అడ్డం
- దంతావళము శాస్త్రం మూడు అడుగులు (5)
సమాధానం: మతంగజము - ఆ తొమ్మిదిలో ఒకటి కలిపితే కోపం వస్తుంది (3)
సమాధానం: ఆగ్రహం - ఆశీర్వదించేటప్పుడు మాత్రమే కాదు తిట్టినా పడతాయి (4)
సమాధానం: అక్షింతలు - ఉత్తరం చెట్టుకి కాచేది దీపావళికి కనిపిస్తుంది (4)
సమాధానం: టపాకాయ - గడప చివర వాకిలి లోనికి రావడానికి 864000 సంవత్సరాలు పడుతుంది (3)
సమాధానం: ద్వాపరం - పరిస్థితులు అనుకూలించనప్పుడు పుణ్యానికి పోతే ఎదురయ్యేది (2)
సమాధానం: పాపం - హంస ముని (2)
సమాధానం: యమి - కడలికి సంబంధించిందే అయినా మన అదృష్టాన్ని కూడా చెపుతుంది (4)
సమాధానం: సాముద్రికం - ముత్యాలహారము (4)
సమాధానం: ముక్తావళి - ఉద్యోగపర్వంలో సంజయుడు, శ్రీకృష్ణుడు చేసినవి సరిగ్గా రాయరా, బాలు (5)
సమాధానం: రాయబారాలు - న్యాయంగా నిజాయితీగా బతికేవాడు (5)
సమాధానం: నీతిపరుడు - నల్లగుఱ్ఱము పుట్టుమచ్చ (4)
సమాధానం: తిలకము - మాడిపోయినా పొడిగా మాకు ఇస్తే పీల్చి పారేస్తాం (3)
సమాధానం: పొగాకు - ఎటునుండి చూసినా అభివృద్ధి (3)
సమాధానం: విరివి - ఇంకొకరి మొగుడితో కలిస్తేనా గౌరవం? (4)
సమాధానం: పరపతి - పర్వతంపైన బాతు? కాదు భుజంగం (5)
సమాధానం: కొండచిలువ - గజపాదము లావు? జబ్బు కాబోలు (5)
సమాధానం: ఏనుగుకాలు - చంద్రునికిచ్చే కానుక? (4)
సమాధానం: నూలుపోగు - విరివిలుకాడు (4)
సమాధానం: రతిపతి - బృహస్పతి కొసలతో నట్టేట్లో దిబ్బ (2)
సమాధానం: దీవి - ఇలా అంటే చచ్చిపోవడం (2)
సమాధానం: హరీ - హైదరాబాదులో పెరిగిన వృధాఖర్చు (3)
సమాధానం: దుబారా - ఇవి అర్థం లేని మాటలు (4)
సమాధానం: ప్రలాపాలు - పిల్లల్ని కని వయసుపైబడి తెరవెనుకయ్యింది (4)
సమాధానం: యవనిక - ఈ ఛందస్సు తెలియాలంటే సంవత్సరం ఆగాలి (3)
సమాధానం: వికృతి - సంతోషాన్ని కలిగించేది (5)
సమాధానం: ముదావహము
నిలువు
- కాళ్ళు కడుక్కోడానికిచ్చిన నీరు మన మధ్య అక్కడక్కడ చేరితే మత్తు కలిగిస్తుంది (5)
సమాధానం: మద్యపానము - ఇరవైనాలుగు నిమిషాల్లో దీన్ని తలుపుకి అడ్డంగా పెట్టాలి (3)
సమాధానం: గడియ - గోపురం పెద్దవాకిలి (5)
సమాధానం: ముఖద్వారము - ఆ నూటయెనిమిది పేటల ముత్యాలపేరు చూస్తే కడుపు నిండుతుంది (3)
సమాధానం: ఆహారం - అడుగులోనే అడ్డంకి? (4)
సమాధానం: హంసపాదు - ఆ విధంగా దోసెలు వెయ్యాలి (2)
సమాధానం: అట్లు - కూతురు నది గా మారితే పక్షానికొక రోజు వస్తుంది (3)
సమాధానం: తదియ - నీళ్ళపాలు (3)
సమాధానం: పేయము - తొట్రుపాటు వల్ల జరిగే యుద్ధము (3)
సమాధానం: కంగారు - సవతి కట్టిన ఇల్లు (3)
సమాధానం: వసతి - చెట్టునుండి పడే తుంటరిపిల్లలు (5)
సమాధానం: రాలుగాయలు - ప్రతి నరకములు అప్పుడప్పుడు కనిపిస్తాయి (3)
సమాధానం: నకలు - మితిమీరి నువ్వు ప్రారంభించు తినడం ఈచేపని (5)
సమాధానం: తిమిరిమీను - దున్నపోతుమీద వేసే ఇనుపబాణం (3)
సమాధానం: గొరక - తియ్యలడ్డూలు అప్పుడప్పుడు నువ్వులుతో చేస్తారు (3)
సమాధానం: తిలలు - వివాదం తిరిగి పిశాచమైంది (3)
సమాధానం: డగర - అందంగాలేని కొత్త సంవత్సరం (3)
సమాధానం: వికారి - మొగలి చెట్టు బయటపడని రంగు (5)
సమాధానం: గుప్తరాగము - గత పదిహేను రోజుల్లో కొందరికి మాత్రమే సహాయం (5)
సమాధానం: పక్షపాతము - ఇంద్రుడి వజ్రాయుధం కొసలుగా గల సంవత్సరం (4)
సమాధానం: పరీధావి - యువ భవిష్యత్తులో ఎదురయ్యే సంవత్సరం (3)
సమాధానం: విభవ - రాలుగాయ పుట్టిన సంవత్సరం (3)
సమాధానం: దుర్మతి - పరాక్రమం చూపించే సంవత్సరం (3)
సమాధానం: ప్రభవ - అప్పుడప్పుడు కాయకష్టం చేస్తే వచ్చే జ్వరం (2)
సమాధానం: కాక