రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

వేడుకుంటిని వేలసారులు

రచన: మల్లాది లక్ష్మణ శాస్త్రి
సెప్టెంబర్ 2023

రాగం: కల్యాణి
తాళం: మిశ్రచాపు
గానం, స్వరకల్పన: శ్రీమతి శాంతిశ్రీ
రచన: మల్లాది లక్ష్మణ శాస్త్రి

//eemaata.com/images/sep2023/vedukumtini.mp3

వేడుకొంటిని వేలసారులు విసిగించితి మాధవా
ఆడుకొమ్మని ఒక్కసారికి అనకపోతిని కేశవా

కావుకావని కేకలేసితి కరుణలేదని కూకలేసితి
బ్రోవుబ్రోవని బేరమాడితి కడుపు నిండిన గొంతుతో

నింద లేసితి చిందులేసితి రంధివీడని బొందితో
నిద్రలేపితి ముడుపుగట్టితి పగలు రేయి రొదలుపెట్టితి

నేను నేనని నన్నునన్నని అహముతో నే బ్రతికితి
ఇంతలిచ్చిన దేవదేవా తృప్తిలేని లోభినై

నిన్ను చూసుకు నువ్వుచేసిన కన్నుపండుగ చూసుకు
పులకరించని పరవశించని జన్మమెందుకు రామయా

కంటిపాపగ నువ్వుఉండగ కొదవలేదయ కృష్ణయా
శ్వాసశ్వాసన కోశమంతట నిండి ఉంటివి కదటయా

ధన్యవాదము తనివితీరగ చెప్పగలిగితె ధన్యము
కోరగలిగిన కోరవలసిన వరములేవియు లేవయా

నన్ను వదలకు కన్నుమెదపకు అనుటమానెద నమ్మరా
నీవు నీవై నేను నేనై వెలుగుతుందము ఈశ్వరా!

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ఆత్మకాకి
  • వేడుకుంటిని వేలసారులు
  • ఒకరికోసం
  • నభూతో నభవిష్యతి
  • తూనీగ తూనీగ

ఇటువంటివే…

  1. ద్విజావంతి: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రేడియో ప్రసంగం

సెప్టెంబర్ 2023 సంచికలో ...

  • అడ్మిన్స్ ఓన్లీ
  • అనాదిగా
  • అసంపూర్ణం
  • ఊహల ఊట 28
  • గడినుడి – 83
  • గీతాచారి
  • గుళిక వేదాంతం
  • ఛందస్సులో గణితాంశములు – 6: ట్రిబొనాచ్చి సంఖ్యలు
  • నా జానపద కల
  • నాకు నచ్చిన పద్యం: ఆర్తవబిల్వదళం
  • నిండు వేసవి
  • నిన్ను కావలించుకునే…
  • మనమెరుగని మధ్య అమెరికా 5
  • యూట్యూబ్‍లో ఈమాట: ఆగస్టు 2023
  • రబీరా
  • వికసితం
  • విషం దేవుడు
  • వెండి
  • వేడుకుంటిని వేలసారులు
  • వేస్ట్‌ లాండ్: 4. ది ఫైర్ సెర్మన్ 2
  • శరీరం
  • సగం వాన
  • సమావేశం
  • సహచరి
  • సెప్టెంబర్ 2023
  • సోల్జర్ చెప్పిన కథలు: ఒంటరి పాట
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

గడినుడి – 82 సమాధానాలు
సగం వాన

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.