అక్టోబర్ 2017

తెలుగు పాత్రికేయ సాహిత్య రంగాలలో సుప్రసిద్ధుడైన మోహన్ గురించి ఆయనొక కార్టూనిస్టు అనో తెలుగులో మొట్టమొదటి గ్రాఫిక్ ఆర్టిస్టు, ఆనిమేషనిస్టు అనో మాత్రమే చెప్పి ఇప్పటిదాకా ఎవరూ ఆగిపోలేదు, ఇక ఆగిపోలేరు కూడా. చక్కటి ఆర్టిస్ట్ కావడం ఆయనలో కేవలం ఒక పార్శ్వమే. సాహిత్యకారుడూ కళా విమర్శకుడూ అయిన ఆయన ఎందరు రచయితలూ కళాకారులపై ఎంత ప్రభావం చూపిందీ మోహన్ ప్రాంగణం ఎలా ఎందరో సాహిత్యకళాకారులకు ఒక పిట్టలు వాలే చెట్టు అయిందీ ఆ నీడన ఎన్ని కొత్త కుంచెలు రంగు నింపుకున్నదీ ఆయన మరణంతో వెల్లువెత్తిన నివాళులు, జ్ఞాపకాల తలపోతలు ఊహామాత్రంగానే మనకు పట్టిస్తాయి. అకాలంగా వెళ్ళిపోయిన ఆ విశిష్ట కళాకారుడు, స్నేహశీలి, మోహన్‌కో నూలుపోగు: ఆయన గీతను పరిచయం చేస్తూ శివాజీ తల్లావజ్ఝల, గోవిందరాజు చక్రధర్ చేసిన ఒకనాటి ముఖాముఖి; మారిషస్ వంటి బహుభాషీయదేశంలో తెలుగు రెండవ భాషగా నేర్చుకునే వారి భాష, లేఖనాలపై పరభాషల ప్రభావం గురించి వివరిస్తూ రాజ్వంతీ దాలయ్య పరిశోధనావ్యాసం; అంతుచిక్కని వింతదేవుడు అంటూ గణపతి గురించి ఒక టీజర్ మాత్రమే ఇచ్చి ఎందరినో తన వ్యాసం కొరకు ఎదురుచూసేలా చేసిన సురేశ్ కొలిచాల వ్యాసం; ఇంకా, కథలు, కవితలు, వ్యాసాలు, సమీక్షలు, శీర్షికలూ…


ఈ సంచికలో…

  • కథలు: శిక్ష – చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టి వెంకట పతిరాజు; Walmart – పాలపర్తి ఇంద్రాణి; ℞: మారేజ్ – పూర్ణిమ తమ్మిరెడ్డి; పవిత్ర – అవినేని భాస్కర్ (ఎ. ముత్తులింగం).
  • కవితలు: ఏదో కనికట్టు – విజయ్ కోగంటి; జాగారం – పాలపర్తి ఇంద్రాణి; అక్కరలేనితనం – అనూరాధ నాదెళ్ళ; గతం – పూడూరి రాజిరెడ్డి; This play without me! నేను లేని ఈ నాటకం! – మంజీర, నందకిశోర్.
  • వ్యాసాలు: గణపతి: అంతు చిక్కని వింత దేవుడు – 2 – సురేశ్ కొలిచాల; కొత్త కథకులు – దాసరి అమరేంద్ర; తన రేఖలే సమ్మోహనాస్త్రాలు సుమా! – తల్లావజ్ఝుల శివాజీ; మారిషస్ దేశంలో ద్వితీయ భాషగా తెలుగు – అన్యభాషల ప్రభావం – రాజ్వంతీ దాలయ్య; తిలక్ కవితా మూలాలు – ఆయన సాధించిన సౌందర్యం – సి. ఎస్. రావ్.
  • శీర్షికలు: తెరచాటు-వులు : 9. అప్పిచ్చువాడు వైద్యుడు! – శ్రీనివాస్ కంచిభొట్ల; నాకు నచ్చిన పద్యం: పినవీరుని పద్యరచనలో గుబాళింపు – భైరవభట్ల కామేశ్వరరావు; గడి నుడి 12 – కొల్లూరు కోటేశ్వరరావు.
  • ఇతరములు: పుస్తక పరిచయం: ఎర్రని ఆకాశం – కోడీహళ్ళి మురళీమోహన్; మరికొన్ని అరుదైన పాటలు – పరుచూరి శ్రీనివాస్; మోహన్‌తో దోస్తీలో ఆ కిక్కే వేరప్పా! – గోవిందరాజు చక్రధర్ (తెలుగు కూపంలో ఇమడలేని మోహనుడు – ముఖాముఖి పునర్ముద్రణ).