ఈ నెలలో మరికొన్ని లలిత గీతాలు. ఇవన్నీ, ఒక్క పాట మినహాయిస్తే, విజయవాడ రేడియో కేంద్రం నుండి ప్రసారమవుతున్నప్పుడు (live), వేర్వేరు సమయాల్లో రికార్డు చేసుకున్నవి.
మొదటి అయిదు పాటలు ఎన్. సి. వి. జగన్నాథాచార్యులుగారు పాడినవి. ‘స్వరముల తూగే ఘనరాగమవో’ అన్న గోదావరి నదిపైన పాట (రచన: ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, సంగీతం: మల్లిక్) ఒకటి మాత్రం శ్రీకాంతశర్మగారు (ఎస్. బి. శ్రీరామమూర్తిగారి సహకారంతో) సంకలనం చేసుకున్న రెండు సి.డి.లలో జతపరచబడింది. కేవలం జగన్నాథాచార్యులుగారి పాటలతో ఒక సంకలనం చేయాలనే (అలాగే మల్లిక్, శ్రీరంగం గోపాలరత్నం) కోరిక చాలా సంవత్సరాలుగా ఉంది కాని, వారి వారసులు అదే ఆలోచనలలో ఉన్నారని వింటున్నాను. ఆయన పాడిన, సంగీతం చేసిన మరిన్ని పాటలు త్వరలోనే బయటికొస్తాయని ఆశిద్దాం.
తరువాతి రెండు పాటలు ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావుగారు రాసినవి. వీటిలో ‘మాటలే కవికి మూటలు’ అన్న పాట పాడింది పి. సుశీల. చివరిగా ఒక సంప్రదాయపు భజన పాట. నిజానికి ఈ పాట వెంకటరమణగారు తమ శోభనాచల బ్లాగులో ఆడియో సాహిత్యం పోస్టు చేశారు. అక్కడ లేని ఒక వివరం ఆ పాట పాడింది మల్లిక్, సుబ్బులక్ష్మి. ఇదే పాట హైదరాబాదు కేంద్రం నుండి పాలగుమ్మి విశ్వనాథంగారు బృందగానంగా రికార్డు చేశారు. దీన్ని నేను విశ్వనాథంగారి దగ్గర తీసుకున్నాను.
- బతుకు బరువు మోయలేక – గానం: ఎన్. సి. వి. జగన్నాథాచార్యులు.
- తొలికారు మేఘమా – గానం: ఎన్. సి. వి. జగన్నాథాచార్యులు.
- ఆశలన్ని చుక్కలగుచు – గానం: ఎన్. సి. వి. జగన్నాథాచార్యులు.
- స్వరముల తూగే ఘనరాగమవో – గానం: ఎన్. సి. వి. జగన్నాథాచార్యులు.
- ఉన్నదిరా ఒకటున్నదిరా – గానం: ఎన్. సి. వి. జగన్నాథాచార్యులు.
- వలపులు చిందగ వచ్చెనదే – గానం: శ్రీరంగం గోపాలరత్నం.
- మాటలే కవికి మూటలు – గానం: పి. సుశీల
- శివుడు తాండవము సేయునమ్మ – గానం: మల్లిక్, సుబ్బులక్ష్మి.
- శివుడు తాండవము సేయునమ్మ – గానం: కోరస్.