సున్నితమైన హాస్యన్ని సునిశితముగా కథలో చక్కగా పండించారు. భానుమతిగారి కథలను గుర్తుకు తెచ్చారు
ఒక మంచి కథను చదివిన అనుభూతిని మిగిల్చారు. మీ నుంచి ఇంకా ఎన్నో ఇటువంటి కథలు రావలని ఆశిస్తూ.
—– మంగు శివ రాం ప్రసాద్ , విశాఖపట్టణం
దాడి తులసి గారి “దాడి” చూసి కలిగిన కుతూహలంతో వెనక్కి వెళ్ళి ఈ ఆడియోని విన్నాను. ఆవిడ అభిప్రాయం కారణం గా నేను ఇన్నేళ్ళూ వినని ఈ టేపుని వినగలిగినందుకు ముందుగా తులసి గారికి థాంక్స్ చెబుతున్నాను.
అలాగే పరుచూరి శ్రీనివాస్ గారికీ మాధవ్ మాచవరం గారికీ కూడా నా సంతోషాన్ని తెలియజేసుకుంటున్నాను. రజని అడిగిన “మెత్త మెత్తని” ప్రశ్నలకి పాపం చలం ఏం అవస్థ పడ్డాడో జవాబులు చెబుతున్నప్పుడు అని నవ్వొచ్చింది. ఇంటర్వూ చేసిన కాలాన్ని కూడా ఈమాట వారు ఇవ్వగలిగితే బాగుండి ఉండేది. చలం అంతర్ముఖత్వం స్పష్టంగా వినిపిస్తూంది చివరాఖరుకి , అలాగే చలం మీద చెప్పిన విశ్వనాధ, శ్రీశ్రీ ల అభిప్రాయాలు సైతం ప్రత్యేకంగా ఉన్నాయి. బాగున్నాయి. గొప్పగా ఉన్నాయి. ముఖ్యంగా “చెలియలికట్ట” రాసిన విశ్వనాధ, చలం గురించి చెప్పిన వాక్యాలు ఎవరైనా ఎక్కడైనా పునరుద్ఘాటించవలసినవి.
తులసి గారూ!! మీ అభిప్రాయం మీద నేను అభిప్రాయం చెప్పాలని మాత్రం కాదు, అలాగే చలాన్ని ఇవాళేదో ప్రత్యేకంగా నిర్వచించాలనీ కూడా కాదు, లేదా సమర్ధించాలని కూడా కాదు. కానీ గమనించండి మీరు, చలం వివాహ వ్యవస్థని నమ్మిన వాడు కాదు. దాన్ని ఆచరించిన వాడూ కాదు. తన కూతుళ్లకి ఎప్పుడూ ఆయన పెళ్ళి ఊసు తలపెట్ట లేదు సరికదా పెళ్ళిళ్ళు చేసుకోకండని వారితో చెప్పిన వాడు. తాను నమ్మిన వాటినే ఆయన ఆచరించి బతికాడు. వివాహవ్యవస్థ మీద తిరుగుబాటు చేసిన వ్యక్తిని మనం ఆ ప్రమాణాలతో చూసే వీలు లేదు. చలం రాసిన వాటిని మీరు ఒప్పుకోకపోవచ్చు. చలాన్ని మీరు విమర్శించవచ్చు. కానీ చలం ఒక గృహస్తు లాగా బతకడానికో, అలాంటి ఒక విషయాన్ని “ఆదర్శం” గా చూపించడానికో ఏనాడూ ప్రయత్నం కూడా చేయలేదు. అందుకోసం ఆయన తన రచనలు చేయలేదు. రజనికాంత రావుగారు చలంతో ఆయన వెనకటి రచనల ప్రస్తావన చెసినప్పుడు చలం మళ్ళీ ఆ రచనలనే చేయవలసి వస్తే అంతకన్నా మరింత ఘాటుగా ఎలా రాయాలా అని ఆలోచిస్తానని అన్నాడు! అలాంటి వారితో కలిసి జీవించడం ఆయన భార్యకి అంత సులువైన విషయమేమీ కాదు, నిజమే. అయినా, ఆవిడ మీరు ఆశించినట్టు గా ఎందుకని “విముక్తి” అనుకుంటూ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోలేదో! మీరు చూడని అంశమేదో ఆమె తన భర్తలో బహుశా చూడగలిగిందేమో మరి! లేకపోతే రంగనాయకమ్మ గారు అన్నేళ్ళు చలంతో సహజీవనం చేయగలిగేది కాదు కదా?
మీరు చలాన్ని విమర్శించిన దానికన్నా ఎక్కువగా చలం తనని తాను విమర్శించుకున్నాడు. ఆయన తన ఆత్మకధని మొదలుపెడుతూ అన్న మాటలని ఎప్పుడైనా చదివిచూడండి. ఆయన అభిప్రాయాలు ఆయన రాసిన “బిడ్దల శిక్షణ” లోనీ “స్త్రీ” లోనీ ఆయన ఆత్మకధ లోనీ స్పష్టం గానే ఉన్నాయి.
చలం వివాదాస్పదం కావడానికి ఆయన “శృంగారం” గురించి రాయడం కారణం కాదు. చలం కన్నా ముందు తెలుగు సాహిత్యం నిండా ఉన్నది శృంగారమే!! వాటిని ఎవరూ తిట్టలేదేం? ఎందుకంటారూ?? ఎందుకంటే వాటి పాఠక వర్గం లో స్త్రీలు లేరు. కనీశం స్త్రీలు ఉండొచ్చును అన్న స్పృహ కూడా ఆ ప్రాచీన “శృంగార” రచయితలకి లేదు. ప్రాచీనమేం ఖర్మ ఆధునిక రచయితలకీ చాలామందికి లేదు. ఆనాటి రచనలన్నీ పురుషుల కోసం పురుషులు రాసుకున్న శృంగార రచనలు. కొద్దో గొప్పో స్త్రీలు రాసినా వారు కూడా ఆ శృంగార చట్రాన్నే ఒప్పేసుకుని ఆ తరహాలోనే తాము సైతం రచించిన శృంగారం! కానీ చలం రచనల్లోని స్త్రీపురుష సంబంధాలు అంతకు మునుపటి రచనలలో లేనివి. స్త్రీల అనుభవం గురించిన ఆలోచనలని తొలిగా సాహిత్యంలో ప్రస్తావన చేసిన రచయిత వెంకటచలంగారే ! ఆయన రాసిన వాటిని బాహాటంగానో, రహస్యంగానో ఎలాగో అలాగ ఆయన కాలం నాటి స్త్రీలు మాత్రం స్వయంగా చదివారు. చదవడమే కాదు వాటిని వారు నచ్చుకున్నారు. ఆ రాసిన వ్యక్తిని కలవడానికీ ఆయనని చూడడానికీ ఆయనతో మాట్లాడడానికీ తెలుగు సమాజం లోని స్త్రీలు స్వతంత్రించి ధైర్యంగా ప్రయత్నం కూడా చేశారు. దీనినే “ప్రభావితం కావడం” అని అంటారు. ఇలా కేవలం “శృంగారం” రాయడం మాత్రమే కాక ఆయా స్త్రీలు మోస్తున్న కుటుంబవ్యవస్థ లోని లోటుపాట్లని చలం బయట పెట్టడం వలన, వాటిని చదివిన ఆడవాళ్ళు ఎక్కడ కుటుంబాలని వదిలి వెళ్ళిపోతారో అని తెలుగు సమాజం కలత చెంది చలాన్నీ, అతని రచనలనీ నిందించడం జరిగింది. కానీ పాపం! ఏదీ? చలం రచనలని చదివి ఏ భార్యా కుటుంబాలని వదిలి వెళ్ళిపోలేదు. చివరికి చలం భార్యతో సహా 🙂
చలం పుస్తకాలు, అవి సమాజం లో కలిగించిన సంచలనం మాట ఎలా ఉన్నా, ఆయన కూదా సగటు మాగవాడిలాగానే ప్రవర్తించాడు. భార్య అందరినీ, పుట్టింటిని, బంధువులని వదులుకుని తనకోసమే ఉంటే ఆయన మాత్రం శృంగారం, అదీ ఇదీ అంటూ ఇతర స్త్రీల వెనక తిరిగాడు. చివరికి ఆవిడ మనస్తాపం చెంది చనిపోయింది కాని, అసలు ఈ రాతలు చదివి ఆవిడే విముక్తి అనుకుంటూ ఇల్లు వదిలి వెల్లిపోయి ఉంటే ఎలా ఉండేదో?
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి ……
*** http://www.youtube.com/watch?v=JtTQPhR44Z8
***
మంచి పండితులు, రచయిత, సాహితీవేత్త, విశ్వనాథ వారికి పరమ ఆప్తులు అయిన శ్రీ జువ్వాడి గౌతమరావు గారు కాలధర్మం చెందారని విని విచారిస్తున్నాను.
విశ్వనాధవారు తమ “భ్రష్ట యోగి” ఖండకావ్యాన్ని ప్రేమతో గౌతమరావుగారికి అంకితమిస్తూ “తొలుతటి జనుస్సులందలి చెలిమికాడు” గా అభివర్ణించారు. విశ్వనాథ సాహిత్యపీఠం గౌరవాధ్యక్షులు డా. వెలిచాల కొండలరావు గారు తమ సంపాదకత్వంలో వెలువరించిన ఎందరో విద్వాంసుల వ్యాసాల సంకలనం “Viswanatha – A literary Legend“ అనే గ్రంధాన్ని శ్రీ గౌతమరావు గారికి అంకితం ఇచ్చి, వారు కదలలేని అస్వస్థతతో ఉండటంతో ఈ సభను కరీంనగర్ లో ఏర్పాటు చేసారు. ప్రధమ ప్రతిని గౌతమరావుగారి ఇంటికి వెళ్లి అచేతనంగా ఉన్న వారి చేతులకు తాకించి వారి దగ్గర ఈ గ్రంధాన్ని ఉంచారు. ఇది జరిగింది ఈ సంవత్సరం జూన్ ఆరవ తేదీన. కొండలరావుగారితో కరీంనగర్ వెళ్ళిన వాళ్ళలో నేనొకడిని. వారిని ఆ స్థితిలో చూడటం మమ్మల్నందరినీ కలచి వేసింది. వారి స్మృతికి జోహార్లు.
గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి chavakiran అభిప్రాయం:
09/01/2012 12:31 pm
శ్రీపాద పినాకపాణి వారి ఈపుస్తకాలు ఇక్కడ http://kinige.com/kbrowse.php?via=author&name=Dr.+Sripada+Pinakapani&id=155
కళాపూర్ణోదయం -4: సుగాత్రీశాలీనులు గురించి mangu sivaram prasad అభిప్రాయం:
09/01/2012 5:38 am
కళా పూర్ణోదయంలొని సుగాత్రీ శాలీనుల ఉపాఖ్యానం ఎంతో రసవత్తరమైనది. ఇటివంటి అద్భుతమైన ప్రభంథాన్ని సరళమైన వచనంలో అందిస్తున్నందుకు ధన్యవాదాలు.
—మంగు శివ రాం ప్రసాద్, విశాఖపట్టణం
ఉరుము ఉరిమి… గురించి mangu sivaram prasad అభిప్రాయం:
09/01/2012 5:08 am
సున్నితమైన హాస్యన్ని సునిశితముగా కథలో చక్కగా పండించారు. భానుమతిగారి కథలను గుర్తుకు తెచ్చారు
ఒక మంచి కథను చదివిన అనుభూతిని మిగిల్చారు. మీ నుంచి ఇంకా ఎన్నో ఇటువంటి కథలు రావలని ఆశిస్తూ.
—– మంగు శివ రాం ప్రసాద్ , విశాఖపట్టణం
చలంతో రజని ముఖాముఖి గురించి rama bharadwaj అభిప్రాయం:
08/30/2012 2:45 pm
దాడి తులసి గారి “దాడి” చూసి కలిగిన కుతూహలంతో వెనక్కి వెళ్ళి ఈ ఆడియోని విన్నాను. ఆవిడ అభిప్రాయం కారణం గా నేను ఇన్నేళ్ళూ వినని ఈ టేపుని వినగలిగినందుకు ముందుగా తులసి గారికి థాంక్స్ చెబుతున్నాను.
అలాగే పరుచూరి శ్రీనివాస్ గారికీ మాధవ్ మాచవరం గారికీ కూడా నా సంతోషాన్ని తెలియజేసుకుంటున్నాను. రజని అడిగిన “మెత్త మెత్తని” ప్రశ్నలకి పాపం చలం ఏం అవస్థ పడ్డాడో జవాబులు చెబుతున్నప్పుడు అని నవ్వొచ్చింది. ఇంటర్వూ చేసిన కాలాన్ని కూడా ఈమాట వారు ఇవ్వగలిగితే బాగుండి ఉండేది. చలం అంతర్ముఖత్వం స్పష్టంగా వినిపిస్తూంది చివరాఖరుకి , అలాగే చలం మీద చెప్పిన విశ్వనాధ, శ్రీశ్రీ ల అభిప్రాయాలు సైతం ప్రత్యేకంగా ఉన్నాయి. బాగున్నాయి. గొప్పగా ఉన్నాయి. ముఖ్యంగా “చెలియలికట్ట” రాసిన విశ్వనాధ, చలం గురించి చెప్పిన వాక్యాలు ఎవరైనా ఎక్కడైనా పునరుద్ఘాటించవలసినవి.
తులసి గారూ!! మీ అభిప్రాయం మీద నేను అభిప్రాయం చెప్పాలని మాత్రం కాదు, అలాగే చలాన్ని ఇవాళేదో ప్రత్యేకంగా నిర్వచించాలనీ కూడా కాదు, లేదా సమర్ధించాలని కూడా కాదు. కానీ గమనించండి మీరు, చలం వివాహ వ్యవస్థని నమ్మిన వాడు కాదు. దాన్ని ఆచరించిన వాడూ కాదు. తన కూతుళ్లకి ఎప్పుడూ ఆయన పెళ్ళి ఊసు తలపెట్ట లేదు సరికదా పెళ్ళిళ్ళు చేసుకోకండని వారితో చెప్పిన వాడు. తాను నమ్మిన వాటినే ఆయన ఆచరించి బతికాడు. వివాహవ్యవస్థ మీద తిరుగుబాటు చేసిన వ్యక్తిని మనం ఆ ప్రమాణాలతో చూసే వీలు లేదు. చలం రాసిన వాటిని మీరు ఒప్పుకోకపోవచ్చు. చలాన్ని మీరు విమర్శించవచ్చు. కానీ చలం ఒక గృహస్తు లాగా బతకడానికో, అలాంటి ఒక విషయాన్ని “ఆదర్శం” గా చూపించడానికో ఏనాడూ ప్రయత్నం కూడా చేయలేదు. అందుకోసం ఆయన తన రచనలు చేయలేదు. రజనికాంత రావుగారు చలంతో ఆయన వెనకటి రచనల ప్రస్తావన చెసినప్పుడు చలం మళ్ళీ ఆ రచనలనే చేయవలసి వస్తే అంతకన్నా మరింత ఘాటుగా ఎలా రాయాలా అని ఆలోచిస్తానని అన్నాడు! అలాంటి వారితో కలిసి జీవించడం ఆయన భార్యకి అంత సులువైన విషయమేమీ కాదు, నిజమే. అయినా, ఆవిడ మీరు ఆశించినట్టు గా ఎందుకని “విముక్తి” అనుకుంటూ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోలేదో! మీరు చూడని అంశమేదో ఆమె తన భర్తలో బహుశా చూడగలిగిందేమో మరి! లేకపోతే రంగనాయకమ్మ గారు అన్నేళ్ళు చలంతో సహజీవనం చేయగలిగేది కాదు కదా?
మీరు చలాన్ని విమర్శించిన దానికన్నా ఎక్కువగా చలం తనని తాను విమర్శించుకున్నాడు. ఆయన తన ఆత్మకధని మొదలుపెడుతూ అన్న మాటలని ఎప్పుడైనా చదివిచూడండి. ఆయన అభిప్రాయాలు ఆయన రాసిన “బిడ్దల శిక్షణ” లోనీ “స్త్రీ” లోనీ ఆయన ఆత్మకధ లోనీ స్పష్టం గానే ఉన్నాయి.
చలం వివాదాస్పదం కావడానికి ఆయన “శృంగారం” గురించి రాయడం కారణం కాదు. చలం కన్నా ముందు తెలుగు సాహిత్యం నిండా ఉన్నది శృంగారమే!! వాటిని ఎవరూ తిట్టలేదేం? ఎందుకంటారూ?? ఎందుకంటే వాటి పాఠక వర్గం లో స్త్రీలు లేరు. కనీశం స్త్రీలు ఉండొచ్చును అన్న స్పృహ కూడా ఆ ప్రాచీన “శృంగార” రచయితలకి లేదు. ప్రాచీనమేం ఖర్మ ఆధునిక రచయితలకీ చాలామందికి లేదు. ఆనాటి రచనలన్నీ పురుషుల కోసం పురుషులు రాసుకున్న శృంగార రచనలు. కొద్దో గొప్పో స్త్రీలు రాసినా వారు కూడా ఆ శృంగార చట్రాన్నే ఒప్పేసుకుని ఆ తరహాలోనే తాము సైతం రచించిన శృంగారం! కానీ చలం రచనల్లోని స్త్రీపురుష సంబంధాలు అంతకు మునుపటి రచనలలో లేనివి. స్త్రీల అనుభవం గురించిన ఆలోచనలని తొలిగా సాహిత్యంలో ప్రస్తావన చేసిన రచయిత వెంకటచలంగారే ! ఆయన రాసిన వాటిని బాహాటంగానో, రహస్యంగానో ఎలాగో అలాగ ఆయన కాలం నాటి స్త్రీలు మాత్రం స్వయంగా చదివారు. చదవడమే కాదు వాటిని వారు నచ్చుకున్నారు. ఆ రాసిన వ్యక్తిని కలవడానికీ ఆయనని చూడడానికీ ఆయనతో మాట్లాడడానికీ తెలుగు సమాజం లోని స్త్రీలు స్వతంత్రించి ధైర్యంగా ప్రయత్నం కూడా చేశారు. దీనినే “ప్రభావితం కావడం” అని అంటారు. ఇలా కేవలం “శృంగారం” రాయడం మాత్రమే కాక ఆయా స్త్రీలు మోస్తున్న కుటుంబవ్యవస్థ లోని లోటుపాట్లని చలం బయట పెట్టడం వలన, వాటిని చదివిన ఆడవాళ్ళు ఎక్కడ కుటుంబాలని వదిలి వెళ్ళిపోతారో అని తెలుగు సమాజం కలత చెంది చలాన్నీ, అతని రచనలనీ నిందించడం జరిగింది. కానీ పాపం! ఏదీ? చలం రచనలని చదివి ఏ భార్యా కుటుంబాలని వదిలి వెళ్ళిపోలేదు. చివరికి చలం భార్యతో సహా 🙂
రమ.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి BVS PRASAD అభిప్రాయం:
08/30/2012 1:15 am
నాకూ జ్యోతిష్యం లో ఆసక్తి ఉంది. ఇంతకాలం మీ బ్లాగ్ ఎలా మిస్ అయ్యనా అనిపిస్తొంది. చాలా మంచి సమాచారము అందించారు. ధన్యవాదములు. దయచేసి రాస్తూ ఉండండి.
ఇటు నేనే – అటు నేనే గురించి తః తః అభిప్రాయం:
08/29/2012 11:54 pm
‘ఇటు నేనే – అటు నేనే’ చదివిన వారందరికీ కృతజ్ఞతలు. అభిప్రాయాలు తెలియజేసిన వారికి మరిన్ని.
తః తః
చలంతో రజని ముఖాముఖి గురించి Tulasi Dadi అభిప్రాయం:
08/29/2012 4:23 pm
చలం పుస్తకాలు, అవి సమాజం లో కలిగించిన సంచలనం మాట ఎలా ఉన్నా, ఆయన కూదా సగటు మాగవాడిలాగానే ప్రవర్తించాడు. భార్య అందరినీ, పుట్టింటిని, బంధువులని వదులుకుని తనకోసమే ఉంటే ఆయన మాత్రం శృంగారం, అదీ ఇదీ అంటూ ఇతర స్త్రీల వెనక తిరిగాడు. చివరికి ఆవిడ మనస్తాపం చెంది చనిపోయింది కాని, అసలు ఈ రాతలు చదివి ఆవిడే విముక్తి అనుకుంటూ ఇల్లు వదిలి వెల్లిపోయి ఉంటే ఎలా ఉండేదో?
ఈమాట జులై 2012 సంచికకి స్వాగతం! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
08/29/2012 2:14 am
అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేసుకుంటూ..ఇదిగో ఈ మాట లో ఈ పాటను అందిస్తూ..
జై తెలుగు తల్లి!
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి ……
***
http://www.youtube.com/watch?v=JtTQPhR44Z8
***
ఈమాట జులై 2012 సంచికకి స్వాగతం! గురించి C.S.Rao అభిప్రాయం:
08/26/2012 7:39 pm
మంచి పండితులు, రచయిత, సాహితీవేత్త, విశ్వనాథ వారికి పరమ ఆప్తులు అయిన శ్రీ జువ్వాడి గౌతమరావు గారు కాలధర్మం చెందారని విని విచారిస్తున్నాను.
విశ్వనాధవారు తమ “భ్రష్ట యోగి” ఖండకావ్యాన్ని ప్రేమతో గౌతమరావుగారికి అంకితమిస్తూ “తొలుతటి జనుస్సులందలి చెలిమికాడు” గా అభివర్ణించారు. విశ్వనాథ సాహిత్యపీఠం గౌరవాధ్యక్షులు డా. వెలిచాల కొండలరావు గారు తమ సంపాదకత్వంలో వెలువరించిన ఎందరో విద్వాంసుల వ్యాసాల సంకలనం “Viswanatha – A literary Legend“ అనే గ్రంధాన్ని శ్రీ గౌతమరావు గారికి అంకితం ఇచ్చి, వారు కదలలేని అస్వస్థతతో ఉండటంతో ఈ సభను కరీంనగర్ లో ఏర్పాటు చేసారు. ప్రధమ ప్రతిని గౌతమరావుగారి ఇంటికి వెళ్లి అచేతనంగా ఉన్న వారి చేతులకు తాకించి వారి దగ్గర ఈ గ్రంధాన్ని ఉంచారు. ఇది జరిగింది ఈ సంవత్సరం జూన్ ఆరవ తేదీన. కొండలరావుగారితో కరీంనగర్ వెళ్ళిన వాళ్ళలో నేనొకడిని. వారిని ఆ స్థితిలో చూడటం మమ్మల్నందరినీ కలచి వేసింది. వారి స్మృతికి జోహార్లు.
సి.ఎస్ .రావ్
ఈమాట జులై 2012 సంచికకి స్వాగతం! గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
08/26/2012 2:52 am
కల్పవృక్షపు మరో పండుటాకు రాలిపోయింది 🙁