గడినుడి-61 సమాధానాలు

అడ్డం

  1. ఆది లోనే కథ అడ్డం తిరిగింది .. ఎంత ప్రమాదం!
    సమాధానం: కురాప
  2. రాత్రి సావిట్లో తిరిగే తార
    సమాధానం: సావిత్రి
  3. ఈ కాలం ఉన్నా ఈ కాలంలో దంచాలంటే కనబడదు
    సమాధానం: రోకలి
  4. క్షీరసముద్రంలో కలిసే నదా?
    సమాధానం: పాలేరు
  5. రేపటికి మొన్న మొన్నటికి రేపు నేటికి తిరిగింది
    సమాధానం: న్నని
  6. పద్యానికైనా వైద్యానికైనా కొంచెం అవసరమే
    సమాధానం: మాత్ర
  7. ఎటుతిరిగినా అతడి పదును తగ్గదు
    సమాధానం: డివా
  8. సవ్యసాచి బాణమేమో
    సమాధానం: లకోరికోల
  9. పరుగు
    సమాధానం: దౌడు
  10. అడ్డదిడ్డమైన వ్యవహారజ్ఞానం
    సమాధానం: క్యంలౌ
  11. జడమైనది
    సమాధానం: స్తబ్ధ
  12. ముఖ్యమైన రక్కసుడే.. క్లుప్తంగా
    సమాధానం: ముర
  13. 56కి సంబంధించిన బౌద్ధాలయం
    సమాధానం: చైత్యం
  14. యుద్ధం ఆపోవుచో యజ్ఞం
    సమాధానం: హవం
  15. కరిగిరిలోని నదీసుత
    సమాధానం: గిరిక
  16. అటుదిటుగా ఒకప్రక్క రాత్రి అయ్యింది
    సమాధానం: క్షప
  17. గారెలు వేసే భీముడు
    సమాధానం: వడముడి
  18. నీరు
    సమాధానం: కం
  19. 30 కలిగిన ప్రపంచం
    సమాధానం: లో
  20. 14 నిలువుతో గజిబిజిగా చేసే యుద్ధం
    సమాధానం: ణంవ్యాకర
  21. వెయ్యి నవలల చెయ్యి
    సమాధానం: కొవ్వలి
  22. వాడీ వాడని పూదండ ఇస్తే
    సమాధానం: ఆముక్తమాల్యద
  23. దుశ్శాసనుని నోట ఇప్పుడే చేయదగిన మాట.. అంతా సినీమాయ
    సమాధానం: తక్షణకర్తవ్యం
  24. గదిలో … ఎదలో సొదలో – జగన్నాథ ఉవాచ
    సమాధానం: మదిలో
  25. రాత్రి ఉదయం కలిసిన పక్షి
    సమాధానం: రేపులుగు
  26. 30 కలిసిన 31 లో లక్ష్మీదేవిని ఆశ్రయిస్తే అమాయకుడు
    సమాధానం: మా
  27. దీనితో కలిస్తే 46లో అమాయకునికి చక్కని చూపు వస్తుంది
    సమాధానం: స
  28. అంత సంతోషంతో మొహం ఎందుకలా పెట్టావ్?
    సమాధానం: ఆముదము
  29. చెప్పులకు వేసే తోలుముక్క పుస్తకాల పైన తిరగబడింది
    సమాధానం: ట్టఅ
  30. ఎద్దు దుప్పటీ
    సమాధానం: కంబళి
  31. నగము ఇంకో నగము మధ్యలోనిది
    సమాధానం: కోన
  32. ఖండించే పూలబంతి
    సమాధానం: చెండు
  33. మనుమరాలైన నాయిక చేపా?
    సమాధానం: మీనా
  34. యోగ్యమైనదాని తలతీసేస్తే చివరి మంట రేగక తప్పదు
    సమాధానం: చితి
  35. కాల్చి పెట్టిన గాలికి అదేం రోగమో!
    సమాధానం: వాత
  36. కొల్లేటి ఇల్లా?
    సమాధానం: కొంప
  37. లేని పొగ విశ్వమంతా కమ్మింది నారాయణా!
    సమాధానం: నాస్తికధూమం
  38. 50వ ఏడు దేవదూత
    సమాధానం: నల
  39. దీని సంరక్షణార్థం అయం పటాటోపః
    సమాధానం: గోచీ
  40. ముసుగు
    సమాధానం: బాడు
  41. ఈ ధ్వని అటుయిటుగా శ్రేష్ఠమే!
    సమాధానం: రవము
  42. మనవారే .. కుక్కలగుంపు కాదు సుమా.
    సమాధానం: స్వజనం
  43. జుట్టు పట్టుకుని కర కర కోసే సాధనం
    సమాధానం: క్రకచం
  44. తూర్పు పడమరలో చూడుమా పండుగ కనిపిస్తుంది
    సమాధానం: కనుమ

నిలువు

  1. మూడు కన్నులున్నా నీరు లేదేమిటో!
    సమాధానం: కురిడి
  2. అనామకంగా మిగిలిన వృద్ధుడు. వేదం చదువుకున్నాడేమో
    సమాధానం: పన్న
  3. ద్విజునికి దొరికిన నాయిక
    సమాధానం: విప్రలబ్ధ
  4. కళ్ళకు అందాన్ని తెచ్చే నీరా?
    సమాధానం: కజ్జలము
  5. రసాన్ని నిలిపేది
    సమాధానం: పాత్ర
  6. పాముపగ గల ఋషి
    సమాధానం: రురుడు
  7. అంతులేని లోతు
    సమాధానం: నిమ్న
  8. శ్రీ శ్రీ క్షేత్రజ్ఞక్షేత్ర యోగం
    సమాధానం: సిరిసిరిమువ్వ
  9. ముంగిసతో సహా, దేవుడిని కన్న తల్లి
    సమాధానం: మాద్రి
  10. పదపదార్థముల యొక్క పరస్పరసంబంధము చెడక యేకార్థత్వము గలిగి క్రియతోడఁగాని తదితరముతోడఁగాని ముగిసెడి పదసముదాయము
    సమాధానం: వాక్యం
  11. సంధి కార్యం
    సమాధానం: దౌత్యం
  12. వాస్తవంగా చెప్పాలంటే పొగడ్తే
    సమాధానం: స్తవం
  13. నశించేది తిరగబడి కాపు కాస్తుంది
    సమాధానం: రక్ష
  14. ఈ అడవికాని అడవికెంత వాసనో
    సమాధానం: దవనం
  15. తొందరలో మధ్య అక్షరాలు ఉడాయించాయి
    సమాధానం: హడి
  16. పందెపు ధనం
    సమాధానం: పణం
  17. అర్థానికి బరువు పెంచిన కవి
    సమాధానం: భారవి
  18. రావణుని వంటి దొంగలా?
    సమాధానం: మునిముచ్చులు
  19. నడవడి వ్యాపించి చుట్టుకొంది
    సమాధానం: వ్యావర్తనము
  20. సంగీతం వాయించే చెట్టు రమ్మని పిలుస్తోంది
    సమాధానం: కమాను
  21. ఈ కూన ధృడమైనదే
    సమాధానం: కొదమ
  22. పేరుకు తగినట్టే ఊగిపోయింది
    సమాధానం: లితలో
  23. పద్యాలను నిర్మించే ప్రమథుల గుంపు
    సమాధానం: గణము
  24. పేరును బట్టి పేరును బెట్టిన తుమ్మెద
    సమాధానం: ద్విరేఫం
  25. మరణించిన భగవంతునికి ప్రాణం పోసేందుకు వస్తున్నాన్నవాడు
    సమాధానం: దిగంబరకవి
  26. స్వేచ్ఛపొందిన ప్రచురణకి సాహిత్యపురస్కారం లభించింది
    సమాధానం: విముక్త
  27. గువ్వ పిట్టను చుట్టేసిన చిన్న కొండ
    సమాధానం: గుట్ట
  28. ఆ నమ్మకం కలగాలంటే ముందు ఇది పెట్టాలి
    సమాధానం: ఆన
  29. నేనూ నువ్వూ తేల్చుకుంటే మిగిలేది నేనే!
    సమాధానం: అమీ
  30. కోరికలతో గెంతులాడే మనసు గతి మున్వెనుక లరసిన తెలియును
    సమాధానం: కోతి
  31. దీనికి చేయి పరంబైనపుడు కంటికి నీరు ఆదేశంబగు
    సమాధానం: చెంప
  32. తిరుపతి వెంకటేశ్వరుని సందర్శనం
    సమాధానం: నానారాజ
  33. విమర్శలో దిట్ట. చతురోక్తుల పుట్ట. ఈ ఇంటనే అటూయిటూ తిరిగారు.
    సమాధానం: చిమంట్టక
  34. మరీ అంత వంగితే శీర్షానం వేయాల్సిందే
    సమాధానం: తన
  35. ఈ భలే మంచి కంచు గొంతు కొంగదటర!
    సమాధానం: కొంగర
  36. రామనామస్మరణతో మొదలయ్యే రాజధాని
    సమాధానం: రాంచీ
  37. గుఱ్ఱాన్ని కన్నడ రారమ్మనండి
    సమాధానం: బాబా
  38. కుమారగిరి మానససరోవరాంతర విహారియైన రాజమరాళి
    సమాధానం: లకుమ
  39. గోరు ముద్దలు ఎంత ముద్దుగా అడుగుతోంది
    సమాధానం: గోము
  40. అటుఇటుగా చుస్తే మిక్కిలి ఎక్కువైంది
    సమాధానం: డుక