పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. నాకు నచ్చిన పద్యం: నన్నయ భారతంలో కర్ణ ప్రవేశం గురించి kapilaram అభిప్రాయం:

    01/22/2013 8:15 pm

    మంచి పుట చదివాను

  2. కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి Narayana Garimella అభిప్రాయం:

    01/21/2013 9:27 pm

    ‘పిండంతే నిప్పటి’ చాలా బాగుంది.

    “సంస్కారం లేని ప్రేమ ప్రేమ కాదు. ఆ అమ్మాయి మీద కక్షతో వీధికి లాగితే నాశనమయ్యేది ఆమె కాదు, ఆమె చుట్టూ అల్లుకున్న జీవితాలు” అన్న కన్నబాబు సంస్కారానికి సరితూగగల మనుషులు, సంస్కారాలు ఎంతమందికి ఉన్నాయి?

    ఇలా ఆలోచిస్తే….యాసిడ్ దాడులకు, ప్రేమించని వాళ్ళని నరికి మరీ చంపేసే కిరాతక దాడులకు ఎప్పుడో ముగింపు పడేది.

    మంచి కధనందించినందుకు జోహార్లు.

    నారాయణ.

  3. అంబఖండి నుంచి అట్లాంటా దాకా… గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    01/20/2013 10:47 pm

    ఇలాటి విషయాలు చెప్పటం వేలూరి గారొక్కరికే సాధ్యమయే పననుకుంటాను. నారాయణరావు గారితో ఇంత చిరకాల అనుబంధం వున్నవాళ్లు ఇంకెవరూ లేరేమో ! అభ్యుదయ కవిత్వపు తొలిరోజుల్లో అందులోని ముఖ్యులు చాలామందితో ప్రత్యక్షపరిచయాలు నారాయణరావు గారికున్నాయని తెలుసును. వేలూరి గారికి కూడ ఉండివుండవచ్చు. ఆనాటి సాహితీ వాతావరణం గురించి, అందులో జీవించిన వ్యక్తుల గురించి వారు వివరిస్తే వినాలనే ఆసక్తి నాకూ వుంది.

    ఇంత చక్కటి ప్రత్యేకసంచికని తెచ్చినందుకు వేలూరి గారిని, రచనల్ని పోగుచెయ్యటానికి కాలికి బలపం కట్టుకుని తిరిగిన పరుచూరి శ్రీనివాస్ గారిని మనసా అభినందిస్తున్నా.

  4. ఈ సంచిక గురించి… గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    01/20/2013 3:59 pm

    కృష్ణమూర్తి గారూ,

    బాగా చెప్పారు. చూసారా? మీరు కూడా నాలాంటి పనికిరాని వాడి వ్యాఖ్య మీద మీ విలువైన కాలాన్ని వెచ్చించి మరీ సలహా ఇచ్చారు. సంతోషం! నేను ఆ పని మీదే ఉంటాను. ఆ చేత్తోనే ఈమాటలో వెల్చేరు గారికి అభినందనలనో లేదా తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి అందజేసిన వాళ్ళల్లో ప్రముఖులనో, ఏదో ఒకటి రాయచ్చు కదా? మీరు రాయలేదు. నా బాధ సరిగ్గా ఇదే!

    నాకు చక్కటి సలహా ఇచ్చారు. ప్రపంచాన్ని మనం మార్చలేం. మనకి మనల్ని మార్చుకోగలం. ఈ విషయం మరో సారి గుర్తు చేసినందుకు థాంక్స్!

  5. ఈ సంచిక గురించి… గురించి కె. కృష్ణమూర్తి అభిప్రాయం:

    01/20/2013 12:29 pm

    బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:
    January 16, 2013 4:27 pm
    ఓ మనిషీ – మనిషిగా పుడితే పుట్టావు; రచయితవి మాత్రం కావద్దు. రచయితగా పుడితే పుట్టావు; తెలుగు వాడివి మాత్రం కావద్దు.

    ఇక్కడ ముచ్చటగా మూడు విషయాలు ప్రస్తావించారు – వాటిల్లో రచయితగా “పుట్టడ”మన్నది ఎందుకో అసంబద్దంగా ఉంది. కానీ మూడింట్లో మార్చుకోగలిగిందీ, ప్రయత్నిస్తే సాధ్యమయ్యేదీ అదొక్కటే అనిపిస్తోంది. మిగిలిన రెండు సందర్భాలు, సంఘటనలు మార్చలేనివి కదా, ఏ మనిషికైనా!

    ఇంకెందుకాలస్యం…మీతోనే మీ భావనకు జీవం పోయండి, మార్పుకు నాంది పలకండి.

  6. బందీ గురించి జ్యోతిర్మయి అభిప్రాయం:

    01/20/2013 10:28 am

    చివరవరకూ వచ్చేదాకా జలపాతం గురించి అనుకోలేదండి. చాలా బాగా వ్రాశారు.

  7. వంశీవనము (హాలుని గాథాసప్తశతి నుండి కొన్ని పద్యములు) గురించి k.v.rama krishna అభిప్రాయం:

    01/19/2013 1:17 pm

    Beautiful translation.

  8. అయినా సరే… గురించి k.v.rama krishna అభిప్రాయం:

    01/19/2013 1:14 pm

    విఫలం సఫలతకి పురిటి నొప్పి – చాలా బావుంది.

  9. బ్రహ్మ జ్ఞానం గురించి rathnamsjcc అభిప్రాయం:

    01/19/2013 4:02 am

    బ్రహ్మ జ్ఞానం కలగటం అనేది చాలా కష్టమైన పని. అట్లా అంత కష్టపడి సాధించాల్సిన అవసరం ఏముంది అనే సందేహం రావచ్చు. ఎందుకు బ్రహ్మ జ్ఞానం కావాలి, దాని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో తెలుపుతుంది

  10. ఈ సంచిక గురించి… గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    01/18/2013 11:43 pm

    మోహన రావు గారూ,

    మామూలు పాఠకుల సంగతి అర్థం చేసుకోగలను. కానీ – వెల్చేరు గారి చేత ముందు మాటలూ, వెనుక మాటలూ, రాయించుకున్న వాళ్ళూ, దగ్గరుండి ఆప్త వాక్యాలు అల్లించుకున్న వాళ్ళూ, మధ్య మధ్యలో ఉత్తుత్తి మాటలు చెప్పించుకున్నవాళ్ళూ, కవిత్వాన్ని గుట్టలుగా పోసిన వాళ్ళూ, కవిత్వాన్ని దిద్దించుకున్న వాళ్ళూ, వాక్యాలు రాయడం నేర్చుకున్నవాళ్ళూ, పాఠాలు చెప్పించుకున్న వాళ్ళూ, కలిసి సాహిత్య చర్చలు చప్పరించిన వాళ్ళూ – అందరూ ఒక్క సారి మాయమై పోయారేమిటబ్బా? అన్నదే నా బాధ. మామూలు పాఠకులకి మొహమాటాలుండవు. నచ్చడం నచ్చకపోవడం తప్ప. అసలు సమస్యంతా సమకాలీకులతోనే! నాకు తెలిసి సగానికి పైగా రచయితలు ఆయన పుస్తకాలు చదివుండరు. ఊరికే వచ్చుంటే చదివుండేవారేమో? ఏదేమయినా – తిట్టడానికి ధైర్యం అవసరం లేదేమో కానీ, మెచ్చుకోడానికి చాలా పెద్ద మనసు కావాలి. కాదంటారా? నా వ్యాఖ్యపై స్పందించినందుకు థాంక్స్!