రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఆత్మ ఘోష

రచన: రవి వీరెల్లి
సెప్టెంబర్ 2010

నువ్వాడే నాటకంలో
నీ అంతరంగానికే పరిమితమైన
ఓ కీచురాయి పాత్రను

నువ్వు చేస్తున్న కర్మల్లో
కోల్పోయిన నా ఉనికిని శోధిస్తూ
గుండె తడారిపోయి తపిస్తున్న అస్తిత్వాన్ని

నువ్వేస్తున్న బొమ్మల్లో
రూపాంతరం చెంది
ఆనవాలు పట్టలేని అదృశ్య చిత్రాన్ని

నువ్వు రాస్తున్న కథల్లో
కనుమరుగైన సత్యాన్ని,
నువ్వు పలికే పైమినుకు మాటల ఇరుకుల్లో
ఊపిరాడని ఉపేక్షిత గీతాన్ని

అత్తరు వేసిన నీ ఆలోచనల తొక్కిసలాటలో
నూర్పిడి మిట్టనై నలిగిపోతున్నా…

ఒక్కసారైనా
నన్ను నువ్వుగా లోకానికి పంచు,
నువ్వు నువ్వుగా జీవించు
ఈ అలంకారాలన్నీ వొలిచి.

    
   

7అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Kiran September 1, 2010 3:25 pm

    రవి గారు,
    చాల బాగుందండి.
    మనిషిలోని లోపలి మనిషి పడే వ్యదను చక్కగా చెప్పారు.
    “అత్తరు వేసిన ఆలోచనలు”, “అలంకారాలన్నీ వొలిచి” బాగుంది.

  2. 2
    Venu Thiru September 1, 2010 5:26 pm

    Ravi,

    Fantastic Poem. WIth this, you have officially joined the band wagon of C. Narayana Reddy garu, Sri Sri garu, and other great Poets. God bless you.

    Venu Thiru.

  3. 3
    Srinivas Vuruputuri September 2, 2010 12:07 am

    “అదృశ్య చిత్రిక” అనే మాట కరెక్టేనా?
    చిత్రిక = “మ్రాను నునుపుపఱచెడు వడ్లవాని కొఱముట్టు, త్రోపుడు.” (శబ్దరత్నాకరము)
    चित्रिक [p= 397,3] [L=73990] m. (fr. चित्र्/आ) the month चैत्र L. (సంస్కృత నిఘంటువు నుంచి)

    [రచయిత కోరికపై ఈ పదాన్ని ‘చిత్రాన్ని’ గామార్చాము – సం.]

  4. 4
    chavakiran September 2, 2010 6:53 am

    కవితల క్వాలిటీ బార్ ఏమన్నా కిందికి దింపారా ఏమిటి ఈ మాట వారు 🙂

  5. 5
    Ramchandar Chebolu September 2, 2010 2:52 pm

    రవి,
    నాకు తెలియదు నీలో ఇంత కవిత్వం వుందని. చాలా బాగుంది.
    రామచంద్ర.

  6. 6
    Prasanna September 2, 2010 2:55 pm

    బాగుంది రవీ. ఇంకా వినాలని వుంది.

  7. 7
    Vamsi Krishna Prakhya September 9, 2010 1:59 am

    చాలా చక్కని-చిక్కని భావాన్ని కవితగా అందించినందుకు ధన్యవాదాలు. మంచి కవితల కోసం ఎదురుచూస్తున్న నన్ను పన్నీటి జల్లులా ఈ కవిత ఒక్కసారి తట్టిలేపింది. ప్రతి పాదంలోను అద్భుత ప్రయోగాలున్నాయి.

    అత్తరు వేసిన నీ ఆలోచనల తొక్కిసలాటలో
    నూర్పిడి మిట్టనై నలిగిపోతున్నా

    ఇది చాలా అద్భుతమైన ప్రయోగం.
    – వంశీకృష్ణ ప్రఖ్య

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • కుందాపన: కప్పతల్లి
  • మరింత దగ్గరికి
  • కుందాపన: చిన్నోడి అమ్మ
  • కుందాపన: రాత్రికి లోకువై
  • సముద్రాన్నవ్వాలంటే

ఇటువంటివే…

  1. ఘోష
  2. తెలుపు-నారింజ ఘోష
  3. గరళం
  4. ఇప్పుడెందుకిలా?
  5. నేనే కవిత్వాన్ని

సెప్టెంబర్ 2010 సంచికలో ...

  • ఆత్మ ఘోష
  • ఆర్ యూ రెడీ?
  • ఇప్పుడెందుకిలా?
  • ఈమాట సెప్టెంబర్ 2010 సంచికకు స్వాగతం!
  • కవితా సుమశరుడు తిలక్
  • గోరువంకలు
  • తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు
  • తిలక్ కథలు
  • తిలక్ జ్ఞాపకాలు: మరీ పాతవీ, ఆ తరవాతవీ
  • తిలక్ తో నా పరిచయం
  • తోడు
  • దీపఖేల
  • నాకు నచ్చిన పద్యం: మొల్ల రాకుమారుల వర్ణన
  • పూల పల్లకి
  • బందీ
  • మంచి కవి, మంచి స్నేహితుడు
  • మహామంగళప్రవచనము
  • మారుపేర్ల మాయువు
  • వెన్నెల – తిలక్ కవిత
  • శతకందసౌరభము: పరిచయం
  • శిఖరారోహణం
  • సామాన్యుని స్వగతం: మాకు తెలిసిన ప్రహేలిక
  • సుప్తశిల: నాటిక
  • “అమృతం కురిసిన రాత్రి” పై రారా సమీక్ష – ఒక ప్రతి విమర్శ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

గోరువంకలు
బందీ

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.