తిలక్ చేయి తిరిగిన కథకుడు కావడం మూలాన తన కవిత్వం మరింత ఆకర్షణీయంగా తయారైంది. అలాగే కవిగా తిలక్ లోని భావుకత్వం, ఊహాశక్తి తన కథల స్థాయిని పెంచింది. వెరసి తిలక్‌లో మెరిసే వ్యంగ్యం – బిగుసుకు పోయిన మనిషికి సైతం జీవం ప్రసాదించ గలదు.
శీర్షికలు సంచికలు
ప్రతి రోజూ ఉదయం పశువులు మేతకొచ్చే సమయానికి చేను దగ్గరకెళ్ళి కాపలా కాయాలి. లేదంటే పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. పశువుల కాపర్లు వాటిని వొదిలేసి ఏ మఱ్ఱిచెట్టు కిందో కూర్చుని తూగుతూనో, గుడి మంటపం దగ్గర కూర్చుని పులీ-మేక ఆట ఆడుతూనో, ఈత పళ్ళు ఏరుకుంటూనో ఉంటారు. వాళ్ళకు తెలీకుండా పశువులు ఏపుగా పెరిగిన పత్తి చేల మీదికి వచ్చేస్తాయి. అది జరిగినప్పుడు పొలి కేకలు పెట్టుకుంటూ నాలుగు దిక్కులా వాటి వెనక పరిగెడుతూ, అరి కాళ్ళకు గుచ్చుకుని చర్మాన్ని చీల్చేసే పల్లేరు కాయల ముళ్ళను కూడా పట్టించుకోకుండా పశువుల్ని అక్కడినించి తరమాల.
పోయిన జన్మలో నీ అమ్మనైనందుకు
ఋణం తీర్చుకుంటున్నావో
మల్లొచ్చే జన్మలో నీకు అమ్మనై
ఋణం తీర్చుకోవాల్నో
పచ్చలైటు పడినప్పుడల్లా
యాక్సిలేటర్ రైజ్ చేయడానికి
మనసు ఒక యంత్రం కాదు
నేల నెలత పచ్చి బాలింత
మూలకున్న నాగలి
పావురంగా రైతు భుజం ఎక్కింది
స్త్రీవాద దృక్పథం కలిగిన కవిత్వానికి, స్త్రీల అనుభవాల్ని మాత్రమే చిత్రించే కవిత్వానికి, అలాగే స్త్రీవాదమని కొందరు పురుషపుంగవులు చేస్తున్నటువంటి male voyeuristic attitudes కు తేడా తెలియకుండా ఉన్న ఈ రోజుల్లో, సుధామురళి లాంటి కొందరు స్త్రీలు కంకణం కట్టుకొని, “ఇది మా శరీరం, ఇదీ మా భావన, ఇదీ మా యాతన”ని వారి శారీరక స్పృహను సామాజిక స్పృహకు సకారాత్మకంగా సమాజంలో ఉపయోగించేలా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతో అభిలషనీయం.
పద్యం ఇట్లాగే మొదలవ్వాలన్న నిబంధనను ఇష్టపూర్వకంగా అతిక్రమించటంలో అఫ్సర్ సిద్ధహస్తుడు. లోలోపల సుడులు తిరిగే ఒక భావధార ఎట్లా ఉబికివస్తే అట్లా ఆ వాక్యపు చిటికెన వేలు పుచ్చుకొని పిల్లాడిలా హాయిగా నడక ప్రారంభిస్తాడు. మనం కూడా ఆ హాయితనంలో బుడుంగున మునిగిపోయి, కవిత పొడవునా పరుగులు తీస్తాం.
రవిశంకర్ మన మధ్యే తిరుగుతున్న మన కవి. ఈయనకు ఏటిపుట్టేడాదీ మనకు దైనందినంగా తోచే సాధారణమైన అనుభవాలు – నిద్ర లేవడం, ఇంట్లో భార్యాబిడ్డలను చూసుకోవడం, బయట ప్రకృతిని గమనించడం వంటివి – పునరాలోచించాల్సిన అనుభవాలై మమత్వం వాటిని పెనవేసి అనుభూతులై మిగిలాయి. ఇలా నిజాయితీగా రాసి తన కవిత్వం మీద తాను నిలబడగలిగిన కవి విన్నకోట రవిశంకర్.
పట్నం వాసనలు తెలియని మారుమూల పల్లెటూరు. మంచు కురుస్తున్నపుడు శరద్వెన్నెల జల్లుల్లో ఎక్కడో దూరాన విరిసిన చుక్కల ఆకాశం రాల్చిన మరీపల్చని కాంతుల్లో, మెత్తని ఇసుక నేల మీద పక్క పరుచుకుని రాత్రికాబోతుందనగానే మాటుమణిగే ఊరు. అటువంటి ఏగ్రామంలోనో ఉన్నామని భావించి ఈ ‘ఊరు’ కథలు చదవాలి.
రాష్ట్ర విభజన జరిగింది కానీ, సాహిత్యచరిత్ర విభజన లో చాలా సమస్యలున్నాయి. విడివిడి సాహిత్య ప్రయాణం ఉన్నది నిజమే కానీ, ఆ దారులు అనేక కూడళ్లలో ఒకదానినొకటి కలవకుండా లేవు. కొంత దూరం కలసి నడవకుండానూ లేవు. ఒకే సమీకరణలోకి రెండు సాహిత్యాలను బలవంతంగా చేర్చడం అనవసరం. అట్లాగని, ఒకరి సాహిత్యం మరొకరికి పూర్తి పరాయిది కూడా కాదు. నన్నయ, శ్రీనాథుడు తెలంగాణకు అవసరం లేనివారు కాదు, సోమన, పోతన లేకుండా ఆంధ్రవారికి గడుస్తుందనీ లేదు.
దాశరథి తెలుగుదేశంలో ఒక భాగమైన స్వాతంత్రోద్యమానికి శంఖం పూరించాడు. తాను ఉద్యమంలో వీరుడుగా పాల్గొని కష్టనష్టాలకు గురి అయ్యాడు. ప్రజాశక్తులతో కలిసి జనంలో కవితావేశాన్ని కల్పించి కార్యరంగంలో దూకించాడు. విశాలాంధ్రచరిత్రలో తెలంగాణా విషాద గాథను, విప్లవచరిత్రను కలసి చదువుకున్నప్పుడే సమగ్రత వచ్చేది. తెలుగు దేశంలో మూడవవంతు తెలంగాణం, దానిని మేల్కొల్పి యావందార్థంతో చెలిమి కలిపిన కవికిశోరం దాశరథి.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ.
“ఈసారి ఆ మస్తానమ్మతో కానీ, ఈ లండీకొడుకుతో గానీ కనబడు చెప్తాను. చెవడాలు ఊడదీస్తా.” చేతిలోని కట్టిపుల్లను దూరంగా విసిరేసి. నేలమీద ఉంచిన బకెట్ ను తిరిగి చేతిలోకి తీసుకుంది తులశమ్మ.
కవిత్వం ఒక ఆల్కెమీ. దాని రహస్యం కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకి తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు అని అన్నాడు తిలక్. ఇప్పుడు ఆ […]
“నువ్వు ఏమిటి తింటున్నావో చెప్పు, నువ్వు ఎవరివో చెబుతాను” అనే జనవాక్యం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. మంచి ఆహారం మంచి ఆరోగ్యానికి మొదటి మెట్టు అని మనలో చాలామంది నమ్ముతాం.
షేక్స్పియర్ కన్నా బేకన్ ఆధునికుడు; బేకన్‌కి స్పష్టమైన చారిత్రక అవగాహన ఉంది; షేక్స్పియర్‌కి అది బొత్తిగా లేదు. పదిహేడో శతాబ్దంతో శాస్త్రీయ యుగం మొదలయిందని గ్రహించిన బేకన్, అరిస్టాటిల్ తాత్త్వికతని పూజించడానికి బదులు ప్రకృతిపై ప్రత్యక్షమైన పరిశోధనలు జరగాలని కోరాడు
భారతదేశంలో అసలు మతం ఉందా? ఈ ప్రశ్న ప్రధానంగా పాశ్చాత్య వలసవాద తాత్వికుల నుండి ఉద్భవించింది. భారతదేశానికి చరిత్ర, న్యాయం, చట్టం వంటి భావనలు ఉన్నాయా అని ప్రశ్నించిన క్రమంలోనే భారతీయులకు మతం ఉందా అనే ప్రశ్న మొదలైంది. అసలు భారతీయులు అంటూ ఉన్నారా, వారిని ఎలా నిర్వచించాలి అనే ప్రశ్న కూడా దీని అంతర్భాగమే.
రామారావు గారు ఒక పుష్కర కాలంలో భూనభోంతరాలు నిండిపోయేలా అనువాదాలు చేశారు – ఒకటా రెండా? తెలుగులోకి రాని భాష లేదు, ప్రాంతం లేదు, కేవలం అనువాదాలే లేదు – కవుల చుట్టూ, కవితల చుట్టూ ఉన్న భోగట్టాను పట్టుకొచ్చారు.
ప్రవాసంలో ఉండటం అనేది ప్రవాసంలో ఉన్న టిబెట్ వాసులు ఎదుర్కొంటున్న అత్యంత శక్తివంతమైన వాస్తవికత. వారి హృదయాలు మాతృభూమి కోసం తహతహలాడుతున్న సమయంలో, వారు తెలియని దేశాలలో జీవితాన్ని నిర్మించుకునే సవాలును ఎదుర్కొంటున్నారు. మతం పురాణాల ద్వారా మాత్రమే తెలిసిన భూమికి తిరిగి పోవాలనే వారంతా కోరుకుంటున్నారు. కానీ అక్కడి పరిస్థితులు వారికి అనుకూలంగా లేవు.
తెలతెలవారే ముందు
అలలు లేని కొలను