గడినుడి – 83 సమాధానాలు

అడ్డం

  1. లోహాలకు పట్టే మురికి
    సమాధానం: చిలుము
  2. దురద
    సమాధానం: కండూతి
  3. రహస్యం
    సమాధానం: గుంభనం
  4. ఆశ్చర్యము
    సమాధానం: వెరగు
  5. వాయుపుత్రుల చేతిలో ఆయుధం
    సమాధానం: గద
  6. చివరి అక్షరం లేకపోయినా ఆడపడుచు మారదు
    సమాధానం: కూతు
  7. రోటీలు కాల్చే పొయ్యిని గజిబిజి చెయ్యడం పాపం
    సమాధానం: దురితం
  8. కడుపు ఖాళీ అవడానికి వైద్యుడిచ్చేది
    సమాధానం: ఎనిమా
  9. చేతి నడిమివేలితో వేసే బాణ విశేషము
    సమాధానం: కర్ణిక
  10. గిరిజనులు చేసే సాగు పద్ధతి
    సమాధానం: పోడు
  11. సంతాపం
    సమాధానం: వగ
  12. అనేక ప్రవాహముల కలయిక
    సమాధానం: వేణి
  13. బరువు ప్రమాణం
    సమాధానం: కిలో
  14. అటువైపు నుంచి ఉన్న సోపానం
    సమాధానం: ట్టుమె
  15. కర్రతో నమస్కారం చేయండి
    సమాధానం: దండం
  16. విప్లవ మార్గం
    సమాధానం: పోరుబాట
  17. ….నేను చెప్పొచ్చేది ఏమిటంటే
    సమాధానం: ఏతావాతా
  18. గాదె
    సమాధానం: కోష్ఠం
  19. తోడబుట్టిన వాడు
    సమాధానం: భ్రాత
  20. ఆకాశం
    సమాధానం: నభం
  21. కలహం
    సమాధానం: తంపి
  22. సాకు
    సమాధానం: మిష
  23. దగ్ధమగు
    సమాధానం: మాడు
  24. జ్ఞాతి
    సమాధానం: దాయాది
  25. వంగుట
    సమాధానం: నమనం
  26. చెక్క
    సమాధానం: కలప
  27. ఆటలో గెలిచి టీ తాగేది
    సమాధానం: కప్పు
  28. కొమ్ము బూర
    సమాధానం: బాకా
  29. లోహపు పొడి
    సమాధానం: రజను
  30. పాపం
    సమాధానం: కిల్బిషం
  31. మార్గం
    సమాధానం: తెరువు
  32. ఇంటి పని మేస్త్రీ గోడపక్కన ఏర్పాటి చేసుకునే మెట్లు
    సమాధానం: సారవ

నిలువు

  1. విచిత్రవీర్యుడి అన్న
    సమాధానం: చిత్రాంగదుడు
  2. ఆణిపూస
    సమాధానం: ముక్త
  3. దడ
    సమాధానం: కంపం
  4. శివుడి వాహనం
    సమాధానం: నంది
  5. వేడిమి
    సమాధానం: వెట్ట
  6. సామెత
    సమాధానం: గురుతుమాట
  7. ఒడ్డు
    సమాధానం: దరి
  8. సుందరకాండలో హనుమంతుడిని మింగజూసిన ఒక రాక్షస స్త్రీ
    సమాధానం: సింహిక
  9. గడ్డి గాదము
    సమాధానం: గరిక
  10. సన్నగా ఈ రాగాలు తీస్తుంటారు కొంతమంది
    సమాధానం: కూని
  11. పసుప్పచ్చటి పూలు పూసే గోశ్రేణి
    సమాధానం: తంగేడు
  12. నీటి మార్గం
    సమాధానం: కాలువ
  13. పావని పిడిగుద్దుతో కూలిన లంకాధిదేవత
    సమాధానం: లంకిణి
  14. తెలంగాణా యాదాద్రి జిల్లాలో ఒక ఊరు
    సమాధానం: ఎల్లంకి
  15. మూసలో పోసిన పోతన విగ్రహం
    సమాధానం: పోతపోసిన
  16. కయ్యల మధ్య అడ్డం
    సమాధానం: గట్టు
  17. ప్రార్థించం
    సమాధానం: వేడం
  18. సత్య హరిశ్చంద్రుని కొడుకు
    సమాధానం: లోహితాస్యుడు
  19. ఆగ్రహించిన వాడు
    సమాధానం: కోపి
  20. కుతూహలము
    సమాధానం: తమి
  21. విరుపు
    సమాధానం: భంజనం
  22. దంతం అయితే 26 అడ్డం సమూహము
    సమాధానం: తండము
  23. శిలతో లాగు
    సమాధానం: షరాయి
  24. ఒక కొలత
    సమాధానం: మానిక
  25. ఈ స్తోత్రం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం
    సమాధానం: కనకధార
  26. ఈ చెక్క ఒక మసాలా దినుసు
    సమాధానం: దాల్చిన
  27. దిశకో ఏనుగు
    సమాధానం: దిగ్గజం
  28. శరప్రవాహం
    సమాధానం: అంపకాలువ
  29. నేర్పుగా మార్పు చెందిన మరుపు
    సమాధానం: మప్పు
  30. తిరగబడిన బాలిక
    సమాధానం: లబా
  31. బంకతో చేరితే పైరు తెగులు
    సమాధానం: పేను
  32. క గుణింతంలో నెమలి
    సమాధానం: కేకి
  33. కడుపులో ఉండేదాని రూపాంతరం
    సమాధానం: ప్రేవు
  34. పైకి వచ్చిన స్నేహం చివర లేదు
    సమాధానం: వాసా