నాకెందుకు చూపవు నీ ముఖము?
వనమెల్లయు నీవే, దేవా, వనమందలి తరువెల్లా నీవే
తరులందాడెడు ఖగమృగమెల్లా నీవే
చెన్నమల్లికార్జునా, సర్వభరితుడవైన నీవు
నాకెందుకు చూపవు నీ ముఖము?
వనవెల్లా నీనె, వనదొళగణ దేవ తరువెల్లా నీనె,
తరువినొళగాడువ ఖగమృగవెల్లా నీనె.
చెన్నమల్లికార్జునా,సర్వభరితనాగి
ఎనగేకె ముఖదోరె?
(361)
చూడలేదా, మీరు చూడలేదా?
చిలిమిలి అని పలుకు చిలుకలారా!
చూడలేదా, మీరు చూడలేదా?
స్వరమెత్తి పాడేటి కోకిలలారా!
చూడలేదా, మీరు చూడలేదా?
రేగి తిరిగేటి తుమ్మెదలారా!
చూడలేదా, మీరు చూడలేదా?
కొలనిని ఆడేటి కలహంసలారా!
చూడలేదా, మీరు చూడలేదా?
గిరిగహ్వరమునాడు నెమలులారా!
చూడలేదా, మీరు చూడలేదా?
చెన్నమల్లికార్జునుడెచట నుండెనో
చెప్పలేరా, మీరు చెప్పలేరా?
చిలిమిలి ఎందు ఓదువ గిళిగళిరా,
నీవు కాణిరె, నీవు కాణిరె.
సరవెత్తి పాడువ కోగిలెగళిరా,
నీవు కాణిరె, నీవు కాణిరె.
ఎరగి బందాడువ తుంబిగళిరా,
నీవు కాణిరె, నీవు కాణిరె.
కొళనతడియొళాడువ హంసెగళిరా,
నీవు కాణిరె, నీవు కాణిరె.
గిరి గహ్వరదొళగాడువ నవిలుగళిరా,
నీవు కాణిరె, నీవు కాణిరె.
చెన్నమల్లికార్జుననెల్లిద్దహనెందు హేళిరె.
(204)
పిలిచి చూపించరే?
అళిసంకులమా, ఓ మామిడితరువా!
ఓ తెలివెన్నెల, ఓ కోకిల గణమా!
మీ అందరినీ నే వేడేదొక్కటే
నా ఒడయడు చెన్నమల్లికార్జున దేవుని చూచిన
నను పిలిచి చూపించరే?
అళిసంకులవె, మామరవె,
బెళుదింగళె, కోగిలెయె
నిమ్మనెల్లరనూ ఒంద బేడువెను.
ఎన్నొడెయ చెన్నమల్లికార్జునదేవ కండడె
కరెదు తోరిదె.
(51)
రాకూడని భవములందు వచ్చితినమ్మా!
చిచ్చులేని సెగలోన వేగితి నమ్మా!
రేగనట్టి గాయముచే నొగిలితి నమ్మా!
సుఖములేని శ్రమము నే చేకొంటినమ్మా!
చెన్నమల్లికార్జున దేవుణ్ణి వలచి
రాకూడని భవములందు వచ్చితినమ్మా!
కిచ్చిల్లద బేగెయల్లి బెందెనవ్వా.
ఏరిల్లద గాయదల్లి నొందెనవ్వా.
సుఖవిల్లదె ధావతిగొండెనవ్వా.
చెన్నమల్లికార్జునదేవంగొలిదు
బారద భవంగళల్లి బందెనవ్వా.
(166)
మనసులోని మనసు వాడు
తనువనువాయెను, మనసనువాయెను,
ప్రాణము కూడా సిద్ధమాయెను.
కినిసి రాడాయెను కిచ్చుకంటివాడు
నా ప్రాణములో నున్నవాడు, మనసులోని మనసు వాడు
నా దేవుడు చెన్నమల్లికార్జునుని గానక
నేనెట్లు బ్రతుకుదునయ్యా?
తనువనువాయిత్తు, మనవనువాయిత్తు,
ప్రాణవనువాయిత్తు.
మునిదు బారద పరి ఇన్నెంతు హేళా?
ఎన్న ప్రాణదల్లి సందు, ఎన్న మనక్కె మనవాగి నింద
ఎన్న దేవ చెన్నమల్లికార్జునన కాణదడె
ఆనెంతు బదుకువెనయ్యా.
(214)
నిను కొఱలుచు మైమరిచి యుంటి!
పగలు నాలుగు జాములు నీ కలవరమున నుంటి
రేయి నాల్గు జాములు లింగవికలావస్థ నుంటి
రేబవళ్ళు నిను కొఱలుచు మైమరిచి యుంటి
చెన్నమల్లికార్జునయ్యా, నీ వలపు కొరకు
ఆకలి దప్పులు, నిద్రయు తొఱగితినయ్యా!
(కొఱలు= కోరు; తొఱగు= తృణీకరించు)
హగలు నాల్కు జావ నిమ్మ కళవళదల్లిప్పెను.
ఇరుళు నాల్కు జావ లింగద వికళావస్థెయల్లిప్పెను.
హగలిరుళు నిమ్మ హంబలదల్లి మైమరెదొరగిప్పెను.
చెన్నమల్లికార్జునయ్యా,
నిమ్మ ఒలుమె నట్టు హసివు తృషె నిద్రెయ తొరెదెనయ్యా.
(404)
చిటచిట నిప్పులు రేగిన …
చిటచిట నిప్పులు రేగిన
నా ఆకలి తీర్చుట కనుకొందును!
ఫెళఫెళ మొయిళ్ళు కురిసిన
నా స్నానము కొరకే ననుకొందును!
తొటతొట రాళ్ళే పడిన
నాపై రాలిన పుష్పములనుకొందును!
చెన్నమల్లికార్జునయ్య!
గిరగిర శిల గిరినుండి జారి
శిరమున బడుచో
నా ప్రాణమే నీకర్పితమనుకొందును!
కిడికిడి కెదరిదడె ఎనగె
హసివు తృషెయడగిత్తెంబెను.
ముగిలు హరిదు బిద్దడె
ఎనగె మజ్జనక్కెరెదరెంబెను.
గిరి మేలె బిద్దడె ఎనగె పుష్పవెంబెను.
చెన్నమల్లికార్జునయ్యా,
శిర హరిదు బిద్దడె ప్రాణ నిమగర్పితవెంబెను.
(167)
అక్కా, నేనొక్క కలగంటి!
అక్కా, వినవే, నేనొక్క కలగంటి
ఆకు వక్కలు ప్రాలు టెంకాయలను గంటి
చిటిపొటి జడలతో తెలిపళ్ళ గురువును
భిక్షకై వాకిలిని నిలిచిన దొరను
మిక్కిలి మీరిన మక్కువతో చేపట్టితిని!
చెన్నమల్లికార్జునుని చెలువము జూచి
కన్నులు తెరచితిని! నేను కన్నులు తెరచితిని!
అక్క కేళౌ, నానొందు కనస కండె.
అక్కి అడకె ఓలె తెంగినకాయ కండె.
చిక్క చిక్క జడెగళ సులిపల్ల గొరవను
భిక్షక్కె మనెగె బందుద కండెనవ్వా.
మిక్కు మీరి హోహన బెంబత్తి కైవిడిదెను.
చెన్నమల్లికార్జునన కండు కణ్దెరెదెను.
(12)
కనుల కఱవు తీరిపోయె నేడు
పొలయు కెంజడలు
మణిమకుట మొప్పెడు పలువరుసయు
నగుమొగముతో కనుల కాంతి గలిసి
ఈరేడు భువనములకే
వెలుగైన దివ్యరూపము గంటిని
కన్న కనుల కఱవు తీరిపోయెను నేడు
గండరగండులను పెండ్లముగ నేలేటి
గఱువనే కంటి నేను!
జగదాదిశక్తితో జతకూడి జగమేలు
పరమగురువైనట్టి
చెన్నమల్లికార్జునుని నెఱవుగని బ్రతికితి నేను!
హొళెవ కెంజెడెగళ, మణిమకుటద, ఒప్పువ సులిపల్గళ,
నగెమొగద, కంగళ కాంతియ,
ఈరేళు భువనవ బెళగువ
దివ్యస్వరూపన కండె నాను.
కండెన్న కంగళ బర హింగిత్తెనగె.
గండగండరెల్లర హెండిరాగి ఆళువ
గరువన కండె నాను.
జగదాది శక్తియొళు బెరసి
మాతనాడువ పరమగురు
చెన్నమల్లికార్జునన నిలవ కండు బదుకిదెను.
(429)
వలచిన దాననవ్వా!
నా మనసునే మాఱుకొనెనవ్వా!
నా తనువునే చూఱగొనెనవ్వా!
నా సుఖమునే సందుకొనెనవ్వా!
నా మనికినే ప్రాపుగొనెనవ్వా!
చెన్నమల్లికార్జునుని వలచినదాననవ్వా!
(మాఱుకొను=ఎదురుకొను; సందుకొను=స్వీకరించు; ప్రాపుగొను=అండగొను, ఆశ్రయించు)
ఎన్న మనవ మారుగొండనవ్వా,
ఎన్న తనువ సూరెగొండనవ్వా,
ఎన్న సుఖవనొప్పుగొండనవ్వా,
ఎన్న ఇరవనింబుగొండనవ్వా.
చెన్నమల్లికార్జునన ఒలుమెయవళాను.
(101)