గతం

నూటారెండోసారి మథనపడినంత మాత్రాన
నేను దాన్ని ఏమీ చేయలేనని తెలుసు.
గొరిగించుకున్న జుట్టు కాదు
కొంతకాలం వేచివుండటానికి.
అయితే వివేకంగల మూర్ఖుడినంటావా?
చద్దరు నాలుగు మూలలు
సరిగ్గా వచ్చేలా మడతపెట్టడం కూడా
చాలా పెద్ద విషయం అయినప్పుడు,
ఎంత చిన్న విషయానికైనా
నూటా ముప్పైరెండోసారి బాధపడటం
ఏమంత పెద్ద విషయం?
నేను బతికేదంతా
నేను జార్చుకున్న క్షణాల్లోనే.


పూడూరి రాజిరెడ్డి

రచయిత పూడూరి రాజిరెడ్డి గురించి:

కథా రచయిత, పాత్రికేయుడు, కాలమిస్ట్ అయిన పూడూరి రాజిరెడ్డి ఇంటర్ లో ఉండగానే కథా రచన మొదలుపెట్టారు. ముఖ్యంగా కథా రచన వీరి ప్రక్రియ. పాత్రికేయుడిగా వ్యాసరచన శైలిలో కూడా బాగా పని చేసారు.

 ...