అల చిట్లిన క్షణాలు

పేరుని చుట్టుకుని
మోహపు పొరలు

మాయకత్వం దాచలేక
అద్దాల అవస్థ

వికల స్వప్న తీరాన
గాజుకళ్ళ గవ్వలు

మృతనగర వీధుల్లో
మారకపు ఆత్మలు

ఆకలితీర్చే
పాచిపట్టని అక్షరాలెక్కడ?

మురుగు నీడలు చెరిపే
తాజా దివిటీలెక్కడ?

పారిపోవాలనుంటుంది, కానీ
ఏ ఋతువులోకి, ఏ రంగుల్తో…
ఏ కాలంలోకి, ఏ దేహంతో…

తారీఖులు మింగేసిన కాలంలో
గుర్తున్నవి మాత్రం
ఘనీభవించిన కొన్నిసమయాలే.

తీరమంతా ఆరేసిన బతుకులో
జీవించినది మాత్రం
అల చిట్లిన కొద్ది క్షణాల్లోనే…