పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16477

  1. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి Ssankara Bhanu Gorthi అభిప్రాయం:

    01/31/2013 10:16 am

    What a wonderful essay! I wish it is published in any standard magazine like “Gana Kala” of Kakinada. I had the fortune of residing 2houses next to the residence of revered Dr Sripada Pinakapani garu in Official colony, Maharanipete, Visakhapatnam from 1953 to 58. In those days, Sri Nedunuri, Sri Nukala (later luminaries) in their twenties used to visit him very frequently. In spite of his busy schedule, he used to organise competitions in music to encourage youngsters. It is interesting that Dr Pinakapani garu was also a fine sportsman, good in weight-lifting, Tennis etc. He is a a legend, YUGAPURUSHA.

    Gorthi Sankara Bhanu

  2. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    01/30/2013 8:46 pm

    పరుచూరికి చెందిన శ్రీనివాసు: Gabriel Jouveau-Dubreuil రాసిన The Pallavas అన్న పుస్తకంలో 6వ శతాబ్దపు పల్లవుల సర్‌నేమ్‌ల (surnames) ప్రస్తావన ఉంది. అయితే ఇక్కడ ప్రస్తావించిన సర్‌నేమ్‌లు ఇంటిపేర్లు కాక బిరుదులో, కులనామాలో అయ్యే అవకాశం ఉంది. ఈ పుస్తకపు ప్రివ్యూ గూగుల్ పుస్తక విభాగంలో చూడవచ్చు.

  3. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    01/30/2013 5:46 pm

    ref: December 7, 2012న తః తః గారు అవధానాలు చేసిన స్త్రీలపై రాసిన వ్యాఖ్య:
    02.02.1998 ఆంధ్రప్రభ వారపత్రికలో ఆరుద్రగారు “అవధానం చేసిన కవయిత్రులు” అని ఒక లేఖ రాసారు. అప్పట్లో ఆ పేజి వరకు ఫోటోకాపీ చేయించుకున్నాను. కానీ గత 15 ఏళ్ళలో అక్షరాలన్నీ వెలిసి పోయాయి. ఎవరి దగ్గరైనా ఆ సంచిక వుందా!

  4. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    01/30/2013 4:34 pm

    వేమూరి గారు: The thesis referred to (I also have no access to the link given by Mr. sarma) is most probably of Tella Satyavati, which’s later published as a book. She is a student of Yarlagadda Balagangadhararao, whose works Sri KHR referred to. Yarlagadda’s work at Nagarajuna university was predominantly on Onomastics. Dr. Satvavati’s is a good reference work and I have a hard copy. The book is also available in DLI (teluguvaari yin’t’i peirlu., 2990100061897. teil’l’a satyavati. 1987. telugu. 582 pgs.) Otherwise there is a short paper from late Prof. Bh. Krishnamurti on Telugu Onomastics.

    > “నేని” శబ్దంతో అంతమయే వన్నీ సర్వసాధారణంగా కమ్మవారి ఇంటిపేర్లు.
    Well, its true to a good extent if you take only coastal districts into consideration. However in Telangana districts you have velama names often ending with “నేని”.

    I have a question. I was under the impression that this “ఇంటిపేర్లు” concept is a post-kaakatiiya development. Cynthia Talbot, who wrote an excellent monograph on Kakatiya period discusses this in some detail. However a Tamil friend recently said that he came across “ఇంటిపేర్లు” in a Pallava inscription of ca. sixth century, but could not give me exact reference. Does anyone have any references to pre-Kakatiya period? Regards, Sreenivas

  5. కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి Tekumalla Visweswararao అభిప్రాయం:

    01/30/2013 2:16 pm

    కళాపూర్ణొదయం మాకు “మధురలాలస” అని గద్యరూపములో పాఠ్యపుస్తము గా ఉండేది ఎప్పుడో చిన్నప్పుడు. ఇది ఎవరైనా సినిమాగా తీస్తే ఎంతబావుణ్ణు అనుకోనేవాళ్ళం. అయితే కాస్త గ్రాంధికంగా ఉండేదనుకోండి.

  6. పాఠకులకు సూచనలు గురించి కొండగుంట వెంకటేశ్ అభిప్రాయం:

    01/30/2013 6:18 am

    ఎడిటర్ గారికి.
    ఈ మాట పత్రిక చాల బాగుంది. కాని ఒక్కటే లోపం. మంచి సీరియల్స్ లేవు.
    ప్రఖ్యాత రచయితలని కాకుండ కొత్త రచయితల రచనలు ప్రచురించండి. మీ పత్రిక
    ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
    ఇట్లు
    కొండగుంట వెంకటేశ్.

  7. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి Rao Vemuri అభిప్రాయం:

    01/28/2013 5:59 pm

    శర్మ:

    మీరు ఇచ్చిన లంకెని ఎలా తెరవాలో నాకు బోధపడలేదు. కనుక ఆ సిద్ధాంత వ్యాసం చూడడం కుదరలేదు.

    కిరణ్

    మీరడిగిన విషయం మీద పరిశోధన చెయ్యాలి. ఏయే ఇంటిపేర్లవారికి ఏయే కులదైవాలున్నాయో నాకు తెలియదు. మీకు తెలిస్తే రాయండి, బాగుంటుంది.

  8. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి kiran అభిప్రాయం:

    01/28/2013 8:13 am

    నమస్కారం సర్. ఇంటిపేరు గురించి వివరించినందుకు ధన్యవాదములు. ప్రతీ ఇంటిపేరు కలవారికీ ఒక ఇంటిదేవుడు ఉంటాడు కదా సర్. అది ఎలాగో వివరించండి.

  9. జన్మజన్మల స్పృహ గురించి adityareddi అభిప్రాయం:

    01/27/2013 8:56 pm

    నారాయణ గారూ మీ కవిత బాగుంది. పుస్తకాల పట్ల ప్రేమని ఆశక్తిని కలుగ జేస్తోంది .అభినందనలు.

  10. ఈ సంచిక గురించి… గురించి కె. కృష్ణమూర్తి అభిప్రాయం:

    01/27/2013 2:35 am

    బ్రహ్మనందం గారు,

    నేను మీకిచ్చిన సలహా నా అంత నేను కల్పించి ఇవ్వలేదు. మీకై మీరు నిర్థారించుకుని నమ్మిన విషయాన్ని – ముందుగా మీరు ఆచరిస్తే ఆదర్శవంతంగా ఉంటుందని చెప్పా! తెలుగు రచయితగా పుట్టొద్దని ఉచిత సలహా ఇక్కడ తెలుగు వాళ్ళందరికీ ఇచ్చింది ఎవరు?!
    మీర్రాసినవి వరసగా, భావం బోధపడే వరకు (ఇక్కడి కామెంట్లు) చదువుకోండి. ఇది నేను మీకిస్తున్న మరో ఉచిత సలహా.

    – కె. కృష్ణమూర్తి