రెండు చేతులు కౌగిలించుకునప్పుడు
వచ్చే కడియాల చప్పుడుతో
తరగతి గదులు నిద్రలేస్తుంటాయి
అక్కడ తలలు లేని సూత్రాలు
ప్రాణం లేని సమీకరణాలు
ఎందుకు పుట్టాయో తెలియని ప్రమేయాలు
జీవితాలను లోతుగా అధ్యయనం
చేస్తుంటాయి

పగటిరూపాల సాయంసంధ్యలో
సూర్యాస్తమయాన్ని కనబడనీకుండా
చీకటి తీరాల కావల నుంచి
కిటికీ దగ్గర చేరి
సంధ్యారూపాల పగటి నీడలను చూస్తూ
ఆ కొద్దిపాటి ప్రేమ రాకను తెలుసుకోనివ్వండి.

ఈడంత గంజి వార్సినట్టయితాందని
ఊరకుక్కలు ఓరసూపు జూత్తయి.
పలుకు మీదున్నప్పటి పదునే పదునని
పదిమంది గుడిసె సుట్టే కాపల గాత్తాంటరు.
గంజిలబడ్డ ఈగకు గాశారమా పాడా?
అని మొఖం జూసుకుంటనే గొణుగుతాంటరు.

మ‌ళ్ళీ క‌ల‌గంటాను.
మ‌నోహ‌ర‌మైన మ‌రీచిక‌ల‌ను,
మ‌రులుగొలిపే మ‌ధుమాసాల‌ను.

మ‌ళ్ళీ మ‌ళ్ళీ క‌ల‌గంటాను.
మధురాధ‌ర మంద‌హాసాల‌ను,
మ‌త్తిల్ల‌జేసే మ‌ల‌యానిలాల‌ను.

పద్యాల మీద
గుట్టలు గుట్టలుగా
పుట్టలు పుట్టలుగా
తుట్టెలు తుట్టెలుగా
పేరుకు పోయిన జ్ఞాపకాలు
జ్ఞాపకాలు పద్యాల్ని కొరుకుతూ

నుదుటిపై నవ్వే నాగేటి చాళ్ళ నుండి
గాలి ఈల నుండి, నీరెండ నుండి
మట్టివాసన నుండి, అట్టడుగు నుండి
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నాకోసం ఎదురు చూడు

చీకటి చీర
కొండచరియ అంచు
రాలుటాకులు కలంకారీ అద్దకాలు
కదిలే నీడలు ఎగిరేపైట
ఊగే ఊడలు చెరిగే కుచ్చిళ్ళు
లోయల ఒడి నిండుగ వనాలు జీవచరాలు

కౌగిలించుకు
బతుకునిచ్చే నవ్వూ, మాటా,
ప్రతి కొత్త కోరికా
నువ్వేనని
నీ తొలి అడుగుకై
ప్రతి పడిగాపూ నాదే

తుఫాను గుప్పిట దాగిన సముద్రాన్నీ
ఇంద్ర ధనువైన ఆకాశాన్నీ
ఒకేలా ప్రేమించగలనని నేనంటే
అసలు నీకు ప్రేమంటేనే తెలియదంటావ్

విచిత్ర రహస్యాల్ని దిగంబరం చేసి
బంతులాడుకుంటూ,
ఉప్పెన కోసిన తీరం మీద
విచ్చుకునే గ్రహణపు రాతిరిలోకి
జారవిడవడం తప్ప
కూరిమితో అది కోయిలై వాలిందెప్పుడు

చేపపిల్లని
గబుక్కున కరుచుకోవటానికి
ముక్కుని చాచి నుంచున్న కొంగల్లా మైకులు
ఎత్తైన గోడల గది నిండా
రకరకాల విదేశీ పెర్ఫ్యూముల రేగు పొదలు
ఎక్కడ కూచుంటావ్

నువ్వేం వినలేదులే
నేనేదీ గుర్తుంచుకోనులే
కలబోసుకున్న కథలిక్కడే వదిలి
గొంతులో చిక్కుబడ్డ
దిగుళ్ళన్నింటినీ గుటక వేసి
నడుద్దాం కాసేపు, లే!