తెల్లవారుఝాము మరణం

ఎర్ర చంద్రుని రాత్రి
ఒక ఒంటరి చెట్టు
ఒక ఒంటరి నీడ
ఒక ఒంటరి పిట్ట

చెక్కిళ్ళపై నీ పెదవుల
రాతలను వెతికిన
చెట్టు కొమ్మల్ని చిరుగాలి
తాకకుండా ముద్దాడిన
చేతిలో నీ ఉత్తరం
ఒక కాగితపుపువ్వులా
రెపరెపలాడిన

ఎర్ర చంద్రుని రాత్రి
ఒక ఒంటరి చెట్టు
చిటారుకొమ్మన వేలాడుతూ
నా ప్రేమ!

(గార్సియా లోర్కా (Lorca) కవిత He died at dawn ప్రేరణతో)