ప్రసిద్ధ భౌతికశాస్త్ర చరిత్రకారుడు అబ్రహం పైస్ (Abraham Pais), “ప్లాంక్, ఐన్‌స్టైన్, బోర్‌ల ప్రసిద్ధ పరిశోధనల తర్వాత, పాత క్వాంటం సిద్ధాంతాన్ని పరిపూర్ణం చేస్తూ వచ్చిన పరిశోధనా పత్రాలలో నాలుగోది, చివరిది, విప్లవాత్మకమైనది బోస్ రాసినదే” అన్నాడు.

ఈ దృష్టితో చదివినప్పుడు రాధికాసాంత్వనం ఒక శృంగార కావ్యంగా మాత్రమే కనిపించదు. అది ఒక కవి, ఒక కథ, ఒక దైవం, ఒక నాయకురాలు, ఒక సహృదయ పాఠకుడు — వీరందరి మధ్య ఏర్పడే సాహిత్య అనుభవంగా కనిపిస్తుంది.

“అభయుడిమీదా, జీవకుడిమీదా చూపించే అభిమానం నీ తండ్రి ఎప్పుడైనా నీ మీద చూపించాడా? ఇప్పుడు నువ్వు రాజువి కాకపోతే, అభయుడికి బింబిసారుడు రాజ్యం ఇస్తాడనేది తధ్యం. ఆ తర్వాత నీ జీవితం ఏమౌతుంది? నీ ఇష్టం, మరోసారి ఆలోచించుకో,” దేవదత్తుడు లేచి వెళ్తూ చెప్పాడు.

ఈ శాఖకు ఇరవై ఐదేళ్ళు సేవ చేసినందుకు ఒక చిన్న రాయితీ తీసుకున్నట్టు అనుకోవచ్చు. ఎంతమంది దోచుకోవట్లేదు; ఒక్కొక్కళ్ళయితే వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లు మింగేశారంటున్నారు. స్టాక్ మార్కెట్ కుంభకోణాన్ని, బ్యాంకుల్లో పై స్థాయి ఆఫీసర్లను చూళ్ళేదూ?! వాటితో పోలిస్తే ఇదేం పెద్ద తప్పని?

కాలం గడిచే కొద్దీ నేర్చుకున్న విద్య నశించిపోతుంది. బలంగా వేళ్ళూని ఉన్న వృక్షాలూ పడిపోతాయి. చెరువుల్లో చేరిన నీరూ ఇంకిపోతుంది. దేవతలకు ఇచ్చిన ఆహుతి, అర్థులకిచ్చిన దానము శాశ్వతంగా ఉండిపోతాయి.

ఆ సినిమాలో ప్రారంభంనుండి చివరిదాకా వీస్తున్న పొగమంచులోంచి కొట్టుకు వస్తున్న ఎండుటాకుల్లాగా, ఆ రాత్రంతా మల్లిఖార్జున్ మనసులో కూడా ఎడతెగని వాన కురుస్తూనే ఉంది.

గుండెలు అవిసిపోయే దుఃఖంతో క్రిసెస్ మార్గం తోచక తన ఇష్టదైవం అయిన అపోలోకి ప్రార్థన రూపంలో విన్నపం సమర్పించుకున్నాడు. తన ఆప్తుడికి ఎదురయిన కష్టాన్ని చూడగానే అపోలోకి కోపం వచ్చి అగమేమ్నాన్‌ సేనల మీద ప్లేగు మహమ్మారి పడాలని శపించేడు.

“మీరు ఏమీ అనుకోనంటే, ఒక మాట… మీరు నాతో డేట్‌కి వస్తారా?” అని ధైర్యం కూడగట్టుకుని అడిగేశాడు.

వేయబోయిన అడుగు ఆగింది కానీ, ఆమె అతని వైపు తిరగలేదు.

మలిన కౌశేయ వస్త్రము మయిన దాల్చి
తరువు నూతగ నిల్చిన తమ్మికంటి
మచ్చ లెరుగని సొచ్చెపు మెచ్చులాడి
యేల వగచుచుంటి విచట? యెవరు నీవు?

నన్నెవరెట్టిమాట యనినన్ సహియింపవు కస్సుమందు వా
తెన్నునబోక నేను కడు తేలికగా గయికొందు నన్నిటిన్,
నిన్నటిదాక కాచితివి నీవె భరించితి వన్ని, యింకపై
నన్నియు సూటిగా తగులు నాలన డాలగునా? సుమంగళీ!

కన్నీటి చుక్కల్లో కథలు ఎవరికీ వినబడవు
గాలికెగిరిపోతున్న కొత్త కొత్త ఆశలు
విరిగిన స్వప్నాలను దాచుకున్న చిరునవ్వు
మనసులోని మాట కోసం కొట్టుకులాడతాయి

నిన్న బడికి రానోళ్ళంతా
ఒక లైను కట్టుండ్రి అంటే
‘మా అమ్మను మా నాయిన కొట్టిండని’
రెక్కలు ముడుచుకున్న పిచ్చుకపిల్లలెక్క
కండ్లు నలుచుకుంట చేతులు చాపుతది

త్రిపురాంతకోదాహరణము, అంబికా శతకము, చంద్ర తారావళి అన్న మూడు కావ్యాలలోనూ “ఇది రావిపాటి త్రిపురాంతకుని కృతి” అని చెప్పటానికి నికరమైన ఆధారమేమీ లేదు. సంపూర్ణంగా దొరికిన త్రిపురాంతకోదాహరణము లోనూ కృత్యాద్యంతాలలో ఎక్కడా రావిపాటి త్రిపురాంతకుడని కర్తృనామం చెప్పబడలేదు.

సంపూర్ణ సూర్యగ్రహణం కొన్ని నిమిషాలు మాత్రమే కొనసాగవచ్చు. చంద్రగ్రహణం కొన్ని గంటలు మాత్రమే కొనసాగవచ్చు. కానీ ఆర్యభట నెలకొల్పిన ఖగోళ సంప్రదాయం పదిహేను శతాబ్దాలకు పైగా కొనసాగుతూనే ఉంది. ఆ వారసత్వాన్ని మూఢభక్తితో ఆరాధించడం కంటే, దాని వెనుక ఉన్న శాస్త్రీయ దృష్టిని అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి పునరంకితులము అవడమే మనం వారికి అందించగల నిజమైన నివాళి.

రత్నాన్ని గమనించండి. రత్నం ఒకటి, దాని మెరుపు మరొకటి అని చెప్పలేము. మెరుపులేని రత్నం సాధారణ రాయిలాగే కనిపిస్తుంది. రత్నత్వాన్ని వ్యక్తపరచేది దాని కాంతి. కాంతిని రత్నం నుండి విడదీయలేము; రత్నాన్ని కాంతి లేకుండా నిర్వచించలేము. రెండుగా చెప్పబడుతున్నా, అవి వాస్తవానికి విడదీయరాని ఏకస్వరూపమే.

గాంధీగారి గురించి చదువుతున్నప్పుడు వచ్చే అనుభూతి కాకుండా, ఆయన నివసించిన సబర్మతీ ఆశ్రమంలో ఆయన రాట్నం వడికిన చోటుని, కూర్చుని రాజకీయ నిర్ణయాలు తీసుకున్న గదిని చూసినప్పుడు కలిగే అనుభవానికి ఒక ప్రత్యేకత తోడవుతుంది.

ఒక భాషనుండి మరో భాషలోనికి మార్చుట అంటే చాలా కష్టమైన పని. భాషాంతరీకరణంలో ఎన్నో క్లేశాలుంటాయి. రెండు భాషలలో నిష్ణాతుడు కాకున్నచో ఆ భాషలలోని మెలకువలు తెలియవు. లేకుంటే భాషాంతరానుసృజనం పేలవమైపోతుంది. ఒకప్పుడు విరుద్ధార్థ స్ఫూర్తిని కూడ కలుగజేస్తుంది. మూలగ్రంథం దీర్ఘంగా ఉన్నప్పుడు దాన్నంతా ఆకళించుకొని ముఖ్యాంశాలను త్యజించకుండా అనుసరించాలి. మూలంలోని పదాల్లో అర్థం అస్పష్టంగా, లేదా క్లిష్టంగా ఉన్నప్పుడు దానిని వివరించాలి. పునరుక్తులను పరిహరించాలి. ఆ భాషలోని నుడికారం అర్థం చేసుకొని ఈ భాషకు తగినట్లు నుడికారపు సొంపు నింపుతూ అనుసృజనం చేసినప్పుడే కౌశలం ఏర్పడుతుంది. ఇట్టి లక్షణాలన్నీ తిక్కన భారతంలో దర్శనమిస్తాయి.

కన్నీటి చుక్క ఆకారంలో ఉన్న ద్వీపం కార్ నికోబార్. అంతా సమతల ప్రదేశం. పరిణతిగల రహదారి వ్యవస్థ. ఎటు చూసినా బీచ్‌లు. ఆ మారుమూల ద్వీపాలలో మనుషుల్ని ఆకర్షించి స్థిరనివాసం ఏర్పాటు చేసుకోమని ప్రేరణ కలిగించే శక్తీ వనరులూ కలది కార్ నికోబారే.

ఈ వాస్తవ సంఘటనల సమాహారం, ఒక పెద్ద మాప్‌ని దగ్గర పెట్టుకుని, ఒకే సమయంలో వేరు వేరు చోట్ల జరిగిన సంఘటనలు, వాటి మధ్య ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉన్న కారణాకారణ సంబంధం గురించి తెలుసుకున్నట్లు ఉంటుంది. ఇది ఒక దేశచరిత్ర కాదు; మానవుల మనుగడ చరిత్ర.

గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాలు: 2025 సంవత్సరంలో వెలువరించిన కథా, కవితా సంపుటాలకు ఆహ్వానం పలుకగా 20 కథా సంపుటాలు, 33 కవితా సంపుటాలు వచ్చాయి.