జూన్ 2017

అసలు ‘చూడటం’ మొదలుపెడితే ‘కనబడటం’ మొదలై అది అనంతంగా మనం చచ్చేదాకా మన కన్నే మనకు బోలెడు చెబుతుంది. ఒక పక్క ప్రకృతి అందచందాలు, మరో పక్క మనిషి తయారుచేసిన, చేస్తోన్న కళ, దాని సౌందర్యం వెరసి కంటికి కునుకు లేకుండా చేస్తుంటాయి. అసలు ముందస్తుగా కళాత్మకమైనవాటిని, కళాఖండాలని, తరచుగా విరివిగా చూడటం అలవాటయితే సామాన్యులనే అసమాన్యులకి ‘కళ’ వీలయినంత దగ్గరవుతుంది – అంటూ ఈ సంచిక నుంచి చిత్రకళను పరిచయం చేస్తూ చిత్రకారుడు, కళావిమర్శకుడు అయిన తల్లావజ్ఝుల శివాజీ కళకాలమ్; సహజమైన బంధాన్ని సంకెళ్ళతో బంధించిన సమాజపు కట్టుబాట్లతో విసిగిపోయిన స్త్రీ ఏ సృష్టినైతే నిరాకరించిందో, తిరిగి ఆ సృష్టినే కోరుకోవడం గురించి వాయుగుండ్ల శశికళ కథ పునరావృతమ్; సంచారమన్నది మనిషి సహజ ప్రవృత్తి అయినపుడు, తమ ప్రయాణాల అనుభవాలను అక్షరరూపంలో నిక్షిప్తం చేయడమన్నది రెండువేల సంవత్సరాలుగా సాగిపోతున్నపుడు, యాత్రాసాహిత్యమూ సాహిత్యమేనంటూ తెలుగులో వచ్చిన యాత్రాచరిత్రలపై విహంగవీక్షణం చేస్తున్న దాసరి అమరేంద్ర సమీక్షావ్యాసం తెలుగులో యాత్రాసాహిత్యం; కవిసమ్రాట్ మొదటి నాటిక నర్తనశాల శబ్దతరంగాలలో…


ఈ సంచికలో:

  • కథలు: పునరావృతమ్ – వాయుగుండ్ల శశికళ; మహారాజుగారి రయిలుబండి – అవినేని భాస్కర్ (ఎ. ముత్తులింగం); ఒకనాటి యువ కథ – మా నాన్న మాకేమిచ్చారు? – అవసరాల రామకృష్ణారావు; మిథ్య ఎగ్జిబిషన్ – దగ్గుమాటి పద్మాకర్; కోడ్ కూలీ – ఆర్. శర్మ దంతుర్తి; సంసారంలో బేతాళప్రశ్న – పూడూరి రాజిరెడ్డి (స్వగతం.)
  • కవితలు: ఇంటికి మళ్ళు – పాలపర్తి ఇంద్రాణి; కడవ – హెచ్చార్కె; కిటికీ పక్క ఆకాశం – అనూరాధ నాదెళ్ళ; రంగులూ మాటాడతాయి – విజయ్ కోగంటి; ఒకప్పుడు – చంద్ర కన్నెగంటి.
  • వ్యాసశీర్షికలు: తెలుగులో యాత్రాసాహిత్యం – దాసరి అమరేంద్ర; వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 4. వైరుధ్యం వర్సెస్ వైవిధ్యం – కల్లూరి భాస్కరం; కళకాలమ్: 1. కళగని… – తల్లావజ్ఝుల శివాజీ; తెరచాటు-వులు: 5. కో హమ్ – నేనెవరు? – శ్రీనివాస్ కంచిభొట్ల; నాకు నచ్చిన పద్యం: పద్య శిల్పారామం హంపీక్షేత్రం – భైరవభట్ల కామేశ్వరరావు; గడి నుడి 7 – త్రివిక్రమ్
  • శబ్దతరంగాలు – విశ్వనాథ నర్తనశాల – సమర్పణ: పరుచూరి శ్రీనివాస్.