జయప్రభ


సొంత ఊరు:
నాగపూర్
ప్రస్తుత నివాసం:
సికింద్రాబాద్
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

జయప్రభ స్త్రీవాద రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. వీరు వ్రాసిన “చూపులు”, ”పైటని తగలెయ్యాలి” అనే కవితలు సాహిత్యప్రపంచంలో ప్రకంపనలను సృష్టించాయి; పలుభాషలలోకి అనువదించబడ్డాయి. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రికగా 1989లో హైద్రాబాదునుండి వెలువడిన ‘లోహిత’ అనే పత్రికకు కొండవీటి సత్యవతితో కలిసి సంపాదకత్వం వహించారు. వీరి కవిత్వాన్ని మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు Unforeseen Affection and Other Love Poems అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు.


 

ఏయే దారులంట మళ్ళాలో తెలియని ఎన్నో జీవులు గతి తప్పడం నన్ను అయోమయపరిచేది. గతి ఏమిటని నేను నదిని అడిగాను. ప్రవహించడం మాత్రమే నాకు తెలిసిన విషయం అంది సౌపర్ణిక. గతి ఎవరని మేము శూన్యాన్ని అడిగాము. చుక్కల్ని అడిగాము. సూర్యచంద్రుల్ని అడిగాము. జననమేమిటీ? మరణమేమిటీ? జీవనమేమిటీ? అని మేము చరాచరాల్నీ అడిగాము.

స్త్రీల సామాజిక దుస్థితి గురించి, వారి స్వేచ్ఛా స్వాతంత్రాల గురించి తన ఆందోళనని జీవితాంతమూ కొనసాగించిన రచయిత గుడిపాటి వెంకటాచలం. చలం సాహిత్య ప్రభావం […]