సుప్తశిల: నాటిక

మనకు చిరపరిచితమైన అహల్య శాపగాథను తనదైన శైలిలో అహల్యాత్మకమైన ఒక రమ్యనాటికగా ఆవిష్కరించిన తిలక్ రచన సుప్తశిల (ఆడియో ఆలిండియా రేడియో, హైద్రాబాదు కేంద్ర సమర్పణ).

నిడివి: 30 ని.

సేకరణ: పరుచూరి శ్రీనివాస్

ఈ నాటకం పూర్తిపాఠం పుస్తక రూపంలో ఆసక్తి గల పాఠకులకోసం అందజేస్తున్నాం.


దేవరకొండ బాలగంగాధర తిలక్

రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ గురించి:

కవి, రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ (1921-1966). భావుకత, అభ్యుదయం వీరి కవిత్వంలో ముఖ్యలక్షణాలు. 1940ల్లో తిలక్ భావకవుల ప్రభావంతో ఛందస్సులోని పద్యాల్లో ఖండకావ్యాలు రాశాడు. గోరువంకలు, స్వయంవరం, ఆవాహన, వర్షా, మధువిరహం, శర్వరీప్రియ, ఆటవెలది, శ్రీ వివేకానందస్వామి, సీత-1, సీత-2, అద్వైతమాన్మధం, అమృతభావము వంటి ఖండకావ్యాలు రచించారు. తిలక్ ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది . భాష ఎంత మెత్తనిదో, భావాలు అంత పదునైనవి. సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో, సంఘ దురన్యాయాలపట్ల అంత క్రోధం. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ‘అమృతం కురిసిన రాత్రి ‘ ఉత్తమ కవితాసంపుటిగా 1971 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది.

 ...