అడ్డం
- మకరిని సరిచేసి సొరుగు చివర పెట్టు. ఇంకా సందేహమా? (5)
సమాధానం: అరమరిక - రౌతు (3)
సమాధానం: సాహిణి - బావలు కల వనితాపక్షపత్రిక (5)
సమాధానం: కలువబాల - యోగాసనమనుకోకు, పాలేటిపట్టి (5)
సమాధానం: అంబుజాసన - జాతీయ పురస్కారం పొందిన వాహినీవారి చిత్రరాజము. (5)
సమాధానం: బంగారుపాప - కాళిదాసుకు, పెద్దన్నకు, కృష్ణశాస్త్రికి, శ్రీశ్రీకి తెలిసిన ఈ రహస్యం తెలుగులో (5)
సమాధానం: రసవాదము - వనరుహము ముందు విలపించు (3)
సమాధానం: వనరు - భేతాళుడు (5)
సమాధానం: యమభటుడు - ఫాలనేత్రుడు (5)
సమాధానం: నిటలాక్షుడు - పిసినిగొట్టు (5)
సమాధానం: మితంపచుడు - భూమిని తిరగేస్తే వేడిని నాశనం చేసే పాలకూర (2)
సమాధానం: హిమ - నెత్తుటియేరు అన్న అర్థం వచ్చే కమల్ హాసన్ తమిళ సినిమాకు తెలుగు పేరు (2)
సమాధానం: ద్రోహి - పరీధావికి నిరుడు (5)
సమాధానం: విరోధికృతు - శ్రీరాముని చరితమును తెలుపుతూ లవకుశులు తీసిన రాగం (5)
సమాధానం: శివరంజని - ఇల్లాలులేని ఇల్లు _____ అని ఒక సామెత (5)
సమాధానం: దయ్యాలకొంప - సురభారతిలో స్ఫటికంలా ప్రకాశించు స్వభావం కలవాడు (3)
సమాధానం: భాసుర - స్వరాలతో నాట్యమాడే పిల్లనగ్రోవి (5)
సమాధానం: స్వరలాసిక - హెల్మెట్ అద్దం (5)
సమాధానం: ముఖత్రాణము - అన్యాయాన్ని ఎదురించి మాట్లాడటాన్ని ఇది వినిపిస్తున్నారంటారు. (5)
సమాధానం: ధిక్కారస్వరం - మస్కా కొట్టే చేమోడ్పు (5)
సమాధానం: నమస్కారము - తబ్బిబ్బు జేసెదవు రామా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా … (3)
సమాధానం: పాహిమాం - నాసికాభరణ విశేషము (5)
సమాధానం: ముక్కుపుడక
నిలువు
- వక్కలను తుంచు సాధనం (5)
సమాధానం: అడకత్తెర - జాణ కలముతో టిష్యూ (5)
సమాధానం: కణజాలము - ఎక్కిలి (2)
సమాధానం: హిక్క - లేతకాయ (5)
సమాధానం: కసరుగాయ - గగన సదృశుడు, మేఘవర్ణుడు, శుభాంగుడు, … (5)
సమాధానం: లక్ష్మీకాంతుడు - 7 అడ్డం వంటిదే, కానీ వాసనగల చెట్టు (5)
సమాధానం: అంబువాసిని - ఈ సూత్రధారి చవట నరుడు కాదు.(5)
సమాధానం: నటవరుడు - పోరంబోకు (5)
సమాధానం: బంజరుభూమి - పట్టమేలే రాజు చదువు పూర్తి చేశాడా? (5)
సమాధానం: పట్టభద్రుడు - నాళము (3)
సమాధానం: వాహిక - అటూఇటూ ఐనా నమ్మకముతో కూడిన ధీమా (3)
సమాధానం: లాసాధి - ప్లేటు (3)
సమాధానం: పళ్ళెరం - పింగళి సాహిత్యపు మత్తులో జగమే ఊయల ఊగేనా? (3)
సమాధానం: లాహిరి - చదువు చివర నాశనము కాదంటే గుడి (5)
సమాధానం: విద్యాలయము - శాయశక్తులా భారము మోసి ఇతరులకు దానం చేస్తావా? (5)
సమాధానం: తులాభారము - శైత్యోపచారము తప్పనిదా? (5)
సమాధానం: శిశిరవిధి - స్వచ్ఛమైన రూపము (5)
సమాధానం: నిర్మలాకారం - హిందీ నొప్పి రొమ్ములో కల స్త్రీ కదా ఈ మండూకి (5)
సమాధానం: దర్దురాంగన - ఉరిత్రాడును పణముగా పెట్టి రక్షణము చేయుము. (5)
సమాధానం: పరిత్రాణము - పైడితేరు (5)
సమాధానం: స్వర్ణరథము - జిలక కూకలో బజారుది. (5)
సమాధానం: కలకూజిక - ఎందుకు లేని సీతాదేవి (2)
సమాధానం: దేహి