షాపింగ్

ఇదే మనిషిలో వేరేవారిని చూపించమని
అడగలేకపోయినందుకు ఆమె విచారిస్తుంది
ఇదే తరహాలో వేరే మనిషిని చూపించమని
అడగలేకపోయినందుకు కూడా ఆమె చింతిస్తుంది

అర్ధ శతాబ్దం గడిచిపోయాక-
అర్హతలకీ గౌరవాలకీ విలువెంతుంటుంది?

అయినా, ‘ఆ సంబంధం చేసుకునుంటేనా?’ అనడం
ఒక సరసపు రసన
ఒక సంసారంలో నిరసన.


దేశరాజు

రచయిత దేశరాజు గురించి:

సుప్రసిద్ధ కవి, రచయిత, జర్నలిస్టు దేశరాజు ఆధునిక జీవితంలోని వైరుధ్యాలను, మనుషుల జీవన శైలిని, విషాదాలను తన రచనల్లో సరళంగా, మనసుకు హత్తుకునే శైలిలో వ్యక్తీకరిస్తారు. 18 కథలతో కూడిన “బ్రేకింగ్ న్యూస్” ద్వారా మంచి కథకుడిగా గుర్తింపు పొందారు.”దుర్గాపురం రోడ్” నవలతో సహా కొన్ని ఇతర కవితా సంపుటాలు కూడా వెలువరించారు.

 ...