కినిగె గురించి: 2010లో స్థాపించబడి, తెలుగు పుస్తకాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులకు అందిస్తూ, తెలుగు ఈ-బుక్ రంగంలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలిచింది కినిగె. పాఠకులకు, ప్రచురణకర్తలకు, రచయితలకు ఒక అద్భుత ప్లాట్ ఫామ్ కినిగె.
శీర్షికలు సంచికలు
మానవ సమాజ పరిణామ క్రమంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం లిపి పుట్టుక — రాత ద్వారా మానవుడు సమాచారాన్ని పంచుకోవడం. ఆ రాత పుట్టుక, పెరుగుదలల పూర్వోత్తరాలను ఎంతో ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా పప్పు నాగరాజు, పరుచూరి శ్రీనివాస్ వివరిస్తున్న సమీక్షా వ్యాసపు మొదటి భాగం రాత పుట్టుక, పరిణామం: 1. పాశ్చాత్య ప్రపంచం; భగవంతం కవిత త్రిపురాత్రి… త్రిపురహిత పగలు ఇటీవలే కీర్తిశేషుడైన కవి, రచయిత త్రిపుర జ్ఞాపకంలో కనకప్రసాద్ అవధారు; కవి, పుస్తకం, కర్తృత్వం మీద తన సిద్ధాంతాన్ని మరికొంచెం వివరిస్తూ వెల్చేరు నారాయణ రావు రాసిన వ్యాసం మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు రెండవ భాగం; మే 24-26న డాలస్‌లో జరిగిన తానా 19వ ద్వైవార్షిక సమావేశాల జ్ఞాపిక ఈమాట గ్రంథాలయంలో; ఆకాశవాణి పన్నాల సుబ్రహ్మణ్య భట్టు త్రిపురల పిచ్చాపాటీ;నాకు నచ్చిన పద్యం శీర్షికను ఇకనుంచీ కొనసాగించే భైరవభట్ల కామేశ్వర రావు మొదట చెప్పిన పద్యం దాశరథి మించుకాగడా — ఈ సంచికలో విశేషాలు.
తెలుగు పలుకు – తానా 2013 జ్ఞాపిక
ఇంకా ఈ సంచికలో: ఎలనాగ, తః తః, స్వాతికుమారి, నారాయణ, జాన్‌హైడ్, ఆర్. దమయంతి, దేశికాచార్యులు, ప్రసాద్, భాస్కర్, ఇంద్రాణి, శ్రీవల్లీ రాధిక, హెచ్చార్కెల కవితలు; రవిశంకర్, సుబ్రహ్మణ్యం, శివకుమారశర్మల కథలు; మోహన రావు, మురళీధరరావుల వ్యాసాలు; సత్యం శంకరమంచి అపురూపమైన ఆడియో రూపకం హరహరమహదేవ…
కండలు తిరిగిన కుర్రాడొకడు
ఎక్కాడు మొరటుగా రెక్కలు నలిగేట్టు
వాడి చేతిలో చిట్లిన గాజు
చనిపోయిన తన ప్రేయసి పెట్టిన
తొలిముద్దు జ్ఞాపకపు ముక్క
[అవినేని భాస్కర్ చేసిన చిన్నారి-దేవత కవిత తమిళ మూలం: తెలుగు, తమిళ్ లిపులలో. పెయ్యెన పెయ్యుం మళై (కురవమనగా కురిసే వర్షం) కవితా సంపుటి […]
కడలి అడుగున
వెలిగే చేప
కడుపు లోపల
తిరిగే పాప
రక్తమంటిన
సింహపు కోర
ఎవరన్నారు మనిషంటే ఘన పదార్ధమని?
చెట్టిక్కిన వాడూ మనిషే
ఎక్కిన కొమ్మను నరుక్కున్న వాడు మనిషే
కింద పడి విలవిలలాడి మృత్యువును ముద్దాడిన వాడూ మనిషే
దానికన్నా నిరుపయోగమైనది లేదు
రూపం లేదు భాషా రాదు
నడవడం తెలియదు నవ్వీ ఎరుగదు
కష్టాలు తీర్చదు కరచాలనానికీ అందదు
పున్నాగములు కొన్ని మూర్ధంబునందు,
కాంచనంబులు కొన్ని కంఠంబునందు,
మల్లెపూవులు కొన్ని యుల్లంబునందు,
హల్లకంబులు కొన్ని హస్తంబులందు,
పంకజంబులు కొన్ని పాదంబులందు,
వేకువలో పాడే ఆమె గొంతు లోంచి
విడుదలయ్యే ధ్వని తరంగాలు
నిరంతరంగా
ప్రకంపనాలు రేపుతుంటాయి
తడారిన గాలి, వడి వడిగా నడుస్తూ నిప్పులోకి దూకుతోంది.
తన చివరి పరిమళపు జావళిని వినిపిస్తూ ఓ మల్లె
మట్టిలో రాలిన చప్పుడవుతోంది.
కనపడని ఒక విచ్ఛేదం
కడుపులో పొంచి వున్నట్టు
బద్దలవబోయే బాంబు ఒకటి
లోపల బస చేసి టిక్ టిక్ టిక్ అంటున్నట్టు
దేహం లోని అంతరింద్రియంపై
దాడి చేసేందుకు క్రూరమృగమొకటి
మన ప్రేమ
మన కలల చుట్టూ
మనం అల్లుకున్న వల
అది
కొండగాలి
కౌగిలిలో కోన కిలకిల…
శరీరంతో
మీరు లేని ప్రపంచంలో
నేనూ కొంతకాలం నివసిస్తాను త్రిపురా…!
మనిషి ఉన్నప్పటి ప్రపంచాన్ని
లేనప్పటి ప్రపంచంతో పోల్చుకుంటూ –
కొన్ని కాంతి సమయాల్ని తింటూ –
వింత ఆటలో పాల్గొంటూ…
సంధ్యా సముద్రమూ చెరోవైపు నుంచి మీదకొచ్చి పడుతుంటే తిరిగి వెళ్ళే ప్రతి అలతో పాటు ఇసుకలోకి కూరుకుపోయే పాదాల్ని పైకి లాక్కుంటూ ప్రయాసపడే వాడు దీపస్థంభానికి చిక్కుకుని రెపరెపలాడుతున్న గాలిపటంతో గుసగుసగా అన్నాడు నాకు తెలుసు ఓడిపోవడానికే మొదలెట్టాను ఈ ఆటని
ఈ పావురాలు ఎగిరేందుకు పుట్టినవికావు
ఇవి వాలేందుకే ఈ లోకంలోకి వచ్చాయి
కాస్త నీడా కాస్త శాంతీ ఉన్నచోట వాలి
నీడ లాంటి శాంతి లోకి వృత్తంలా మరలి
అతడూ అమ్మాయి విడిపోయేప్పుడు పంచుకోడానికి
విడిపోయే ఆలోచన రావడానికి ముందు కొనుక్కున్న
సింగిల్ ఫ్యామిలీ హౌస్ కిటీకీలో ఏదో కదలిక
లేదు జానకీ, అది నిజం కాదు. నాకు మనుషుల మీద జాలి, కరుణ అంతే. నాకు ఎవరి మీద, దేని మీద ద్వేషం లేదు – మనుషులతోనే కాదు పువ్వులతో, చెట్లతో, పక్షులతో కూడా మాట్లాడతాను. దారిలో చెయ్యి చాచిన ప్రతి చెట్టు కొమ్మని ఆప్యాయంగా అందుకుంటాను. మమ్మీ! డాడీ మాటలలాగే ఉంటాయి. ఆయన మాట్లాడకపోవటమే బెటరు.
బ్రహ్మగారు ఎంత చెప్పినా పశుపతికి భార్యోత్సాహ పద్యం పాడుకోవాలనే ఉబలాటం తగ్గలేదు. కష్టమైనా, నిష్ఠురమైనా సాధించాలని బలంగా కోరుకున్నాడు. లహరి మహా దొడ్డ ఇల్లాలు అని భార్య పేరు పొందాలని, తద్వారా లహరీపశుపతులు ఆదర్శ దంపతులు, ఒకరి కోసమే మరొకరు పుట్టారు అనిపించుకోవాలని తీర్మానించుకున్నాడు. ఘోర ప్రతిజ్ఞ చేసుకున్నాడు.
శివయ్య పార్టీ కొత్తది కాబట్టి అప్పటికే దశాబ్దాల చరిత్ర వున్న రాజకీయ పార్టీలన్నీ కుమ్మక్కై ఆ సవాళ్ళకి జవాబులు చెప్పకూడదని నిర్ణయించుకున్నాయి. వాళ్ళ నిర్ణయాలకి కారణం, అలాంటి సవాళ్ళు విసిరింది తామెంత అవినీతిపరులో నిర్ధారించడానికి శివయ్య వేసిన ఎత్తు కావచ్చనీ, సవాళ్ళని తాము స్వీకరించగానే శివయ్య తన పనయిందని పెద్దగా నవ్వేసి ఈల వేసి గోల చేస్తాడేమోననీను.
కథలో, అడపా తడపా కుముదం, నేను పాత్ర, సుమారు ఇరవైఏళ్ళలో ఒక మూడు నాలుగు సార్లు కలుస్తారు. మాట్లాడుకుంటారు. కలిసిన ప్రతిసారీ, కుముదం జీవితంలో మనిషిగా ఎంత ఎత్తు ఎదిగిందో, ‘నేను’ ఎంత కిందకి దిగజారిందో అంచెలు అంచెలుగా కనపడుతుంది.