రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఈ క్షణం

రచన: బివివి ప్రసాద్
జూన్ 2021

ఈ క్షణమొకసారి పిల్లకాలువ
తేలికగా ప్రవహిస్తూ పోతుంది
ఒక్క గెంతులో దానిని దాటగలుగుతావు
మరొకసారి మహాసముద్రం
దానిలో మునిగిపోకుండా నిలబడటానికి
నీ శక్తులన్నీ ఒడ్డుతావు

ఒకసారొక చినుకు
గుర్తించేలోపు పలకరించి మాయమౌతుంది
మరొకసారి మురికికూపం
తప్పుకొని పోయేందుకు తహతహలాడతావు

అనేక క్షణాలుగా కనబడే ఒకే ఒక క్షణం ఇది
దానిని అనుభవిస్తున్నట్లుంటుంది గానీ
అదే నిన్నూ, నన్నూ, లోకాన్నీ
అనుభవిస్తూ, పలవరిస్తూ సాగుతోంది కొండచిలువలా

క్షణాన్ని ఊరకనే పైపైన తాకి
అది పూవు లాంటిదనో, పండులాంటిదనో
రంగులు రాల్చిన ఎండుటాకులాంటిదనో
తేలికగా తలుస్తావు గానీ

క్షణం గర్భంలో అనంత విశ్వాలున్నాయి
అంతూదరీ లేని లోతులున్నాయి
మొనదేలిన తర్కాలకూ అందని కొలతలున్నాయి

తెలియరాని ఆకర్షణ ఏదో
దాని ఖాళీరంగు సుడిగుండంలోకి
బలంగా లాగేటప్పుడు జాగ్రత్త
వెనుతిరిగి జీవితంలో పడేందుకు
నీకు నువ్వంటూ ఏమీ తగలక పోవచ్చును

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నీతో నువు
  • ఖాళీపాత్ర
  • పసుపుకాంతి
  • జీవించి ఉండటానికి నన్ను నేను ఒప్పించుకునే ప్రయత్నమే నా కవిత్వం
  • ఇంతేనా

ఇటువంటివే…

  1. ఒక్క క్షణం
  2. ఒక్క క్షణం
  3. లిఖిత: కాలంలో ఒక క్షణం, నీతో –
  4. సాహిత్యం పట్టని క్షణం
  5. హైకూలు

జూన్ 2021 సంచికలో ...

  • Mama Bear
  • ఆట
  • ఈ క్షణం
  • ఊహల ఊట 1
  • కాళ్ళనొప్పి
  • కేతన ఆంధ్ర భాషాభూషణము-5
  • గడినుడి – 56
  • జూన్ 2021
  • జెరర్డ్ మేన్లీ హాప్కిన్స్
  • త్రిభంగి
  • పాంథశాల
  • మాట శీతకన్నేసింది
  • మూగవోయి పిలు
  • రెండు కన్నీటిచుక్కలు
  • విశ్వ మహిళానవల: 9. ఆన్ రాడ్‌క్లిఫ్
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 56
  • సంక్షోభం-శోకం-సాహిత్యం
  • సమయసూచి వరరుచి 2
  • హృదయాల ఊసులు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

కేతన ఆంధ్ర భాషాభూషణము-5
మాట శీతకన్నేసింది

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.