బ్యాగ్‌ల నిండా తడిబట్టలు. దులుపుతుంటే రాలిపడుతోన్న ఇసుక. తప్పుకుంటుంటే చుట్టుకుంటోన్న సముద్రపు నీటి వాసన, నీచు వాసన. తీరంలో నా పాదాలను తడిపినట్టే తడిపి వెనక్కి పోయిన అలల్లా… సెలవులు. దేవుడా, మళ్ళీ ఎప్పుడు?

నువ్వొచ్చి నన్ను ఎలా చూస్తావు? ఏ రూపంలో?
మబ్బుల్లేని నక్షత్రం లాగానా, లేక నీళ్ళమీద పొరలాగా
అంచెలంచెలుగా తాకుతూ పరుగెత్తే చిల్లపెంకు లాగానా?
నీకు ఏదైతే బాగుండదో నాకు తెలుసు,
కోయిల కుహూ కుహూల మధ్య నిశ్శబ్దం, నీకు బాగుంటుంది.

తడబడే అడుగుల పసివాడి
పాదం తగిలితే చాలు
పుడమి తల్లి పుత్రవాత్సల్యంతో పులకిస్తుంది
రెండడుగులు తనవైపు నడిచి పలకరిస్తే చాలు
చుట్టాల్ని చూసిన చిన్నపిల్లలా
సముద్రం అరుస్తూ గంతులు వేస్తుంది

ఏది ఏ కాలమో తెలియదు
ఎవరు నీకోసమో కాదో తెలియదు
ఏ తూనీగలు నీపై ఎగిరిపోతాయో
ఎవరి కేరింతలు నీలో అలలై కదులుతాయో
ఏ తామరలూ కలువలు నీలో పులకించి
నిన్ను పగటినో రాత్రినో చేస్తాయో తెలియదు

ఎర్ర రాతి కొండల వెంబడి దిక్కుతోచక తిరుగుతూ
నా ప్రేమను కనుమలలో పాతిపెట్టేశాను.
ఆ క్షణంలోనేనా విముక్తి కోసం నువ్వు ప్రార్థనలు చేసింది?

ఆకాశంలో నీ రూపురేఖలతో మబ్బులు
నోళ్ళు తెరిచి నా వైపుకి అప్పుడప్పుడు దూసుకు వస్తాయి

కాశ్మీరు సైనికుడి రక్తమంటిన అరువు రాయి
అటవీ అధికారులపై ఎర్ర చందనం కూలీ రాయి
వాహన చోదకుని రక్తమంటిన నిర్లక్ష్యపు రాయి
స్థలాల దురాక్రమణల్లో కాళ్ళొచ్చిన రాయి
మృత కథలని మోస్తున్న చరిత్ర రాయి
మోసులెత్తిన ఆశలను మోస్తున్న పునాది రాయి

గొప్పులు తవ్వడానికి,
కలుపు తియ్యడానికి
కాల్వలు కట్టడానికి
పంటకొయ్యడానికి
ప్రయాసపడుతుంటాడు ఒక్కడే, ఒంటరిగా
వాడంటే మాత్రం ఎవరికీ పడదు
ఎవరికీ అర్థంకాని నల్లటి విషాదం వాడిది

పగవారి కుట్రో
బంధువుల గూడుపుఠాణో
రాజ్యభారం కోల్పోయి
బికారిలా తిరగసాగాడు రాజు
రాజభోగాలు పోయాయని చింతలేదు

ఈ చుట్టుకుచుట్టుకు పోతున్న
అల సొరంగమే అయితేనా
నువ్వూ నేనూ అందులో
ఒకళ్ళనొకళ్ళు అల్లుకుపోయి
పడుకుని…
ఎవరికి తెలుస్తుంది
సముద్రం హోరు

వాడు నాగరికుడు
వాడిక్కొంచం తేనీరు కావాలి
కూర్చున్న కుర్చీని
పెద్దమోతతో వెనక్కి తోసి లేస్తాడు
బాత్రూమ్ తలుపును
గట్టిగా తెరచి ఆపైన
ఢామ్మంటూ మూస్తాడు

ఆదిరప్పళ్ళి తలపోత తుంపరలకింద
వళ్ళంతా తడిసి ముద్దైన తీయటి కలలు
పిల్లల్లా తుళ్ళి ఆడటం మానేసి
పక్కపక్కనే పడుకున్న చెక్క గది కిటికీలోంచి
ఊగే వక్క చెట్లపై పడి వెన్ను విరిగిపోయాయి

ఆవల దూరంగా
విరిసిన ఇంద్రధనువోటి
నన్నిట్టే పట్టేస్తుంది
పరిగెట్టి పట్టాలని
నీవగుపడలేదని
వెతుకుతాను

చెక్కిళ్ళపై నీ పెదవుల
రాతలను వెతికిన
చెట్టు కొమ్మల్ని చిరుగాలి
తాకకుండా ముద్దాడిన
చేతిలో నీ ఉత్తరం
కాగితం పువ్వులా
రెపరెపలాడిన