గడినుడి సమాధానాలు – 63

అడ్డం

  1. ఖడ్గధారి (5)
    సమాధానం: కటారికాడు
  2. పుణ్య క్షేత్రంలో రేగుచెట్టు (3)
    సమాధానం: బదరి
  3. అవతారపురుషుడిని ఎలాగైనా మనువాడు (4)
    సమాధానం: వామనుడు
  4. బూజులుపట్టిన రంగవల్లులు (3)
    సమాధానం: ముగ్గులు
  5. అంతా వట్టిదే కానీ అతి చేరితే అధికము (3)
    సమాధానం: రిక్తము
  6. టిట్టిభము అంటే ఇదే (4)
    సమాధానం: లకుముకి
  7. ముప్పైమూడు అడ్డానికి ముందొచ్చే ఇరవైనాలుగు (2)
    సమాధానం: భోగి
  8. దిక్కులకు నడిమిచోటు ఆటంకము (5)
    సమాధానం: అభ్యంతరము
  9. పంతొమ్మిదిలోనే మునిగితేలేవాణ్ణి ఇలాగంటారు కాబోలు (6)
    సమాధానం: వ్యసనపరుడు
  10. కటిక చీకటిలో సంతోషాన్ని మొదటి మద్దెలమ్రోత భంగపరిచింది (5)
    సమాధానం: సంతమసము
  11. పదిహేనైనా, ముప్పైమూడు అడ్డమైనా, ముప్పైఎనిమిదైనా, ఏడైనా ఇదే (3)
    సమాధానం: పండుగ
  12. ఆకాశంలో ఎగురుతుంది కానీ పక్షి కాదు (5)
    సమాధానం: గాలిపటము
  13. కేవలం ఆదికావ్యం లో ఒక అక్షరంవదిలేస్తేనే ఈ కాలం (6)
    సమాధానం: ఉత్తరాయణము
  14. మూడు ఇళ్ళుగల శత్రువా? కాదు, శివుడు (5)
    సమాధానం: త్రిపురవైరి
  15. జ్యోతి ధరించే పొట్టి కంచుకము (2)
    సమాధానం: రవి
  16. ప్రదోషం అంటే ఋషి మైల? (4)
    సమాధానం: మునిమాపు
  17. ఒకటీ ముప్పైమూడు నిలువూ కలిస్తే వచ్చే ఇరవైనాలుగు (3)
    సమాధానం: సంక్రాంతి
  18. తెలివైనవాడి చిలుక (3)
    సమాధానం: మేధావి
  19. ఏడు తర్వాత వచ్చే ఇరవైనాలుగుని నాసిక అనిచెప్పుమ? (4)
    సమాధానం: ముక్కనుమ
  20. నల్లనెమలి నీ వెనకనుంది (3)
    సమాధానం: నీలిమ
  21. కల్లుతేట కావాలంటే అడవి ఉత్తమమైనది (5)
    సమాధానం: కారోత్తమము

నిలువు

  1. మొసలి దొరకాలంటే తుమ్మెదలో అక్షరం పోవాలి (4)
    సమాధానం: మకరము
  2. కోపంవస్తే కారాలతోబాటు నూరేవి (4)
    సమాధానం: మిరియాలు
  3. ధైర్యం కలవాడు రంగడు. సరిహద్దులోపలే ఉంటాడు (4)
    సమాధానం: గడుసరి
  4. ముద్దు కావాలంటే సూదంటురాయిలో అక్షరం మార్చాలి (4)
    సమాధానం: చుంబనము
  5. గోదావరి పక్కనే పాఠశాల? కాదు అంకుశము (4)
    సమాధానం: బరిగోల
  6. ఇంట్లోకి గాలీ వెలుతురూ రావాలంటే ఇది తప్పనిసరిగా ఉండాలి (4)
    సమాధానం: గవాక్షము
  7. ముప్పైమూడు అడ్డం తర్వాత వచ్చే 24 చూడుము (3)
    సమాధానం: కనుము
  8. తోటల్లుడు (4)
    సమాధానం: జగిలెడు
  9. సిగ్గు, సిగ్గులేమి (4)
    సమాధానం: అపత్రప
  10. అలవాటైన విద్యకి ముందుండేది (3)
    సమాధానం: అభ్యాసం
  11. ఎలాగైనా సంతోషమే (3)
    సమాధానం: ముదము
  12. ఇదిలేని ఇరవైనాలుగు ఊహించలేం (4)
    సమాధానం: కోడిపందెం
  13. ఒంట్లో శక్తితోబాటు తోడుగా ఉండే సైన్యం (4)
    సమాధానం: అంగబలం
  14. శృతిచేస్తే రాగమయి వజ్రమౌతుంది (4)
    సమాధానం: మగరాయి
  15. ఛందస్సులా సాగే మంత్రవిశేషం (3)
    సమాధానం: గాయత్రి
  16. కవి కృష్ణుడు (3)
    సమాధానం: మురారి
  17. తోకలేనిపిట్ట తిరిగే దిక్కు (4)
    సమాధానం: ఉత్తరము
  18. నిజమే మరి, హృదయం లోపించిన సత్యశీలుడు (4)
    సమాధానం: నిజమరి
  19. తరవాణి కల్లు (4)
    సమాధానం: పుల్లనీళ్ళు
  20. ఇరవైతొమ్మిది ఒకటిలో ప్రవేశిస్తే జరిగేది (5)
    సమాధానం: సంక్రమణం
  21. సమస్య వస్తే మన్మథపత్ని తలకిందులై డబ్బుపట్టుకుంటుంది (4)
    సమాధానం: తిరకాసు
  22. నత్త మేలు చేస్తే వచ్చే బంధువులు (4)
    సమాధానం: మేనత్తలు
  23. ధనం సంపాదించాలంటే పరాక్రమంతో ఎద్దు మూపురం తాకాలి (4)
    సమాధానం: విడిముడి
  24. తోడపుట్టినబంధువుకి తలబిరుసు ఆఖరున కోపం (3)
    సమాధానం: అక్కసు