వెన్నెల – తిలక్ కవిత

వెన్నెల – తిలక్ స్వీయ కవితా పఠనం, 1965లో మొదటగా రికార్డు చేయబడి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం స్వర్ణోత్సవాల సందర్భంగా పునఃప్రసారం చేయబడింది.

సేకరణ: పరుచూరి శ్రీనివాస్


దేవరకొండ బాలగంగాధర తిలక్

రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ గురించి:

కవి, రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ (1921-1966). భావుకత, అభ్యుదయం వీరి కవిత్వంలో ముఖ్యలక్షణాలు. 1940ల్లో తిలక్ భావకవుల ప్రభావంతో ఛందస్సులోని పద్యాల్లో ఖండకావ్యాలు రాశాడు. గోరువంకలు, స్వయంవరం, ఆవాహన, వర్షా, మధువిరహం, శర్వరీప్రియ, ఆటవెలది, శ్రీ వివేకానందస్వామి, సీత-1, సీత-2, అద్వైతమాన్మధం, అమృతభావము వంటి ఖండకావ్యాలు రచించారు. తిలక్ ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది . భాష ఎంత మెత్తనిదో, భావాలు అంత పదునైనవి. సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో, సంఘ దురన్యాయాలపట్ల అంత క్రోధం. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ‘అమృతం కురిసిన రాత్రి ‘ ఉత్తమ కవితాసంపుటిగా 1971 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది.

 ...