నా వ్యాసమునకు స్పందించిన పాఠకలోకమునకు వినయపూర్వకమైన వందనములు.
ఛందస్సు నిజముగా ఒక మహాసాగరమే, అది సంగీత, సాహిత్య, గణితాదులవంటి ఎన్నో జ్ఞానస్రవంతులను కలుపుతుంది. చెలియలికట్టపై కూర్చుండి ఆ అలలను చూస్తూ, తీరములోని సైకతముపై ఇసుకతో ఇండ్లు కట్టుతూ, ఒక చిన్ని గవ్వను, ఒక నత్త గుల్లను చూసి ఆనందపడే స్వభావము నాది.
ఈ సమయములో న్యూటన్ విజ్ఞాని ఈ వాక్కులు స్మరణియము – I was like a boy playing on the sea-shore, and diverting myself now and then finding a smoother pebble or a prettier shell than ordinary, whilst the great ocean of truth lay all undiscovered before me.
వేలూరిగారు, భూషణ్ గారు, ఛందస్సుపైన పుస్తకాలు తేవాలనే నా ప్రయత్నము కూడ. మీ ప్రోత్సాహానికి, సహాయానికి సదా కృతజ్ఞుడిని. తప్పు నాదే. సమయాభావము, తాత్సారము, అనారోగ్యము ఇత్యాదులు ఎన్నో కారణాలు.
రమ గారు, నాకు కూడ ఛందశ్శాస్త్రాధ్యయనారంభములో అన్నీ అయోమయమే. కాలక్రమేణ అర్థమయి నేడు కొద్దిగా స్వతంత్రముగా ఆలోచించే అవకాశము కలిగినది. సంస్కృత ప్రాకృత ఛందస్సులలో జ-గణానికి పెద్ద పీట. నవవిధములైన ఆర్య మాత్రమే (అందులో కందము కూడ ఒకటి) కాదు, పజ్ఝటికవంటి పద్యాలలో కూడ జ-గణమునకు గొప్ప స్థానము ఉన్నది. అందుకే దానికి నరేంద్ర అని పేరు. పాదాంతమునుండి తరువాతి పాదమునకు పదములను లాగుకొని వెళ్లడము మొట్టమొదట కన్నడ కవులు ఆరంభించారు, తరువాత తెలుగు కవులు అనుసరించారు. అందుకే పంకరుహ దళేక్షణ పం కరుహ దళేక్షణ అయినది 🙂 దేశి ఛందస్సులో సామాన్యముగా ఏ పాదానికి ఆ పాదము స్వతంత్రముగా ఉంటుంది. రగడలలో, ద్విపదలలో ఇది ఒక నియమము కూడ.
నా ఉద్దేశములో మొదట లఘువు తరువాత గురువు ఉండినప్పుడు, పదముల ఉచ్చరణలో ఆ మొదటి లఘువు సరిగా వినబడని కారణమువలన ఎదురునడకను కవులు, సంగీతకారులు ఆచరించలేదు అనుకొంటాను. కాని సంస్కృతములో సుప్రసిద్ధ వృత్తములయిన పంచచామరము, భుజంగప్రయాతము, శిఖరిణి మున్నగునవి ల-గారంభమే.
కామేశ్వరరావు గారు, నా బాల్యములో తెలుగులో పద్యాలు వ్రాయడానికి ఆరంభించినప్పుడు గణభంగము కాకుండ కాపాడుకోవడము ఒక గొప్ప కసరత్తుగా ఉండేది, కాని వాటిని చదవడము నాకే కష్టముగా ఉండేది 🙂 పద్యములలో లయ ప్రధానము. మీరుదహరించిన సీస పాదములో ఎదురు నడక ఉన్నది, కాని మనకు సుపరిచితమయిన సీసపు నడక అందులో లేదు. రెండు ఇంద్రగణములకు బదులు మూడు సూర్య గణములను ఉపయోగించవచ్చును. దీనిని ఆధారము చేసికొని ఒకప్పుడు సీసపద్యమును త్ర్యస్రగతిలో వ్రాసినాను. కాని దానిని సీసము అని చెప్పడము కష్టమే 🙂 అది –
సీసము-
ఆకసమ్ము వెలిగె నాకు ముదము గల్గె
చీక టంత తొలగె శ్రీలు జెలగె
వేకువాయె గనర వేగ పాట వినర
కేకి నటన మాడె కేక తోడ
ప్రాకటముగ బూచె వనమునందు విరులు
మ్రాకునందు గదలె నాకు లెల్ల
తోక నూపుకొనుచు తొంగి చూచె గపులు
దూకి నడచె లేగ దూడ లెన్నొ
ఆటవెలది (సీసము)-
నీకు లేవ నిపుడు నిజము సమయ మాయె
స్వీకరించు ప్రణతు లో కళాత్మ
నీ కరాబ్జముల ననేక వరము లిమ్ము
మాకు నగును గాత మంగళమ్ము
ఏది ఏమైనా ముఖ్యముగా పద్యమునకు ఒక తూగు ఉండాలి. వాక్యం రసాత్మకం కావ్యం అన్నట్లు పద్యం లయాత్మకం ఛందస్ అని చెప్పవచ్చును.
కామేశ్ గారు, స-గణమును ఎదురు నడక అని చెప్పలేము. చతుర్మాత్రలలో రగడలాటి మాత్రాఛందస్సులలో జ-గణమే నిషిద్ధము.
అక్షర గణముల వృత్త సంఖ్య తెలిసికొనవలసినప్పుడు, అందులోని గురు-లఘువుల సంఖ్య ఆ వృత్తము ఎన్నవ ఛందములో పుట్టినదో అనే విషయమును తెలుపుతుంది. మాత్రా ఛందస్సు విషయములో ఆ వృత్తపు మాత్రల సంఖ్య గురులఘువుల అమరికనుండి తెలిసికొనవచ్చును. అంశగణముల విషయములో ఒక వృత్తములో మొదటి అక్షరము గురువైనప్పుడు కష్టము లేదు, అందులోని మొత్తము అక్షరముల సంఖ్య ఆ ఛందపు సంఖ్య తెలుపుతుంది. ఉదాహరణకు, UII UII UII UU వృత్తము 11వ ఛందములో జనించినది. అక్షరగణములైనా, అంశగణములైనా ఇది 11వ ఛందమే. కాని వృత్తము లఘువుతో ప్రారంభమయితే, గురులఘువుల మొత్తము సంఖ్యనుండి ఒకటి తీసివేయవలయును. ఇది ఎందుకంటే మనము ఈ గణముల ప్రస్తారమును అప్పకవి తెలిపిన ఆ విధముగా చేసియున్నాము. ఉదాహరణకు, వృత్తపు గురులఘువులు IIII UII IIII UU అయినప్పుడు, ఈ వృత్తము 12వ ఛందమునకు చేరినది (లఘ్వాదిగా గల ఈ వృత్తపు మొత్తము గురులఘువుల సంఖ్య 13నుండి ఒకటి తీసివేయగా వచ్చిన ఫలితము). అక్షరగణరీత్యా ఈ వృత్తము 13వ ఛందమునకు చెందినది, అంశగణారీత్యా యిది 12వ ఛందమునకు చెందినది.
Combinatrics పాఠం Coins, Cards బదులు ఈ షట్ప్రత్యయాలను ఉదాహరణలుగా తీసుకొని చెప్పే రోజులు వస్తే ఎంత బాగుణ్ణు!
ఇది చాలా ముఖ్యమైన ఆకాంక్ష. ఇది నిజం అవాలంటే మనకు మనదైన శాస్త్ర సంపద, దాని ద్వారా వచ్చిన శక్తి ఉండాలి. పాణిని, పింగళ, గోవింద, విరహాంకాదులు విలసిల్లే వాతావరణం మళ్ళీ రావాలి. చైనా ఆ ప్రయత్నంలో ఉంది. చాలా త్వరలొ మనం చైనీస్ పరిభాష వాడుతామేమో. మనం ఆ దరిదాపుల్లొ లేము.
శ్రీ మోహన ఒక ఆదర్శ వంతుడైన వ్యాసకర్త. వారికి నా నమస్కారాలు.
మహనీయులు శ్రీ పినాకపాణి గారి పై మంచి వ్యాసం అందించిన శ్రీ గొర్తికి అభినందనలు.
ఈవ్యాసానికన్నా ముందే తెలుగులో(కూడా) వస్తున్న పక్ష పత్రిక The Sunday Indian మంగళవారం, సెప్టెంబర్ 4, 2012 సంచికలో నూరు వసంతాల శ్రీ శ్రీపాద వారిపై వ్యాసం చదివాను. విశాఖ పట్నంలొ ఆయన మిత్రులు డాక్టర్ బ్రహ్మయ్య శాస్త్రి గారు తదితరులు శ్రీపాద వారు పిట్టల కూతలకీ, తలుపుల చప్పుళ్ళకీ కూడా నొటేషన్ రాస్తుండేవారని ఆయన కచేరీ చేసిన ఒక సభ లొ అనుకోవడం నేను విన్నాను.
ఆ సభ లొనే వారు పాడిన “చల్లరే…” [ఆహిరి , త్యాగరాజు] నాకు గుర్తుండి పొయింది.
The Sunday Indian లో వ్యాసంలో [శాస్త్రీయ]సంగీతంలో ఉన్న సాహిత్యం మీద వారి అభిప్రాయం, చాలా బాధాకరంగా ఉంది. సంగీతంలో ఉన్న సాహిత్యాన్ని ‘పిప్పి’ గా వారు చూస్తారు. వారు ఎంత పెద్ద వారైనా ఈ విషయంలో ఈ పాత కాలపు తమిళ ధోరణి దుర్భరం. ఇదే కారణంగానేమో ధారావాహికగా చాలా సంవత్సరాల క్రితం వచ్చిన వారి ఆత్మ కధలో వారు బాల మురళి ని ప్రస్తావించలేదన్నట్టుగా గుర్తు.[పట్టాభిరామయ్య గారు తనని మెచ్చుకున్నారని అందులొ వారు ఒక చోట అన్నారు]. అలాగే కొత్త రాగాల విషయంలొనూ అన్యాపదేశంగా బాలమురళి మీద ఒక కరుకుదనం వినపడుతుంది. వారి అంతరాంతరాలలొ బాలమురళికి సంగీతం రాదన్న అభిప్రాయం ఉందేమోనని అనిపిస్తుంది నాకు. ఈ విషయం మీద The Sunday Indian వ్యాసం చదివిన వారు గానీ ఇతరులు గానీ యెవరైనా ఈమాటలో రాస్తే చదవాలని ఉంది.
“ఒక ఛందములో వృత్త సంఖ్య కావలసినప్పుడు, ముందు అది ఎన్నవ ఛందమో తెలిసికోవాలి. ఉదాహరణకు అది 12వ ఛందమనుకొందాము. …” అని మొదలయ్యే పేరా మాత్రం నాకు సరిగా అర్థం కాలేదు.”-కామేశ్వరరావు
(”అరెరే, అరెరే,” క్యా హువా, ఐ ఫీల్ సో సాడ్ యార్!)
Nevermind. So Sorry! Ignore my parroting దిల్ తొ పాగల్ హై. But read the following.
కొత్త సంగీత విద్యాదర్పణము ( ఏకా సుబ్బారావుతో సమకూర్చబడినది.) 486 పేజీ – “ఈ డెబ్బది రెండు మేళకర్త రాగముల పేళ్ళ యొక్క మొదటి రెండు వర్ణములను కాదినవ, టాదినవ, పాదిపంచక, యాదృష్ట్యమను వాటియందు సదరు మేళకర్తల పేళ్ళయొక్క మొదటి యక్షర సంఖ్యను ( ఏకస్థానంబునను అనగా; మొట్టమొదట వ్రాయునట్టి సంఖ్యను ఏకస్థానమని ఎరుంగునది.) రెండవ యక్షర సంఖ్యను ( దశస్థానమందును అనగా, మొదట వ్రాయబడిన సంఖ్యకు ఎడమ వైపున మరియొక సంఖ్యనుంచుట దశస్థానమని నెరుగునది.) ఇటుల వ్రాసి చూడగా అది ఎన్నవ సంఖ్య మేళకర్త యైనదిన్ని తేటబడును. అదెట్లనిన?”
Keep reading. Look at the 72. మేళకర్తల స్వరస్థానములను తెలిపెడు పథకము on the next page (487:-)) . keep reading. Go to the next page 488.
“ఈ పథకమునందు ఉదహరించబడియున్న డెబ్బదిరెండు మేళకర్త రాగముల యొక్క స్వరస్థానములను దెలిసికొనెడిమార్గమెటువలెనంటె? అందు మొదటి గదిలో 1టో సంఖ్యగల కనకాంగి రాగము యొక్క స్వరస్థానములను దెలియవలసినపుడు సదరు రాగమునకు కుడిదిక్కునయుండు రిషభగాంధార మధ్యమమును దానికింది దిక్కున యుండు ధైవతనిషాదములను జూచినట్లయిన ఆ రాగము యొక్క స్వరస్థానములు స్పష్టముగా తెలియుచున్నది. ఇట్లే అన్నిటియందు నూహించునది.”
ఇలాంటి వ్యాసాలు, నాకు తెలిసినంతలో, తెలుగులో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి! చందో లక్షణ గ్రంథాలలో కూడా, సాధారణంగా, షట్ప్రత్యయాలు అక్షరగణాలకు మాత్రమే పరిమితం. వాటిని మాత్రాగణాలకే కాక, దేశీ ఛందస్సులో కనిపించే విశేష గణాలకు కూడా విస్తరించడం చాలా గొప్ప విషయం. ప్రత్యేకించి, ఛందస్సూ గణితమూ – రెండిటి మీదా ఆసక్తి ఉన్న నాలాంటి వాళ్ళకిది మాంచి విందుభోజనమే! మన విద్యాలయాలలో Combinatorics పాఠం Coins, Cards బదులు ఈ షట్ప్రత్యయాలను ఉదాహరణలుగా తీసుకొని చెప్పే రోజులు వస్తే ఎంత బాగుణ్ణు!
“ఒక ఛందములో వృత్త సంఖ్య కావలసినప్పుడు, ముందు అది ఎన్నవ ఛందమో తెలిసికోవాలి. ఉదాహరణకు అది 12వ ఛందమనుకొందాము. …” అని మొదలయ్యే పేరా మాత్రం నాకు సరిగా అర్థం కాలేదు.
ఎదురునడక, దేశి గణాల గురించి. వ్యాసంలో చెప్పినట్టుగా ఒక లఘువుతో మొదలుపెట్టకుండా, ఒక గురువు లేదా రెండు లఘువులతో మొదలుపెట్టి ప్రస్తారం చెయ్యడం మూలంగా చాలా వరుకూ ఎదురునడక అరికట్టబడింది. అయితే, పద్యం మొదట లఘు గురువులు రాకపోయినా (అంటే త్రిశ్రగతిలో ఎదురునడక అనుకోవచ్చా?), IIU, UU వంటి గణాలవల్ల కూడా ఎదురునడకలాంటిది వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు రెండు సగణాలు వరుసగా వేస్తే (“అరెరే, అరెరే, వయసే” లాగ), అది ఎదురునడక లాగానే ఉంటుంది కదా (ఇది చతురశ్రగతిలో ఎదురునడక అనవచ్చా?). తెలుగులో యిది కూడా చాలా వరకూ పరిహరింపబడింది. అయితే తెలుగు గణాలను ఉపయోగించి కూడా ఎదురునడక రప్పించవచ్చు. ఉదాహరణకు:
రావూరివారి పుస్తకం ప్రస్తుతం నా దగ్గర లేదు కాని, సంపత్కుమారగారి తెలుగు ఛందోవికాసం ప్రకారం, మధ్యాక్కరలో మాత్రమే సూర్యగణాలైన III, UI బదులు వేరే గణాలు నన్నయ్యగారి పద్యాలలో కనిపిస్తాయి. గగ, స గణాలే కాక, భ, జ కూడా కనిపిస్తాయి! అలాగే ఇంద్రగణాలలో కూడా తేడాలున్నాయి. అయితే అవి నడకకు ప్రత్యేకతనేమీ ఇచ్చినట్టుగా అనిపించవు. అవి లేఖక దోషాలే అయి ఉంటాయని సంపత్కుమారగారు అభిప్రాయబడ్డారు. పాదం/పాదభాగం చివర ఉండే సూర్యగణాల బదులు గగ, స గణాలు వేస్తే నడక బాగుంటుందని నేను అంగీకరిస్తాను. ఉదాహరణకు, “కవనాల వ్రాసేను నీకై – కావ్యమ్ము లల్లేను నీకై” అన్నప్పుడు మామూలు మధ్యాక్కర నడక కన్నా ధార బాగుంది. అలాగే,
అన్న “ద్విపద” పాదాలు కూడా బాగున్నాయి.
వేరే చోట్ల మాత్రం నడక దెబ్బతింటుందని నా అభిప్రాయం. ఉదాహరణకు సీసపాదం చివర రెండు సూర్యగణాలకు బదులు స-స వస్తే నడక చెడుతుంది. అలాగే ఆటవెలది, తేటగీతులలో కూడా.
మోహనగారూ,
ఇంత అరుదైన, అద్భుతమైన వ్యాసాన్ని అందించినందుకు మనఃపూర్వక అభివాదనాలు, అభినందనాలు. మీ కృషికి జోహార్లు!
పండిత మహాశయా ఇదే నా పాదాభివందన శతం, అంగీకరించి నన్ను ధన్యుని చేయ ప్రార్థన. నిజమైన పండితుల రచన చూసే భాగ్యం ఇవాళ కలిగింది. భాషలోకాని ఛందస్సులో కాని గణితంలోకాని పిపీలకం కన్న కనాకష్టమైన వాడినే ఐనా మూటి మీద ఉత్తి ఇష్టం మాత్రం ఉన్న వాణ్ణి. అలాంటి నాకు మీ వ్యాసం అర్థంకాని మాట నిజమేకాని, చూసే అదృష్టం కలిగిందనే స్పృహ పాటి కలిగిన వాడిని. గణనాధ్యాయ మనే పేరు పెట్టేసుకొని ఏదో చేసేస్తున్నాననే ఆశ లావు పీక సన్నంగాడిని. ఐనా నా పాదాభివందనాలు స్వీకరించ మని అర్థిస్తున్న ఆశాజీవిని. తెలుగుకి తగిన ఉత్కృష్టత తేగలిగిన మీ లాంటి మహోన్నతులు మరెందరో రావాలని మా నల్లనయ్యను ఇందుమూలంగా ప్రార్థిస్తున్నాను.
బల్రాజ్ సహానీ ప్రసంగ వ్యాసాన్ని బాగా అనువాదం చేశారు. సోషలిజానికి “సమాజవాదం” అని వాడినట్టున్నారు మీరు. అది చప్పున అర్ధం అయ్యేలా లేదు. “సామ్యవాదం” అని అనడానికి మీకు అభ్యంతరం ఎందుకు కలిగిందీ? అవసరం అయినప్పుడు కొత్త పదాన్ని సృshTiMచడంలో తప్పేం లేదు గానీ, ఉన్న పదం బాగానే ఉపయోగపడుతున్నప్పుడు మళ్ళీ మరో కొత్త పదం అవసరం ఎందుకూ అని.
మీరన్నది ఇవాళ నిజం. బలరాజ్ సహానీ వ్యక్తపరచిన బాధకి నలభై ఏళ్ళు గడిచాయి గాని దానికి జవాబులు మాత్రం ఏదీ ఇంకా దొరకనే లేదు. ఇప్పటికీ “జీ హుజూర్ గాళ్ళు ” అన్ని రంగాల్లోనూ ఆ రకమైన విధానం వలన మాత్రమే పైకి వస్తూ ఉన్నారు. అందువలన ఎవరన్నా పైకి రావాలీ అంటే అది వారి ప్రతిభ వల్ల కాక ఇతర మార్గాల ద్వారా మాత్రమే అన్న ఒకరకమైన ఉదాశీనతకి సమాజం బలంగా చోటిచ్చింది. ఇది అన్ని రంగాల్లోనూ అమలులో ఉంది. రాజకీయరంగం మొదలుకొని విద్యారంగం దాకా! దీని వల్ల జరిగిన నష్టం అపారమైనది ఆయా రంగాలకి సంబంధించి. మంచి నాయకులు కరువయ్యారు. మంచి టీచర్లు కరువయ్యారు. ఎవరూ బయటికి వచ్చి ఈ ధోరణులని ప్రశ్నించడానికి గానీ ఇందువలన ఉత్తరోత్తరా సమాజంలో కలిగే దుష్పరిణామాల గురించి చర్చించడానికి గానీ వేదికలన్నవి లేకుండా తుడిచేశారు. మనదగ్గర అసలు విమర్శ అన్నది లేదే ఏ రంగం లోని సంగతులని గురించి మాట్లాడడానికి అయినా? విమర్శ అనగానే ఇప్పటికీ బుజాలు తడుముకునే పరిస్థితి. ఎవరూ ముఖ్యమైన విషయాల మీద నోరు మెదపరు కదా? మహా అయితే ఎవరి డ్రాయింగు రూముల్లో వాళ్ళు వాళ్ళ లోపలి ఉక్రోషాలని వెళ్లగక్కుకోవడమే. ఇందువలన నిజంగా ఏ మార్పూ రాదు. కార్యాచరణ కావాలి. అది ముఖ్యం. కానీ ఎలా?
ప్రచార సాధనాలన్నీ సంపూర్తిగా వ్యాపారమయంగా పనిచేస్తున్న పరిస్థితి ఇవాళ ఉంది. దృశ్య మాధ్యమాలు ఎంతగా కలుషితమైపోయాయీ అంటే అస్సలు వాటి ధోరణి మీద బలమైన విమర్శ అన్నదే బయట లేకుండా పోయింది. అయితే మీరు టీవీ లలో వాళ్ళు చూపించే చెత్తని అయినా చూడాలి. లేదా టీవీని కట్టేసుకోవాలి. మినహా మరో వేదిక అన్నదే లేదు. ఇదంతా ఒక గూడుపుఠాణీ అన్నమాట! విశ్వవిద్యాలయాలలో మంచి టీచర్లు లేరివాళ. ప్రతీ వాళ్ళు వాళ్ళ మాట వినేవాళ్ళనే జాగ్రత్త గా ఎంపిక చేసుకోవడంతో అవి గ్రూపు రాజకీయాలకి ఆలవాలమయ్యాయే తప్ప అక్కడ విద్యావేత్త అనే పేరుకి తగిన వాళ్ళు నిజంగా చాలా శాఖల్లో కరువయ్యారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే! అయినా పరిస్థితి ఎందుకని మారలేదు? ఎందుకని అంటే ఇటువంటి వాటిని తెచ్చిపెట్టిన వాళ్ళు నిజంగా చదువుకున్నవాళ్ళే కావడం వలన! ఒక ప్రతిభావంతుడు మరొక ప్రతిభావంతుడిని ఒప్పుకోగల సంయమనం కలిగిన వారు కాకపోవడం! చాలా విచారించవలసిన విషయాలివి. ఒక జాతికీ ఒక భాషకీ అపకారం చేసిన వారు మొదటగా ఆయా ప్రాంతాలలో చదువుకున్న వారే చాలాసార్లు. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. పైరవీలు చేసుకోవడాన్ని భారతీయ నాగరికతలో ఒక భాగం చేసేసారు. అవి చేసుకోగలిగిన వాళ్ళకే అన్ని అవకాశాలు దక్కేలా చేసారు. స్వతంత్రతా స్వభావాన్ని వ్యక్తులలో అణిచేయడానికి ఎన్ని రకాలుగా చేయడానికి వీలుందో అన్నీ చేయగలిగేరు “ఇది ఇంతే మారదు. ఇలా తప్ప మరింక ఎలాగా కూడా పదవి గానీ .. ఉద్యోగం గానీ రాదనే” బలమైన అభిప్రాయానికి యువత వచ్చేలా చేసారు. అధిక సంఖ్యాకులలో వ్యవస్థ మారగలదనే నమ్మకాన్ని సమూలంగా తీసేసారు. ఇది ఇంతే ఇలాగే ఉంటుంది అన్న నిరాశని చదువుకున్న వాళ్లలో ఆ సమాజం కలిగించడం కన్నా దారుణమైన విషయం మరొకటి ఉండబోదు. అందుకు తమ వంతు పాత్ర పోషించిన వారంతా ఇందుకు బాధ్యులే! అయితే వాటి గురించి మాట్లాడే వారు లేరు. మాట్లాడగల చోట్లు నిజంగా లేవు. వార్తా పత్రికలు ఇవాళ రాజకీయనాయకుల కనుసన్నలలో నడవడానికి అలవాటుపడ్డాయి. ప్రజాస్వామ్యానికి ఇంతకన్నా గొడ్దలిపెట్టు ఇంకేముంటుందీ? అయినా మనమందరం బయటికి మాత్రం ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకుంటూంటాం ! నేతి బీరకాయలోని నేయి లాగా అది ఎప్పుడూ పేరులో మాత్రమే ఉంటుంది. ఏ వ్యవస్థా ఎక్కడా నిజంగా “అర్హత గల వ్యక్తుల మీద” ఆధారపడి పని చేయాలని అనుకున్నట్టుగా కనబడదే?
పైగా నిజంగా ధర్మాగ్రహం అయినా రాని ఒక అచేతనమైన స్థితి లోకి ఒక జడత్వం లోకి ప్రజలు వెళ్ళిపోవడం ఇంకా ప్రమాదం కదా? ఆ ప్రమాదాన్ని అయినా తగిన విమర్శ ద్వారా, విషయాలని చర్చ చేయడం ద్వారా మార్చుకునే ప్రయత్నం అయినా చేయాల్సి ఉంది. బలరాజ్ సహానీ బాధ, ఆయన కోరికని గురించి కనీశం ఆలోచించవలసిన బరువూ బాధ్యతా విద్యావంతుల మీద ఇప్పటికైనా ఉండాలి అని నేను ఒక ఆశతో అనుకుంటాను.
సంపాదకులకి,
ఆ ఫొటోలో నేదునూరి కృష్ణ మూర్తి గారి పక్కన ఉన్నది సద్గురు కందుకూరు శివానంద మూర్తి అని తెలుసు నాకు. కానీ ఏదో పరధ్యానంగా సచ్చిదానందమూర్తి అని రాసినట్టున్నాను. అది దొర్లిన పొరపాటే! క్షమించి ఆ తప్పుని సవరించండి.
శ్రీ విన్నకోట రవిశంకర్ గారి కవితా సంకలనం చాలా గొప్పగా ఉంటుంది. ఈ సంకలన సమీక్ష చక్కగా ఉంది. రవి శంకర్ గారి రచన లాగానే ఇది కూడా ఇంచుమించు సమగ్రం గానే ఉంది. ధన్యవాదాలు.
ఛందస్సులో గణితాంశములు గురించి మోహన అభిప్రాయం:
09/04/2012 10:10 am

మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. విధేయుడు – మోహన
ఛందస్సులో గణితాంశములు గురించి తఃతః అభిప్రాయం:
09/04/2012 8:05 am
ఇది చాలా ముఖ్యమైన ఆకాంక్ష. ఇది నిజం అవాలంటే మనకు మనదైన శాస్త్ర సంపద, దాని ద్వారా వచ్చిన శక్తి ఉండాలి. పాణిని, పింగళ, గోవింద, విరహాంకాదులు విలసిల్లే వాతావరణం మళ్ళీ రావాలి. చైనా ఆ ప్రయత్నంలో ఉంది. చాలా త్వరలొ మనం చైనీస్ పరిభాష వాడుతామేమో. మనం ఆ దరిదాపుల్లొ లేము.
శ్రీ మోహన ఒక ఆదర్శ వంతుడైన వ్యాసకర్త. వారికి నా నమస్కారాలు.
గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి తఃతః అభిప్రాయం:
09/04/2012 4:17 am
మహనీయులు శ్రీ పినాకపాణి గారి పై మంచి వ్యాసం అందించిన శ్రీ గొర్తికి అభినందనలు.
ఈవ్యాసానికన్నా ముందే తెలుగులో(కూడా) వస్తున్న పక్ష పత్రిక The Sunday Indian మంగళవారం, సెప్టెంబర్ 4, 2012 సంచికలో నూరు వసంతాల శ్రీ శ్రీపాద వారిపై వ్యాసం చదివాను. విశాఖ పట్నంలొ ఆయన మిత్రులు డాక్టర్ బ్రహ్మయ్య శాస్త్రి గారు తదితరులు శ్రీపాద వారు పిట్టల కూతలకీ, తలుపుల చప్పుళ్ళకీ కూడా నొటేషన్ రాస్తుండేవారని ఆయన కచేరీ చేసిన ఒక సభ లొ అనుకోవడం నేను విన్నాను.
ఆ సభ లొనే వారు పాడిన “చల్లరే…” [ఆహిరి , త్యాగరాజు] నాకు గుర్తుండి పొయింది.
The Sunday Indian లో వ్యాసంలో [శాస్త్రీయ]సంగీతంలో ఉన్న సాహిత్యం మీద వారి అభిప్రాయం, చాలా బాధాకరంగా ఉంది. సంగీతంలో ఉన్న సాహిత్యాన్ని ‘పిప్పి’ గా వారు చూస్తారు. వారు ఎంత పెద్ద వారైనా ఈ విషయంలో ఈ పాత కాలపు తమిళ ధోరణి దుర్భరం. ఇదే కారణంగానేమో ధారావాహికగా చాలా సంవత్సరాల క్రితం వచ్చిన వారి ఆత్మ కధలో వారు బాల మురళి ని ప్రస్తావించలేదన్నట్టుగా గుర్తు.[పట్టాభిరామయ్య గారు తనని మెచ్చుకున్నారని అందులొ వారు ఒక చోట అన్నారు]. అలాగే కొత్త రాగాల విషయంలొనూ అన్యాపదేశంగా బాలమురళి మీద ఒక కరుకుదనం వినపడుతుంది. వారి అంతరాంతరాలలొ బాలమురళికి సంగీతం రాదన్న అభిప్రాయం ఉందేమోనని అనిపిస్తుంది నాకు. ఈ విషయం మీద The Sunday Indian వ్యాసం చదివిన వారు గానీ ఇతరులు గానీ యెవరైనా ఈమాటలో రాస్తే చదవాలని ఉంది.
తఃతః
నా కోరిక, నా ప్రార్థన గురించి Vijayavardhan అభిప్రాయం:
09/04/2012 4:13 am
The English transcript of this speech is available here.
ఛందస్సులో గణితాంశములు గురించి lyla yerneni అభిప్రాయం:
09/03/2012 9:59 pm
“ఒక ఛందములో వృత్త సంఖ్య కావలసినప్పుడు, ముందు అది ఎన్నవ ఛందమో తెలిసికోవాలి. ఉదాహరణకు అది 12వ ఛందమనుకొందాము. …” అని మొదలయ్యే పేరా మాత్రం నాకు సరిగా అర్థం కాలేదు.”-కామేశ్వరరావు
(”అరెరే, అరెరే,” క్యా హువా, ఐ ఫీల్ సో సాడ్ యార్!)
Nevermind. So Sorry! Ignore my parroting దిల్ తొ పాగల్ హై. But read the following.
కొత్త సంగీత విద్యాదర్పణము ( ఏకా సుబ్బారావుతో సమకూర్చబడినది.) 486 పేజీ – “ఈ డెబ్బది రెండు మేళకర్త రాగముల పేళ్ళ యొక్క మొదటి రెండు వర్ణములను కాదినవ, టాదినవ, పాదిపంచక, యాదృష్ట్యమను వాటియందు సదరు మేళకర్తల పేళ్ళయొక్క మొదటి యక్షర సంఖ్యను ( ఏకస్థానంబునను అనగా; మొట్టమొదట వ్రాయునట్టి సంఖ్యను ఏకస్థానమని ఎరుంగునది.) రెండవ యక్షర సంఖ్యను ( దశస్థానమందును అనగా, మొదట వ్రాయబడిన సంఖ్యకు ఎడమ వైపున మరియొక సంఖ్యనుంచుట దశస్థానమని నెరుగునది.) ఇటుల వ్రాసి చూడగా అది ఎన్నవ సంఖ్య మేళకర్త యైనదిన్ని తేటబడును. అదెట్లనిన?”
Keep reading. Look at the 72. మేళకర్తల స్వరస్థానములను తెలిపెడు పథకము on the next page (487:-)) . keep reading. Go to the next page 488.
“ఈ పథకమునందు ఉదహరించబడియున్న డెబ్బదిరెండు మేళకర్త రాగముల యొక్క స్వరస్థానములను దెలిసికొనెడిమార్గమెటువలెనంటె? అందు మొదటి గదిలో 1టో సంఖ్యగల కనకాంగి రాగము యొక్క స్వరస్థానములను దెలియవలసినపుడు సదరు రాగమునకు కుడిదిక్కునయుండు రిషభగాంధార మధ్యమమును దానికింది దిక్కున యుండు ధైవతనిషాదములను జూచినట్లయిన ఆ రాగము యొక్క స్వరస్థానములు స్పష్టముగా తెలియుచున్నది. ఇట్లే అన్నిటియందు నూహించునది.”
Keep reading until the end of page 515.
Hope that makes it clear. Happy Labor Day!
లైలా
ఛందస్సులో గణితాంశములు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
09/03/2012 1:35 pm
ఇలాంటి వ్యాసాలు, నాకు తెలిసినంతలో, తెలుగులో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి! చందో లక్షణ గ్రంథాలలో కూడా, సాధారణంగా, షట్ప్రత్యయాలు అక్షరగణాలకు మాత్రమే పరిమితం. వాటిని మాత్రాగణాలకే కాక, దేశీ ఛందస్సులో కనిపించే విశేష గణాలకు కూడా విస్తరించడం చాలా గొప్ప విషయం. ప్రత్యేకించి, ఛందస్సూ గణితమూ – రెండిటి మీదా ఆసక్తి ఉన్న నాలాంటి వాళ్ళకిది మాంచి విందుభోజనమే! మన విద్యాలయాలలో Combinatorics పాఠం Coins, Cards బదులు ఈ షట్ప్రత్యయాలను ఉదాహరణలుగా తీసుకొని చెప్పే రోజులు వస్తే ఎంత బాగుణ్ణు!
“ఒక ఛందములో వృత్త సంఖ్య కావలసినప్పుడు, ముందు అది ఎన్నవ ఛందమో తెలిసికోవాలి. ఉదాహరణకు అది 12వ ఛందమనుకొందాము. …” అని మొదలయ్యే పేరా మాత్రం నాకు సరిగా అర్థం కాలేదు.
ఎదురునడక, దేశి గణాల గురించి. వ్యాసంలో చెప్పినట్టుగా ఒక లఘువుతో మొదలుపెట్టకుండా, ఒక గురువు లేదా రెండు లఘువులతో మొదలుపెట్టి ప్రస్తారం చెయ్యడం మూలంగా చాలా వరుకూ ఎదురునడక అరికట్టబడింది. అయితే, పద్యం మొదట లఘు గురువులు రాకపోయినా (అంటే త్రిశ్రగతిలో ఎదురునడక అనుకోవచ్చా?), IIU, UU వంటి గణాలవల్ల కూడా ఎదురునడకలాంటిది వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు రెండు సగణాలు వరుసగా వేస్తే (“అరెరే, అరెరే, వయసే” లాగ), అది ఎదురునడక లాగానే ఉంటుంది కదా (ఇది చతురశ్రగతిలో ఎదురునడక అనవచ్చా?). తెలుగులో యిది కూడా చాలా వరకూ పరిహరింపబడింది. అయితే తెలుగు గణాలను ఉపయోగించి కూడా ఎదురునడక రప్పించవచ్చు. ఉదాహరణకు:
ఎదలో పదేపదే మెదిలే వ్యథే కథై
ఇదిగో బయల్పడే నిపుడు చూడు
అన్నది అచ్చమైన సీసపద్య పాదం!
రావూరివారి పుస్తకం ప్రస్తుతం నా దగ్గర లేదు కాని, సంపత్కుమారగారి తెలుగు ఛందోవికాసం ప్రకారం, మధ్యాక్కరలో మాత్రమే సూర్యగణాలైన III, UI బదులు వేరే గణాలు నన్నయ్యగారి పద్యాలలో కనిపిస్తాయి. గగ, స గణాలే కాక, భ, జ కూడా కనిపిస్తాయి! అలాగే ఇంద్రగణాలలో కూడా తేడాలున్నాయి. అయితే అవి నడకకు ప్రత్యేకతనేమీ ఇచ్చినట్టుగా అనిపించవు. అవి లేఖక దోషాలే అయి ఉంటాయని సంపత్కుమారగారు అభిప్రాయబడ్డారు. పాదం/పాదభాగం చివర ఉండే సూర్యగణాల బదులు గగ, స గణాలు వేస్తే నడక బాగుంటుందని నేను అంగీకరిస్తాను. ఉదాహరణకు, “కవనాల వ్రాసేను నీకై – కావ్యమ్ము లల్లేను నీకై” అన్నప్పుడు మామూలు మధ్యాక్కర నడక కన్నా ధార బాగుంది. అలాగే,
ఎందుకే తహతహ – యెందుకే హృదిలో
ఎందుకే చెప్పవే – యెవ్వరే మదిలో
అన్న “ద్విపద” పాదాలు కూడా బాగున్నాయి.
వేరే చోట్ల మాత్రం నడక దెబ్బతింటుందని నా అభిప్రాయం. ఉదాహరణకు సీసపాదం చివర రెండు సూర్యగణాలకు బదులు స-స వస్తే నడక చెడుతుంది. అలాగే ఆటవెలది, తేటగీతులలో కూడా.
మోహనగారూ,
ఇంత అరుదైన, అద్భుతమైన వ్యాసాన్ని అందించినందుకు మనఃపూర్వక అభివాదనాలు, అభినందనాలు. మీ కృషికి జోహార్లు!
ఛందస్సులో గణితాంశములు గురించి ఊ. సాంబశివ రావు అభిప్రాయం:
09/03/2012 1:32 pm
పండిత మహాశయా ఇదే నా పాదాభివందన శతం, అంగీకరించి నన్ను ధన్యుని చేయ ప్రార్థన. నిజమైన పండితుల రచన చూసే భాగ్యం ఇవాళ కలిగింది. భాషలోకాని ఛందస్సులో కాని గణితంలోకాని పిపీలకం కన్న కనాకష్టమైన వాడినే ఐనా మూటి మీద ఉత్తి ఇష్టం మాత్రం ఉన్న వాణ్ణి. అలాంటి నాకు మీ వ్యాసం అర్థంకాని మాట నిజమేకాని, చూసే అదృష్టం కలిగిందనే స్పృహ పాటి కలిగిన వాడిని. గణనాధ్యాయ మనే పేరు పెట్టేసుకొని ఏదో చేసేస్తున్నాననే ఆశ లావు పీక సన్నంగాడిని. ఐనా నా పాదాభివందనాలు స్వీకరించ మని అర్థిస్తున్న ఆశాజీవిని. తెలుగుకి తగిన ఉత్కృష్టత తేగలిగిన మీ లాంటి మహోన్నతులు మరెందరో రావాలని మా నల్లనయ్యను ఇందుమూలంగా ప్రార్థిస్తున్నాను.
నా కోరిక, నా ప్రార్థన గురించి rama bharadwaj అభిప్రాయం:
09/02/2012 2:44 pm
బ్రహ్మానందంగారూ!
బల్రాజ్ సహానీ ప్రసంగ వ్యాసాన్ని బాగా అనువాదం చేశారు. సోషలిజానికి “సమాజవాదం” అని వాడినట్టున్నారు మీరు. అది చప్పున అర్ధం అయ్యేలా లేదు. “సామ్యవాదం” అని అనడానికి మీకు అభ్యంతరం ఎందుకు కలిగిందీ? అవసరం అయినప్పుడు కొత్త పదాన్ని సృshTiMచడంలో తప్పేం లేదు గానీ, ఉన్న పదం బాగానే ఉపయోగపడుతున్నప్పుడు మళ్ళీ మరో కొత్త పదం అవసరం ఎందుకూ అని.
మీరన్నది ఇవాళ నిజం. బలరాజ్ సహానీ వ్యక్తపరచిన బాధకి నలభై ఏళ్ళు గడిచాయి గాని దానికి జవాబులు మాత్రం ఏదీ ఇంకా దొరకనే లేదు. ఇప్పటికీ “జీ హుజూర్ గాళ్ళు ” అన్ని రంగాల్లోనూ ఆ రకమైన విధానం వలన మాత్రమే పైకి వస్తూ ఉన్నారు. అందువలన ఎవరన్నా పైకి రావాలీ అంటే అది వారి ప్రతిభ వల్ల కాక ఇతర మార్గాల ద్వారా మాత్రమే అన్న ఒకరకమైన ఉదాశీనతకి సమాజం బలంగా చోటిచ్చింది. ఇది అన్ని రంగాల్లోనూ అమలులో ఉంది. రాజకీయరంగం మొదలుకొని విద్యారంగం దాకా! దీని వల్ల జరిగిన నష్టం అపారమైనది ఆయా రంగాలకి సంబంధించి. మంచి నాయకులు కరువయ్యారు. మంచి టీచర్లు కరువయ్యారు. ఎవరూ బయటికి వచ్చి ఈ ధోరణులని ప్రశ్నించడానికి గానీ ఇందువలన ఉత్తరోత్తరా సమాజంలో కలిగే దుష్పరిణామాల గురించి చర్చించడానికి గానీ వేదికలన్నవి లేకుండా తుడిచేశారు. మనదగ్గర అసలు విమర్శ అన్నది లేదే ఏ రంగం లోని సంగతులని గురించి మాట్లాడడానికి అయినా? విమర్శ అనగానే ఇప్పటికీ బుజాలు తడుముకునే పరిస్థితి. ఎవరూ ముఖ్యమైన విషయాల మీద నోరు మెదపరు కదా? మహా అయితే ఎవరి డ్రాయింగు రూముల్లో వాళ్ళు వాళ్ళ లోపలి ఉక్రోషాలని వెళ్లగక్కుకోవడమే. ఇందువలన నిజంగా ఏ మార్పూ రాదు. కార్యాచరణ కావాలి. అది ముఖ్యం. కానీ ఎలా?
ప్రచార సాధనాలన్నీ సంపూర్తిగా వ్యాపారమయంగా పనిచేస్తున్న పరిస్థితి ఇవాళ ఉంది. దృశ్య మాధ్యమాలు ఎంతగా కలుషితమైపోయాయీ అంటే అస్సలు వాటి ధోరణి మీద బలమైన విమర్శ అన్నదే బయట లేకుండా పోయింది. అయితే మీరు టీవీ లలో వాళ్ళు చూపించే చెత్తని అయినా చూడాలి. లేదా టీవీని కట్టేసుకోవాలి. మినహా మరో వేదిక అన్నదే లేదు. ఇదంతా ఒక గూడుపుఠాణీ అన్నమాట! విశ్వవిద్యాలయాలలో మంచి టీచర్లు లేరివాళ. ప్రతీ వాళ్ళు వాళ్ళ మాట వినేవాళ్ళనే జాగ్రత్త గా ఎంపిక చేసుకోవడంతో అవి గ్రూపు రాజకీయాలకి ఆలవాలమయ్యాయే తప్ప అక్కడ విద్యావేత్త అనే పేరుకి తగిన వాళ్ళు నిజంగా చాలా శాఖల్లో కరువయ్యారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే! అయినా పరిస్థితి ఎందుకని మారలేదు? ఎందుకని అంటే ఇటువంటి వాటిని తెచ్చిపెట్టిన వాళ్ళు నిజంగా చదువుకున్నవాళ్ళే కావడం వలన! ఒక ప్రతిభావంతుడు మరొక ప్రతిభావంతుడిని ఒప్పుకోగల సంయమనం కలిగిన వారు కాకపోవడం! చాలా విచారించవలసిన విషయాలివి. ఒక జాతికీ ఒక భాషకీ అపకారం చేసిన వారు మొదటగా ఆయా ప్రాంతాలలో చదువుకున్న వారే చాలాసార్లు. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. పైరవీలు చేసుకోవడాన్ని భారతీయ నాగరికతలో ఒక భాగం చేసేసారు. అవి చేసుకోగలిగిన వాళ్ళకే అన్ని అవకాశాలు దక్కేలా చేసారు. స్వతంత్రతా స్వభావాన్ని వ్యక్తులలో అణిచేయడానికి ఎన్ని రకాలుగా చేయడానికి వీలుందో అన్నీ చేయగలిగేరు “ఇది ఇంతే మారదు. ఇలా తప్ప మరింక ఎలాగా కూడా పదవి గానీ .. ఉద్యోగం గానీ రాదనే” బలమైన అభిప్రాయానికి యువత వచ్చేలా చేసారు. అధిక సంఖ్యాకులలో వ్యవస్థ మారగలదనే నమ్మకాన్ని సమూలంగా తీసేసారు. ఇది ఇంతే ఇలాగే ఉంటుంది అన్న నిరాశని చదువుకున్న వాళ్లలో ఆ సమాజం కలిగించడం కన్నా దారుణమైన విషయం మరొకటి ఉండబోదు. అందుకు తమ వంతు పాత్ర పోషించిన వారంతా ఇందుకు బాధ్యులే! అయితే వాటి గురించి మాట్లాడే వారు లేరు. మాట్లాడగల చోట్లు నిజంగా లేవు. వార్తా పత్రికలు ఇవాళ రాజకీయనాయకుల కనుసన్నలలో నడవడానికి అలవాటుపడ్డాయి. ప్రజాస్వామ్యానికి ఇంతకన్నా గొడ్దలిపెట్టు ఇంకేముంటుందీ? అయినా మనమందరం బయటికి మాత్రం ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకుంటూంటాం ! నేతి బీరకాయలోని నేయి లాగా అది ఎప్పుడూ పేరులో మాత్రమే ఉంటుంది. ఏ వ్యవస్థా ఎక్కడా నిజంగా “అర్హత గల వ్యక్తుల మీద” ఆధారపడి పని చేయాలని అనుకున్నట్టుగా కనబడదే?
పైగా నిజంగా ధర్మాగ్రహం అయినా రాని ఒక అచేతనమైన స్థితి లోకి ఒక జడత్వం లోకి ప్రజలు వెళ్ళిపోవడం ఇంకా ప్రమాదం కదా? ఆ ప్రమాదాన్ని అయినా తగిన విమర్శ ద్వారా, విషయాలని చర్చ చేయడం ద్వారా మార్చుకునే ప్రయత్నం అయినా చేయాల్సి ఉంది. బలరాజ్ సహానీ బాధ, ఆయన కోరికని గురించి కనీశం ఆలోచించవలసిన బరువూ బాధ్యతా విద్యావంతుల మీద ఇప్పటికైనా ఉండాలి అని నేను ఒక ఆశతో అనుకుంటాను.
రమ.
గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి rama bharadwaj అభిప్రాయం:
09/02/2012 1:16 pm
సంపాదకులకి,
ఆ ఫొటోలో నేదునూరి కృష్ణ మూర్తి గారి పక్కన ఉన్నది సద్గురు కందుకూరు శివానంద మూర్తి అని తెలుసు నాకు. కానీ ఏదో పరధ్యానంగా సచ్చిదానందమూర్తి అని రాసినట్టున్నాను. అది దొర్లిన పొరపాటే! క్షమించి ఆ తప్పుని సవరించండి.
రమ .
విన్నకోట రవిశంకర్ ‘రెండోపాత్ర’: ఒక పరిచయం గురించి G.Girija Manohara Babu అభిప్రాయం:
09/02/2012 10:09 am
శ్రీ విన్నకోట రవిశంకర్ గారి కవితా సంకలనం చాలా గొప్పగా ఉంటుంది. ఈ సంకలన సమీక్ష చక్కగా ఉంది. రవి శంకర్ గారి రచన లాగానే ఇది కూడా ఇంచుమించు సమగ్రం గానే ఉంది. ధన్యవాదాలు.
జి. గిరిజా మనోహర బాబు