శిఖరారోహణం

శిఖరారోహణం – కవి తిలక్‌పై ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రం సమర్పించిన సంగీత, సాహిత్య చర్చా రూపకం.

రూపకల్పన, సమర్పణ: ఇంద్రగంటి శ్రీకాంతశర్మ,

నండూరి రామమోహనరావు, వోలేటి వెంకటేశ్వర్లు, దేవరకొండ గంగాధర రామారావు, ఆవంత్స సోమసుందర్, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, ఎన్ సి వి జగన్నాధాచార్యులు, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు తదితరులతో కుర్చిన ఈ రూపకం, తిలక్ కవితలు, కథలు, నాటికలపై చర్చలతో, తిలక్ కవితలకు బాణీలు కట్టి పాడిన గీతాలతో ఎంతో అపురూపమైన కార్యక్రమం, ఈమాట పాఠకులకు తప్పకుండా నచ్చుతుందని మా నమ్మకం.

సేకరణ: పరుచూరి శ్రీనివాస్


ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గురించి:

అభ్యుదయ కవిగా పేరొందిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (1944-2019) తండ్రి, కవి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి. చిన్ననాటినుండే సాహిత్యవాతావరణంలో పెరిగి విద్యార్థి దశలోనే రచనావ్యాసంగం చేపట్టారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో (విజయవాడ) సబ్-ఎడిటర్ గా 1969-76 మధ్య పనిచేశారు.

 ...