నీరెండవేళ తేయాకు తోటలో రికామీగా తిరిగినట్టు,
సౌందర్యవతి ముఖాన్ని చంద్రోదయానికి అర్పించినట్టు,
చేప గగనాన్ని పలకరించి నదిలో మునిగినట్టు,
భూమి సారం పూలరేకుల్లా విప్పారి

గాయపడ్డ మాటలన్నింటినీ దాచుకుని
రెండు దోసిళ్ళలో నింపుకుని
మహానిశ్శబ్దాన్ని నిర్మించుకున్నాను

శాంతి మంత్రమేదో దొరికేంతలో
మళ్ళీ నువ్వు…

చూశాను..
దూరంగా ధవళాగ్ని కాంతి బింబాన్ని మోస్తూన్న మహాసముద్రాన్ని
తోటబాటలో నా పక్కన నడిచే నత్తని
అది మెల్లగా నడిచొచ్చిన దారి స్పటికంలా మెరవడాన్ని.

బీజమే వృక్షమై పెరిగి పెరిగీ మరల
ఆ వృక్షమై చిన్ని బీజమైనట్టుగా
లింగమందుదయించి లింగమందైక్యమై
పురాతనులుగ వెలుగు జంగముల సంగమును చూడరయ్యా!

వేదశాస్త్ర ఆగమ పురాణములెల్ల
తవుడు నూకల దంపుడే సుమీ!
దంచుటెందుకు? చెరుగుటెందుకు?
చెదిరే మనసును నిలుపగలిగిన
అంతా బట్టబయలు చెన్నమల్లికార్జునా!

ఆ లేఖలన్నీ చేరినప్పుడే కదా,
మన చుట్టూ అడవులు విస్తరించేది
అందరికీ నాలుగు వేళ్లూ నోట్లోకి పోయేది!

సంధ్య కొమ్మల మీద
సన్నాయి పాటలు
ఊపందుకున్నాయి
మంచు తెరల చాటుగా
మబ్బుల కళ్లు
తొంగి చూస్తున్నాయి

మరొక శరీరం ఉంటుంది
దీనికి అలుపు లేదు, ఆశాభంగం లేదు
వయసు లేదు, వృద్ధాప్యం లేదు
ప్రాణమై ప్రవేశించే ఒక పద్య పాదం కోసం
అనంత కాలం నిరీక్షిస్తుంది

గిరియందు గాక గడ్డిదిబ్బల మీద ఆడునా నెమలి?
కొలనులో గాక చిన్నికాల్వల నీరాడునా కలహంస?
మావిచిగుళ్ళు మెసవక మోమెత్తి పాడునా కోకిల?
పరిమళములు లేని పూలపై వ్రాలునా తుమ్మెద?
నా దేవుడు చెన్నమల్లికార్జునుని గాక నా మనసు
ఇతరుల నెట్లు చేరగలదో? చెప్పరమ్మా?

ఆకుల మధ్య ఖాళీల్లో ఇరుక్కుపోయిన సూర్యుడు పెరోల్ మీద పలకరింపుకొస్తాడు. అక్కడక్కడా కొన్ని గడపలకు చేతులు మొలిచి గాల్లో ఊగుతాయి. సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకునే తలుపు పాడే నిరసన పాటకు గోడలు దాచుకున్న నిశ్శబ్దం మట్టిబొమ్మ పగులుతుంది.

తియ్యని రాత్రి, నమ్మదగని
అసంగతం కాని రాత్రి
ఆకాశంలో చంద్రుడు
నిండుకున్నాడు.

ఎన్ని ప్రభూతులం గలవరింతల తాకితినో రవంత వి-
చ్ఛిన్నతలేని పున్నెముల శీతలపుంజము కోరి; యెంత కా-
వ్యాన్నమునాబ చేత ముఖమంతట కూరితినో, గురూక్తిగా
విన్న పురాకవీశ్వరుల వేదనలో, సిరిలో, ప్రపత్తిలో
మన్ననలో, గవేషణము మానక సల్పితినో; చికాకు లో-
గొన్న మనమ్ము గింజుకొన కూరిమి బల్మిని క్రుక్కికొంటినో

పూల మీది రంగుల్లా పుట్టాల్సినవాడివి
సీతాకోక రెక్కల నిశ్శబ్దంలా,
ఇంద్రధనువులోని చెమ్మగాలిలా,
అడవిచెట్ల నీడల్లా ఉండాల్సినవాడివి
ఇలా ఎందుకున్నావని దుఃఖపడతావు