాలంగా సాహిత్య అకాడెమీ ఇటువంటి యువరచయితలకు పురస్కారాలిచ్చి ప్రోత్సహించడం కూడా సమర్థనీయం. కాని, ఇది వారి ప్రయత్నానికి మాత్రమే ఇస్తున్న ప్రోత్సాహం అనిపించడం సహజం. తమ తమ కథలని, తమకి నచ్చిన భాషలో, రీతిలో చెప్పుకోవడమే లక్ష్యంగా రాతలోకి అడుగుపెట్టినవాళ్ళకు సంబంధించినంతవరకూ, రాత అన్న దశ ముగిసిపోయింది. రచన ఎప్పుడూ రచయిత పక్షమే. అది వ్యక్తిగతమైన వ్యవహారం. అయితే, ఎప్పుడు దాన్ని సాహిత్యం అన ప్రయత్నిస్తామో, అప్పుడిక సాహిత్యనియమాలు, లక్షణచర్చ అమలులోకొస్తాయి. కథాకథన నైపుణ్యతల విశ్లేషణ, విమర్శ తప్పనిసరి అవుతాయి. ఈ విలువలను యువరచయితలు మార్చుకోవచ్చు. కొత్తవి తెచ్చుకోవచ్చు. కానీ అసలు సాహిత్యనియమాలే అవసరం లేదనుకోవడం అజ్ఞానం. ఆశయాల గొప్పదనంతో రచన విలువ ముడిపడి లేదు. ఇది నిజం. అందువల్ల, ఇప్పుడు కొత్తగా వస్తున్న రచనలు కూడా ఏ ఆదర్శాలతో వచ్చినా, అవి పదికాలాలు నిలబడడానికి వీటిలో సత్యంతోపాటు, ఉద్వేగంతోపాటు, సాహిత్య విలువలు ఉండి తీరాలి. ఇప్పటి సమాజంలో ఏ గొంతుకీ ఏ నిర్బంధమూ లేదు. ఏ రచనా ప్రచురణకైనా మాధ్యమాల కొదవ లేదు. సామాజిక మాధ్యమాల్లో మనం మన చుట్టూ నిలుపుకుంటున్నది, కో అంటే కో అనే ఒక సమూహాన్ని మాత్రమే. ఆ సమూహాలలో స్నేహం ఉంది. అవగాహన ఉంది, సహానుభూతి ఉంది. పైకి చెప్పకపోయినా అందరికీ అర్థమయ్యే సమీకరణాలు ఉన్నాయి. అక్కడ నాకే పాఠకుడు అక్కర్లేదు, నాకే విమర్శతో పని లేదు అని బింకాలు పోవడం తేలిక. కానీ ఈ సమూహాలకు ఆవల అసలైన ప్రపంచం ఉంది. రచయిత స్వయంగా వెళ్ళి సమర్థించుకోలేని ఆ తావుల్లో కూడా రచన స్వంతంగా మనగలగాలి. అలా జరగాలంటే, యువరచయితలు తమ కథననైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలి. వాళ్ళ వాళ్ళ సమూహాలను దాటి వచ్చి, తమ రచనలను నిజాయితీగా పరామర్శించుకోవాలి.
విమానం పైకి ఎగిరినపుడు పైనుంచి కొన్ని ద్వీపాలు కనిపించి పలకరించాయి. ఆ ద్వీపాల మీద అడుగు పెట్టాను, రెండు మూడు రోజులు తిరిగాను అన్న ఆలోచనే నాకు విభ్రమ కలిగిస్తోంది. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతానికి శిలాన్యాసం చేసిన ద్వీపాలవి. జీవరాసుల గురించి ప్రపంచపు అవగాహనను సమూలంగా మార్చిన సిద్ధాంతానికి పుట్టినిళ్ళవి.
త్యాగరాజస్వామి సంగీతానికే ప్రాముఖ్యత ఇచ్చినట్లు చక్కగా సాక్ష్యం ఇస్తాయి ఇలాంటి కీర్తనలు. నేటి తెలుగు సంగీతవిద్వాంసులకు కొందరికి త్యాగరాజుకున్న కీర్తనాసాహిత్యమ్మీద ఆయనకంటే ఎక్కువ ప్రేమ! అది అరవవిద్వాంసుల నోటిలో నలిగిపోతూంటే వీరు పద్యాలు పాడినట్టు కీర్తనలు అనేసి సాహిత్యాన్ని చక్కగా రక్షిస్తున్నారు. కలవవు రెండు కళలు! సంగీతమూ, సాహిత్యమూ కూడా కలవవు. వింత యేమిటి? ఇవి ఆదిలో వేరుగా పుట్టేయి, భరతముని చేర్చికట్టినా, కాలక్రమ వికాసంలో వేరైపోతున్నాయి. అస్తు.
“కాదు కాదు, అందరూ అలా అనుకుంటారు కాని, ఏఐ అవతార్ అయినా విడాకులకి గ్రౌండ్స్ ఉంటాయి. మీరనుకున్న దానిలో కొంత నిజం ఉంది. చట్టం, 2032 యాక్ట్ ద్వారా చెప్పేదేంటంటే, ఏఐ అవతార్‌లని కేవలం యంత్రాలుగా భావించాలి. అంటే, వాటితో కేవలం శారీరిక సంబంధం అనుకోవాలి.” నేను సెక్స్ డాల్స్ గురించి చెప్పడానికి సందేహించాను. “కానీ, ఆ వ్యక్తి ఆ అవతార్‌ని నిజం మనిషిలాగ చూస్తే, చట్ట ప్రకారం విడాకులకు కారణం అవుతుంది.”
ఏళ్ళ క్రితం, నేనూ నా ఫ్రెండు మదరాసు నగరాన్ని ఒక చూపు చూద్దామని బయట వీధులెంట తిరుగుతుంటే పదిహేడు-పద్దెనిమిది ఏళ్ళ వయసు కుర్రవాడొకడు, ఇంకా తక్కువ వయసు కూడానేమో! ఒక గోడ మీద రాజకీయనాయకుడి పోర్ట్రయిట్ ఒకటి వేస్తూ కనపడ్డాడు. చాలా పెద్ద బొమ్మ అది. గోడ మీద, అదీనూ అంత పెద్ద గోడ మీద.
ఫ్రాంక్‌కి బహుశా అరవై ఏళ్ళు ఉంటాయేమో. ‘దేని సౌందర్యమైనా దాని ఆత్మలో ఉంటుంది ఫ్రాంక్’ అంటే గట్టిగా నవ్వేవాడు. ‘ఆత్మలో సౌందర్యం, హృదయంలో సౌందర్యం, శరీరంలో సౌందర్యం ఇవన్నీ ఒట్టి మాటలు శ్యామా. సౌందర్యమంటే ఒకటే, అది నీకు సౌందర్యంగా కనపడటం మాత్రమే’ అంటాడు. ‘బ్యూటీ ఈజ్ ఇన్ ది బిహోల్డర్స్ ఐస్ అన్న మాట’ అంటే, ‘కాదు. ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ది బిహోల్డర్స్ లైఫ్, మూడ్, అండ్ ఛాయిస్’ అంటాడు.