ఏనాటివో గుర్తులేక
రంగు వెలుస్తున్న ఊహలు
రేకులు విప్పి అందంగా
కుండీలో కుదురుకుని
మళ్ళీ కొత్తగా పూసినట్లే నవ్వుతూ
శీర్షికలు సంచికలు
ఒక సినిమా బతికి బట్టకట్టి, ప్రేక్షకులని చేరి, వారి దూషణ-భూషణలు, సత్కార-చీత్కారాలు, ఆదరణ-తిరస్కరణలు మున్నగు ద్వంద్వ సమాసాలకు గురికావడానికి పైన పేర్కొన్న వాటిలో ఏ ఒక్క పనికి మాలిన, అసంబంధిత కారణమైనా చాలు. ఇదే సినీ వైకుంఠపాళి.
వర్షం కురిసినపుడో
పూవు రాలినపుడో
సన్నజాజులు పలుకరించినపుడో
ఏ వెన్నెలరాత్రో
ఏ శ్రావణ మేఘం ఉరిమినపుడో
ఏ కోవెల ప్రాంగణపు కోనేటి నిశ్శబ్దంలోనో
జీవితపు ఏ శూన్యతో నిన్ను నిలవేసినపుడో
అలా వాకిట్లో మంచం వాల్చానో లేదో-
ఒక్కొక్కటిగా
నా జ్ఞాపకాలన్నీ పులుముకుంది
ఆకాశం.
ఎప్పట్లాగే
గతాన్ని వెలిగించి గట్టిగా పీల్చా
ఇదిగో
చీకటి గోడలకు చూపులనతికించి
నడిరాత్రి నడుం మీద
సమయాన్ని చేది పోస్తూ
అరతెరిచిన కళ్ళతో
ఒక్కొక్క జ్ఞాపకం పూసని
మునివేళ్ళతో మీటుతూ
పూడూరి రాజిరెడ్డితో కథల ప్రయాణం అద్భుతమైన అనుభవం. మనకు విసుగు తెలీకుండా కబుర్లు చెబుతూనే వుంటాడు. తన అనుభవాలు చెబుతూనే, అందులోనుండి గ్రహించిన జీవిత సత్యాలను, తాత్త్విక అవగాహనను మనతో పంచుకుంటాడు. సమయం చూసి మంచి పంచులు విసురుతుంటాడు. కిటికీ తెరచి అందులోనుండి ప్రకృతిని చూడమంటాడు.
ఎనుకటి తడి జ్ఞాపకాలను మోస్తూ
ఒళ్ళంతా విచ్చుకున్న పొడికళ్ళతో
ఎదురుచూస్తున్న చెరువును
సడిలేని మత్తడి
యెట్లా సముదాయిస్తది?
దాగుడుమూత లాడుతూ
బీరువాలో దాక్కున్న పిల్లోనిలా
ఇంట్లో ఉన్న ఆటబొమ్మలన్నీ
వాడి పాదాల సడి కోసం
చెవులు రిక్కించి వింటుంటాయి.
ఏ చెయ్యీ నను చేరదీయదనీ
ఏ మొగ్గా నాకోసం బుగ్గరించదని తెలిసాక
నా కాళ్ళ మోడుపై నేనే ఎదిగి
నా వేళ్ళ చివర్లు నేణే చిగురించుకుని
నాలో నేను మోయలేనంత పువ్వునై విచ్చుకుంటాను.
బందర్ రోడ్
బాబాయ్ హోటెల్
మెలికల్ మెలికల్
బెజ్వాడ్ బాజార్స్
బాణాల్ వేసి
వెదికీ వెదికీ
నాకప్పుడు పాకిస్తాన్‌లోని ఈశాన్య మూలనున్న పెషావర్‌లో ఉద్యోగం. ఆరోజుల్లో నాకొక వంటమనిషి కావలసి వచ్చాడు. మనిషంటూ దొరికితే, అతని పని చాలా సులువుగానే ఉంటుంది, సందేహం అక్కరలేదు. వంట చెయ్యాల్సింది నా ఒక్కడికి మాత్రమే. ఉదయం అల్పాహారం నేనే చేసుకుంటాను. టోస్ట్ చేసుకుని బ్రెడ్‌కి వెన్న రాసుకోడానికీ తినడానికీ నాకు సరిగ్గా నాలుగు నిముషాలు సరిపోతుంది. మధ్యాహ్నానికీ, రాత్రి భోజనానికే ఇబ్బంది.
నాకేదో అయిపోయినట్టు, అంతలోనే ఏమీ కానట్టు…
రెండు రెండుగా ఆలోచిస్తున్నారు.
రెండు రెండుగా చూస్తున్నారు.
జాలిచూపులు దాచుకోలేక అవస్థ పడుతున్నారు!
నిజం నాకు తెలుసని వాళ్ళకీ,
వాళ్ళకి తెలుసని నాకు తెలియనిదేమీ కాదు.
మరి కొన్ని కాలాలు ఇక్కడే విడిచిపెట్టినా
మరొక్క మాటా పెగలని మన మర్యాదల మీద
ఒక్క అడుగు ఎటూ కదలని మన విడి విడి కథల మీద
ఇవాళ కాస్త ఎక్కువ జాలిపడుతూ చెరో దారికి విడిపోతాం
ఎప్పటిలాగే నువ్వు తూర్పుకి, నేను పడమరకి!
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
గతంలో బి.ఎన్. రెడ్డి పైన వ్యాసం రాసినప్పుడే ఈ రేడియో ఇంటర్‌వ్యూని ప్రస్తావించినందువల్ల దానిని కూడా జత పరచుదామనుకున్నాను కానీ సమయానికి డిజిటైజ్ చేయడం సాధ్యపడలేదు. ఆ తర్వాత దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. అలా ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడు, ఇక్కడ, మీరందరూ వినగలిగేట్లు!
అడ్డం నందనవనంలో దాగిన మొహం సమాధానం: వదనం. ఏనగ్రామ్. శకుని చేతిలోని ఆయుధం సమాధానం:పాచిక. వని కాని భూమి సమాధానం: వని కానిది అ-వని. […]
గడినుడి 13 పూర్తిగా నింపినది ఈసారి ఒక్కరే. కామాక్షిగారికి మా అభినందనలు. సరిచూపు సహాయంతో గడి పూర్తిగా తప్పులు లేకుండా నింపిన మొదటి ఐదుగురు: 1. వైదేహి శశిధర్, 2. రాఘవేంద్ర ఆదిత్య, 3. ఎ. రామారావు, 4. పూల రమాదేవి, 5. కార్తీక్ చంద్ర. వీరికి మా అభినందనలు.
అధివాస్తవికతావాదం 1950, -60 దశకాలకల్లా సాహిత్యాన్ని దాటి చిత్రకళానాటకరంగాలలో ప్రవేశించి ఒక గొప్ప సాంస్కృతిక ప్రభంజనంగా పరిణమించింది. ఆ అధివాస్తవికోద్యమానికి పారిస్ నగరం కేంద్రం కాగా అందులో చిత్రకారుడు స్టాన్లీ హేటర్ చిత్రశాల ఆట్లియే 17 కేంద్రబిందువు అయింది. బెకెట్, పికాసో, బ్లిన్, ఆఖ్‌త్వాఁ వంటి ఎందరో కళాకారుల సమక్షంలో పెరిగిన ఆగీ హేటర్ ఒక చక్కటి కవి, రచయిత, నటుడు, అనువాదకుడుగా ఎదగడంలో ఆ దశకాల ప్రభావం ఎంతో ఉంది. ఆనాటి పారిస్ నాటకరంగం, అబ్సర్డ్ థియేటర్ గురించి, నాటకరంగంలో తన ఎదుగుదల గురించి రాసిన ఆత్మకథాత్మక వ్యాసం షోబిజ్ డేస్ – నాగరాజు పప్పు అనువాదం; భారతదేశానికి సంబంధించినంతవరకు భావవ్యక్తీకరణ విషయంలో జరిగే తిరుగుబాటుకీ కులవ్యవస్థకీ ఉన్న సంబంధం ఎలా కీలకమైనదో వివరిస్తూ, బెంగళూరు పెన్ సంస్థ నిర్వహించిన లేఖన-2017 కార్యక్రమంలో ప్రసిద్ధ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ ప్రసంగపాఠం – అవినేని భాస్కర్ సమర్పణ; తెలుగువారందరికీ సుపరిచితమైన యమాతారాజభానసలగం అనే నెమానిక్ ఎలా ఏర్పడి వుండచ్చో వివరిస్తున్న ఛందస్సులో గణితాంశములు వ్యాసం – జెజ్జాల కృష్ణ మోహన రావు; అంతుచిక్కని వింతదేవుడిపై కొనసాగుతున్న సురేశ్ కొలిచాల వ్యాసం; ఇంకా, కథలు, కవితలు, పద్యసాహిత్యం, తెరచాటువులు, గడి నుడి…
ఆ రోజుల్లో, కళ కళ కోసమే అని వాదించే అబ్సర్డిస్టులు, నాటకాన్ని సాంఘిక, రాజకీయ మార్పుకి వేదిక కావాలని వాదించే బ్రెఖ్టియన్ల మధ్య వాదోపవాదాలు వాడిగా వేడిగా నడిచేవి. కెనెత్ టైనన్ అబ్సర్వర్ పత్రిక నడిపేవాడు. అతను ఉద్యమకారుల పక్షాన, ఐనెస్కో కళాకారుల పక్షాన ఉండేవారు. ఐనెస్కో కళాకారుల కవిత్వకాల్పనికతను సమర్థించేవాడు. మొదటినుంచి ఐనెస్కోనే నా హీరో.
ప్రాణసఖిగా అతని జీవితంలోకి ప్రవేశించి, ప్రేయసిగా మారిన ఆమె ఉన్నట్టుండి ఒకనాడు తన జీవితాన్నుండి అతన్ని బహిష్కరించింది ఎందుకెందుకెందుకెందుకని అడిగేందుకు వీలివ్వకుండానే. ఒకే చరణం పదే పదే పాడే అరిగిపోయిన గ్రామఫోను రికార్డ్ లాగా ఆమెనూ, ఆమె జ్ఞాపకాలనూ మించి ఆలోచించలేకపోయాడు అతను.