కాళీ పదములు 3

1.

అపరాహ్ణ వేళ
నిర్మోహ కాంతి
బైరాగి పాట
మందకొడి గాలి

ఎర్ర చిగుళ్ళ
చింత తోపులో
సర్రున కాలే
నడక దారి

ఎండ వలలో
దిక్కు తోచని
ధూళి పక్షి

ఎక్కడిదో
తెంపు లేని
కీటకరావం

నట్టనడి
ఒకటే
ఎర్ర కన్ను

తిరిగి చూడకు

వెంబడించేను
కాళి.

2.

తలలో నాలిక
హృదిలో బాలిక
ఎదలో మల్లిక

ఇలలో కదలిక
జతిలో అమరిక
గతిలో అల్లిక

నిశిలో పకపక
మతిలో సూచిక
వెతలో ఊనిక

రసనకు పూనిక
మేధకు వీచిక
కాళిక కాళిక.