అసలు దయ్యాలు, సైతానూ అన్నవే లేకపోతే, క్రీస్తుమతం పొడిపొడిగా రాలిపోతుంది; ఏళ్ళబట్టి అబద్ధాలూ పొరపాట్లతో, అసత్యాలతో, అద్భుతాలూ వింతలతో, రక్తపాతంతో, అగ్నిజ్వాలలతో, అనాగరిక ప్రపంచం నుండి ఎరువు తెచ్చుకున్న కల్పిత కథలతో మన పూర్వీకులు, పోపులు, ఫాదరీలు, వేదాంతులు, క్రైస్తవం పేరుతో నిర్మించిన భవనం నామరూపాలు లేకుండా కుప్పకూలిపోతుంది.
రచయిత వివరాలు
పూర్తిపేరు: Robert G Ingersollఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
Robert G Ingersoll రచనలు
ఒక్క ధర్మతత్వశాస్త్రం బోధించే పాఠశాలలలోనే ఒక ఆచార్యుడికి తన మతవిశ్వాసాలకి విరుద్ధంగా ఒక వాస్తవం కనిపిస్తే, దాన్ని అతను గోప్యంగానైనా ఉంచాలి, లేదా దాని ఉనికిని నిరాకరించాలి. లేకపోతే అతను తన పదవిని కోల్పోవలసి వస్తుంది. సత్యప్రకటన నేరం, పిరికితనం. కానీ, ఆత్మవంచన మాత్రం ఒక సుగుణం.
కొత్త నిబంధనల గ్రంథం ప్రకారం, నమ్మిన వాళ్ళకి క్రీస్తు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానమే ఋజువుగా చలామణీ అవుతోంది. క్రీస్తు ఈ వాగ్దానాన్ని చేస్తున్న సమయంలో, ఆత్మశుద్ధిగల, నిజాయితీ పరులైన, స్వేచ్ఛగా ఆలోచించగల వ్యక్తుల నైతిక ప్రవర్తనని మరిచిపోయైనా ఉండాలి, నిర్లక్ష్యం చేసి అయినా ఉండాలి, లేదా తిరస్కారభావంతో చూసైనా ఉండాలి.
అన్ని వాదనలకీ ముగింపుగా, అంతకుమించి చెప్పడానికి ఏమీ లేదన్నట్టు చివరకి ఇలా చెప్పేవాడు: ‘ఈ సరఫరా-గిరాకీ అన్న నియమం భగవంతుడు ఏర్పాటు చేసినది. మనం ఊహించగలిగిన అన్ని సందర్భాల్లోనూ ఈ నియమం పని చేస్తుంది. ఈ నియమమే శ్రమకి తగిన ధరని కూడా నిర్ణయిస్తుంది. దీనికి తిరుగు లేదు. ఈ ఆచరణావిధానం నచ్చని వాళ్ళు తమ స్వంత ప్రపంచాలను నిర్మించుకోవచ్చు.’
మీరు అడగవచ్చు ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానని. నా సమాధానం: ప్రకృతి ఎలాగో, బైబులూ అలాగే. ప్రతి పాఠకుడికీ అది ఒక్కొక్క కథ చెబుతుంది. అయితే, చదివే మనిషి మనిషికీ బైబుల్ మారిపోతుందా? అవును. బైబుల్ ద్వారా దేవుడు ఇద్దరు వ్యక్తులకు ఒకే సందేశాన్ని ఇవ్వగలడా? ఇవ్వలేడు. ఎందుకని? ఎందుకంటే, ఏ వ్యక్తి చదువుతాడో ఆ వ్యక్తే స్ఫూర్తి.
కళ కేవలం తనకోసమే తాను ఉంటుంది. ఎప్పుడైతే కళాకారుడు ఈ సత్యాన్ని విస్మరించి, తన కళ ద్వారా మానవాళికి సందేశం ఇవ్వాలని ఉబలాటపడతాడో అప్పుడతను కేవలం ఒక ప్రబోధకుడు మాత్రమే. తన కళ ద్వారా సామాజిక నైతికతను నిర్దేశించి, అమలుచేయాలని తపనపడతాడో అప్పుడతను కేవలం ఒక తార్పుడుగాడు మాత్రమే.