రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

నెలబానిస

రచన: శ్రీకాంత్ గడ్డిపాటి
నవంబర్ 2019

ముఖం చూడు…
ముఖానికేం? ముఖారవిందం.
ముఖమా? అరవిందమా?
అరబిందెనా?
పూర్తి బిందెనా?
ఎటో వెళ్ళిపోతోంది మనసూ…
ఎందుకిలా బ్రో?
బ్రో…చే…వారెవరురా బ్రో…

అయిదొకటి. ఆరొకటి. పదకొండొకటి.
ఒక్కొక్కటి మహా ఇక్కట్టు.
డౌటు పడకు. డేటు మారరాదు. కట్టవలె.
అవునూ, అలహాబాదు బాంకు హిందీలో ఇలాహాబాదు బాంకు ఎట్లగును?
నేను కట్టను.
గట్టిగా అనకు. మెర్జయిపోతుంది.
కొండొకచో ఇట్లగును.
కాదు.
ఎప్పుడూ ఇంతే.
ఖాళీ బిందె.
జమా కీ గయీ రాశి నుండి ఆహరిత రాశి పోగా
ఖాతా శేషము దాదాపు నిశ్శేషము.

పదిహేనేళ్ళు, పంద్రా సాల్, ఫిఫ్టీన్ యియర్స్.
సృష్టిలో చేదయిన పదములేనోయీ
ఇంకోటి కలుపు వాటికి. ఒకే ఒక్కటి.
ఓన్లీ!
ఈఎమ్ఐ వదలని ప్రియమైన దయ్యమై…
మధ్యలోని దళసరి గీత క్రమంగా చెరిగిపోయి,
మోజే అవసరమై, ప్చ్!

నువ్వొక్కడివేనా?
బయటికి చూడు
ఎన్నో ముఖాలు
లోపల విలవిలా వలవలా
బయటకు తళతళా…
కదం తొక్కుతూ ఆన్‌లైన్లో
కిస్తీలన్నీ కట్టేస్తూ…

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నెలబానిస
  • ఒంటరి నవల: కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు

ఇటువంటివే…

  1. నో-బుల్ బహుమతి
  2. కవిత ఒకటి కొత్తది
  3. గమ్యం(?)
  4. ఒక నవ్వునొప్పి
  5. మౌనగీతి

నవంబర్ 2019 సంచికలో ...

  • ‘మంచి’ కథ
  • ఇంతింతైన ఇల్లేరమ్మ
  • ఇల్లేరమ్మకు చలవపందిరి
  • ఒక నవ్వునొప్పి
  • కొత్త పుస్తకాలకు స్వాగతం!
  • గడినుడి – 37
  • థాయ్‌లాండ్ యాత్రాగాథ – 4
  • ద్వాసుపర్ణా: అనువాద కవిత్వం
  • నవంబర్ 2019
  • నీడ
  • నెలబానిస
  • నో-బుల్ బహుమతి
  • ముఖం కడగని అందగత్తె
  • మూడు ముక్కలు
  • మౌనగీతి
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 37
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఇల్లేరమ్మకు చలవపందిరి
మూడు ముక్కలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.