హత్యకు గురైన దేహపు కళ్ళను చూసి
మీరు దాక్కోనక్కర్లేదు
మీ దుర్వాసనలేవీ
దాని ముక్కుపుటాలకు అందవు
శీర్షికలు సంచికలు
నిశ్శబ్దం ఎక్కడ?
పురుగుదో పిట్టదో
ఏదో ఒక పాట
వినిపిస్తునే ఉంటుంది
పన్నెండవశతాబ్దికి చెందిన సంఘసంస్కర్త, కవి అయిన బసవణ్ణ, కులవ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు. శ్రమైకజీవనమే పూజ అని నమ్మిన కులరహిత సమాజ నిర్మాణానికి ఆయన కృషి చేశాడు. బ్రాహ్మణీయ వర్ణవ్యవస్థపై తిరుగుబాటు చేసి, ‘తక్కువకులస్థుల’తో మమేకమయ్యాడు. ఒక ‘వచనం’లో ఆయన, తను మదర చెన్నయ్య సేవకుడికీ, కాకయ్యవద్ద చర్మకారవృత్తిచేసే పనిపిల్లకు పుట్టినవాడినని చెప్పుకునేంతగా సాహసించాడు.
ప్రసిద్ధ తమిళ నవలా రచయిత జయమోహన్ రాసిన వెళ్ళైయానై అన్న తమిళ నవలకు తెలుగు అనువాదం అయిన ‘తెల్ల ఏనుగు’ ఆగస్టు 9న విడుదల అవుతోంది. ఆ సందర్భంగా ఆయన ఈమాటకు ఇచ్చిన ఇంటర్యూ.
అప్పుడు జరిగింది అనుకోని సంఘటన. రోడ్డుపైన గుంతల్ని, స్పీడు బ్రేకర్లని అడ్డంగా వచ్చే వాహనాలను దాటుకుంటూ ఇంటికి ఇంకా పావు కిలోమీటరు దూరం ఉన్నప్పుడు జరిగింది. అంత జరిగినా ఉరుము ఉరమ లేదు. పిడుగు పడలేదు. తాను ఇంకా ఓడి పోలేదన్నట్లు వర్షం ఇంకా జోరుగా కురుస్తుంది. ఆ జరిగిన సంఘటన చూసినా ఎవరూ పట్టించుకోలేదు. లోకం తీరే అంత. ఏం జరిగిందంటే, ఉన్నట్టుండి కరెంటు పోయింది. దారి కనిపించడం లేదు. స్పీడుగా వస్తున్న యాదయ్య సైకిల్ అడుగులోతు గుంతోలో పడి ఫెడెల్ ఊడిపోయింది.
నాన్న మమ్మల్ని దగ్గరకు తీసుకొని ముద్దు చేసిన జ్ఞాపకమే లేదు. ఆయన ఇంటికి రావడమే అరుదు. ఎక్కువభాగం ప్రయాణాల్లోనే ఉండేవారు! ఆ రోజుల్లో, పాలక్కాడు కొండ ప్రాంతాలలో ఊరూరా తిరుగుతూ దొంగతనాలు చేసే బందిపోట్ల బెడద విపరీతంగా ఉండేది.
“వాళ్ళ తాతలు,తండ్రులు, అందరూ ఈ ఊళ్ళోనే పుట్టారు. ఈ ఊళ్ళోనే చనిపోయారు. వాళ్ళది ఈ వూరు కాకపోతే నీది మాత్రం ఈ వూరు ఎలా అవుతుంది. మీ నాన్న ఎక్కడి నుండో ఉత్తరాదినుండి ఇక్కడకు వచ్చాడు. అక్కడ ఉత్తరాదిలో ఏ వూరో కూడా నీకు తెలియదు.అట్లాగే చిన మస్తాన్ పూర్వీకులు ఎక్కడినుండి వచ్చారో మస్తానుకూ తెలీదు. నీది ఈ వూరైతే, మస్తాన్ దీ ఈ వూరే. మస్తాన్ తాతలు, తండ్రులు అందరూ స్వామివారికి నాద స్వరం తో అర్చన చేస్తూ వచ్చారు. ఖాదర్ వాళ్ళూ అంతే! మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కుదరదు” అన్నాడు రామినాయుడు.
నేను కవినీ కాదు, విమర్శకుడినీ కాదు; కేవలం ఓ సామాన్య పాఠకుడిని. ముకుంద రామారావు గారి “అదే ఆకాశం: అనేక దేశాల అనువాద కవితలు,” గ్రంథాన్ని సమీక్షించడానికి ఎందుకు సాహసించానంటే, ఈ పుస్తకంలో అనేక దేశాల కవితలు అందమైన తెలుగులో ఉన్నాయి; రోర్టీ అన్నట్లు వాటిని నెమరేసుకుంటే దగ్గరి స్నేహితులతో గడిపినట్లే.
తెలుగు భాషపై వివిధ భాషలు చూపిస్తున్న ఆధిపత్యాన్ని గురించి మొదట అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఆధిపత్యాలు అన్నిటికీ వలసవాద భావజాలమే కారణం. తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మాటలు ఇవి: “సనాతనుల దృష్టిలో సంస్కృతం నేర్చిన వాళ్లే చదువుకున్నవాళ్లు. అధునాతనుల దృష్టిలో ఇంగ్లీష్ నేర్చుకున్నవాళ్లే చదువుకున్నవాళ్లు. ఆ సనాతనులు, అధునాతనులు తెలుగువాళ్లే. మళ్లీ ఈ మధ్య హిందీ మానసపుత్రులు బయలుదేరారు. వారికి తెలుగు బతికి ఉండడమే పనికిరాదు.” అంటారు శ్రీపాద.
“సంఘటనలు కథలుగా మారకుండా చూసుకోవాలి. ఒకసారి కథలుగా అయ్యాయంటే, రెండు సమస్యలు. ఒకటి కాదన లేవు. రెండు నిరూపించ లేవు.” ఈ నవలాకథనానికి మూలసూత్రం అదే.
తెలుగు సాహిత్యంలో పండితుల ప్రశంసలను, పాఠకుల ఆదరణను పొందిన గ్రంథం పోతన భాగవతం. రెండు మూడు దశకాల పూర్వం వరకూ పోతన పద్యాలను వల్లెవేయని తెలుగు వారు వుండేవారు కాదన్నది అతిశయోక్తి కాదు.
పరహితం, లోకహితమే కాకుండా సన్నిహిత మిత్రులకి సదా శ్రేయోభిలాషిగా ఉండే విద్యార్థి గారు 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు!
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ.
2025వ సంవత్సరానికి ‘ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సాహితీ పురస్కారం’ ప్రముఖ కవి శ్రీ విన్నకోట రవి శంకర్ గారికి ఇవ్వడానికి అవార్డు కమిటీ నిర్ణయించింది.
ఈమాట – సెప్టెంబర్ 2025 ఆలూరి బైరాగి ప్రత్యేక సంచికకు రచనల ఆహ్వానం
ఇపుడు మేము నడుస్తున్నది దిగువ హిమాలయాలలోని అడవులలో… మర్సియాంగ్దీ నదీలోయలోని పర్వతాల సానువుల్లో ఉన్న అరణ్యాలలో.. ఆ లోయకు అటూ ఇటూ ఎగసి నిలచిన పచ్చని పర్వతచరియల్ని చూస్తోంటే ప్రకృతి తన కళాత్మకతనంతా ఇక్కడే పొందుపరచిందా అనిపించింది. పచ్చని అడవులు, వరి పొలాలు, జలపాతాలు – అన్నీ చక్కగా అమరిపోయి ఉన్న ఆ సుందరసీమ ప్రకృతి గీసిన బృహత్తర వర్ణ చిత్రం కాదూ?!
తెలుగుదేశంలోని తల్లిదండ్రులకు ఆంగ్లభాష ప్రపంచాన్ని ఓ కుగ్రామంలా మార్చేసి చప్పున అరచేతిలో పెట్టే మంత్రదండం. భారతదేశ సమగ్రతకు, సమైక్యతకు హిందీ భాష అత్యవసరమన్నది ప్రస్తుత […]
పిసపిసలాడే మాంసపు ముద్దలని, చీము, నెత్తురులని కనబడకుండా కప్పెట్టి మన కొక బాహ్య సౌందర్యాన్ని కల్పించి, మనకి ఒక ఆకర్షణని, వ్యక్తిత్వాన్ని ఇస్తుంది చర్మం. మన స్పర్శ జ్ఞానానికి మూలాధారం చర్మం.
1752 జూన్ నెల వానా కాలం. కొడుకుని తీసుకొని ఫ్రాంక్లిన్ మైదానానికి వెళ్ళాడు. గాలిపటాన్ని ఆకాశంలోకి వదిలాడు. గాలికి పటం అటూ ఇటూ కొట్టుకుంటూ ఎగురుతూ మిన్నంటుకున్నది. ఓ మబ్బు గాలిపటాన్ని రాసుకుంటూ వెళ్ళింది కాని ఏమీ జరగలేదు. ప్రయోగం విఫలమైందని విచారిస్తుండగా మరో మబ్బు పటాన్ని తాకింది. దారానికి గల పోగులు రోమాల్లా నిక్కబొడుచుకున్నాయి – ఒకదానికొకటి దూరంగా, అవన్నీ విద్యుద్వాహకమైన తీగె మీద ఉన్నట్లుగా. ఫ్రాంక్లిన్ తాళం చెవిని మెటికతో తాకాడు. స్పార్క్ వచ్చి షాక్ కొట్టింది. ప్రయోగం సఫలమైంది.
గిడుగు నుంచి గురజాడ వరకు అందరూ వ్యావహారికాన్ని శిష్టతతో ముడివేశారు. ఆంగ్లేయులు, అగ్రవర్ణములవారు, ఇంగ్లీషు దొరలు పాలించే అభివృద్ధి చెందిన ప్రాంతాల నగరీకరణ చెందిన ప్రజలు వ్యావహారిక భాషకు మూలస్థంబాలు ఈ సంస్కర్తల దృష్టిలో. తెలుగు దళితవాదం కూడా వలసవాద భక్తి, ఆంగ్ల పాశ్చాత్య అనురక్తి అనే ఆధునిక అగ్రవర్ణ వలయంలోనే తిరుగుతోంది.