రచయిత వివరాలు

అరవింద పిల్లలమఱ్ఱి

పూర్తిపేరు: అరవింద పిల్లలమఱ్ఱి
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://aravinda.aidindia.org/
రచయిత గురించి: చిన్నప్పటినుండీ అమెరికాలో పెరిగి తెలుగు సాహిత్యంపై పరిశోధన సాగించిన ప్రవాసాంధ్రులలో అరవింద మొట్టమొదటి వ్యక్తి. AID సంస్థాపకుడైన తన భర్త రవి కూచిమంచితో తో పాటు 1998లో ఇండియా వెళ్ళి ఆ సంస్థ ఎన్నో కొత్త కార్యక్రమాలను రూపొందించి, విజయవంతంగా పూర్తి చేయడంలో క్రియాశీలక పాత్ర వహించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛంద కార్యక్రమాలు నడుపుతూ, అడపాదడపా చేసే రచనల ద్వారా తమ ఆశయాలకు గొంతునివ్వడం ఈ దంపతుల వృత్తి, ప్రవృత్తి.

 

ఆడ వాళ్ళు కొన్ని చదవకూడదు, కొన్ని నేర్చుకోకూడదు. ఎందుకు? గుడి లో ఇంత వరకే వెళ్ళచ్చు దాటి లోపలకి వెళ్ళకూడదు. ఎందుకు? పూజారి అవటానికి అర్హులు కారు… ఎందుకు? అని అడిగితే ఇచ్చే జవాబుల్లో మొదటిలో కాని, చివరిలో కాని, మొత్తానికి ఒకే విషయం వచ్చేది: “ముట్టు.”

కాని, మనం మాట్లాడే నాలుగోవంతు, పదోవంతు తెలుగైనా ఆ సంభాషణలు ఇంగ్లీష్‌ లో కుదరవు. కొన్ని నాజుకైనా భావాలు, పలకరింతలు, ఆప్యాయతలు తెలుగు పదాలలో మాత్రమే చెప్పగలుగుతాము. అవి లేకపోతే విషయాలు తెలపగలము, కాని అల్లం పచ్చిమిరపకాయ లేని పెసరట్టు లాగా చప్పగా ఉంటుంది.