కొసీ ఫాన్ తుత్తె
కొసీ ఫాన్ తుత్తె (Così fan tutte) అనునది మొజార్ట్ (Wolfgang Amadeus Mozart) చేసిన సంగీతరూపకము (opera). లొరెన్జో ద పాన్తె (Lorenzo Da Ponte) అను నాటకకర్త ఇటాలియను భాషలో నీ రూపకమును వ్రాసెను. ఇది తొట్టతొలిగా క్రీ.శ. 26 జనవరి 1790 సంవత్సరమున వియన్నాలో మొజార్ట్ సంగీత దర్శకత్వములో ప్రదర్శింపబడెను. ఆకాలములో ఇది ఎక్కువ ప్రసిద్ధి గనకున్నను 20వ శతాబ్దార్ధమునుండి ఇది ప్రతి సంవత్సరమును ప్రపంచవ్యాప్తముగా అనేక సంగీత నాటక బృందములచే ప్రదర్శింపబడి సుప్రఖ్యాతమైనది. ఈకాలములో ప్రేక్షకులకిష్టమైన ఆపెరాల లోనిది ప్రథమ శ్రేణికి జెందినది.
ఇందులో గల కథ సంగ్రహముగా నిది: నేపుల్స్ నగరంలో ఫెర్రాందో (Ferrando), గుల్యెల్మో (Guglielmo) అను ఇద్దఱు యోధులున్నారు. వారికి దొరబేల్లా (Dorabella), ఫ్యోర్దిలీజి (Fiordiligi) అను యువతులతో వివాహమునకై నిశ్చితార్థము జరిగినది. ఈ యువతులకు తమపై అచంచలమైన ప్రేమ గలదని ఆ యోధులు వాకొనుచుండగా డాన్ ఆల్ఫోన్సో (Don Alfonso) అను మధ్యవయస్కుడు అచంచలచిత్తలైన యువతులే లేరని వారి వాక్కులను ఖండించుటయే కాక, దానిని నిరూపింపలేనిచో వారికి తలా నూరు బంగారు నాణెముల నిత్తునని ప్రమాణము చేసినాడు. ఇది నిరూపించుటకు రెండురోజుల పాటీ యువకులు తాను చెప్పినట్లుగా చేయవలెనని వారిచే ఒప్పందము చేసికొన్నాడు. మఱునాడు ఆ యోధులు యుద్ధమునకై దేశాంతరమునకు పోవుచున్నట్లు వారి వధువులకు నమ్మకము కల్గించినాడు. కాని ఈ యోధులకు ఆల్బేనియా ధనవంతుల వేషములు వేసి, వారిని యువతులకడకే పంపి ఆ యువతులకు తమపై ప్రేమాసక్తి కలుగునట్లు నటింపుమని నిర్దేశించినాడు. ఆ స్త్రీల మనస్సులీ కృత్రిమవేషధారులవైపు త్రిప్పుటకై ఆ స్త్రీల గృహసేవికయు, అత్యంత చతురురాలును ఐన దెస్పీనా (Despina) అను యువతికి లంచమిచ్చి ఆమె సహాయమును పొందినాడు. మొదట నిరాకరించినను, దెస్పీనా, ఆల్ఫోన్సోల బోధనలవల్ల ఆ యువతులు కృత్రిమవేషధారులకు వశమై వారిని వివాహమాడుట కంగీకరించినారు. కాని వివాహమగు వేళకు యుద్ధమున కేగిన యోధులు తిరిగి వచ్చుచున్నట్లు సైన్యభేరి మ్రోగినది. తమ ప్రియులు తిరిగి వచ్చుచున్నారని ఆవేగముతో యువతులు కృత్రిమవేషధారులను ప్రక్కగదిలో దాచినారు. వారు వెంటనే తమ వేషములను తొలగించుకొని నిజమైన వరులుగా వచ్చి తమ వధువులు పరపురుషులయందాసక్తులైనట్లు గ్రహించి, వధువులయం దపరాధము నారోపించినారు. వధువులు తమ తప్పిదమునకు భయభ్రాంతులైనారు. దీనికి కారణమైన పరపురుషులను (మారువేషములలో నున్న తమనే) వెదకి శిక్షించు నెపముతో వారా పురుషులు దాగియున్న గదిలో ప్రవేశించి, కొన్ని క్షణములలో వారు ధరించియున్న కోట్లను మాత్రము వేసికొని బయటకు వచ్చినారు. అసలైన మోసము వధువుల కవగతమైనది. కొసీ ఫాన్ తుత్తె అనగా అతివలీ విధముననే చేయుదురు అని అర్థము, అనగా ఇంతులందఱు నింతయే. కడకు అదే రంగముపై ఇద్దఱు యోధులకు, వారి వధువులకు పాణిగ్రహణము జరిగి కథ సుఖాంతమైనది.
ప్రస్తుత ప్రయత్నము
ఇటాలియను భాషలో నున్న అత్యంత రసవత్తరమైన ఈ రూపకముయొక్క ఆంగ్లానువాదమును ఆధారముగా చేసికొని, తెలుగులో దీనిని పునర్నిర్మించితిని. ఇది ఇంగ్లీషు ప్రతికి అనుకరణయే కాని అనువాదము కాదు, మూలేతివృత్తాధారముగా నిర్మింపబడిన స్వతంత్ర రచన. మూలములో నున్న సన్నివేశములు, పాత్రల పేర్లు భారత సంస్కృతికి తగునట్లుగా మార్చబడినవి. ఫెర్రాందో, గుల్యెల్మోలు విక్రమ పరాక్రములుగాను, ఆల్బేనియా కేరళగాను, కేరళ దేశీయులుగా మారువేషములలో నున్న వీరి పేర్లు ప్రవిక్రమ త్రివిక్రములుగాను మారినవి. దొరబేల్లా, ఫ్యోర్దిలీజిలు మాలినీశాలినులైనారు. అట్లే దెస్పీనా, డాన్ ఆల్ఫోన్సోలు మాలతీశల్యులైనారు. ఇటలీ మాళవదేశమైనది. కథలోను కొంత మార్పు జరిగినది. మూలకథలో మారువేషములోనున్న ఫెర్రాందో గుల్యెల్మో ప్రియురాలు ఫ్యోర్దిలీజిను, అట్లే గుల్యెల్మో ఫెర్రాందో ప్రియురాలైన దొరబేల్లాను వశపఱచుకొనినట్లున్నది. అనగా మారువేషములోనున్న యొకడు తన ప్రియురాలితో గాక ఇతరుని ప్రియురాలితో ప్రణయము నెరపినట్లున్నది. ఇది అంత ఔచిత్యసమంచితముగా లేకుండుటచే, వారు మారువేషములు ధరించి, పరపురుషులుగా భ్రమగొల్పి తమ ప్రియురాండ్రనే తాము వశపఱచుకొనుటకు నటించినారని కథను మార్చినాను.
ఆపెరా (opera) అనునది సంగీతనాటకము. అందులో పొడిపొడిమాటలనుగూడ తాళయుక్తముగా పఠింతురు. నేను పొడిమాటలను విధిలేనిచోట క్వాచిత్కముగా వ్రాసితిని. ఇవియు సామాన్యముగా తాళమునకు సరిపడునట్లు జాగరూకత వహించితిని. ఇవి మినహాయించిన, ఇతర సంభాషణలన్నియు పాడుటకనుకూలమైన తేటగీతి, ఆటవెలది, కందపద్యములలో వ్రాసితిని. భావము దీర్ఘముగా నున్న కొన్నితావులలో ఉత్పలచంపకమాలలను వాడితిని. పాటలను త్ర్యస్ర, మిశ్ర, ఖండ, చతురశ్ర గతులలో వ్రాసితిని. అన్వయోచ్చారణ సౌలభ్యమునకై కొన్నిచోట్ల విసంధి చేసితిని. ఒకవిధముగా నీప్రయత్నము నెల్లను ఆధునిక యక్షగానముగా చూడవచ్చును.
ప్రథమాంకము
మొదటి దృశ్యము
స్థలము: 18వ శతాబ్దములో మాళవదేశమునందలి మదిరాగృహము. విక్రమపరాక్రములను దాదాపు పాతిక సంవత్సరముల వయస్సు గల ఇద్దఱు యోధులు కత్తులుంచిన యొరలు భుజములనుండి వ్రేలాడుచుండఁగా మద్యమును సేవించి క్రిందనిచ్చిన పాటను పాడుచుందురు. 45, 50 సంవత్సరముల ప్రాయము గల శల్యుఁడను మధ్యవయస్కుఁడొకఁడు వారితోఁబాటు అచ్చట నుండును.
యుగళగీతం
ఉభయులు:
కనరారు లోకాల గాలించినం గాని
ఉభయులు:
అవనికిం దిగినట్టి అప్సరోభామలే
మన జీవితోద్యానవనములం బూచిన
పరువంబు దఱుగని విరిచెండులే వారు
ఉభయులు:
కనరారు లోకాల గాలించినం గాని
విక్రముడు:
ఇలలోన నెవ్వారు తులతూగగలరు?
శిలకంటె దృఢమైన చిత్తమ్ముతో నన్ను
పూజించు నిరతంబు పుణ్యవతి యామె
ఉభయులు:
కనరారు లోకాల గాలించినం గాని
పరాక్రముడు:
ధరలోన నెవ్వారు సరితూగఁగలరు?
తనయాత్మలో పరమ దైవముగ నిల్పి
అర్చించు నాయింతి అనిశంబు నన్ను
ఉభయులు:
కనరారు లోకాల గాలించినం గాని
వారికి ప్రియురాండ్రపై గల నమ్మకమును శంకించుచు, స్త్రీలయొక్క చంచల ప్రకృతిని వర్ణించు నీ క్రింది రెండు పద్యములను వారితో నున్నశల్యుఁడు పాడును.
శల్యుడు:
కెంతటి విశ్వాసము తరళేక్షణలందున్?
కంతునిదాసులు మాయా
కాంతల వలలోనఁ దగిలి కానరు నిజమున్.
ఇంతులయందు నమ్మకము నింతగ నుంచి నుతించు మీ ఖల
స్వాంతము నేమనం గలను? చంచలవారితరంగలోలముల్
కాంతల స్వాంతముల్, క్షణవికారివిశృంఖలమేఘతుల్యముల్
కాంతులయందు కాంతలకుఁ గల్గు నళీకపు రాగభావముల్.
విక్రమపరాక్రములు సరోషముగా కత్తులను దూసి శల్యునిముందు ఝళిపించుచు క్రింది గీతమును పాడుదురు.
ఉభయులు:
హితమౌనె ఓశల్య! ఇంతైన నీకు?
విక్రముడు:
ఆచెలువ మానసం బత్యంతనిర్మలము
నిరతంబు ననుఁదక్క నితరు నెవ్వని నైన
స్మరియింపఁగాఁ బోదు స్వప్నమున నైన
ఉభయులు:
హితమౌనె ఓశల్య! ఇంతైన నీకు?
పరాక్రముడు:
సురతరంగిణిఁ బోలు శుద్ధాత్మురాలు
నామగువ శాలినీ, ఆమెనుం బోలు
వామాక్షు లిల లేరు, ఆమెయే తక్క.
ఉభయులు:
హితమౌనె ఓశల్య! ఇంతైన నీకు?
శల్యుడు:
అతివ లట్టి వారౌటచే నట్టు లంటి
తనుమనంబుల మీవారు తరుణులైన
తాదృశంబగు వర్తన తప్పదంటి.
విక్రముడు:
తలలో నాల్కవలె మెలఁగు తరుణుల శీలం
బుల శంకించి యవాచ్యపుఁ
బలుకులఁ బల్కెదవు శల్య! పాపాత్ముఁడవై.
(పరాక్రముఁడు కోపముతో కత్తిని శల్యుని కంఠమునకు గురిచేసి పల్కును)
పరాక్రముడు:
నీవిప్డు జేయుమా నీతిమంతుఁడవైన
లేదేని నీకత్తి నీదు గళమునఁ దూర్చి
మోదింపఁగాఁ జేతు భూతముల నేను.
(శల్యుఁడు కత్తిని ప్రక్కకు నెట్టుచు వారించి పల్కును)
శల్యుడు:
పణముగా నొడ్డి యిన్నూరు స్వర్ణములను
కాని మీరు మాత్రము మదుక్తంబు లెల్ల
రెండునాళులు సేయుచు నుండవలెను.
ఉభయులు:
(తమలో)
పణమొడ్డి ఘనముగా ఘనమైన పరిభవము
కొనితెచ్చుకొనఁ జూచు కూళయే యీతండు;
ఇతని యుద్యమము మన యింతు లవలీలగా
పతనమొనరింతు రిఁక భయమేల మనకు?
(ప్రకాశముగా)
గారవము చెడకుండఁ గావింపు మని నీవు
చేరి పల్కినవెల్లఁ జేయుచుందుము గాని
పంతమందునఁ గూడు పరిభవంబే నీకు
స్వంతమగు; సమకూడు స్వర్ణములు మాకు.
శల్యుడు:
ముద మెవ్వరిదొ, శోకపద మెవ్వారిదొ
మీనాయికామణుల మానసంబులఁ దెలియ
పూని సల్పుడు రేపె నేను చెప్పెడిరీతి.
నిష్క్రమించును. సంతోషగర్వములతో విక్రమపరాక్రము లీక్రింది పాటను పాడుచు నర్తింతురు.
ఉభయులు:
కరమందు నిండును మెఱుఁగారు నిష్కములు
విక్రముడు:
నే విలుతు నూరేసి నిష్కములతోడ
(నిష్కములు=స్వర్ణములు=బంగారు నాణెములు)
పరాక్రముడు:
నా చెలికిఁ గైసేతు నవకంఠహారాలు
ఉభయులు:
కరమందు నిండును మెఱుఁగారు స్వర్ణములు
(నిష్క్రమింతురు.)
రెండవ దృశ్యము
(స్థలము: గృహారామము: మాలినీశాలినులు తమ హారతరళములందున్న విక్రమపరాక్రముల చిత్రములను చూచి ప్రశంసించుచుందురు.)
(హారతరళము=హారమునందలి పతకము, నాయకమణి)
మాలిని:
ప్రోడయయి రణభూములందున
సంతతంబును జయమునందు ని
తాంతసాహసవంతు నార్యుని
అతనిహాసమె అమలచంద్రిక
అతని మోమున నాడు చంద్రుఁడు
అతనిఁ గన నా యాత్మ పొంగును
అతనుఁ గాంచిన రతివిధంబున
శాలిని:
సురేశ్వరనిభ సుందరాంగము
గలుగు నీతఁడు కొలువుదీరెను
అలతి నాహృదయాలయంబున
అతనినవ్వులె అమృతమయములు
అతనిచూపులె అతనుశరములు
అతనివాక్కులె అమృతగుళికలు
అతనిస్నేహమె అమరలోకము.
మాలిని:
ఉదయించె సోదరీ ఉన్నపాటున నాకు
రాడయ్యె పతి నిన్న రాత్రిలో నాకడకు
నేడైన వచ్చునో రాడో మఱేమొ!
శాలిని:
సంచలించి యెడంద స్పందించు నటులె
వాంఛించు నాకనులు వల్లభుని జూడంగ
మించువలె చూడ్కులను నించి దెసలందు.
(నేపథ్యమున పదధ్వని నాలించి, క్రింది వాక్యమును బల్కుచు నపేక్షతోఁ జూతురు)
ఉభయులు:
అరుదెంచుచుండిరి ఆత్మీయసఖులు!
(వారి ప్రియులకు బదులు విచారవదనుఁడైన శల్యుఁడు ప్రవేశించును)
మాలిని:
శల్యంబుగఁ దోఁచు నీవిషాదానన మీ
కల్యంబునఁ, జెప్పుము సా
కల్యంబుగ నీ విషాదకారణ మెదియో?
శల్యుడు:
వ్యర్థమగుచునుండె వనితలార!
కంపమొందు పెదవి, కాయమెల్ల వణకు,
మాట రాదు నోట మగువలార!
స్త్రీలు:
సేదదేఱి సుంత చింత దొఱఁగి;
నీకుఁ గూర్చువారు, మాకుఁ గూర్చెడివారు
సరిగ నున్నవారె శల్య! చెపుమ.
(కూర్చువారు=ఆప్తులు, ఇష్టమైనవారు)
(క్రిందిది ప్రశ్నోత్తరోత్పలమాల. ప్రశ్నలు శాలినీమాలినులవి, ఉత్తరములు శల్యునివి.)
ఏమని చెప్పుదుం దరుణి! ఎంతొ యనిష్టము గల్గుచుండెడిన్,
స్వాములకా? అదే యనియె పల్కవలెన్, మరణంబ? కాదు, ఇం
కేమిటి? అట్టిదేను, మఱి యేమది? మిమ్ములఁ బాసి దవ్వులం
భూమికి సంగరార్థమయి పొమ్మనె వారల భూమికాంతుఁడున్.
శాలిని:
సఖుని ముఖముఁ గనని ప్రతిక్షణము నాకు
కాలరాత్రియె; యింకెట్లు గడవఁ గలను
దీర్ఘకాలపు విరహంబుఁ దెల్పుమయ్య!
మాలిని:
ప్రధనభూమియు నుద్యానవనము గాదు;
అట్టిచోటికి ప్రియుఁడేగ వట్టిపోయి
నట్టి మనుగడ నింక నేనెట్టు లీడ్తు?
(ఆలము=ప్రధనము=యుద్ధము; కందుకకేళి=బంతియాట)
శాలిని:
బూనుట లోకరీతి, యటు పోవఁగ నెంచిన మాదువల్లభుల్
గానఁగరారొ మమ్ము క్షణకాలము? కౌఁగిటఁ గ్రుచ్చి ప్రేమస
న్మానము లొప్ప వీడ్కొలుపు మానినులం దరిసింపఁజాలరో?
శల్యుడు:
పరమదుఃఖదమగు నిట్టి విరహవార్త
నన్నుఁ బంపిరి చల్లగా విన్నవింప …
ఉభయులు:
యుంటిమింకను శల్య! మాకొదవఁ గలద
కడమసారిగ వారలఁ గాంచఁగల్గు
భాగ్యలేశంబు తెల్పుమా త్వరగ నీవు.
శల్యుడు:
వచ్చుచున్నారు మిముఁ జూడ త్వరితముగనె.
(ఇంతలో విక్రమపరాక్రములు ప్రయాణ వేషములతో విషణ్ణవదనులై ప్రవేశింతురు.)
విక్రముడు:
తడబడుచు పదములే తచ్చాడుచుండె
పరాక్రముడు:
వెడలకుండెను మాట వీడి వాతెరను
(వాతెర=పెదవి)
శల్యుఁడు:
బలము ధైర్యంబె ఆపదలయందు.
స్త్రీలు:
ఒక్కసారిగఁ దొలగంగ నురమునందు
మీదు కరవాలముల కసిమీరఁ గ్రుచ్చుఁ
డయ్య! యింకేల యింత విడంబనంబు?
మీదు సంశ్లేషరహితమౌ మేని కిపుడు
మృత్యుసంశ్లేషమొక్కటే మేలు సేయు.
(సంశ్లేషము=కౌఁగిలింత)
విక్రముడు:
(మాలినితో)
ఏమి సేతును ప్రియురాల! ఎన్నడేని
విడిచి యుంటినె నిను, క్రూరవిధియె యిపుడు
ఘోరమగు నెడబాటును గూర్చుచుండె;
మాలిని:
మగిడి వచ్చువఱకు నేను మిగులనయ్య!
పరాక్రముడు:
(శాలినితో)
రాజశాసనంబును త్రోసిరాజనంగఁ
జాల; క్షణమైన నిను వీడి చనఁగఁ జాల;
అకట!అడకొత్తులో పోక నయితి నేను.
శాలిని:
అరుగు మపుడు నిశ్చింతగా నాలమునకు.
విక్రమ పరాక్రములు:
విరహవహ్నియుఁ దోడగు వేళ యయ్యె
ఐన శోకింపవలదు మృగాక్షులార!
తిరిగివత్తుము త్వరలోనె తీర్చి విధుల.
స్త్రీలిర్వురు:
రణము గెల్తురొ, చత్తురో, తనువు నిండ
వ్రణములం గొనివత్తురో బ్రహ్మయేని
నెరుగలేడన నెరుగ మీరెంతవారు?
మాలిని:
శాలిని:
శల్యుడు:
(తనలో)
నీటుగా సాగుచున్నదీ నాటకంబు
పాత్రధారులు పరిణతప్రజ్ఞతోడ
ఆడుచున్నారు నాటకం బద్భుతముగ.
విక్రమ పరాక్రములు:
(జనాంతికముగా శల్యునితో)
చూచితె శల్య! మా ప్రియల సుస్థిరరాగమయప్రవృత్తి, రౌ
ప్యాచలమట్లు మావిషయమందున నున్నది వారి బుద్ధి,
(రౌప్యాచలము=వెండికొండ)
శల్యుడు:
(జనాంతికముగా వారలకు శల్యుని హెచ్చరిక)
అప్డే చరితార్థులైతిరని ఎమ్మెలు వల్కఁగ రాదు, ముందుముం
దాచరణీయమైనయవి యన్నియుఁ దీఱెడుదాఁక నుండుఁడీ!
(ఇంతలో నేపథ్యమునందు యుద్ధభేరీనాదము, క్రింద నిచ్చిన దేశభక్తి గీతమును పాడుచు యోధులు వచ్చుచున్న చప్పుడు)
పల్లవి:
సిద్ధపడుడు యోధులార!
చరణం1:
శత్రురాజబలము నణచి
ధర్మరక్ష సేయ త్వరగ
తరలిరండు తరలిరండు ॥యుద్ధభేరి॥
చరణం2:
కుత్తుకలను దఱుగ రండు
బాణయుద్ధమందు రిపుల
ప్రాణములను గొనఁగ రండు ॥యుద్ధభేరి॥
చరణం3:
ధైర్యలతలఁ గాల్చ రండు
భండనంబునందు రిపుల
బాహుగర్వ మణచ రండు ॥యుద్ధభేరి॥
శల్యుడు:
(విక్రమ పరాక్రములను హెచ్చరించుచున్నాడు)
చేరువయ్యె నకట విధిచేష్టితంబు
మృత్యుదేవత పెనుబొబ్బరీతి నిపుడు
దద్దరిలఁజేసె దెసలను యుద్ధభేరి
చనక తప్పదు మీకు నేస్తంబులార!
స్త్రీలు:
వ్రక్కలగుచుండె గుండె లా రవము చేత
మున్నె వ్రస్సిన హృదయాల మొత్తముగను
చూరుసేయుచునుండె నీ భేరి మఱల.
విక్రమ పరాక్రములు:
త్వరగ విజయులమై చేరవత్తుమేము.
శాలిని:
(శోకించుచు)
మరణభూమికె రణభూమి మఱొక పేరు
దానిఁ జొచ్చినవారు సప్రాణముగను
తిరిగివత్తురొ రారొ యెవ్వరికి నెఱుక?
నీదు కౌక్షేయకం బిట నిచ్చి పొమ్ము
ఎప్పు డవసరంబగునొ నేఁజెప్పలేను.
పరాక్రముడు:
(అమెను ఎదలో బొదివికొని లాలించుచు)
ఆపదలయందు ధైర్యంబె యండ నీకు,
మాను మట్టి నిర్వేదంబు మనసులోన.
మాలిని:
(శోకించుచు)
వలదు కౌక్షేయకము నాకు వల్లభుండ!
విరహవేదన చాలును వీడఁ దనువు.
విక్రముడు:
(ఆమెను ఎదలో జేర్చుకొని తలను ప్రేమతో నిమురుచు)
ఎందుకింతటి శోకంబు కుందరదన?
నృపుని శాసన మవిలంఘనీయమగుటఁ
జనక తప్పదు; నిన్ను నా మనసునందె
నిల్పుకొనియుందునుగద నేనెందు నున్న!
(ఇంతలో ఇద్దఱు సైనికులు ప్రవేశించి యుద్ధప్రస్థానమునకు ఆలస్యమగుచున్నదని, వెంటనే రమ్మని యోధులకు సైగ చేతురు.)
విక్రముడు:
మాలిని:
(కౌఁగిలించుకొని)
మఱవకుమునాథ! మఱిమఱి వ్రాయవలయు.
పరాక్రముడు:
శాలిని:
(కౌఁగిలించుకొని)
ప్రతిదినంబును నాథ! పత్రమును వ్రాయుము.
(ప్రేయసులను వీడ్కొలిపి విక్రమపరాక్రములా సైనికులతో నిష్క్రమింతురు. )
మూడవ దృశ్యము
(శల్యుఁడు తానారంభించిన కపటనాటకము చక్కగా సాగుచున్నదని సంతృప్తుఁడై పాడుకొనుచు నర్తించుచుండును.)
పల్లవి:
సంరంభములతోడ సరసంపు నాటకము
చరణం1:
సక్రమంబుగఁ గూర్మి సంభాషణలతోడ
అసమానకపటరాగాభినయనముతోడ
రసపూర్ణమొనరించి రక్తి కట్టించిరి ॥ఆరంభమయ్యెఁబో॥
చరణం2:
మనలేను నినుఁబాసి యను విషాదంబులు
అనురాగసందీపితాలింగనంబులు
కనుగొన్న మనసులం గదలించు కవ్వించు ॥ఆరంభమయ్యెఁబో॥
చరణం3:
కానంగరావింత క్షణము గడచిన వెనుక
సిరిసంపదలవాడు సింగారములవాడు
నరుడొక్క డెదురైన నతని కంకితమౌను. ॥ఆరంభమయ్యెఁబో॥
చరణం4:
ఆయువకుఁ డనిలంబు నాలానమునఁ గట్టు,
ఉదధిలో వ్యవసాయమొనరింపఁ దలపెట్టు,
హృదయంబులో నబ్ధి నిమిడింప సమకట్టు. ॥ఆరంభమయ్యెఁబో॥
(ఆలానము=ఏనుగును గట్టు కంబము; ఉదధి=అబ్ధి=సముద్రము)
నాల్గవ దృశ్యము
(మాలతి యనునది మిక్కిలి చాతుర్యము గలదియు, 35 ఏండ్ల వయస్సు గలదియు నగు శాలినీమాలినుల సేవకురాలు. వారుద్యానమునుండి ఇంటిలోనికి వచ్చుసరికి ఆమె ప్రాతరల్పాహారమును వండుచు ఈక్రింది పాటను పాడుచుండును.)
అంతమున సేవికకు అనుభవము చేదు
నిరతంబు శ్రమియించి నేనెంత జేసినను
కరుణ గల్గదు సుంత దొరసానులకును
గంటసేపటినుండి కష్టించి చేసితిని
పంటికిని రుచియైన పచ్చడులు నేను
వండితిని పూరీలు, దండిగా నిడ్లీలు
పండు లెన్నియొ కోసి ప్రక్కగా నుంచితిని
వీనిఁ జూచుచునుండ బిట్టుగా నోరూరు
ఐనఁ దినగను నాకు నధికార మేది?
పోనిమ్ము, రుచిఁజూతు పూరీల నీరోజు
(బిట్టుగా=అధికముగా,తీవ్రముగా)
(అని పూరీలను పచ్చడి నంజుకొని తినుచుండును. ఇంతలో శాలినీమాలినులు గుమ్మములోనికి వచ్చిన సవ్వడి. మాలతి తడబడుచు…)
అమ్మయ్య! నాకర్మ! అమ్మవారిప్పుడే
గుమ్మమ్ము నంటిరి.
(అని పలికి తాను తినుచున్నది ఆదరాబాదరాగా మ్రింగి, మిగిలినది ఇతరులకు కనపడకుండ పడవేయును.)
ఐదవ దృశ్యము
(శాలినీమాలినులు ఈడిగిలబడి నడచుచు లోపలికి వచ్చి అసంతృప్తిగా కుర్చీలపై కూర్చొందురు. కుర్చీలకు ముందర ప్రాతరుపాహారమును (Breakfast) తినుటకు వీలుగా చిన్నపాటి బల్లలు వేయబడియుండును.)
మాలతి:
సిద్ధముగఁ దెస్తినీ చిన్నారులార!
(అని ఉపాహారమును మాలిని కీయఁబోవును. మాలిని ఆమె తెచ్చిన పళ్ళెమును విసరికొట్టును.)
మాలతి:
మాలిని:
శాలిని:
(అని నిట్టూర్చుచు, విసిగికొనుచు ధరించిన ఆభరణములను తీసివేయ నారంభింతురు.)
మాలతి:
మాలిని:
శాలిని:
మాలతి:
మాలిని:
దూరమున నుండుము.
దారితప్పిన ప్రేమ
ఘోరాగ్నియై రేగెను.
ఆవహ్నిలో బుగ్గియై
నీవుండఁగాఁ దగదు.
కిటికీలు మూయవే
అటు నిల్వకను నీవు
ఈవెల్తురులు మఱియు
నీవాయువులు నాకు
ప్రాణాంతకంబులై
హాని చేయుచునుండె.
శాలిని:
నానాటికిం బెరిగి నన్నె దహియించి వేయు
అటుగాక బ్రతికినన్ స్ఫుటితహృదయోత్థమౌ
చటులహాహాకారపటలంబు లిల నిండు.
మాలతి:
మాలిని:
శాలిని:
మము విడిచి సమరంబుకై చనిరి.
మాలతి:
(పెద్దగా నవ్వుచూ)
అంతే కదా? వస్తారు తిరిగి వారే.
మాలిని:
మాలతి:
శాలిని:
మాలతి:
శాలిని:
(కోపంతో)
చెదలు పట్టని నీదు నోటికి, వదరకట్టుల సేవికా!
మాలతి:
కోరుచుంటిని కోమలాంగీ!
చారువృత్తులు సరసులెందఱొ
తారసింతురు వారు వోయిన!
శాలిని:
మందబుద్ధీ! మాటలాడకు,
నిరాశ్రయనై నేను నిముసము
పరాక్రమునిం బాసి బ్రతుకను
మాలిని:
పోకయుండదు నాదు ప్రాణము.
మాలతి:
ప్రేమకొఱకుఁ జన్న స్త్రీలు లేరు,
పోవ నేమి యొక్క పురుషుఁ డతని చోట
వందపురుషు లున్నవారు భువిని.
(చన్న=చనిపోయిన)
మాలిని:
మానసము లెట్లితరులపై మరులుగొనును?
మాలతి:
వారినిన్వరియించినట్టుల
వీరినిన్వరియింపవచ్చును.
వారు దూరమునందు నుండిరి
చేరవత్తురొ చేర రారో?
ఊరకే కన్నీరు నింపక
వీరితోడుత సుంత సౌఖ్యవి
హారమూనుట కేమి లోపము?
మాలిని:
మాలతి:
రణము పేరిడి సుఖపారణము సేయు
వారివలె మీరున్న నేరమేమి?
శాలిని:
వారు శుద్ధులు; మముఁదక్క స్వప్నమునను
ఇతరవనితలఁ గనని స్నేహితులు వారు.
మాలతి:
(పెద్దగా నవ్వుచు, అపహాస్యము చేయుచు)
పూర్వకాలపు గాథలు పొలఁతి యివ్వి,
వీని నిప్పుడు నమ్మరు పిల్లలైన.
ముందుగా పురుషపుంగవు
లందులో యువకసైనికు
లిట్టి వారల కేది శీలము?
ప్రమదలందునఁ బ్రతినిమేషము
తమ ప్రమోదము దక్క నితరము
నరయఁజాలని స్వార్థచిత్తులు
పురుషు లతితర పరుషవృత్తులు.
పూవుపూవునఁ బుష్పరసమును
ద్రావి వీడెడు భ్రమరముంబలె
వీడిపోదురు ప్రియల వారలు
కూడఁగనె తమ కోర్కెలన్నియు
ఆడవారును నట్టి యాటలె
ఆడఁ జెల్లును; అందుచేతను
అతివలారా! అలమటింపక
అతనుసౌఖ్యము నందఁగోరుడు.
ఆఱవ దృశ్యము
(ఒక కిటికీమాత్రము కొంత తెరవఁబడి, చీకటితో నిశ్శబ్దమై యున్న శాలినీమానినుల భవనములోనికి శల్యుఁడు తొంగిచూచి, తనలో)
నొప్పెడు నీభవనంబునఁ
జొప్పడు నతినిశ్శబ్దమె
గొప్పవిషాదతమిస్రమె
విరహార్తినిఁ గుందెడు నీ
సరసీజాక్షుల కొదవును
పరితాపనివారకమగు
పరిణామము త్వరలో…
చేరుదురిఁక వారి మనో
హరులే అజ్ఞాతాకృతి
ధారులునై తొలగింపఁగ
వారి మనోవైకల్యము.
మాలతి ఈయజ్ఞాతుల
లీలల గుర్తించినఁ జెడు;
మేలగు నామెను నిందున
పాలుగొనంగను జేసిన.
(భవనము తలుపు దట్టును)
మాలతి:
శల్యుడు:
మాలతి:
(మాలతి అనాసక్తితో తలుపు తీయును. శల్యుఁ డామెను తలుపును మూసి ప్రాంగణములోనికి రమ్మని సైగచేయును. ఆమె అట్లే చేయును)
శల్యుడు:
మాలతి:
శల్యుడు:
(రెండు బంగారు నాణెములను చూపించును)
మాలతి:
శల్యుడు:
సదయను మదుక్తంబు నొదవించిన న్నీవు.
మాలతి:
సెలవిమ్ము నీకేది చేయంగవలెనొ.
శల్యుడు:
(ఆనాణెము లామె కొసంగి పల్కును)
అరయుదువుగద నీదు యజమానురాండ్ర
విరహంపువేదనలు విసుగుకోళ్ళును చాల
మాలతి:
శల్యుడు:
నిరువురం జూపెదను నీకు; విరహబాధ
నపనయింపఁగ వారిపై నలరుబోంట్ల
చేతములు లగ్నమౌనట్లు చేయవలెను.
మాలతి:
గాని యామూఢ లే కరణిఁ జేతురొ …
ఐన నీవారు సొగసైనవారొ,
ఐశ్వర్యవంతులో…?
శల్యుడు:
సింగారములు, మంచి సిరిసంపదలును
హంగులన్నియుఁ గలవారు వారు.
మాలతి:
శల్యుడు:
మాలతి:
(శల్యుఁడు మారువేషములలో ప్రవిక్రమత్రివిక్రములను పేర్లతో నున్న విక్రమపరాక్రములను ప్రదర్శించును.)
శల్యుడు:
చాల చతుర యీమె, చక్కగాను
నీమెనీడ నున్న నిండఁగలదు
మీ మనోరథంబు మిత్రులార!
మాలతి:
(నవ్వుకొనుచు, తనలో)
ఏమి రూపము లేమి వేషము
లేమి మీసము లేమి నాసిక
లీమనుష్యుల కేదివాసమొ
కామపురమో భీమపురమో!
శల్యుడు:
(మాలతితో)
వీరెట్లున్నారు?
మాలతి:
వీరిఁ గాంచిన వెలఁదులాదటఁ
జేర నేరరు, పాఱిపోదురు.
శల్యుడు:
(జనాంతికముగా ప్రవిక్రమత్రివిక్రములతో)
గురుతింపదీమె మిము గూఢవేషములందు
జరుపంగఁ గలమింక జంకకయె కార్యంబు.
శాలినీ మాలినులు:
(గృహాంతరమునుండి)
మాలతీ, మాలతీ!
మాలతి:
శల్యుడు:
(మాలతితో)
నేను చెంతనె దాఁగి యుందును.
నిర్వహింపుము నీదుకార్యము.
(గృహాంతరమునుండి వెలికి వత్తురు.)
శాలినీ మాలినులు:
తరిమికొట్టుము వీరిఁ దత్క్షణమె యిటనుండి
లేదేని వారివలె రోదింతు వీవును.
(మాలతీప్రవిక్రమత్రివిక్రములు ఆస్త్రీల ముందు మోకరిల్లెదరు. ప్రవిక్రమత్రివిక్రములు వారినిట్లు అభ్యర్థించెదరు.)
స్తోకశరప్రబుద్ధమగు తోరపుమోహము మీపదంబులన్
మోకరిలంగఁజేసె నిఁక మోదము గూర్పుడు ప్రేమభిక్షతో
నో కమలాక్షులార! క్షమయుం దయయున్మది జాలువాఱఁగన్.
స్త్రీద్వయము:
ఏ చెనటి యీ ‘ప్రబుద్ధుల’ నిటకుఁ బంపె?
పురుషులు:
స్త్రీద్వయము:
మిమ్ముఁ గన మదులందుఁ గ్రోధమ్ము పండె.
పురుషులు:
(తమలో)
కొంత లాలిత్య మున్నట్లు గోచరించు
వీరి క్రోధమ్మునకు వెన్క వింతగాను.
శల్యుడు:
(దూరమునుండి వినుచున్నట్లు నటించుచు, పురుషద్వయమును సరిగా గమనింపకుండ ప్రవేశించి)
ఏమయ్యె నేమయ్యె నేణాక్షులార!
సామరస్యము లేని సంభాషణలును
సంరంభములు చాలు, శాంతంబు మేలు.
మాలిని:
(కోపంతో)
అరయండి, మాయింట నజ్ఞాత పురుషులు
శల్యుడు:
(వారికేసి చూడకుండా)
ఉన్నారు, కానింత ఉడుకేల మీకు?
శాలిని:
(సరోషముగా)
ఏమంటివేమంటి వీనాడె
మామనోనాథులం బాసి
పలవించు మాకిట్టివారు
నిలయంబులో నున్నచో
కలఁగదే మనసు?
(ఆమె రోషమును చూచి మాలతి మెల్లగా గృహాంతరమునకు దప్పుకొనును.)
శల్యుడు:
(పురుషద్వయమును పరీక్షగా చూచి)
ఎటువంటి భాగ్యమ్మొ ఈమహాత్ములు
ఇటకేల వచ్చిరో ఎప్పు డేతెంచిరో!
ఇది కల్లగాదుకద! ఈక్షణంబులకు
సదసద్వివేకంబు సరిగ నున్నది కద!
పురుష ద్వయము:
(వచ్చి ఆలింగనము చేసికొందురు)
శల్యుడు:
మాలతి:
(శల్యునితో)
నీమిత్రులా వీరు?
శల్యుడు:
సుందరీహృదయారవిందభాస్కరులు
సుందరులు, వీరు నా సుహృదయవరులు
దూరంపు బంధువులు కేరళేశ్వరునకు
కూరిమి న్ననుఁ జూడఁ గూడివచ్చినవారు
శాలిని:
పురుషు లిర్వురు:
(క్రింది గీతమును పాడుచు ప్రవిక్రముడుశాలిని యెదుటను, త్రివిక్రముడు మాలిని యెదుటను అభినయింతురు.)
చెప్పితిమి కద మున్నె రాజీవనేత్రి!
మారశరవిద్ధమైనట్టి మనసుతోడ
మీదు ప్రేమల నర్థించు పేదవార
మగుచు వచ్చినారము మనుపఁ దగును మమ్ము.
మాలిని:
శాలిని:
త్రివిక్రముడు:
(బెట్టుసేయుచు నటించు శాలిని యెదుట నభినయించును)
పూఁబోడి తగదమ్మ యింతగా
మోడి సేయుట నీకు
పాడు మదనుండు హృదయంబు
గాడ నేసెను నన్ను
వీడి పంతంబు నిఁక దయతోడఁ
గూడి యేలుము నన్ను.
ప్రవిక్రముడు:
(కోపముతో వైముఖ్యమును సూచించు మాలిని యెదుట నభినయించును)
నీనేత్రములలోన నెలకొన్న మెఱుపులే
సూనాశుగజ్యోతి నాలోన వెలిగించె
నీమోములోఁ దోఁచు నీరజాతంబులే
నామనంబును దోచె నలినాస్త్రశరములై
కోమలాంగీ నన్ను కొఱకొఱం జూడకు
ప్రేమంబు దయసేయ పేదవైపోవు.
మాలిని:
శాలిని:
మా చేతమును మార్చ మీచేతఁగాదు
మీ చేతలను మేము మెచ్చంగ లేము
మావాక్కులం దైక్ష్ణ్యమావహింపక మున్నె
మావేశ్మమును వీడి మర్యాదగా పొండు.
స్త్రీలిర్వురు:
ఈప్రయత్నము మాని ఇఁక మీరు పొండు
చరణం1:
పెనుతుఫానులు రేచి పృథ్వినే క్రమ్మినను
కణమైన రాల్చని వనధిలో శిలవోలె ॥మాప్రేమ॥
(వనధి=సముద్రము, పృథ్వి=భూమి)
చరణం2:
మాప్రణయకీలలే మాఱి పెనుచిచ్చుగా
విప్రియుల హృదయాల వేవేగ దహియించు ॥మాప్రేమ॥
చరణం3:
పేరాసలను మీరు పెంచుకొనవలదు
ధీరచిత్తుల మేము స్త్రీల మైనను గాని. ॥మాప్రేమ॥
(ఇట్లు హెచ్చరించి గృహములోనికిఁ జొచ్చి తలుపు మూసికొందురు. అప్పుడు ప్రాంగణములో శల్యుని పరిహసించుచు ప్రవిక్రమ త్రివిక్రములు నవ్వుచుందురు. వారికిని, వారిని వారించుచు పలుకు శల్యునికి మధ్య ఇట్లు సంభాషణ జరుగును.)
శల్యుడు:
ప్రవిక్రమ త్రివిక్రములు:
కారణము గ్రహియింప లేవొ!
చిత్తుగా నోడించె నిన్ను మా
మత్తాక్షి యుగ్మంబు!
వజ్రసంకల్పులైన మాప్రాణసఖుల
స్థైర్యముం జూచితివిగద శల్య నీవు
ప్రతినచేసిన పణము మావశము చేసి
ఒప్పుకొనుము నీ యోటమి నిప్పుడైన.
శల్యుడు:
ఇంటి నలుకంగనే పండు వెట్టు లగును?
వజ్రగర్భమునందును వ్యక్తమగును
నరయగా నవ్యనవనీత మప్పుడపుడు
అభినయించుడి మిగిలిన యంకములను
అపుడు విశదమౌ నాస్త్రీల ఆత్మబలము.
ప్రవిక్రమ త్రివిక్రములు:
శల్యుడు:
రాణించు నన్నంబు రమ్యరుచిపూర్ణమై
కాని యిపుడుండు డుద్యానవనమందు
పైని నాటకమచట ప్రవృత్తమగును.
(ప్రవిక్రమత్రివిక్రములు ఉద్యానవనమునకు పోవుటకై నిష్క్రమింతురు. శల్యుఁ డటనే యుండును. ఇంతలో మాలతి ప్రవేశించును.)
ఏడవ దృశ్యము
శల్యుడు:
(తనలో)
స్థిరచిత్తమెక్కడ? స్త్రీచిత్త మెక్కడ?
సరిపోదు రెంటికిని ధరలోన పొత్తనఁగ
కనుగొంటి నిర్వురను కఠినాత్మురాండ్రను
తొణకకుండెడి మంచిమనసున్నవారలను.
(ఇంతలో మాలతి ప్రవేశించును.)
శల్యుడు:
(మాలతితో)
ఎందు నున్నవార లిందుముఖులు?
మాలతి:
తిరిగిరానట్టి ప్రియులకై దేవురిలుచు
ఉండి రుద్యానవనమందు నువిద లిపుడు
శల్యుడు:
పాఱఁగలదా మన ప్రయత్నము?
మాలతి:
ఐన పోయిన ప్రియునికై
అలమటించుట యేమి న్యాయము?
ఒక్కడేగిన నేమి? లేరె
పెక్కురాతనిఁ బోలు వారలు?
శల్యుడు:
మాలతి:
నీలీల ప్రకృతిధర్మంబు.
వలపన్న సౌఖ్యంబు, వలపన్న శాంతంబు
వలపన్న సంబరము, వలపన్న సంతసము
సంకటము, శోకంబు, సంతప్తహృదయంబు
కలిగించు క(ఖ)ర్మంబు వలపెట్టులౌను?
శల్యుడు:
మాలతి:
వలచి యున్నవారలనెడి తలఁపు వారి
తలలయందుఁ బడిన నంత వలనుపడును.
శల్యుడు:
తలలయందుఁ బడినయట్లె తలఁతు నేను.
మాలతి:
ఓట యన్నది లేదు నాయాట కెపుడు
ప్రణయమందున విజయంబుఁ బడసినారు
వేలపురుషులు నాయుక్తి మూలమునను
వీరి నిర్వుర దారిలోఁ బెట్టలేనె?
మాలతి:
శల్యుడు:
క్రన్ననం జనవలెం గార్యార్థమందు.
(ఇర్వురు నిష్క్రమింతురు)
ఎనిమిదవ దృశ్యము
(ఉద్యానవనములో నొకవైపు శాలినీమాలిను లీక్రింది విరహగీతము నాలపించుచు దురపిల్లుచుందురు. వారికి కనపడకుండ వారికి సమీపములోనే చాటుగా ప్రవిక్రమత్రివిక్రములు, శల్యుఁడును ఉందురు. ఆ స్త్రీలకు చేరువలో గృహాంతరమున మాలతి యుండును.)
ఇర్వురు:
సంతోషముగ నున్న స్వాంతమును నేడు
మాలిని:
చల్లచల్లగ నన్ను సరసాలఁ దేలించు
నాప్రియుండేగ నాహవంబున కిపుడు
విప్రియం బయి బ్రతుకు వెగటుగాఁ దోఁచు. ॥ఎంతగా॥
శాలిని:
అతని పల్కులయందు నరుదైన అమృతంబు
అతిమోహదంబగుచు నలరించె మున్ను
గతియించె నదియంత క్షణమందె నేడు. ॥ఎంతగా॥
ఇర్వురు:
అజుఁడైన నెరుగునే యాహవవిధంబు
క్షణమొక్కయుగముగా సంతసము లేక
దినమెట్లు గడచునో తెలియంగ లేము. ॥ఎంతగా॥
తొమ్మిదవ దృశ్యము
(శాలినీమాలినుల విరహగీతము వారికి కనపడకుండ సమీపములోనే యున్న శల్యప్రవిక్రమత్రివిక్రములకు వినిపించును. వారా గీతములోని చివరి చరణమువలన ఆస్త్రీల మనఃస్థైర్య మించుక సడలుచున్నట్లుగా నూహింతురు.)
శల్యుడు:
(ప్రవిక్రమత్రివిక్రములతో)
‘క్షణమొక్క యుగముగా సంతసము లేక
దినమెట్లు గడచునో తెలియంగ లేము’
ఆలింప నీగీత మనిపించు నాకు
స్త్రీల స్థైర్యంబింత క్షీణించు చున్నట్లు
ఆగామినాటకం బాడంగ మీరింక
సాగుండు ముందునకు చాతుర్య మెసఁగ.
ప్రవిక్రమ త్రివిక్రములు:
(స్త్రీద్వయమునకు వినిపించునట్లుగా)
చావనిమ్ము శల్య! మమ్ము చావనిమ్ము
అట్టులైన వారిమనసు లార్ద్రమౌనొ యేమొ.
శల్యుడు:
మాఱునేమొ మఱల వేడికొన్నవారి మనసు.
స్త్రీద్వయము:
(వారు సరభసంగా శల్యాదులు గల ప్రాంతమున కుఱికి వత్తురు.)
శల్యుడు:
పురుష ద్వయము:
మావిషాద మడఁపఁజాలు మందు
ఈవిషంబు మాత్రమే.
(విషమువలె కన్పించు ద్రావకము త్రాగి క్రింద కూలుదురు.)
స్త్రీద్వయము:
శల్యుడు:
స్త్రీద్వయము:
వడఁకుఁ గాలుసేతులు పల్లవంబులట్లు
ప్రవిక్రముడు:
(హీనస్వనంతో)
గాఢమగు ప్రేమ కావించు కార్య మిద్ది
దూరమేల యింకను నింత వైరమేల?
చేరి లాలింపుఁ డిపుడైన చెలువలార!
త్రివిక్రముడు:
కరుణ యొక్కింత జూపెడు తరుణమిదియె
జాగు సేయఁగఁ దగదు కృశాంగులార!
శల్యుడు:
కరుణ జూపుడు కాసింత తరుణులార!
స్త్రీద్వయము:
నోట మాటలు రావెంత చేటువచ్చె
వీరిఁ గాపాడ నింకేది వెరవు మనకు?
(వెరవు=ఉపాయము)
మాలతీ! మాలతీ!
మాలతి:
స్త్రీద్వయము:
మాలతి:
(ఉఱుకుచు వచ్చి పురుషద్వయమును తాఁకి చూచి)
ఘోర మీ దుర్భగుల్ చావుకోఱలందు
జిక్కి చచ్చిరో లేక యా స్థితికి వేగఁ
జేరుకొనుచున్నవారొ …
శల్యుడు:
తాళఁజాలక వీరలు క్ష్వేళములను
త్రావి చేయనెంచిరి తనుత్యాగ మిపుడు.
(క్ష్వేళములు=విషములు)
మాలతి:
(స్త్రీద్వయముతో)
వీరి నీస్థితిం ద్యజియింప నేరమౌను
ఆదుకొనవలె నెట్లైన అబలలార!
స్త్రీద్వయం, శల్యుడు:
మాలతి:
(వారి యెదలపై చేయి వేసి చూచి, ముక్కుల దగ్గర అరచేతినుంచి పరిశీలించి, స్త్రీద్వయముతో)
ఊపిరింకను వీరిలో నున్నయట్లు
దోఁచు నందుచే నంకమందు నిడి మీదు
మృదుకరంబుల లాలింప మేలు గలుగు.
(శల్యునితో)
తోడనే విషవైద్యునిఁ దోఁడి తేఁగ
రమ్ము నాతోడ శల్య! బిరాన నీవు.
(మాలతీశల్యులు నిష్క్రమింతురు.)
స్త్రీద్వయము:
ఇంతవఱకును నింతకంటెను
వంతగూర్చెడి పాటు నెఱుగము.
పురుష ద్వయము:
(తమలో)
ఇంతకంటెను వింత గొల్పెడు
కపటనాటక మెపుడు నాడము.
(పచ్చికపై పడియున్న ప్రవిక్రముని తలను మాలినియు, త్రివిక్రముని తలను శాలినియు తమ ఒడిలో నుంచుకొని లాలింపఁ జూతురు. అప్పుడా యువకులు కష్టముగా శ్వాస వెడలించుచు రోఁజుచుందురు.)
మాలిని:
విసము తలకెక్కెనో యేమొ వీరి కిపుడు
శాలిని:
కానిచోబుసకొట్టఁగాఁ గలరె యిట్లు!
(ఆ స్త్రీ లా పురుషద్వయముయొక్కశిరములను కొంచెముగా నెత్తి తమ వక్షములందుంచుకొని ముఖము పరికింతురు. వారి వక్షోజస్పర్శచే ఎంత దాఁచుకొన యత్నించినను కొంతగా ఆ యువకుల ముఖములు వికాసవంతము లగును.)
స్త్రీద్వయము:
కానిపించు ముఖముల వికాస మింత
తలకు నెక్కిన విష మిప్పు డలతిగాను
క్రిందికిం దిగెనేమొ యీచంద మొదవ.
పురుష ద్వయము:
(తమలో)
అతనురోగంబులం బాప నతివలార!
ఉరములందిట్లు జేరిచియుండుఁ డెపుడు.
(ఇంతలో విషవైద్యుని వేషములో నున్న మాలతితో గూడి శల్యుఁడు తిరిగి వచ్చును.)
శల్యుడు:
(స్త్రీద్వయముతో)
వచ్చియున్నాఁడిదె ప్రసిద్ధవైద్యవరుఁడు
మంత్రతంత్రంబులును నుత్తమంబులైన
ఔషధంబు లొసఁగి యెట్టి యార్తినైన
దూరమొనరింపఁగల సమర్థుం డితండు.
(మాలతితో)
త్వరగఁ జూడుము వైద్యశేఖర
మరణముఖమున మతులెఱుంగక
ఒరిగియుండిరి యువకు లిర్వురు
మాలతి:
(ఆ యువకుల నాడిని చూచి, ఫాలములను స్పర్శించి చూచి)
విషము ద్రావినట్లుగఁ దోఁచు వీరిఁ జూడ
ఔషధం బిచ్చుటకు పూర్వ మరయవలయు
ఏవిషంబును త్రాగిరో, ఏల త్రాగి
నారొ, శీతలంబుగనొ, ఉష్ణంబుగానొ.
స్త్రీద్వయము, శల్యుఁడు:
(త్రాగి పడవేసిన సీసాలను చూపుచూ)
మేము వారించు నంతలో ప్రేమకొఱకు
అచట వేసిన సీసాలయందు నించి
వారు ద్రావిరి విషపూర్ణవారి నిటనె
ప్రణయజీవులై వారిట్లు భంగపడిరి
మాలతి:
(మాలతి క్రింది పద్యమును చదువుచుండగా శాలినీమాలినులు ఆయువకుల విషసేవనమునకు తామే కారణమను అపరాధి భావమును సూచింతురు.)
ఎంత ఘోర మకట! వార లిట్టి స్థితికి
జారుకొనుట కేకాంతలు కారణంబొ?
ఏదియైన నేమి? యిపుడె యీవిషంబు
వలనఁ గల్గిన బాధలఁ దొలఁగఁజేతు.
(స్త్రీద్వయముతో, తన చేతిలోని వేణుదండమును చూపించుచు పల్కును)
మంత్రశక్తిమహితమైనదీ దండంబు
దీనిచేతఁ దుడువ మేని నెల్ల
సర్వగరళజాత దుర్వారరుజ లెల్ల
దూరమగును త్వరగ నారులార!
(అట్లు వేణుదండమహిమను వర్ణించి దానిచేత ప్రవిక్రమత్రివిక్రముల తనువులను దుడుచును. దాని ప్రభావముచేత వారి తనువు కంపించుచు ధనురాకారముగా పైకి లేచుచున్నట్లు వారు నటింతురు. దానిని చూచుచున్న స్త్రీద్వయమును, శల్యుఁడును ఇట్లు పల్కెదరు.)
దండమహిమచేతఁ దనుయుగంబు
పైకి లేచి పడెడు వారిశిరంబులు
కొట్టుకొనునొ యేమొ మట్టి నిపుడు.
మాలతి:
(స్త్రీద్వయముతో)
వారి వెనుకఁ జేరి వామలోచనలార!
పట్టుకొనుడు తలల పాణులూని
స్త్రీద్వయము:
(అని యువకుల వెనుక జేరి వారి తలలను వక్షములపై నానించి పట్టుకొందురు.)
మాలతి:
(స్వల్పకాలానంతరము ప్రవిక్రమత్రివిక్రములు కనులు తెఱచి చూచి విషప్రభావము కొంత తగ్గినట్లుగా నటింతురు. వారిని చూచి స్త్రీలిట్లు పల్కుదురు.)
స్త్రీద్వయము:
విషము దిగి వీరు కోల్కొన్న విధము దోఁచు
ఎంత ఘనవైద్యరత్నంబొఈతఁ డకట!
చాల దితనికి నెన్ని నిష్కంబు లిడిన.
మాలతి:
(స్త్రీలతో)
దండప్రభావవశమున
ఖండితవిషగుణయుతమగు కాయంబులకున్
దండిగ స్వాస్థ్యము గూర్చెను
మెండుగ మీచే నొనరిన మృదుతరసేవల్.
కావున వారల నట్లే
మీవక్షములందుఁ జేర్చి మృదుతరకరసం
భావనచే లాలింపుఁడు
పోవని విషలక్షణములు పోయెడు దనుకన్.
(ఆస్త్రీలు వారల నట్లే యెదలందుఁ బొదివికొని లాలించుచుందురు. వారు క్రమముగా తేరుకొన్నట్లు నటించి హఠాత్తుగా లేచి నిలుచుందురు. స్త్రీలును నిలుచుందురు.)
పురుష ద్వయము:
మెక్కడ? ఏతెంచితి మెపు డిక్కడి కేమున్
(అని పలికి, స్త్రీలను తేఱిపాఱఁ జూచుచు)
ఇక్కమలానన లెవ్వరు?
చక్కని రంభలొ, నిలిచిన సౌదామినులో?
శల్య మాలతులు:
(ప్రవిక్రముడు మాలినితో క్రిందివిధముగాఁ బలుకుచు కౌఁగిలించి అమె కరమును ముద్దిడును)
ఆ.వె. నీవు నాదు సఖివె నిస్సంశయంబుగ
గురుతువచ్చె నీదు కరముఁ జూడ
(త్రివిక్రముడు శాలినితో క్రిందివిధముగాఁ బలుకుచు కౌఁగిలించి ఆమె కరమును ముద్దిడును)
నీవు నాదు సతివె నిస్సంశయంబుగ
పరిచితంబు నీదు పాణి నాకు
శల్య మాలతులు:
ఇట్టి చేష్టితంబులకదె హేతువగును
ఓర్మితో గ్రహింపుడు వీరి నువిదలార!
స్త్రీద్వయము:
బగుఁగదా యంకంబు మాచరిత్రంబులకు
(ప్రవిక్రముడు మాలినితో క్రిందివిధముగాఁ బలుకుచు ఆమెను కౌఁగిలించి చుంబింపఁబోవును. మాలిని అతనిని చుంబింపఁబోయి అంతలో తిరస్కరించును.)
ప్రవిక్రముడు:
ఏలుకొను మింక జాగేల నీకు
ఒదవఁజేయవె నీదు పెదవిలోని
అమృతంబుఁ గ్రోలు భాగ్యమ్ము నాకు.
(త్రివిక్రముడు శాలినితో క్రిందివిధముగాఁ బలుకుచు ఆమెను కౌఁగిలించి చుంబింపఁబోవును. శాలిని అతనిని చుంబింపఁబోయి అంతలో తిరస్కరించును.)
త్రివిక్రముడు:
సుకుమారసల్లాపసుధలు చిందింపవే
మధుపూర్ణమైన నీయధరంబు చుంబించి
మధురానుభూతిలో మైమఱవనీయవే!
మాలతి:
(స్త్రీద్వయముతో)
ఓర్మితోడ నుండుఁ డువిదలార!
(శాలినీమాలినులు లోన కొంత ఇష్టమున్నను కోపంతో పైకి తిరస్కారపూర్వకముగా నీక్రింది పద్యమును చదివి నిష్క్రమింతురు.)
స్త్రీద్వయము:
మాన్యతం గోరు మానినీమణులమేము
ఓర్మి నశియించె, నిఁక వీరి కర్మమునకు
వీరె భోక్తలు, మాకేల వీరితోడ?
మాలతీ శల్యులు, పురుషులు:
గాని ప్రేమాంకురంబు లోలోన నున్న
యట్లు దోఁచు, నీయంకురం బాశువుగనె
వర్ధిలెడు సూచనలు కొన్ని బయలుపడును.
(ప్రథమాంకము సమాప్తము)
ద్వితీయాంకము
ప్రథమ దృశ్యము
(స్థలము:శాలినీమాలినుల గృహము)
మాలతి:
చిత్రములు మీదు పోవడుల్ చిత్తగతులు.
మాలిని:
మాలతి:
శాలిని:
మాలతి:
మాలిని:
మాలతి:
శాలిని:
మాలతి:
మాలిని:
మాలతి:
ననిశంబుఁ గట్టునెది యది కాదు ప్రేమ
పుటుకునం దెగునట్టి పూలదండను బోలి
ఘటియించు బంధంబె కామ్యమగు ప్రేమ
ఒకపూరుషునె నమ్మి యుండంగఁ బనిలేదు
ఒకసారి సుస్థిరత యొకసారి చంచలత
వహియించి యెపుడేది స్వానందసిద్ధికై
విహితంబొ దాని నావిష్కరింపంగఁ దగు.
ఇది యౌవనంపుసెగ మదిలోన రగులు
మదవతులు మోదార్థమనుసరించు విధమ్ము.
శాలిని:
మాలతి:
లోకాన స్త్రీశక్తికే కేతనంబది
రణనియోజితులైరి ఘనులైన మీప్రియులు
వనటనందుట యేల వారు వచ్చెడుదనుక?
యువకులం బ్రియుల నియోగించుకొని మీరు
నవసుఖంబులఁ దేలు నవకాశముం బాసి.
మాలిని:
మాలతి:
తగ భూమిపై నున్నాము మనము
ఇది మీరు చింతింపుఁడేణాక్షులార!
సదయులు, సుహృదులు, సంపదాన్వితులు
మదిలోన మీరూపె మెదలెడివారు
పదసేవకులవోలెఁ బడియుండువారు
ఘనముగా సౌఖ్యమ్ముఁ గలిగింప మీకు
పణమువెట్టెడువారు ప్రాణముల నైన
వనితలెల్లను గోరు గుణగణంబులకు
గనులైన యువకులు కాంక్షించి మిమ్ము
వచ్చియుండిరికదా వారలను మీరు
ముచ్చటగఁ గామించి ముదమొందఁ దగును.
(ఇట్లు చెప్పుచు వారి ముఖభావములను గ్రహించి మాలతి తనలో)
శాలిని:
చేయుమందువు మము వింతచేష్టితముల
కాని వానిచే మాకపఖ్యాతి రాదొ?
ఇట్లు వర్తింప మాహృదయేశ్వరులకు
బాధ కల్గకయుండునా బాఢముగను.
(బాఢముగను=తీవ్రముగను)
మాలిని:
అన్యపురుషులతోఁ గుల్కిరనెడు వార్త
పరులెఱింగిన నవ్వులపాలు గామొ,
మాబ్రతుకులు బజారునం బడవొ యట్ల.
మాలతి:
వారు నను జూడఁగా వచ్చువార లనియె
ప్రకటమొనరింతు బాహ్యప్రపంచమునకు.
మాలిని:
మాలతి:
పోలదా నాబోటి బోఁటికత్తియకు
బాలచంద్రులబోలు ప్రౌఢు లిర్వురిని
లాలించు సౌభాగ్యలవమేని భువిని?
శాలిని:
పెదవిపై ముద్దిడఁగ వెనుకాడ లేదు
అట్టి చేష్టలు చూడ అన్యు లూరకయె
రట్టుసేయక యుందురా మమ్ము?
మాలతి:
(తనలో వ్యంగ్యంగా)
ఆహా! ఎంత అపరాధము!
(ప్రకాశముగా)
విసమును మ్రింగ మూర్ఛనలు వెఱ్ఱితలంపులు వ్యర్థభాషలున్
మసగొను చిత్తముల్ గలుగు మానినులార! అదే నిదానమౌ
వెస మిముఁ జేరి ముద్దిడఁగ వీరలు గోరుటకు, న్నిజంబుగా
నసదృశసద్గుణాన్వితులు, నార్యులు వీరలు శీలవంతులున్.
మాలిని:
మాలతి:
మఱల రావించి కథనెల్ల జరుపవలయు,
మీరు రక్తమాంసములున్నవారలైన
నింక నన్యంబు దలఁపక యింతులార!
పల్లవి:
హృదయస్పందన నింతులు వినవలె
చరణం1:
ఎప్పుడసత్యముఁ జెప్పిన నొప్పును
ఎప్పుడు హాసము లెప్పుడు రోసము
లెప్పుడు మోసము లొప్పగుఁ గనవలె. ॥పదహారేండుల॥
చరణం2:
రూపము చతురతరోక్తులు దృష్టులు
పొనరఁగఁ దోడై, పొలఁతులు యువకుల
మనసుల దోఁచెడు మార్గము గనవలె ॥పదహారేండుల॥
చరణం3:
దినఁగను వనమునఁ దివిరెడు విధమున
వనితలు సైతము బహువిధపురుషుల
ప్రణయంబుల చవి గనఁ దివురన్వలె. ॥పదహారేండుల॥
(వారి ముఖభావములను గమనించి మాలతి తనలో)
వీరి మనములు మాఱిన విధము దోఁచె
బాగు! మాలతి నీపూన్కి ఫలము దాల్చె
రెండవ దృశ్యము
శాలిని:
మాలిని:
కనెను నిశ్చేష్టితను నామనము.
శాలిని:
అందుకో దగిన సందేశ మేదైన?
మాలిని:
కలదందున సందేశము.
శాలిని:
నిశ్చితార్థమైన నెలఁత కిట్టి పనులు
నింద్యములని యందువా?
మాలిని:
శాలిని:
కష్టమగు, నపకీర్తియుం గలుగు మనకు.
మాలిని:
నెపము వెన్కను దాఁగిన నేమి యగును?
శాలిని:
తీఁగవలె నీవివేకము సాగుచుండె,
ఇట్లు గప్పినఁ గాని లోకేక్షణముల
మనదు హృదయాల మాట నేమనఁగ వలెను?
మాలిని:
కాని యవి విరహాగ్నిదగ్ధములు గాక
నవ్య సమ్మోదరససేచనమున నలరి
పతులు వచ్చెడు వఱకును బ్రతికియుండు.
శాలిని:
మాలిని:
శాలిని:
అపనింద కల్గినను అవమాన మబ్బినను
ఆపనికి నేను దూరంబుగా నుందు.
మాలిని:
అవమాన మేరీతిఁ గలుగు?
అంత జాగర్తతో మనముండ?
అది యట్టులుండనీ, సెలవిమ్ము సోదరీ
ఆజంటలో నెవఁడు నీమదిం దోచెనో?
శాలిని:
మాలిని:
శాలిని:
నాకు నంటును నందుచేతను
నేను రెండవ వానినే మది
లోన నిల్పఁగఁ బూనుకొంటిని.
పల్లవి:
చిత్తసంభవు శ్రీపదమ్మును
మాలిని:
అమృతవాహిని యలల నేను
అతని వదనమునందుఁ జూతును
అమృతకిరణుని అతిశయంబును ॥క్రొత్తప్రియులం॥
శాలిని:
హాసకౌముదియందు విరియును
అతని మోమున నందగించెడు
కలువకన్నులు కాంతు లీనుచు ॥క్రొత్తప్రియులం॥
మాలిని:
లందు నన్నే అరయుచుందును
నాదుకన్నుల నలరు తారక
లందతండే ప్రతిఫలించును. ॥క్రొత్తప్రియులం॥
శాలిని:
పిలుచు నాతని పిలుపు వినఁగనె
మోదభూమిని మొలచు మొలకలఁ
బోలి తనువున పులక లెసఁగును. ॥క్రొత్తప్రియులం॥
( శల్యుఁడు ప్రవేశించి)
శల్యుడు:
త్వరగ రండిక వనముఁ జేరఁగ
ఏమి గీతము లేమి వాద్యము
లేమి నాట్యము లెన్ని చోద్యము
లన్ని మీరలు కన్నుగల్వల
కఱవు దీఱఁగఁ గాంచ రండిక.
స్త్రీద్వయము:
శల్యుడు:
(నిష్క్రమింతురు)
మూడవ దృశ్యము
(ఉద్యానవనము. అందులో నాల్గు నగిషీ చెక్కిన అందమైన బల్లలు, కుర్చీలు ఉండును. సేవకులు సంరంభముగా రంగురంగుల పరిమళ భరితమైన పూవుతట్టలను ఆ బల్లలపై నుంచుచుందురు. ఆ బల్లలకు వెనుక వాద్యకారులు కొందఱు వాద్యములను వాయించుచుందురు. వారి ముందు కొందఱు నాట్యము చేయుచుందురు. వాద్యకారుల వెనుక కొందఱు బృందగానపరులుందురు. సన్నివేశ మంతయు సంతోషముగా, ఉత్సవపూరితముగా నుండును. ఇంతలో వాద్యరావము లాగిపోవును. నాట్యములు విరమింపబడును. అప్పుడు ప్రవిక్రమత్రివిక్రములు క్రిందిపాటను పాడుచుండగా, దాని ననుసరించుచు వాద్యములు, వాద్యములకు వెనుకనున్న బృంద గాయకులు ప్రవిక్రమత్రివిక్రముల పాటకు ప్రాపు నిత్తురు. అచ్చటికి వచ్చిన శాలినీమాలినులు, శల్యమాలతులు చాటునుండియే ఆ దృశ్యము నంతయు గమనింతురు. అట్లు గమనించు శాలినీమాలినులు ఆపాట అర్థమున కనుగుణముగా శృంగారపూరితమైన భావాభినయనమును ప్రదర్శింతురు. చివరి కోరస్ పంక్తులు పాడుచుండగా చాటుననున్న నల్వురచ్చటికి ప్రవేశింతురు. పాట ముగియగనే వాద్యకారులు, బృందగాయకులు, సేవకులూ, నృత్యకారులూ – అందఱు అచ్చటినుండి నిష్క్రమింతురు.)
పాట
ప్రవిక్రమ త్రివిక్రములు:
నేవో వలపుల తావులు నిండెను
బృందం (కోరస్):
తెలుపుడు వీరల వలపులు ప్రియలకు
(పలపల వీచే=సూక్ష్మముగా వీచే, పిల్లగాలులకు విశేషణము)
ప్రవిక్రమ త్రివిక్రములు:
వనరుహనేత్రల మనములు మారి
ప్రణయము నేడే పండెడురీతిగ
వినుచుము వారికి ననిలా మాకథ
బృందం (కోరస్):
తెలుపుడు వీరల వలపులు ప్రియలకు
ప్రవిక్రమ త్రివిక్రములు:
మామదులందున నామోదంబులు
సంధిలునటు మా సందేశంబుల
నందింపుము నీ వనిలా వారికి.
బృందం (కోరస్):
తెలుపుడు వీరల వలపులు ప్రియలకు
శాలినీ మాలినులు:
మాలతి:
పెదవి దాట దిదియేమి పదము మీకు
మౌనులంబోలి నిల్తురొక్క మాట లేక.
ప్రవిక్రముడు:
పెటిలదయ్యె మాట పెదవినుండి
త్రివిక్రముడు:
ప్రణయవివశత కదియె లక్షణము.
శల్యుడు:
(శాలినీమాలినులతో)
ఈదీనుల కింత ధైర్యము నందింపుడు.
శాలిని:
మాలిని:
ప్రవిక్రముడు:
(సంకోచిస్తూ)
దేవీ!
త్రివిక్రముడు:
(సంకోచిస్తూ)
కాదు, దేవతలారా!
ప్రవిక్రముడు:
(త్రివిక్రమునితో)
నీవు మాట్లాడు.
త్రివిక్రముడు:
(ప్రవిక్రమునితో)
లేదు, లేదు, నీవే…
శల్యుడు:
ఇట్టి సిగ్గు మాను డింతులందు
మాలతి:
రెండు పక్షములకుఁ గాన స్త్రీల కేను
తోడుపడెద, తోడ్పడు మీవు వ్రీడతోడ
పలుకలేని యువద్వయపక్షమునకు.
(యుగళద్వయగీతము. నల్గురు పాడే పాట)
శల్యుడు:
(మాలిని కరమును మృదువుగా గ్రహించి)
మృదువాణీ! వినుమిది దయతో
అదరుచు వీరలు మదినిం దెలుపరు
కావున వారలకై పల్కెద నే
నే వారలమదినెఱిగినవాఁడను
‘అతిచారము చేసితి మింతగ నీ (అతిచారము=హద్దుమీరి ప్రవర్తించుట)
యతివలయం దని అపరాద్ధమతిం
గృతమెంచక క్షమియింపుండని మి
మ్మతిదీనంబుగ నర్థింతురు వీరలు’
ప్రవిక్రమ త్రివిక్రములు:
మ్మతిదీనంబుగ నర్థింతురు వీరలు’
శల్యుడు:
ప్రణతులె వీరల వశమున గలవు’
ప్రవిక్రమ త్రివిక్రములు:
ప్రణతులె వీరల వశమునఁ గలవు’
(శాలినీమాలిను లేమీ పలుకకుండా నవ్వుతూ తటస్థముగానుందురు. వారితో శల్యుఁ డిట్లనును)
శల్యుడు:
కరుణను బ్రత్యుత్తర మొసఁగుడు వీరికి.
(ఆ స్త్రీలు చెప్పవలసినది తానే చెప్పెదనని మాలతి ఇట్లనుచున్నది)
మాలతి:
వారలకొఱకుం బలుకుదు నేనే
‘కడచినదేదో కడచిన దింకను
అడలుట యేలా అది భావించుచు
విడువుము బిడియము వెఱ్ఱితనంబును
నడువుము నాతో నాకర మూనుము’
ఇవియే వారల హృదయంబులలో
రవళించెడు ప్రతిరవరూపంబులు.
శల్య మాలతులు:
(తమలో తాము జనాంతికముగా)
వీరి నిట నుంచి ప్రణయవిహారమునకు
కందు మిఁక వీరినిం బరోక్షంబుగాను
ఇంక నీస్త్రీలు లోఁబడరేని వారి
నభినవానసూయ లనియె యనఁగవచ్చు.
(శల్యమాలతులు నిష్క్రమింతురు)
శాలిని:
త్రివిక్రముఁడు:
శాలిని:
నెదిగెను; తత్పార్శ్వమందు నెసఁగును త్రోవల్
త్రివిక్రముఁడు:
మ్మదిగ మనము తన్నికుంజమార్గములందున్.
(ఇర్వురు చేతులు పట్టుకొని ఆ నికుంజమార్గములందు విహరించుట కేగుదురు)
మాలిని:
(ప్రవిక్రమునితో)
మనమొక వైపున విహరింతమా?
ప్రవిక్రముఁడు:
(ఇర్వురు ప్రక్కప్రక్కగా నడచుచు కొంతదూరము పోదురు)
ప్రవిక్రముడు:
(బాధను నటించుచు ఒకపొదచెంత కూలబడి)
హమ్మయ్య!!
మాలిని:
ప్రవిక్రముడు:
మాలిని:
ప్రవిక్రముడు:
ప్రణయాగ్నిశైలోత్థపావకబాధ
మాలిని:
ప్రవిక్రముడు:
గేలిసేతువు కఠినాత్మురాల నీవు!
మాలిని:
ప్రవిక్రముడు:
మాలిని:
ప్రవిక్రముడు:
(అనుచొక హృదయాకార రత్నస్థగిత సువర్ణపతకము గల హారమును చూపును)
మాలిని:
ప్రవిక్రముడు:
వనరు, తపియించు హృదయంపు ప్రతిమయేను.
మాలిని:
ప్రవిక్రముడు:
మాలిని:
(లోన ఇష్టమున్నను పైకి లేనట్లు నటించుచూ)
శఠశిరోమణి! ఇట్టి లంచంబు లిచ్చి
జార్పఁజూతువు నామనఃస్థైర్య మీవు.
ప్రవిక్రముడు:
(తనలో)
అదరుచున్నది యీమె ధైర్యాచలంబు
(ప్రకాశముగా)
ప్రియతమంబుగ నిన్నెంతు విధుసమాస్య!
మాలిని:
ప్రవిక్రముడు:
మాలిని:
ప్రవిక్రముడు:
మాలిని:
ప్రవిక్రముడు:
నుందు నీతోడనే నేను కుందరదన!
మాలిని:
ప్రవిక్రముడు:
దీని నీకంఠమున నుంప నానతిమ్ము
(అని పలికి ప్రక్కగాఁ దిరిగిన మాలిని కనులు ఒక చేత మూసి, వేఱొక చేతితో తన ప్రతిమగల పతకముతో నున్న ఆమె హారము నామె మెడలోనుండి తీసికొని దాచుకొని, దాని స్థానమున కేవలము హృదయప్రతిమతోనున్నహారము నుంచును.)
యుగళగీతం
ప్రవిక్రముఁడు:
ఇది నీకె యధీనము
ఇది గొని చేయుము నీ
యెద నాకు నధీనము
మాలిని:
నాయెద నీయఁగఁజాలను
నాయెద నాయది గాదు
ఈయఁగఁజాలను నీకది
ప్రవిక్రముడు:
(ఆమె యెదను స్పృశించుచు)
పదెపదె కొట్టుచు నుండెను
మాలిని:
(అతని యెదను స్పృశించుచు)
నేదిట గొట్టుచు నుండెను
ఇర్వురు:
(పరస్పరహృదయములను స్పృశించుచు)
కానీ ఇది నాకడ లేదు
ఇది నీలో నొదిగినది
పదెపదె కొట్టుచు నున్నది.
ఈయెద ఆయెదలో దాఁగె
(కౌఁగిలించుకొని)
ఆయెద ఈయెదలో దాఁగె
అందున నవమోదమె విరిసె
సుందరమై జగమే మెఱిసె.
(ఇర్వురు సవిలాసముగా చెట్టాపట్టాలు పట్టుకొని నిష్క్రమింతురు. )
నాల్గవ దృశ్యము
(ఉద్యానవనములో శాలినీత్రివిక్రములు.)
త్రివిక్రముడు:
శాలిని:
(సవిలాసముగా అతనిని చూచి, తనలో)
రూపవంతుఁడితఁడు కాని ఓపలేను
నాదు ప్రియున కన్యాయంబు నాచరింప
అట్టులని వీనిఁ బ్రక్కకు నెట్టలేను
ఎట్లు మోతునొ యీద్వైద్య మెడఁదయందు.
త్రివిక్రముడు:
శాలిని:
పొదకుఁ బెట్టిన సొమ్ములా పూవు లెల్ల
త్రివిక్రముడు:
సుందరంబది నీమేని సొబగురీతి
శాలిని:
(తనలో)
సరసుఁడే గాని యీతండు, సాహసించి
నాదు ప్రియునకు ద్రోహంబు నాచరింప;
(సాభిప్రాయముగా)
మఱలఁ జూడంగ నాకుంజమందు నాకు
కంటకంబులె యంతటఁ గానుపించు.
త్రివిక్రముడు:
(తనలో)
సరసముగ నున్న యీయింతి స్వాంతమిపుడు
విరసముగ మాఱుచుండెను వింతగాను;
మఱలఁజేతును దాని నీకరణిఁ బలికి.
(ప్రకాశముగా)
చందనపుగిన్నెలో యన సౌరభంబుఁ
జల్లుచున్నవి యాపూవు లెల్లదెసల.
శాలిని:
వలన నున్మత్తభావంబె ప్రబలుచుండె.
త్రివిక్రముడు:
నేను సైత మున్మత్తతం బూనియుంటి
శాలిని:
నీత్యనీతుల కాత్మలో నెగడుచున్న
రణముచేఁ గల్గు సంక్షోభ మనఁగఁ దగును.
త్రివిక్రముడు:
నీదు ప్రేమయె అభిలషణీయమనుచు
చెంతనే యున్న యీనన్నుఁ జేరలేవొ?
శాలిని:
అందమైనట్టి నీముఖమందు నాకు
క్రూరరాక్షసశక్తియే గోచరించు
త్రివిక్రముడు:
లక్ష్యముగ నుండె రమణీలలామ! చాలు
సంక్షుభితచిత్తవృత్తులు, చాలు వ్యర్థ
భాషణ మొకింత శాంతించి పలుకవమ్మ.
శాలిని:
(అసమ్మతితో)
ఇట్టి మాటలు వ్యర్థంబు, లినుమడించు
నా యశాంతి వీనివలన, నన్ను నిందె
విడిచి, నీదారిలోన నీవేగుమయ్య.
త్రివిక్రముడు:
చేతును, సుఖముండుమిఁక సుశీలవగుచు.
(అని త్రివిక్రముఁడు నిష్క్రమించును)
పాట
నామనశ్చంచలత, నామనోవికలత్వ
మామానవునియందు నాసక్తి కలిగించె
అపవిత్ర మాప్రేమ, అపమార్గమున మనం
బెపుడు పయనించునో యపుడె యిట్టివి గూడు
ఒకని తృష్ణను దీర్ప నొకని తృష్ణను మాపు
వికటయత్నమె యిద్ది, వీఱిఁడితనమె యిద్ది
నామనఃస్థైర్యంబు, నామనోధైర్యంబు
లీ మనోదుర్బలతనెల్లఁ దొలఁగించుగాక.
నీనమ్మకము నెల్ల నేలపాలొనరించి
నేనుద్యమించితిని నీకు ద్రోహము చేయ
ఈనికుంజములోనె ఈపాప మడఁగనీ
ఓనాథ! క్షమియింపు మీనాతి తప్పిదము
ఐదవ దృశ్యము
(త్రివిక్రముఁడు క్రింది గీతమును పాడుచు శాలినీమనఃస్థైర్యమును ప్రశంసించుచుండును. అప్పుడే శల్యుఁ డచ్చటికి ప్రవేశించి, దూరము నుండి ఆ గీతమును వినుచు, చివరి పల్లవిని పాడునపుడు త్రివిక్రముని సమక్షమునకు వచ్చును. )
పల్లవి:
శ్రీశైలముంబోలి స్థిరమామె చిత్తంబు
చరణం1:
మించువలె నిర్మలం బేయింతి చిత్తంబు
ఆయింతి శాలినీ, ఆమె శీలము నరయ
నాయుల్లమునఁ బొంగు నానందముల వెల్లి ॥నాశాలినిం బోలు॥
చరణ2:
నాయునికి సుస్థిరం బా యువతిమదియందు
భూమిజామన మెట్లు రామునకు నంకితమొ
ఆమె మానస మెప్పు డంకితము నాకె ॥నాశాలినిం బోలు॥
శల్యుడు:
త్రివిక్రముడు:
హస్తమం దీక్షణమె అనాయాసముగను?
శల్యుడు:
త్రివిక్రముడు:
చప్పున నాకొసంగుమిఁక శల్య! విచంచలచిత్త మింతయుం
జొప్పడనట్టి సత్యగుణశోభిత శాలిని, కానలేము నీ
చెప్పిన శీలభంగకరచేష్టితమొక్కటియేని నామెలోన్
శల్యుడు:
ముగియలేదింక చేయంగఁదగినదంత
మాట యిచ్చినట్లుగ వచ్చు నాటకంబు
నంత యాడిన పిదప మాటాడుమయ్య.
ఆఱవ దృశ్యము
(శాలిని తన ప్రవర్తనను పునర్విమర్శించుకొనుచు క్రిందిపాట పాడుచుండును)
పల్లవి:
చేతమ్ము క్రోధమ్ముచే నేల నించితిని
చరణం1:
జల్లుచున్నవి యాపూవు లెల్లదెసల’
ఎంత రమ్యంబొ కద యీభావచిత్రంబు
ఎంత సరసంబొ కద యిట్టి హృదయంబు ॥ఆతనిని॥
చరణం2:
అతిసుందరం బతులితానందకరము
అవమానమొనరించి తట్టి వానిని నేను
అవిమృష్టహృదయనై ఆగ్రహోన్మత్తనై ॥ఆతనిని॥
చరణం3:
చెంత నెపుడైన వీక్షింపఁగలనా?
చెంత నున్నను నన్నుఁ జేరి పల్కున యతఁడు
శాంతుఁడై దరహాసచంద్రికలు నించి ॥ఆతనిని॥
ఏడవ దృశ్యము
మాలతి:
ఇప్పుడు నేనెంతును నిను
మాలిని:
నా యనంగీకృతిని నంగీకృతిగమార్చె
అతని సరసత్వంబు నతని చాతుర్యంబు
అతనికిన్ లోఁబడక ఆత్మ నిల్వక పోయె
మాలతి:
అందిపుచ్చుకొనవలె నట్టి యవకాశంబు
నిందింపకను విధిని నిపుణలౌ జవరాండ్రు
(శాలినిని చూచి)
కనుమిదిగొ నీ సహోదరిని
కాంతిహీనం బామె ముఖము
శాలిని:
మాలతి:
మాలిని:
శాలిని:
మీ వికటబోధనలచేత మెత్తబడిన
మన్మనంబున నావిష్టమగుచు నన్ను
వ్యథలఁ బెట్టును దుష్టశక్త్యాదు లెన్నొ
మాలిని:
శాలిని:
పరుఁడొకండు నాప్రేమకు పాత్రుఁడయ్యె.
మాలతి:
మాలిని:
తనయువకులతోడ వేఱు దలఁపక యింకన్
మనసిజభోగములొందుచు
ఘనముగఁ బెండ్లాడి వారిఁ గందము సుఖమున్.
శాలిని:
వీరులు రారొ, వచ్చి వలపెచ్చఁగ భద్రతరోపయామ సం
స్కారముచేత నేకమయి సౌఖ్యము గూర్పరొ, ఏల యంతలో
బేరము మార్చి అన్యులకు ప్రేమలు చేర్చి వివాహమాడుటల్?
మాలిని:
తెరవు మనకేది వారనిం దివికిఁ జనిన
చేతిలో నున్న పక్షినిన్ స్వీకరింప
కడవిలో నున్న పక్షికై అరయు టేల?
శాలిని:
మాలిని:
క్రొత్త యువకులఁ బెండ్లాడి కూర్మిమీర
దూరదేశాన నుందుము వారితోడ.
శాలిని:
ఒక్కపూటలో వరియించియున్న ప్రియుల
మట్టె మార్చినరీతిని మార్చు నీతి
ఎట్టులబ్బెనొ నీకు నే నెఱుఁగనైతి.
మాలిని:
ఇంతులు రక్తమాంసములు, నింగితముల్గలవారు గారొ, ఒ
క్కంతయు లేదొ వారి కధికారము నచ్చినవారికి న్నిజ
స్వాంతము లప్పగించి సుఖవైభవపూర్ణముగా వసింపఁగన్?
సోదరీ! నీహృదయసందేశమును వినుము.
ఆ సుందరునికి హృదయంబు నర్పింపుము.
వాడు ప్రవేశించిన మది వశమును దప్పుట సత్యము
కాంతుని మోమున మూగిన కనుచూపులలోనే
వింతగ నతఁడు జనించును, వెంటనె మదిలోఁ జేరును
అతఁడు సుఖంబుగ నుండిన ఆమది సుఖియించును
కావున నాతని నెప్పుడు కఠినంబుగఁ జూడకు
ఆతని పూనిక సాగిన అవరోధంబులు లేక
ఆనందంబును తృప్తియు హాయియుఁ గల్గును
కావున నాతని పనుపును గావింపు మవశ్యము
నావలె నీవును నవ్యానందంబును బొందుము
ఎనిమిదవ దృశ్యము
(రంగమునందు శాలిని తన సందిగ్ధావస్థను గుఱించి యోచించుచుండును. రంగము వెనుక నొక గదిలో శల్యుఁడు, ప్రవిక్రముఁడు, త్రివిక్రములుందురు. ఆ గదికి గల పెద్ద కిటికీగుండా వారు ప్రేక్షకులకు కనపడుచుందురు. శాలిని ‘ఇరువురు పురుషుల మధ్యన’ అను చరణమును పాడునపుడు త్రివిక్రముడు రంగముపై దూరముగా కన్పడి, ఆ చరణము పూర్తి కాగానే ఆమెను సమీపించును.)
శాలిని:
మనసొకయింత చలించెను
ఆచలనము పెంపొందెను
నాచెలియలి పలుకులచే
ఇరువురు పురుషుల మధ్యన
తిరుగును నామన మిప్పుడు
దొరకునొ లేదో దీనికి
సరియైన పరిష్కారము
త్రివిక్రముడు:
(తనలో)
కరఁగుచుండె నొకింత ఈ తరుణి మనము
(సమీపించి)
పడఁతీ! నిష్కరుణన్నను
వెడలంగొట్టితివి గాని వెడలదు నాలో
నడరెడు ప్రేమము నీపై
కడకన్నులఁ గాంచి నన్నుఁ గరుణింపుమిఁకన్.
నీదు దరహాసకౌముదుల్ నెగడఁజేసి
ఇందుశిలచందమున్నట్టి ఇతని యెదను
సంద్రవింపంగఁ జేయుము చంద్రవదన!
శాలిని:
త్రివిక్రముడు:
(ఆమె మ్రోలఁ గూలఁబడి కత్తిని ఆమెకు ముందు జొనుపుచూ )
ఏమి చేయుదు నననేల ఇంత వినుము
ఇచ్చినను నీదు హృదయంబు నిమ్ము, లేద
గ్రుచ్చు మీకత్తి నాదు హృత్కోశమందు
శక్తి లేదందువా? నేనె సాయపడెద.
శాలిని:
(తనలో)
చక్కనిమాటలతోడం
జక్కనిరూపంబుతోడ స్వాంతచ్ఛలమున్
గ్రక్కునఁ బాపుచు నీతం
డక్కట! నన్నుం గ్రమముగ నావేశించున్.
(ప్రకాశముగా)
చాలు సాహసము. లెమ్మింక. పల్కుమిఁక యథార్థంబు నాకు.
త్రివిక్రముడు:
నీదు హృదయంబొ లేదేని నాదు మృతియొ
ఏదొ యొక్కటి నను వరియించుఁగాక!
శాలిని:
(సవిలాసముగా)
నీ వాక్చాతుర్యము, శో
భావహమైన భవదీయభవ్యాకృతియున్
పూవఁగఁజేసెను నాలోఁ
బూవిలుకాని మరుల, గెలుపొందితి వీవే.
చేయఁదలంచితి వేదియొ
చేయుము, వశమయ్యె నాదుచిత్తము నీకున్
తోయజబాణుని సన్నల
నాయువుఁ బుచ్చుదము మనము హాయిగ నింకన్.
ఉభయులు:
(పరస్పరాలింగనముతో)
మదిలో మెదిలే మన్మథభావమె
విదితంబయి కడు విందును గూర్చెను
ఈవిధముగ మన జీవితమంతయు
పూవులతోఁటగఁ బొంపెసలారని
(నిష్క్రమింతురు)
తొమ్మిదవ దృశ్యము
(ప్రవిక్రమత్రివిక్రములు, శల్యుడు రంగములో నుందురు.)
ప్రవిక్రముడు:
మును ప్రతినలు చేసిన వధువులె
స్ఖలితాంతరులై స్వాంతము లెవరో
పురుషుల కంకిత మొనరించిరి
త్రివిక్రముడు:
మాడెద, మాడిన నవిమృష్టాత్మలు
వీరలు మనయెడ విశ్వాసముతో
నుందురె, మన శ్రేయోరతు లౌదురె?
శల్యుడు:
ప్రేమమీరంగ వారలఁ బెండ్లి యాడి
పూవులం బెట్టి పూజించి ప్రోదిసేయ
వారు విశ్వసనీయలై వరలుచుంద్రు.
ప్రవిక్రమ త్రివిక్రములు:
వారి నేరీతిఁ బరిణయం బాడఁగలము?
శల్యుఁడు:
ప్రవిక్రమ త్రివిక్రములు:
ఉత్తమస్త్రీలు లేరొకో ఉర్వియందు?
శల్యుఁడు:
ఐన మీ యంతరంగంబులందుఁ గలదు
సుస్థిరంబగు ప్రేమ యీ సుదతులందు
ప్రవిక్రముడు:
త్రివిక్రముడు:
శల్యుఁడు:
చానల వేఱుగా సృజన సల్పడు, ఊఱడు డందుచేత, నే
మైనను నేటిరాత్రి ఉపయామయుగంబును గాననెంతు నేఁ
గానఁ దదర్థమింకఁ ద్వరగాఁ బయి కార్యములెల్లఁ జేయుఁడీ!
అందఱు నిందసేతురిల నబ్జదళాక్షుల గాని యోర్మితో
గందును నేను వారి, తమకంబులు వారి మనంబులం దినం
బందున వందసార్లు పరివర్తనమందిన నందుఁగాక, కాం
చందగు దాని వారి సహజంబగుధర్మముగానె యోర్మితోన్.
అందుచే వారి నిందించు టనవసరంబు
తరుణులైనను కాంతలు స్థవిరులైన
రూపవతులైన లేక కురూపులైన
నింతులందఱు నింతయే యిదియె నిజము
ప్రవిక్రమ త్రివిక్రములు:
ఇంతులందఱు నింతయే యిదియె నిజము.
పదవ దృశ్యము
(మాలతి ప్రవేశించి ప్రవిక్రమత్రివిక్రములతో)
మాలతి:
సమకూడెను; సుముఖమయ్యె జలజాక్షీయు
గ్మము మిముఁ బరిణయమాడఁగ
కమనీయాద్యసుముహూర్తకాలమునందున్
మీకిది నచ్చినఁ దెల్పుడు
ఆకమలాక్షులు పెండ్లి యైన యైదవనాడే
ఆకాంక్షింతురు చనఁగన్
మీకేరళదేశమునకు మీతోఁ గూడన్.
ప్రవిక్రమ త్రివిక్రములు:
మాలతి:
వేచియున్నారు వధువు లావేగమెసఁగ
వారి కిది తెల్పి పరిణయపర్వమెల్ల
వైభవంబుగ సాగు నేర్పాట్లు సేతు.
ప్రవిక్రమ త్రివిక్రములు:
పైని శుభలగ్నపత్త్రిక వ్రాయవలెను
చక్కగాఁ బెండ్లి నాపైని సలుపవలెను
చేయవలె నిట్టి యేర్పాట్లు శీఘ్రముగను
మాలతి:
పొల్లువోవదు మాలతి పూన్కి యెపుడు.
పదకొండవ దృశ్యము
(రంగములో చక్కని విలువైన కుర్చీలు వేయబడి యుండును. బృందగాయకులుందురు, రంగమునకు వెనుక రెండు గదులుండును.)
బృందం (కోరస్):
జేరి వరించెడి చిత్రవివాహము
జరుగుచునుండెను సంరంభంబుగ
సరగున రండు సంవీక్షింపఁగ
(మాలతి క్రింది చరణమును పాడుచుండఁగా వివాహయోగ్యమైన వేషములు ధరించి శాలినీమాలినులు రంగములో ప్రవేశింతురు.)
మాలతి:
రంగులఱైకలు, రవణంబులును
రంగుగఁ దాలిచి రమలం బోలుచు
పొంగుచు కన్యలు పొలుపుగ వచ్చిరి
(శల్యుఁడు క్రింది చరణమును పాడుచుండఁగా వివాహయోగ్యమైన వేషములు ధరించి ప్రవిక్రమత్రివిక్రములు రంగములో ప్రవేశింతురు.)
శల్యుడు:
వీరులు, వధువులఁ బెండిలియాడఁగ
సారంబగు వేషంబులు దాల్చుచు
శ్రీరమణులవలె ప్రియమున వచ్చిరి
బృందం (కోరస్):
జేరి వరించెడి చిత్రవివాహము
జరుగుచునుండెను సంరంభంబుగ
సరగున రండు సంవీక్షింపఁగ
(వధూవరులు వారివారి అర్హాసనములలో కూర్చొందురు. అచట పురోహితుఁడు లేకుండుటను గమనించి త్రివిక్రముఁ డిట్లనును)
త్రివిక్రముడు:
కన్నులకు పురోధ కానరా డిదియేమి?
మాలతీ శల్యులు:
ఎదురుగా నేగి కొనివత్తుమింక నతని
(మాలతీశల్యులు నిష్క్రమింతురు. వారు వచ్చులోగా సంతోషముతో వధూవరులు క్రింది బృందగానమును పాడుచుందురు.)
పాట
బృందం (కోరస్):
పావనమగు నుద్వాహముతో
జీవనగమ్యము చేరఁ దలంచెడు
ఈవరవర్యుల కీవధువులకు
ప్రవిక్రమ త్రివిక్రములు:
తనువులసైతము దానము చేసి
ఘనసౌఖ్యముతో గలసి చరించెడు
క్షణమిదె, మనజీవనలక్ష్యంబిదె
శాలినీ మాలినులు:
అవిరతసౌఖ్యసుమావళిఁ గందము
కవ వీడని విహగంబుల విధమున
సువిలాసంబుగ జోడై యుందము
బృందం (కోరస్):
పావనమగు నుద్వాహముతో
జీవనగమ్యముఁ జేరఁ దలంచెడు
ఈవరవర్యుల కీవధువులకు
(కోరస్ నిష్క్రమించును. మాలతి ఒంటినిండా విలువైన పండితార్హమైన జరీశాలువను కప్పుకొని, తలపాగా పెట్టుకొని, ముఖమునందు విభూతిని ధరించి, చేతిలో పంచాంగమును, లగ్నపత్రికను పట్టుకొని పురోహితుని వేషముతో శల్యసహితముగా ప్రవేశించి అర్హాసనముపై కూర్చొనును.)
ఇతరులందఱు:
శతధృతిసమధీయుతునకు
(నమస్కరింతురు)
పురోహితుడు:
అంగనామణులను అందాల వరులతో
మంగళశ్రుతిమంత్రమహితమ్ముగా నేఁడు
హంగుమీరఁగ గూర్ప నారంభమును జేతు,
పొంగారు వేడ్కతో ముందుగాఁ జదివెద
రంగారు వ్రాలుగల లగ్నపత్త్రిక నేను
వధూవరులు:
చదువుండు చదువుండు జాగు సేయకుడింక
పురోహితుడు:
(అని చదివి, వధూవరుల నుద్దేశించి పలుకును.)
ఇది మీకు హితమైన నీపత్త్రమందుఁ
జేయుడీ సత్వరమె చేవ్రాలు నిపుడు.
వధూవరులు:
(అని నల్వురు సంతకములు చేసి పత్త్రమును పురోహితుని కిత్తురు. పురోహితుఁడు దానిని శల్యుని కిచ్చును. అతని కిచ్చుచుండగా హఠాత్తుగా యుద్ధభేరి మ్రోగును. యోధులు తిరిగివచ్చుచు పాడు నీపాట వినిపించును.)
పౌరుషంపుజ్వాల రేచి
వైరిగణము నెల్లఁ గాల్ప
భూరివిజయమంది మేము
గారవంబుతోడ పురికిఁ
జేరుకొంటిమీ;
గారవంబుతోడ పురికిఁ
జేరుకొంటిమీ.
వధూవరులు:
(సంభ్రమాశ్చర్యములతో)
ఏమీభేరీనాదము? ఏమీ పాట? ఏమగుచున్నది?
శల్యుఁడు:
(కిటికీ దగ్గరి కేగి తేరిపాఱఁజూచును, అట్లు చూచి)
అయ్యొ భగవంతుఁడా! ఇది యేమి ఖర్మంబు?
కాలుసేతులు కొంకరలు వోవు
కాయంబు కంపించు శుష్కపర్ణమురీతి
శాలినీ మాలినులు:
(ఉద్వేజితులై)
ఏమైనదేమైనది?
శల్యుఁడు:
శాలినీ మాలినులు:
శల్యుఁడు:
శాలినీ మాలినులు:
(ప్రవిక్రమత్రివిక్రములతో)
ఇటనుండి పొండు, మీరిటనుండి పొండు, ఈతత్క్షణమె పొండు
ప్రవిక్రమ త్రివిక్రములు:
శాలినీ మాలినులు:
(అని బలవంతముగా వారిని రంగమునకు వెనుక ఎడమవైపున్న ద్వారమున కీడ్తురు. వారటనుండి అదృశ్యులౌదురు. శల్యుఁడు పురోహితుని వేషములో నున్న మాలతిని రంగమునకు కుడివైపున్నగదిలోనికి పంపివేయును.)
శాలినీ మాలినులు:
(కుర్చీలను, అలంకరణములను రభసముగా తొలగింతురు)
శల్యుఁడు:
శాలినీ మాలినులు:
శల్యుఁడు:
శాలిని:
మాలిని:
శాలిని, మాలిని:
నమ్ముదురె మనల పదిజన్మములకైన?
పన్నెండవ దృశ్యము
(ప్రవిక్రమత్రివిక్రములు తమవేషములను త్యజించి విక్రమపరాక్రములుగా రంగమున ప్రవేశింతురు.)
విక్రమ పరాక్రములు:
స్థిరతరానురాగాభోగచిత్తలగుచు
మాకొఱకుఁ బ్రతీక్షించెడు మానవతుల
కౌఁగిళులఁ దేలి సుఖియింపఁగాను మేము.
శల్యుఁడు:
తిరిగివచ్చితిరెందుకో త్వరగ మీరు?
విక్రమ పరాక్రములు:
శీఘ్రముగ నివృత్తులమయి క్షేమముగను
వచ్చితిమి మాదు ప్రియురాండ్రవలపుతీపి,
నీదు స్నేహంపురుచిఁ గ్రోలి మోదమొంద.
పరాక్రముడు:
(శాలినితో)
ఏల ఇంతటి మౌనమూ? ఏల ఇంతటి దైన్యమూ?
విక్రముడు:
(మాలినితో)
మాటాడవేమి మత్ప్రియసఖీ?
శల్యుడు:
పలుకు రాదయ్యె సమ్మోదభరముచేత
శాలినీ మాలినులు:
(తమలో)
నోరెండె, మాటరాకుండె నోట
నామేన ప్రాణంబు లెట్లుండె నింక?
(శల్యుఁడు తన చేతిలోని లగ్నపత్త్రికను పొరపాటున పడినట్లు నటించుచు క్రింద పడవేయును. దానిని విక్రముడు తీసికొని చదువుకొనును)
శాలినీ మాలినులు:
(తమలో)
ఈపలువ యీపత్త్ర మేల పడవేసె?
ఇది వారు చూచిన నింక మన బ్రతుకు
లావిరై పోవవా అసువు లిఁక నిల్చునా?
విక్రముడు:
పరాక్రముడు:
(విక్రముని చేతిలోని పత్త్రమును పరిశీలించి)
సందేహమే లేదు. లగ్నపత్త్రిక యిది.
విక్రమ పరాక్రములు:
ఎంత వంచన యింతలో నింతులార?
ఏరి? వారేరి? ఆచోరులెందుఁ గలరు?
వారిరక్తము లేఱులై పాఱు నింక!
(అనుచు వారు వెనుకగదిలో వెదకఁబోవుట కుద్యమింతురు. స్త్రీలు వారిని వారించుచు క్రిందివిధముగా వేడుకొందురు.)
శాలినీ మాలినులు:
మరణమే దీని పరిహారమార్గమరయ
ఏవి మీకత్తు లిపుడె మాయెదలఁ గ్రుచ్చి
యమునినగరికి మమ్మంపు డార్యులార!
(విక్రమపరాక్రములు అట్లు వేడికొన్నను శాంతింపక, సరభసముగా పురోహితుని వేషములో నున్న మాలతి దాఁగియున్న గదిలోనికి ప్రవేశించి, ఆమెను బలవంతముగా బయటి కీడ్చి తెచ్చి శాలినీమాలినులతో నిట్లందురు.)
విక్రమ పరాక్రములు:
యీ పురోహితుండును…, దోసమింత చేసి
మొసలికన్నీటితో మము మోసపుత్తు
రెంత నంగనాచులొ మీర లింతులార!
(మాలతి తన తలపాగను, శాలువను తొలగించి, నిజస్వరూపము కన్పడజేయుచు ఇట్లు పల్కును.)
మాలతి:
మాఱువేసంబులో నున్న మాలతిఁ గని
భ్రమతురేల? పురోహితప్రవరుఁ డనుచు.
శాలినీ మాలినులు:
(విస్మయముతో)
మాలతీ! నీవెంత మాయావివే?
బాలిశులఁ జేసి మము వంచించితీవు.
విక్రమ పరాక్రములు:
చెప్పుడు యథార్థంబు చెలువలార!
శాలినీ మాలినులు:
(శల్యమాలతులను చూపెట్టుచు)
ఈ తార్పుకాని నీ తార్పుకత్తియను
యాథార్యముం జెప్ప నడుగుండు మీరె
శల్యుఁడు:
నన్నుఁ గావునఁ జెప్పెద నున్నతీరు
దాఁగియున్నది యిందు యాథార్థ్యమెల్ల
(అని ప్రవిక్రమత్రివిక్రములు దాఁగిన గదిని చూపెట్టును)
శాలినీ మాలినులు:
(భయముతో తమలో)
కొంప మునిగెను, చూపె నీ కూళ యేల
వారు దాఁగిన చోటునే వీరి కిపుడు?
విక్రమ పరాక్రములు:
ఇందు దాఁగిన ధూర్తుల నీడ్చి తెచ్చి
బలి యొనర్తుము మా కరవాలములకు
(అనుచు సరభసముగా ఆగదిలోని కేగి, తమ దుస్తులను ప్రవిక్రమత్రివిక్రములు ధరించి యుండిన దుస్తులతో మార్చుకొని, వారి మీసములు, ఉష్ణీషములు లేకుండ బయటికి వత్తురు.)
శాలినీ మాలినులు:
(వారి నాశ్చర్యముతో చూచి తమలో)
ఎంతటి వంచకు లక్కట!
ఎంతగ యత్నించిరి మనయీలువు నొంపన్
ఇంతుల స్వాంతము వీరికి
సంతసమును గూర్చు కేళిసాధన మయ్యెన్.
విక్రముడు:
(మాలిని ముందు వంగి)
ఇదియె నీదు హారంబు పూర్ణేందువదన!
కేరళుఁడు నీదు ప్రణయంబుఁ గోరువాఁడు
తిరిగి యిచ్చుచునున్నాడు మఱల నీకె
స్వీకరింపుము ప్రియమార, చెలువు మీర.
(విస్మయోద్వేగభరితచిత్తముతో సవిలాసముగా నామె దానిని గ్రహించును.)
పరాక్రముడు:
(శాలిని ముందు వంగి)
కేరళమునుండి మాళవక్షేత్రమునకు
నిన్నుఁ గామించి వచ్చిన నీదుబంటు
నతి యొనర్చుచు నున్నాఁడు నళిననేత్రి!
కరుణతోఁ దీర్పు మీతని కాంక్షితంబు.
(విస్మయోద్వేగప్రణయపూరితచిత్తముతో సవిలాముగా నామె యాతని నాలింగనము చేసికొనును.)
విక్రమ పరాక్రములు:
(పరిహాసముగా)
పరిణయంబును గావింప వచ్చినట్టి
యీపురోహితశ్రేష్ఠున కిత్తు మేము
పండితోచితమైన సౌవర్ణశాటి
(అని బంగారురంగుశాలువను మాలతికిఁ గప్పుదురు.)
శల్యుడు:
వైద్యునకు నిత్తు వింశతిస్వర్ణములను
(అని తాను ప్రతినచేసిన వింశతిస్వర్ణములను మాలతి కిచ్చును.)
శాలినీ మాలినులు:
(శల్యుని వంకఁ జూచుచూ)
ఈ తులువయే మూలమీ యనర్థమునకు
ఎదుట నున్నాఁడు విషవృక్షంబువోలె.
శల్యుడు:
ఐన నేమయ్యె? దృఢమయ్యె దీన మీకు
వల్లభులయందు ననురాగభావ, మట్లె
వారికిని హెచ్చె మీయందు వలపులిపుడు
దొసఁగులెంచుట మాని లోనెసఁగు ప్రీతిఁ
జేతిలోఁ జెయివేసి మీ చెలిమికాండ్రఁ
జెంతకుం జేర్చి గాఢసంశ్లేషములను
అనుభవించుడు సుఖముల నవధిలేక.
(అని పాడుచు శల్యుఁడు వారి చేతులు కలుపును. వారు విలాసముగా పరస్పరాలింగనమును చేసికొందురు)
శాలినీ మాలినులు:
(విక్రమపరాక్రములతో)
సంభవించిన పొరపాటు సంభవించె
నైన నికముందచంచల మైనయట్టి
మానసంబుల ననురాగమహితమైన
జీవితంబులఁ బుత్తుము చేరి మిమ్ము.
విక్రమ పరాక్రములు:
(శాలినీమాలినులతో)
విశ్వసింతుము మీమాట వెలఁదులార!
చింత మానుఁడు, మిముఁ బరీక్షింప మెపుడు.
అందఱు:
మదులం గలఁచుచు మనుజుల కిలలో
ఐనను వానికి అటమటమొందక
జ్ఞానముతో మనఁజాలుట శ్రేయము
ఒక్కనిఁ గలఁచెడు నుమ్మలికంబే వే
ఱొక్కని కగపడు నుల్లాసంబయి
చిక్కక శోకపుచెఱలో నెటులో
చక్కని సుఖమును సంపాదించుము.
(సమాప్తము)