Timeline

పదాల కోసం ఎవ్వరూ ఇక్కడ ప్రాణాలు చేసుకుని ఉండలేదు.

ఒక పాత ఒళ్ళుని మనుషుల ముందు పాతరేసి
తవ్వుకు తినమంటావు.

పెదాలను స్వాగతించే దమ్ము నీకెప్పుడూ రాదు.
పుట్టడం, పొందడం మాత్రమే
నిఘంటువులో ఉన్నాయని ధైర్యంగా అబద్దాలాడతావు.

నువ్వు కవిత్వం, నేను కోరిక అని
కాలాల రూపం తొడుక్కున్న కాగితాలు వెక్కిరిస్తుంటేనే
నీకో పెళ్ళి, నాకొక అరువు శరీరం దక్కుతాయి.
నువ్వు ఎక్కడో పిల్లలకి పేర్లు పెడుతుంటావు
నేను పాడైన బట్టలు ఉతుక్కుంటుంటాను.


కాశి రాజు

రచయిత కాశి రాజు గురించి: పీజీ ఇన్ రూరల్ డెవలప్‍మెంట్, భూమధ్యరేఖ (కవిత్వం ), 2014. ...