పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి రవిశంకర్ అభిప్రాయం:

    09/02/2012 10:06 am

    వ్యాసం బాగుంది. పైన చెప్పిన ఫొటోలో నేదునూరిగారితో ఉన్నది సద్గురు కందుకూరి శివానందమూర్తిగారు.

  2. నా కోరిక, నా ప్రార్థన గురించి మోహన అభిప్రాయం:

    09/02/2012 9:37 am

    బ్రహ్మానందం గారు, చాల బాగుంది ఈ వ్యాసం. అబ్బ, బలరాజ్ సాహనీ ఎంత మంచి నటుడో? అతని దో బీఘా జమీన్ (సలిల్ చౌదరి మొదటి హిందీ చిత్రం), కాబూలివాలా, అనురాధ (నాయికగా లీలా నాయుడు, రవిశంకర్ సంగీతం) వంటి చిత్రాలను ఎన్ని మారులైన చూడవచ్చును. గొప్ప కవి, భావుకుడు. వ్యాసములో ఉదహరించబడిన నందలాల్ బోస్ గాంధీ చిత్రాన్ని యిక్కడ చూడ వీలగును. విధేయుడు – మోహన

  3. ఛందస్సులో గణితాంశములు గురించి తమ్మినేని యదుకుల భూషణ్. అభిప్రాయం:

    09/02/2012 8:19 am

    మోహన గారు ఛందస్సు పుస్తకం చిత్తుప్రతి అంద జేస్తే దేశీబుక్స్ ద్వారా ప్రచురించడానికి మేము సర్వదా సిద్ధం.
    బ్రౌన్ అవార్డు లో భాగంగా ఇది మా ప్రణాళిక లో చాలా కాలంగా ఉన్నది.

    తమ్మినేని యదుకుల భూషణ్.

  4. కిటికీ గురించి rama bharadwaj అభిప్రాయం:

    09/02/2012 1:25 am

    శారద గారూ! మన్రో గారి కధకి మీ అనువాదం బాగుంది. నవ్వు తెప్పించింది కధ . “సాకి” కధలో హాస్యం బాగుంది. ముఖ్యంగా మనం అలాంటి పరిస్థితిని ఊహించినప్పుడు కలిగే situational comedy బాగుంటుంది. ఇలాంటి హాస్యం మనకి అప్పారావు గారి రచనల్లో కనిపిస్తుంది. ఇంగ్లీషులో ఆస్కార్ వైల్డ్ వంటి రచనల్లోనూ కనిపిస్తుంది. హారర్ విషయంలో మపాసా కధలు ఒక తరహా. కల్పనలో ఊహలో మార్కజ్ కధలు ఇలాంటివి మరొక తరహా!!

    ఇది నిజానికి హారర్ కధ కాదు. ఆ పదిహేనేళ్ల అమ్మాయి ఆ వచ్చిన కొత్తవ్యక్తి ని ఆట పట్టించిందని అర్ధం అవుతూనే ఉన్నా మన్రో ఎక్కడా దాన్ని వాచ్యంగా చెప్పకపోవడమే ఈ కధలోని గడుసుదనం అంతా 🙂 తెలుగు కధకులు ఎక్కువమంది మరీ “రియలిజం” లో కూరుకుపోయి ఊహకి తిలోదకాలిచ్చేసారు. మనకి కధ అంటే వట్టి సోషల్ థీం. అందువలన తెలుగు కధని చదవడమే చాలాసార్లు విసుగు . చదవాలంటే మళ్ళీ కాశీమజిలీ కధల్ని చదువుకోవాల్సిందే!

    నాకు “కొవ్వుపుంజి” కధలో లాగే ఇందులోనూ మీ తెలుగు అనువాదపు సరళి నచ్చింది. మీరు ప్రపంచంలో పేరెన్నికగన్న మంచి కధల్ని, లేదా మీకు నచ్చిన కధల్నైనా సరే ఎంచుకుని వాటి తెలుగు అనువాదాల్ని ఒక సంకలనంగా తెస్తే బాగుంటుందని అనిపించింది. చాలామంది అనువాదాలు ఏమంతగా చదివించవు. మీ అనువాదం చదివిస్తుంది హాయిగా! అందుకూ!

    రమ.

  5. ఛందస్సులో గణితాంశములు గురించి rama bharadwaj అభిప్రాయం:

    09/02/2012 12:18 am

    బెజ్జాల కృష్ణ మోహన రావు గారూ! మీ పరిశ్రమకీ, చందస్సు మీది మీ అనురక్తికీ అద్దం పడుతున్నది ఈ మీ వ్యాసం. వ్యాసం అద్భుతంగా “ఉన్నట్టుంది”. ఇదేమి వాక్యం అనుకోకండి. ఓపికతోనే ఆగి ఆగి నెమ్మదిగా మీ వ్యాసం చదివాను. నాకు చందస్సు కొద్దో గొప్పో తెలుసని ఇదివరకూ అనుకునేదాన్ని. ఈ వ్యాసం చదివాకా నాకు ఏమంతగా తెలియదని అర్ధమయ్యింది. ఇది మొదటి సంగతి. “చందస్సు ఒక మహా సాగరము” అని మీరు చెప్పారు గనక నాకు మరీ తెలియనందుకు నేను అంతగా బాధ పడలేదు. కానీ ఇంత మంచి వ్యాసం నాకు సరిగ్గా ఎందుకని అర్ధం కాలేదో అనుకున్నాను. బహుశా ఈ వ్యాసం అర్ధం కావలెనన్న వారికి గణితశాస్త్రం కూడా తెలియాలి కాబోలని నాకు నేను నచ్చచెప్పుకున్నాను. ఎందుకంటే నాకు లెఖ్ఖలు రావు. నేను ఆ విషయంలో సంపూర్తిగా మూఢురాలిని. ఇదే కారణం అయితే మీ వ్యాసం అర్ధం కావాలంటే నా లాంటి ఇతరులకు కూడా బహుశా కష్టమే కావొచ్చు. అప్పుడెలా??

    అయితే ఇందులో నాకు నచ్చినది. “విరహాంకుడు” అన్న పేరు నాకు కొత్తగానూ ప్రీతిగానూ అనిపించింది 🙂 . చందస్సుని గురించి విశదీకరిస్తూ నాగవర్మ “కరుహదళేక్షణే” అని ఉద్దేశ్యించి పద్యం చెప్పడం సరదాగా అనిపించింది. చివరగా కనీశం చందస్సులోనైనా ఒకే చందస్సునకి అటు”విప్రుల” పేరూ ఇటూ “నరేంద్రుల” పేరూ సమానంగా కలిపిన ఏర్పాటు చూసి, అలా కులాల మధ్య ఒక ఐక్యతని ఆనాటి వారు సాధించుకున్నారనిపించింది 🙂

    నాకు గణితంతో కలిసిన ఇందులోని విషయం తెలియకపోతేనేం గాక! మీరిచ్చిన పిలుపు ” వసంతకాలము వచ్చెనుకాదా!! రసార్ణవ మిక బ్రతుకగు గాదా !! అన్నది చూసి ఉల్లాసం కలిగింది 🙂
    రమ.

  6. విలువలు: కథ నచ్చిన కారణం గురించి Navuluri Venkateswara Rao అభిప్రాయం:

    09/01/2012 10:58 pm

    బసవరాజు గారు వ్యక్తిగతంగా తెలుసు. భేషజం లేని, పెద్ద మనసుగల పెద్దమనిషి. మీరన్నట్టు, ఆయన రచనలలో ముళ్ళపూడి తొంగి చూడకుండ ఉండుంటే బాగుండేది. చాలా కాలం క్రితం ఒక సంకలనంలో విలువలు చదివాను. ఇంకా గుర్తుంది. గుర్తుంటుంది. మేధావి రచయిత. మీకు వత్తాసు ఇస్తున్నాను.

    నవులూరి వెంకటేశ్వర రావు

  7. ఈమాట సెప్టెంబర్ 2012 సంచికకు స్వాగతం! గురించి మోహన అభిప్రాయం:

    09/01/2012 7:26 pm

    సర్వాంగ సుందరముగా నున్నది మీ సంచిక. ఒక చిన్న మనవి. అనువాద కథల, వ్యాసముల మూల రచయిత పేరును కూడ ముఖపత్రంలో తెలియజేస్తే బాగుంటుందేమో? అప్పుడు ఆ రచనను జ్ఞాపకము పెట్టుకోడానికి అనువుగా నుంటుంది. విధేయుడు – మోహన

  8. ఛందస్సులో గణితాంశములు గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:

    09/01/2012 4:06 pm

    అమ్మయ్య! ఎన్నాళ్ళకెన్నాళ్ళకి! గణితశాస్త్రం + చందస్సు కలిపేసిన గొప్పవ్యాసం! అయితే, మీ గణితశాస్త్ర ప్రతిభ, చందస్సుతో మీకున్న పరిచయం కలిపి ఇంగ్లీషులోకి ఎప్పుడు తెస్తారు? గ్రూప్ థీరీకి చందస్సుతో పెళ్ళిచేసి ఇంగ్లీషులో పుస్తకం తెమ్మని, ఎంత వేగిరంగా వేవేగిరంగా తెస్తే అంత మంచిదనీ ఈమాట పత్రికా ముఖంగా నామాట మళ్ళీనూ!

    మిత్రుడు వేవే

  9. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి rama bharadwaj అభిప్రాయం:

    09/01/2012 2:33 pm

    “శ్రీపాదతో నూకల మూర్తి తదితరులు” అన్న వాక్యం ఉన్న ఫోటోలో ఉన్నది నేదునూరి కృష్ణమూర్తి, స్వామి సచ్చిదానందమూర్తి గారలు. నూకల చినసత్యనారాయణ ఆ పోటోలో లేరు. సవరించగలరు.

    “పలుకుతేనెలతల్లి” లో శ్రీపాదవారి గొంతు రమణీయంగా ఉంది. నేదునూరి మనోధర్మ సంగీతం పై ఆయన గురువు గారి ప్రభావం స్పష్టం గా వినిపిస్తూ ఉంటుంది.

    రమ.

    [తప్పు సరిదిద్దాము. పట్టించినందుకు కృతజ్ఞతలు – సం.]

  10. విశ్వనాథగారితో వేదాంత చర్చ గురించి srinivasaraov,khammam అభిప్రాయం:

    09/01/2012 2:15 pm

    చాలా బాగుందండి. జీవిత సారాన్ని తెల్చి చెప్పారు. ఎక్కడి మాటర్, ఎక్కడి శక్తి.
    చాలా నచ్చింది.