నారాయణ రావు గారి ఆలోచనల్ని క్లుప్తీకరించి క్రమీకరించిన తీరు బాగుంది. ఒక చోట ఉన్నందువల్ల అన్నీ కలిసి పెద్ద వైశాల్యాన్ని, లోతునీ సాధించినయ్. ఐతే అప్పటివరకు నియమబద్ధంగా సాగిన వ్యాసం చివరిభాగంలో ఆలోచన తక్కువా ఆవేశం ఎక్కువా ఐనట్టనిపిస్తుంది. స్వతంత్ర భారతంలో సాగుతున్న భావదారిద్ర్యాన్ని ఏకరువు పెట్టటం కాదుకదా పరిశోధకుడి పని? అందుకు కారణాల్ని ప్రతిపాదించటం, వాటినుంచి ఎలా బయటపడాలోతార్కికంగా సూచించటం చేస్తే ఇంకా బాగుండేదేమో అని నా అనుమానం. వీటన్నిటికీ కారణం వలసపాలనే అనేదే ప్రదిపాదనైతే ఆమాట స్పష్టంగా లేదనుకుంటాను. ఒకవేళ అదే అనుకున్నా, ఏ విధంగా వలసపాలన దుష్టఫలితాల్ని వెకక్కితిప్పొచ్చునో (లేక అలాటి అవకాశమే లేదో) వివరిస్తే బాగుండేదనుకుంటాను. చివరగా, నాకో సందేహం – వలసపాలన కిందున్న ఇతర దేశాల్లో కూడ ఇలాటి ఫలితాలే వచ్చాయా లేక భారతదేశానికే ఇవి ప్రత్యేకమా? తెలిసిన వారు వివరిస్తే తెలుసుకోవాలని కుతూహలం. మొత్తం మీద చక్కటి ఆలోచనాత్మకమైన వ్యాసాన్ని అందించిన వ్యాసకర్తకి అభినందనలు.
ఎంతొ చక్కగా వ్రాసిన హెచ్చార్కె గారి నీటి ఊహలో తేలుతూ నాకిలా స్పందించాలనిపించింది.
“ఒక్కడినె వంతెన మీద
ఎవరూ రాని వెన్నెల వేళ
నా కోసం నీను ఎదురు చూస్తూ
రావలసి ఉన్న నన్ను పలకరిస్తూ
రాయవలసిన పాటకు రాగం కడుతున్నా
నీరై ప్రవహించే ఊహల్లొ విహరించెందుకు
అందాకా వ్యూహ రచన సిద్దం చెస్తున్నా”
1. పాతరోజుల పాత్రికేయుడు జి కృష్ణ గారి అబ్బాయి జి.రాజ శుక రాసిన ‘విశ్వనాథ తో కొద్ది రోజులు’ ఆంధ్రజ్యోతి వారి వార పత్రిక – ‘నవ్య’ 02 01 013 సంచిక పే 44-45.
2. కుర్రా జితేంద్ర బాబు రచన ‘చందాల కేశవ దాసు తొలి సినీ గేయ రచయిత’ ‘మిసిమి’ చింతనాత్మక సారస్వతం జనవరి 013 సంచిక పే 14-18.
భలే చెప్పారు కృష్ణ మూర్తి గారూ!
నా మానాన నేను వ్యాఖ్య పెట్టుకుంటే, “నాంది పలకండి” అంటూ మొట్ట మొదట ఉచిత సలహా పారేసిందెవరూ? మీరా? నేనా? బావుంది మీ డబాయింపు. మొక్కుబడి రాతలే రాసుకుంటారో, అర్థవంతమైన వ్యాఖ్యలే చేసుకుంటారో అది మీ ఇష్టం. అలాగే నేను కూడా. చివరగా – మీకు ఏం రాయాలో చెప్పలేదు. చెప్పచ్చు కదా? అని ప్రశ్నించాను. “ఎదుటి వారికి ఇచ్చేటందుకే సలహాలున్నాయి!” అన్నట్లుగా వుంది మీ వాలకం. మీకున్న స్వేచ్చే, నాకూ ఉండదా, మరి?
సహృదయతతో నా వ్యాఖ్యని అర్థం చేసుకుని, ఆచరించడానికి ఉద్యుక్తులౌతున్నందుకు మహదానందంగా ఉంది.
ఆ చేత్తోనే ఈమాటలో వెల్చేరు గారికి అభినందనలనో లేదా తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి అందజేసిన వాళ్ళల్లో ప్రముఖులనో, ఏదో ఒకటి రాయచ్చు కదా?
ఏదో ఒహటి వ్రాయడమే మీ ప్రధాన ధ్యేయం మరియు ఏమి వ్రాయాలో కూడా మీరే చెబుతున్నారు. భేష్!
అభిప్రాయాలు వెలుబుచ్చడం పూర్తిగా వ్యక్తుల ఇష్టం అని నేననుకుంటాను. మీ ఉద్దేశ్యం దీనికి భిన్నమని మీ వాలకం బట్టి అర్థమౌతోంది. మొక్కుబడి వ్రాతలతో, వ్యాఖ్యలతో ప్రయోజనం శూన్యం. ‘ఒక పనైపోతుంది బాబూ’ టైపులో కాకుండా, నాకు వ్రాయలనిపిస్తె అభిప్రాయమో, కామెంటో వ్రాస్తాను. మీరు కాస్త ఆలోచిస్తే నేను చెప్పదలచుకున్నది ఆర్థమౌతుందనుకుంటున్నాను.
వలస పాలన, సంస్కృతి: నారాయణ రావు గారి ఆలోచనలు కొన్ని గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
01/26/2013 4:24 am
నారాయణ రావు గారి ఆలోచనల్ని క్లుప్తీకరించి క్రమీకరించిన తీరు బాగుంది. ఒక చోట ఉన్నందువల్ల అన్నీ కలిసి పెద్ద వైశాల్యాన్ని, లోతునీ సాధించినయ్. ఐతే అప్పటివరకు నియమబద్ధంగా సాగిన వ్యాసం చివరిభాగంలో ఆలోచన తక్కువా ఆవేశం ఎక్కువా ఐనట్టనిపిస్తుంది. స్వతంత్ర భారతంలో సాగుతున్న భావదారిద్ర్యాన్ని ఏకరువు పెట్టటం కాదుకదా పరిశోధకుడి పని? అందుకు కారణాల్ని ప్రతిపాదించటం, వాటినుంచి ఎలా బయటపడాలోతార్కికంగా సూచించటం చేస్తే ఇంకా బాగుండేదేమో అని నా అనుమానం. వీటన్నిటికీ కారణం వలసపాలనే అనేదే ప్రదిపాదనైతే ఆమాట స్పష్టంగా లేదనుకుంటాను. ఒకవేళ అదే అనుకున్నా, ఏ విధంగా వలసపాలన దుష్టఫలితాల్ని వెకక్కితిప్పొచ్చునో (లేక అలాటి అవకాశమే లేదో) వివరిస్తే బాగుండేదనుకుంటాను. చివరగా, నాకో సందేహం – వలసపాలన కిందున్న ఇతర దేశాల్లో కూడ ఇలాటి ఫలితాలే వచ్చాయా లేక భారతదేశానికే ఇవి ప్రత్యేకమా? తెలిసిన వారు వివరిస్తే తెలుసుకోవాలని కుతూహలం. మొత్తం మీద చక్కటి ఆలోచనాత్మకమైన వ్యాసాన్ని అందించిన వ్యాసకర్తకి అభినందనలు.
నీటి ఊహ గురించి D.Venkateswara Rao అభిప్రాయం:
01/25/2013 10:23 am
ఎంతొ చక్కగా వ్రాసిన హెచ్చార్కె గారి నీటి ఊహలో తేలుతూ నాకిలా స్పందించాలనిపించింది.
“ఒక్కడినె వంతెన మీద
ఎవరూ రాని వెన్నెల వేళ
నా కోసం నీను ఎదురు చూస్తూ
రావలసి ఉన్న నన్ను పలకరిస్తూ
రాయవలసిన పాటకు రాగం కడుతున్నా
నీరై ప్రవహించే ఊహల్లొ విహరించెందుకు
అందాకా వ్యూహ రచన సిద్దం చెస్తున్నా”
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి గురునాథ రావు దిక్కల అభిప్రాయం:
01/25/2013 1:24 am
మన సైటులో సందేహాలు సలహాలు చాలా బాగున్నాయి. ఆటో సజేశన్లు కూడా అత్యున్నతముగా ఉన్నాయి. నాలాంటి విశ్రాంత ఉద్యోగులకు ఉపయుక్తం గున్నాయి. ధన్యవాదాలు.
స్వప్నవాసవదత్తం -7 గురించి గురునాథ రావు దిక్కల అభిప్రాయం:
01/25/2013 12:56 am
స్వప్న వాసవదత్తం చాలా బాగుంది. కానీ 5వ అంకం మిస్సయింది.
ఈమాట గురించి గురించి తః తః అభిప్రాయం:
01/24/2013 11:28 pm
ఈ మాట చదువరులు చదవక తప్పని రెండు రచనలు:
1. పాతరోజుల పాత్రికేయుడు జి కృష్ణ గారి అబ్బాయి జి.రాజ శుక రాసిన ‘విశ్వనాథ తో కొద్ది రోజులు’ ఆంధ్రజ్యోతి వారి వార పత్రిక – ‘నవ్య’ 02 01 013 సంచిక పే 44-45.
2. కుర్రా జితేంద్ర బాబు రచన ‘చందాల కేశవ దాసు తొలి సినీ గేయ రచయిత’ ‘మిసిమి’ చింతనాత్మక సారస్వతం జనవరి 013 సంచిక పే 14-18.
అయినా సరే… గురించి తః తః అభిప్రాయం:
01/24/2013 11:11 pm
శ్రీ బండి : మీ కవిత చాలా బావుంది
నమస్కారాలతొ
తః తః
ఈ సంచిక గురించి… గురించి బ్రహ్మానందం అభిప్రాయం:
01/23/2013 7:53 pm
భలే చెప్పారు కృష్ణ మూర్తి గారూ!
నా మానాన నేను వ్యాఖ్య పెట్టుకుంటే, “నాంది పలకండి” అంటూ మొట్ట మొదట ఉచిత సలహా పారేసిందెవరూ? మీరా? నేనా? బావుంది మీ డబాయింపు. మొక్కుబడి రాతలే రాసుకుంటారో, అర్థవంతమైన వ్యాఖ్యలే చేసుకుంటారో అది మీ ఇష్టం. అలాగే నేను కూడా. చివరగా – మీకు ఏం రాయాలో చెప్పలేదు. చెప్పచ్చు కదా? అని ప్రశ్నించాను. “ఎదుటి వారికి ఇచ్చేటందుకే సలహాలున్నాయి!” అన్నట్లుగా వుంది మీ వాలకం. మీకున్న స్వేచ్చే, నాకూ ఉండదా, మరి?
ఈ సంచిక గురించి… గురించి కె. కృష్ణమూర్తి అభిప్రాయం:
01/23/2013 12:05 pm
బ్రహ్మానందం గారు,
సహృదయతతో నా వ్యాఖ్యని అర్థం చేసుకుని, ఆచరించడానికి ఉద్యుక్తులౌతున్నందుకు మహదానందంగా ఉంది.
ఏదో ఒహటి వ్రాయడమే మీ ప్రధాన ధ్యేయం మరియు ఏమి వ్రాయాలో కూడా మీరే చెబుతున్నారు. భేష్!
అభిప్రాయాలు వెలుబుచ్చడం పూర్తిగా వ్యక్తుల ఇష్టం అని నేననుకుంటాను. మీ ఉద్దేశ్యం దీనికి భిన్నమని మీ వాలకం బట్టి అర్థమౌతోంది. మొక్కుబడి వ్రాతలతో, వ్యాఖ్యలతో ప్రయోజనం శూన్యం. ‘ఒక పనైపోతుంది బాబూ’ టైపులో కాకుండా, నాకు వ్రాయలనిపిస్తె అభిప్రాయమో, కామెంటో వ్రాస్తాను. మీరు కాస్త ఆలోచిస్తే నేను చెప్పదలచుకున్నది ఆర్థమౌతుందనుకుంటున్నాను.
– కె.కృష్ణమూర్తి
అయినా సరే… గురించి gopagani ravinder అభిప్రాయం:
01/22/2013 10:15 pm
మీ కవిత బాగుంది
నాకు నచ్చిన పద్యం: నన్నయ భారతంలో కర్ణ ప్రవేశం గురించి kapilaram అభిప్రాయం:
01/22/2013 8:15 pm
మంచి పుట చదివాను