కా.రా. కథలపద్ధతి వేరు. కా.రా. పేదలకంటే నిరుపేదల గురించి కథలు రాస్తాడు. అయితే మనుషులను మంచివారిగా గాని చెడ్డవారిగా గాని చూపడం అతడి కథాప్రయోజనం కాదు. మనిషి మంచివాడుగా గాని చెడ్డవాడుగా గాని ఎలా మలచబడుతున్నాడు మారుతున్నాడు అన్నది అతని కథావస్తువు.

జేన్ ఆస్టిన్ ‘నేను అందరిదాన్నీ’ అని ఏనాడూ చెప్పుకోలేదు కాని, అందరూ ఆమె తమకే చెందుతుందని అనుకున్నారు. తమ సిద్ధాంత పరిధుల్లోకి ఆమెను లాక్కువెళ్ళాలని ప్రయత్నించారు. ఆమె మరణించి రెండు శతాబ్దాలు గడిచినా, ఇప్పటికీ ఆమెను చర్చించుకుంటూనే ఉన్నారు. అందుబాటులో ఉన్న ఆరు నవలల్లోనూ లోతుల్ని వెతుకుతూనే ఉన్నారు.

సాహిత్యంలోగాని యితర కళలలోగాని ఉద్యమాలు ఆయాకాలాల జీవనదర్శనాలప్రభావంలో ఆవిర్భవిస్తాయి. కాని వాటితో పోవు. అస్తిత్వవాదం అనేక సాహిత్యోద్యమాలలాగే వచ్చింది, పోయింది. ఉద్యమం చరిత్రలో కలిసిపోతుంది, సాహిత్యం నిలిచి ఉంటుంది. నిలిచి ఉన్న అస్తిత్వవాద సాహిత్యపరిచయమే ప్రస్తుత ప్రయత్నం. వాదం గౌణము, సాహిత్యం ముఖ్యము.

1942లో జరిగిన దౌర్జన్యములకు కాంగ్రేసే ఉత్తరవాదులని గవర్నమెంటువారు నిందించగా గాంధిగారు కాదనిరి. రాజప్రతినిధి దర్శనమివ్వలేదు. ఆయన ఉపవసింపగా ఆయనకు ప్రాణాపాయకర పరిస్థితి కలిగెను. అంతట బ్రిటీషు ప్రభుత్వమువారాయనను 1944 సం. మే 6వ తేదీన చెరసాల నుండి వదిలివేసిరి.

రాతియుగంలో సహజసిద్ధంగా లభించే లోహపు కణికలు మానవుడి కంటికి కనబడినప్పుడు వాటిని పదిలంగా భద్రపరచి ఉంటాడు. ఆకుపచ్చగా ఉండే తామ్ర కర్బనితం రాళ్ళనీ, నల్లగా ఉండే అంజన గంధకిదము రాళ్ళనీ గుండ చేసి ఈజిప్టులోని పురాతన రాజవంశీయులు సౌందర్య సామగ్రులుగా ఉపయోగించినట్లు దాఖలాలు ఉన్నాయి.

వ్యాకరణ రచనలో కేతన లాఘవం, అది కూడా తేలిక తెలుగు మాటలలో అప్పటికీ ఇప్పటికీ కూడా ఏ వ్యాకర్తలోనూ కనిపించదనిపిస్తుంది. అందువల్లనే చిన్న చిన్న మాటలలో, చిన్న కంద పద్యంలో కేతన తెలుగు క్రియా స్వరూపాన్ని వర్ణించిన తీరుకు తెలుగు వ్యాకరణాలను, భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేసే వారందరూ కూడా ఆనందిస్తారు.

ఇలా మానవాతీత శక్తులు లేవని, అవి మన ఊహాజనితాలనీ చెప్పడం వల్లనే కాబోలు 20, 21వ శతాబ్దుల్లోనూ ఆన్ రాడ్‌క్లిఫ్ ఒక సంచలన రచయిత్రిగా సాహిత్యవేత్తల మన్ననను పొందుతోంది. ఇది మౌలికంగా సెంటిమెంటల్ నవలే. కానీ అందులో సస్పెన్స్‌నూ, థ్రిల్‌నూ పొందుపరచడంలో ఆన్ రాడ్‌క్లిఫ్ చూపిన ప్రతిభ వల్ల ఇది ఒక అసాధారణ రచన అయింది.

హాప్కిన్స్ విక్టోరియాయుగపు వాడు. టెన్నిసన్, బ్రౌనింగ్, స్విన్‌బర్న్‌లకు సమకాలికుడు. కాని కవిగా వాళ్ళలో చేరడు. అతడు యిరవయ్యవ శతాబ్దపు ఆధునిక కవి. ఎలియట్ తన గురించి అన్నాడు: తాను ఆధునికుల్లో పురాతనుడు, పురాతనుల్లో ఆధునికుడు అని. హాప్కిన్స్ ఆంగ్లోశాక్సన్ మూసలోని ఆధునికుడు.

సూర్యోదయం మొదట్లో పొడవుగా సాగిన నీడ మధ్యాహ్నం సూర్యుడు నెత్తిమీదకు వచ్చే వేళకి చిన్నదవుతూ, మళ్ళీ పొడవుగా సాగుతుందన్న విషయం మనకు తెలుసు. కనుక నీడ పొడవును బట్టి, అది మధ్యాహ్నమైతే, ఇంకా సూర్యాస్తమయానికి 7 గడియల పొద్దు ఉందనీ, అదే ఉదయపు నీడ అయితే, సూర్యోదయం అయి 7 గడియల పొద్దు అయిందనీ తెలుసుకోవచ్చు.

త్రిభంగి అంటే మూడు భంగములు గలది. భంగము అంటే ఇక్కడ విఱుపు. అనగా పాదము స్పష్టముగా మూడు విఱుపులతో నుండాలి. ఈ విఱుపులకు అంత్యప్రాస కూడ ఉంచుట వాడుక. సామాన్యముగా మూడు అంత్యప్రాసలు ఉంటాయి. ఈ త్రిభంగి పుట్టు పూర్వోత్తరాలు సరిగా తెలియవు.

తెలుగులో ఈ సమాసాలకు సంబంధించిన అవగాహనంతా సంస్కృతం నుండి తెచ్చుకున్నదే. అందువల్ల పాఠశాల స్థాయినుండి స్నాతకోత్తర స్థాయివరకూ సమాసాల కన్నా వాటి సాంకేతికపదాల విషయంలోనే విద్యార్థులు ఇబ్బందులు పడుతూండటం గమనార్హం. కేతన ఇచ్చిన నిర్వచనం చిన్నయసూరి పై నిర్వచనం కన్నా సులభంగా అర్థమవుతూందన్నది ఎవరైనా నిర్వివాదంగా అంగీకరించాల్సిందే.

ఎవరయినా పెద్ద ఆర్టిస్ట్ చనిపోగానే తెల్లారి కాగితపు పేపర్లకు కార్టూనిస్టులు వేసే బొమ్మలలో ఆ సదరు చిత్రకారుడు ఒక సంచి తగిలించుకుని మేఘాల మధ్య స్వర్గమో ఇంకే శ్రాద్ధమో అనే ఒక పిండాకూడు ద్వారం దగ్గరికి వెడుతుంటాడు కదా, అటువంటి బొమ్మలని చూసినపుడల్లా మాకిరువురికి ఎక్కడ కాలాలో అక్కడ కాలేది.

బోద్‌లేర్ అసాధారణకవి. అతడికి ఖ్యాతి అపఖ్యాతి కూడా అమితంగా లభించాయి. అపఖ్యాతిలో కొంత అతడు కోరి తెచ్చుకున్నదే. అతని అపఖ్యాతికి ప్రధానకారణం అతడి అద్భుత కవితా శిల్పాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం చేయకపోవడం వల్లనే. ఆ రచనా శిల్పాన్ని కొంతైనా ఆవిష్కరించే ప్రయత్నమే యీ వ్యాఖ్య.

మేరీ ఉల్‌స్టన్‌క్రాఫ్ట్ నవలల కంటే ముందు రాసిన నాలుగు గ్రంథాలూ స్త్రీల విద్యకు పెద్ద పీట వెయ్యడంతో పాటు, సామాజిక, రాజకీయ వ్యవస్థల్లో ఆధిపత్యాన్ని ప్రశ్నించేవే. వ్యక్తి స్వాతంత్ర్యాన్నీ, సమానత్వాన్నీ సమర్ధించేవే. ఒక్క ఫ్రెంచి విప్లవం నేపథ్యంగా ఆమె రాసిన మూడు రచనలూ పెద్ద ప్రకంపనలకు దారి తీశాయి.

కథ చదివేప్పుడు పాఠకుడికి ట్రెజర్ హంట్ లాంటి అనుభవం కలిగిస్తాడు రచయిత. కొన్ని క్లూలు అక్కడక్కడా ఉంటాయి. వాటిని వెతికి పట్టుకోవటం పాఠకుడి పని. పట్టుకున్నాక వాటితో కథను మళ్ళీ పునర్నిర్మించుకోవాల్సి వస్తుంది. కొందరికది ఇష్టమయితే మరికొందరికి కష్టం.

వరరుచి అన్న పేరు నన్ను ఎప్పటి నుండో వెన్నాడుతోంది. ముఖ్యంగా పగటిపూట సూర్యుడున్నప్పుడు మననీడ ప్రమాణాన్ని బట్టి, రాత్రిపూట నడి నెత్తిన ఉన్న నక్షత్రాన్ని బట్టీ సమయాన్ని తెలుసుకుందుకు అతను కొన్ని గణితవాక్యాలు చెప్పాడని తెలుసుకున్న దగ్గరనుండీ ఈ వరరుచి మీద మరింత కుతూహలం కలిగింది.

వ్యాకరణ రచనల్లో సంజ్ఞ (వర్ణాక్షరాల, పదాల పరిచయం), సంధి తర్వాత చెప్పే అంశం ‘విభక్తి’, ‘విభక్తి’ నామాలకు సంబంధించింది. వాక్యాలలో అర్థం బోధపడేందుకై పదాల మధ్య సంబంధాన్ని తెలుపుతూ దోహదపడేవి విభక్తులు.

ఈలోపు ఘాజీయుద్దీనుగారు ఢిల్లీ దర్బారు చక్రవర్తిగారి వజీరు మొదలయినవారి వలన దక్కనుసుబేదారీకి తానొక అధికారపత్రమును సంపాదించి తరలివచ్చుచున్నారని వార్తయొకటి వ్యాపించెను. అంతట సలాబతుజంగుగారు గోలకొండనుండి తక్షణమే బయలుదేరి ఔరంగాబాదు నగరమునకు పోయి అక్కడనుండుటకు నిశ్చయించిరి.

ప్రతి వృత్తమునకు ఒక విలోమ వృత్తము గలదు. అవి రెండు ఆ ఛందపు సంపూర్ణత్వమును సూచిస్తాయి. సంస్కృతములో పద్యపు పాదము గుర్వంతము. కాని ద్రావిడ భాషలలో దేశి ఛందస్సులో పాదములు ఎక్కువగా లఘ్వంతములు. ఇది విలోమ గీతులలో ప్రస్ఫుటము.

సాహిత్యంలో ప్రగతి ఉండదు, విజ్ఞానశాస్త్రంలో వలె. కవికి సమాజం పట్ల ప్రత్యక్ష బాధ్యత ఉండదు, అంటాడు ఎలియట్. అతని బాధ్యత భాషకే. తన సాటివారి భాషను స్వీకరించి, దానిని శుద్ధిచేసి, కావ్యయోగ్యంగా తీర్చి దిద్దడమే ప్రజల పట్ల కవి పరోక్షబాధ్యత.