అడ్డం
- పొద్దున్న విప్పే కథ (3)
సమాధానం: పొడుపు - అప్పుడప్పుడు రాసే ఒక స్వల్పమైన రచన (3)
సమాధానం: కల్పన. అక్షరం తప్పించి చూడాలి. - భవిష్యత్తుని సూచించే అందగత్తె (3)
సమాధానం: భావిని భావి+ని - ప్రతి సూర్యోదయం మధ్యలో జరిగే పుట్టుక (3)
సమాధానం: ప్రసూతి. ప్ర[సూ]తి - గచ్చకాయతో పిల్లలు ఆడుకుంటారు (5)
సమాధానం: కుబేరాక్షము. రెండర్థాలమాట. - నారి గతకల్లో పడితే సంస్కృతి (5)
సమాధానం: నాగరికత. అనాగ్రామ్ - జిగట బంక (3)
సమాధానం: బందన. రెండర్థాలమాట. - బాబాలు పుట్టించేది కాబోలు (3)
సమాధానం: భస్మము - తునాతునకలు (5)
సమాధానం: ముక్కముక్కలు - మన రోము గతి తప్పడం అభివృద్ధికి వ్యతిరేకం (6)
సమాధానం: తిరోగమనము. అనాగ్రామ్ - తలలేని ఎగసిపాటు నిద్రాదేవికి ఆహ్వానం పలుకుతుంది (4)
సమాధానం: ఆవలింత. ఎగసిపాటు అంటే విజృంభణము. తల లేకపోతే జృంభణము. - తలలేని పట్నంకి వచ్చే రోగం (3)
సమాధానం: గరము. నగరము-తల తీసేస్తే వస్తుంది. - భాగవతములో పోతే పోయిన ఆలోచన (3)
సమాధానం: భావము - కంటికి పెట్టుకునే నాసికా దర్పణము (4)
సమాధానం: ముక్కద్దము. ముక్కు+అద్దము - కక్ష-పాపముల విచిత్ర కలయికతో అధికారంలో ఉన్నకూటమి (6)
సమాధానం: పాలకపక్షము. చెల్లాచెదురైంది. - కాటుకపిట్ట (5)
సమాధానం: కర్కరాక్షము - చావూ-బతుకుల మధ్య పూగులాడే ప్రమాదకరమైన రోగం మొదలు (3)
సమాధానం: ఉయ్యాల. చావూ-బతుకుల మధ్య పూగులాడే జబ్బు ఉయ్యాల రోగం. ఈ రోగం
మొదటి మాట ఉయ్యాలే కదా? - ఎండకు పట్టేది కాబోలు (3)
సమాధానం: గొడుగు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం అన్నది నానుడి. - మొగలి పుష్పదళము విచ్చుకుంది (5)
సమాధానం: దళపుష్పము. విచ్చుకోవడం తారుమారుకి సంకేతం. - దాసీసుతుల ఏర్పాటుతో బయటపడ్డ గోస్వామి (5)
సమాధానం: తులసీదాసు. ఏర్పాటు తారుమారుని సూచిస్తుంది. - అదృష్టం మధ్యలో తుదిలేని గుహ కలిస్తే సరసుడౌతాడు (3)
సమాధానం: సుగుడి. సుడి మధ్యలో గు చేరిస్తే సరి. - ముడి లో చిట్టచివర చేరిస్తే నిర్బంధం (3)
సమాధానం: ముట్టడి. ముడి మధ్యలో ట్ట చేర్చాలి. - నేరం మోపబడినవాడికి తిరిగి అవకాశం యిద్దాము (3)
సమాధానం: ముద్దాయి. అక్కడే వెనుకనుండి కనిపిస్తోంది. - ఇది చాలించడం అంటే చావు (3)
సమాధానం: తనువు. తనువు చాలించడం వినే ఉంటారు.
నిలువు
- పొడిగా మాకు అప్పుడప్పుడు ఇచ్చినా సరే పీల్చి పారెసేది (3)
సమాధానం: పొగాకు. అక్షరాలు తప్పించి చూడండి. - నక్షత్రం మధ్యలో దుష్టుడు ప్రవేశిస్తే మణి ఉద్భవిస్తుంది (5)
సమాధానం: పుష్యరాగము. పుష్యము అంటే నక్షత్రము. రాగ అంటే దుష్టుడు. మధ్యలో వచ్చేడు. - గుర్రపు నడక విశేషం (3)
సమాధానం: కదము - కంటిచూపుతో చంపేసే దేముడు (6)
సమాధానం: నయనాయుధుడు - గొప్ప సంస్కర్త మధ్య ప్రవేశిస్తే శని (3)
సమాధానం: భాస్కరి. గొప్ప అంటే భారి. సంస్కర్త మధ్య అంటే స్క. - పశువుల నీళ్ళతొట్టిలో కడవ మొదట ముంచితే దోషము (5)
సమాధానం: నిపాతకము. నిపాతము అంటే పశువులతొట్టి. మధ్యలో క చేరిస్తే వస్తుంది. - తిక్కన ఆరంభంతో కావ్యం మధ్యలో చేరితే అంతరాయము అవుతుంది (5)
సమాధానం: ప్రతిబంధము. కావ్యం అంటే ప్రబంధము. తిక్కన ఆరంభం అంటే తి. మధ్యలో చేరిస్తే సరిపోతుంది. - స్వస్థత చేకూరిన కవి ముక్కు (3)
సమాధానం: తిమ్మన. స్వస్థత అంటే తిమ్మన. ముక్కు తిమ్మన కవిగారు అందరికీ తెలుసు. - అనుభవం తిక్క కుదిరిస్తే ఇల్లు కనిపిస్తుంది (3)
సమాధానం: భవంతి. అక్కడే ఉంది. - ఓదార్పు చెప్పు అందము (5)
సమాధానం: అనునయము. చెప్పు అంటే అను. అందము అంటే నయము. మొత్తం కలిస్తే ఓదార్పు. - అంతులేని రచ్చతో రెండో పెళ్ళాం వంటిల్లు పూర్తయ్యింది (4)
సమాధానం: రసవతి. రెండో పెళ్ళాం అంటే సవతి. రచ్చలో ర [అంతు లేదు]. కలిస్తే వంటిల్లు - కోయబడ్డ దొంగసొమ్ము (3)
సమాధానం: లుప్తము. రెండర్థాల మాట. - మూడడుగుల జంతువు (3)
సమాధానం: గజము. గజానికి మూడడుగులే కదా? - పాము తలకు పుట్టే నాగవల్లీదళం (5)
సమాధానం: తములపాకు. పుట్టడం తారుమారుని సూచిస్తుంది. - పాము ఎత్తేది తిరగబడితే ఇల్లు (3)
సమాధానం: గడప. పాము ఎత్తేది పడగ. తిరగబడింది. - చక్కనిది తెలివిలేనిది? (4)
సమాధానం: ముద్దరాలు. ముద్దరాలు అంటే ముగ్ధ. దానికి చక్కనిది, తెలివిలేనిది అని రెండర్థాలున్నాయి. - భార్య షికారు కథ ముందు వాక్కు (3)
సమాధానం: భాషిక. మొదటి మూడు పదాల మొదటి అక్షరాలని పేరిస్తే వస్తుంది. - జీయర్లు సదా ధరించేది? (3)
సమాధానం: ముక్కోల - కవ్వానికి పనిచెప్పింది ఇక్కడే (6)
సమాధానం: పాలసముద్రము - రామమ్మ గుడి బద్దలుకొడితే కూష్మాండం (5)
సమాధానం: రామగుమ్మడి. బద్దలుకొట్టడం తారుమారైందనడానికి సంకేతం. - పాదరసములో కలిసిన 3 మొదలు ఉల్లిగడ్డ (5)
సమాధానం: ముకుందకము. ముకుందము అంటే పాదరసము. 3 అడ్డం మొదటి అక్షరం క. మధ్యలో కలిస్తే ఉల్లిగడ్డ. - క్లుప్తంగా ఉదాహరణకి సీతలో 3 చివర చేరితే ఉపేక్ష (5)
సమాధానం: ఉదాసీనత. ఉదాహరణకి క్లుప్తం ఉదా. మూడు అడ్డం చివరి అక్షరం న. సీత మధ్యలో చేరితే ఉదాసీనత అయింది. - సంకెల నగ (3)
సమాధానం: గొలుసు. రెండర్థాల మాట. - బంగారుబొమ్మ (3)
సమాధానం: పుత్తడి. రెండర్థాల మాట. - అశ్వాలంకరణ విశేషం (3)
సమాధానం: తురాయి - ఇది సులభం (3)
సమాధానం: సులువు. సులువే కదా?