శ్రీ అనామకుడు గారి లేఖకు సమాధానం వ్రాసినప్పటి నుంచి నా దగ్గరున్న గ్రంథాలన్నీ మరొక్కసారి సరిచూస్తుంటే అమృతానంద యోగి రచించిన అలంకారసంగ్రహంలో ‘కష్టము’నకు ఉదాహరణగా “కష్టః కృచ్ఛ్రేణ విజ్ఞేయః శబ్దసంక్షేపతో యథా” అన్న నిర్వచనంతో శ్రీహర్షుని నైషధీయచరితంలోని “కలశే నిజహేతుదణ్డజః” అన్న (2-32) లోని శ్లోకోదాహరణం కనుపించింది. నేను పాతికేళ్ళ మునుపు చదివిన జ్ఞాపకంతో అమృతానంద యోగి ఉదాహరణలను చూపలేదని నా లేఖలో పొరపాటుగా వ్రాశాను. శబ్దసంక్షేపం వల్ల అర్థం చేసుకోవటం కష్టసాధ్యమైన రచన ‘కష్టము’ అన్నమాట. ఈ ‘శబ్దసంక్షేపము’నే వేదం వేంకటరాయశాస్త్రి గారు తరచు ‘ఇమిడిక’ అన్న సంకేతంతో గుణముగా వ్యవహరించేవారు. వామనుడు కావ్యాలంకారసంగ్రహంలో ‘కష్టము’ను శబ్దదోషమని పరిగణించాడు. అది భామహాదుల దృష్టిపథంలో ఉన్నదే. ‘కష్టశబ్దము’ అనే దోషం కూడా మరొకటున్నది. అమృతానంద యోగి ‘కష్టము’ను శబ్దదోషంగా కాక అర్థదోషాధ్యాయంలో ఉదాహరించాడు. నిజానికి ఇది ‘ప్రౌఢి’లో భాగమై గుణమే అయినప్పటికీ, దోషప్రస్తావనతో లాక్షణికోదాహరణమంటూ ఒకటున్నది కాబట్టి వ్యాసాన్ని ముద్రించేటప్పుడు (ఇంకేమైనా ఉదాహృతులు కనబడితే వాటితోపాటు) వాక్యాన్ని సరిచేస్తానని వారికి విన్నవిస్తున్నాను.
చక్కటి పరిచయాన్ని అందించిన వేలూరి వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.
లిఖిత, మౌఖిక సాంప్రదాయాల లేదా ప్రక్రియలనడుమ మనమే సృష్టించుకున్న లక్ష్మణరేఖల్ని చెరిపేసుకుంటే బాబ్ డిలాన్ వంటి గాయకుల, గేయకారుల కవిత్వం ఉప్పొంగి ఉక్కిరిబిక్కిరి చేస్తుందని తెలుగు, ఇంగ్లీషు భాషల జోడుగుర్రాల పైన అవలీలగా స్వారీ చేస్తూ వచ్చి నాబోంట్లకు తెలియజెప్పినందుకు – మరీ ముఖ్యంగా ధన్యవాదాలు.
ఈ పరిచయ వ్యాసం చదివినవాళ్లెవరైనా ఒక గాయకుడికి సాహిత్యరంగంలో నోబెల్ బహుమతి ఇవ్వొచ్చునా, కూడదా అనే అనవసరపు వివాదంలోంచి బయటపడగలుగుతారని నమ్ముతున్నాను.
సంస్కృతం లోని హర్ష నైషధం చదవలేను. కాని శ్రీ నాథుడి శృంగారనైషధము ఇదివరలో చదివాను. ఇప్పుడు ఇంకొంచెం మెరుగ్గా చదవగలను. ఎమెస్కో పుస్తకం అట్ట మీద శ్రీనాధుడు అని ఉంది. లోపల చాలా వరకూ శ్రీ నాథుడు అని ఉంది. ఈ రకం పొట్టలో చుక్కల అచ్చు తప్పులు నేను కనిపెట్టగలగటం, నా కంటి డాక్టర్లు మంచి కరెక్షెన్ చేస్తారని చెపుతుంది. ఈ తెలుగు మాటలు ఎలా రాయటం సరైనదో, నేను తప్పులు రాసినప్పుడు కొందరు స్నేహితులు చెపుతారు. కాని, నేనేం లెక్క చేసుకోను. వాదన సాగించి అలాటి అంశాల మీద చిన్న సైజు డిబేట్ లు నడపటం నాకు చాలా ఇష్టం. దరిమిలా కొన్ని తప్పులు సరిచేసుకుంటాననుకోండి.
చాలా డిబేట్ లలో ఎవరు గెలిచారనేది, స్పష్టం కాదు. ట్రంప్, హిల్లరీ క్లింటన్ ల డిబేట్లు ఎవరు గెల్చారనేది, పోల్స్ ఐతే, ప్రతి డిబేట్ హిల్లరీ నే గెలిచిందని చెప్పాయి. ట్రంప్ తనే గెలిచాడని నిక్కచ్చిగా చెప్పాడు. (ఎలక్షన్ లో ట్రంప్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందేలా గెలిచాడు. నాకైతే సువర్ణ శ్రీ, బెన్ హర్ ఛారియెట్ రేస్ చూసినట్టనిపించింది. It is a fantastic drama. I am thrilled. I congratulate the victor.)
ఏ వివాదం లోనూ ఒకరు నిక్కచ్చిగా గెలిచారనే పరిస్ధితి ఇప్పుడు ప్రపంచంలో లేదు. ఈ వ్యాస విషయం లోనూ లేదు. పొట్టలో చుక్క ఉన్న/ లేని విషయం ఆధారంగా నేను ఇద్దరు శ్రీనాథులు ఉన్నారనొచ్చు. ముగ్గురు డింఢిమ భట్టులుండగా లేంది, ఇద్దరు సర్వజ్ఞ సింగభూపాలురుండగా లేంది ఇద్దరు శ్రీనాధులెందుకు ఉండరాదు?
అసలు, ఈమాటలోనే చూడండి, ఎందరో వేంకటేశ్వరరావులు. తెలుగు దేశంలో మనవడికి తాత పేరు పెట్టే సంప్రదాయంలో, దేవుళ్ల పేర్లుంచే వ్యాపకంలో, ఒకే పేరు వాళ్లు లక్షలు లక్షలు. ఇక ఆ పేరూ ఈ పేరూ పెట్టుకుని రాసే అలవాటు కూడా ఉన్నప్పుడు, వేమ భూపాలుడు, వీర భూపాలుడూ ఒకరా, ఇద్దరా అనేదే కాక, ఈ ఇద్దరి రాజుల బదులూ డబ్బు కోసం శ్రీ నాథుడే రకరకాల కావ్యాలు రాసాడేమో అని కూడా అనుకోవచ్చు. పోనీ కావ్యంలో కంటెంట్ చూసి, రచయితను గుర్తు పడదామంటే, ఐదుగురు నల మహారాజులను ఒకేసారి చూసిన దమయంతి అవస్థ. అన్ని ప్రబంధ కావ్యాలూ ఒకలాగే ఉంటాయి. అట్టలు చూసి గుర్తు పడదామంటే, అన్నమయ్యకీ, వీరేశలింగం గారి ఆంధ్ర కవుల చరిత్రకూ ఒకే లాటి బొమ్మ వేస్తాడు డా. బాపు. అన్ని తెలుగు పుస్తకాల మీదా ఆయన బొమ్మలేనయ్యె!
వీరేశలింగం పంతులు గారు ఆంధ్ర కవుల చరిత్రము లో ‘మాతృక’ లంటే ఏమిటో, ‘పుత్రిక’ లంటే ఏమిటో చెప్పారు. పాపం, పంతులు గారు తెలుగు కవులను గూర్చి రాయటానికి, మాతృకలను సంపాదించుకోటానికి చాలా ప్రయత్నించారు. ఐనా ఇతరులు ఆయనకు అందనీయకుండా తొక్కి పట్టినట్టున్నారు. మదరాసులో లైబ్రరీ లకు వెళ్లి కొన్ని మాతృకల నుండి ‘పుత్రిక’లను ఆయనే దత్తత చేసుకున్నారు. ఆ కష్టాలు చూస్తే, అప్పుడే దొరకని తాళ పత్ర గ్రంధాలు ఇప్పుడింకేం దొరుకుతాయీ అనిపిస్తుంది. ఆయన పీఠికలు, శ్రీనాథుడి పైన వ్యాసం చూస్తే, కొత్త మెటీరియల్ దొరికినప్పుడల్లా ఆయన వ్యాసాలు upgrade చేస్తూ వచ్చాడని తెలిసింది. కవుల కథలు చాలా వరకూ అతుకుల బొంతలనీ, ఇప్పటి వీకీపీడియాల లాగానే ఏదీ 100% నమ్మేందుకు వీలు లేదనీ తెలుస్తుంది.
అలాగే, అంతకు ముందు కావ్యాలలో కూడా మెటీరియల్ తర్వాత తర్వాత చేర్చి ఉండొచ్చు. నాకూ శృంగార నైషధం చివరి లోని ‘కావ్యోపసంహారము’ out of place లాగానే అనిపించింది. Insert లాగా అనిపించింది. వేమభూపాలుడో, అంకింతం పుచ్చుకున్న అమాత్యుడో, శ్రీ నాథుడి గొంతు మీద కూర్చుని, అక్కడో పద్యం, చివర్లో వచనం, ఇరికింప చేసారా అని సందేహం కలిగింది. అలా చేసే పవర్ వాళ్లకు ఉంది.
భాషను చూసి, శ్రీనాధుడి పద్యం ఏదో చెబుదామా అంటే, పొట్టకూటికై కవి వేషం మార్చుకుంటున్నాడు, పరగణా మారినప్పుడల్లా భాష, యాస మారక తప్పదే. భాష మీద భద్రిరాజు గారి రీసర్చ్ అయ్యే లోపల, తెలుగు వాళ్లు ఎన్నో సార్లు జిల్లాలు, రాష్ట్రాలు మారి ఉంటారు. అందుకని అలా చాలా స్లోగా సంవత్సరాల మీద సాగే ఆ రీసెర్చ్ మీద నాకంత నమ్మకం లేదు.
ఇక కావ్యంలో ఉన్న అశ్లీలం పట్టి రచయిత ఎవరో నిర్ణయం చేద్దామంటే, వీరేశ లింగం పంతులు గారే ఆ ప్రయత్నంలో పరాజయం పొందారు. పోతన కవి, భోగినీ దండకం రాస్తే -భాగవతం రాసిన పరమ భాగవతోత్తముడు, అలాటి రచన రాయటమేంటని, ఆయన కక్కా మింగా లేకపోయాడు. ఒక వేశ్య, రావు సింగభూపాలుని కామించటమేమిటి? ఆయన ఆమె ముద్దు చెల్లించట మేమిటి? పైగా వేశ్యమాతను ఏనుగు ఎక్కించి ఊరేగించటమేమిటని, ఆయన పళ్లు పటపటలాడినయ్యి. అలాటి బోగం stuff/అశ్లీలం? పోతన వ్రాసి ఉండడన్నారు. కానీ ఇతరులు మందలించాక, అప్పుడు మంచె దిగొచ్చి -తనది సైన్స్ దృక్పథం, నిజం చెప్పటమే తన ధ్యేయమని, మనకు సంజాయిషీ ఇచ్చి, పోతనకు pardon ఇచ్చారు.
ఐతే శ్రీనాధుడి విషయంలో వీరేశలింగం గారు నెగెటివ్ గా విజృంభించారు. ఆయన దృష్టిలో శ్రీనాథుడు చెడిపోయినట్టు లెక్క. వేశ్యా సంపర్కం ఆయనకు గిట్టదు. పంతులు గారు -ఈ శ్రీ నాథుడికి ద్రాక్షారామం నగరం లో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్ర కులస్థులెవరూ ఊళ్లో కనపడలేదు, భోగం స్త్రీలు మాత్రమే కనిపించారని – వారి గ్రంధంలో ఉడుక్కుంటాడు. ఆ కులాలు కల్పించిన మానవ సంఘమే కదా వేశ్యా కులం కూడా కల్పించింది. వేశ్యలు వారు వారంతట వారే మొలుచుకు వచ్చారా? ఆ విషయం ఆయన ఎందుకు గమనించడు?
జాషువా కవి ‘గబ్బిలం’ ఖండకావ్యం మొదట్లోనే – నేను కడజాతిలో జన్మించిన వాడిని, భారత వీరులకు చెప్పులు కుట్టేవాడిని అని ఆయన అన్నప్పుడు, ఆ కవికే న్యూనతా భావం ఉందా? తీరి కూర్చుని నేను ఇతర తెలుగువారి కంటే తక్కువ అని తనే ఊహించుకుంటున్నాడా? లేదు. వాళ్ల అమ్మా నాన్నా, ఒరే నాయనా, మనం మాల వాళ్లంరా మాదిగ వాళ్లంరా అని చెపితేనే జాషువాకి తెలిసింది. ఇతర తెలుగులు – నువ్వు మమ్మల్ని అంటుకోకూడదురా, నువ్వు ఎడంగా ఉండు అంటే జాషువాకి తెలిసింది. ఏ కులాల వాళ్లకు కూడా, వాళ్ల పెద్దలు చెపితేనే, వారు అగ్రవర్ణాల వారనో, నిమ్నవర్ణాల వారనో తెలిసింది. భోగం కులం అనేది ఒకటి ఏర్పడి పోయాక, అందులో పుట్టి పెరిగిన భోగం పిల్లకి, వేశ్యమాత -అమ్మా, నువ్వు ఈ టక్కులు వెయ్యాలి, విటులు వచ్చినప్పుడు ఐటమైజ్ చేసి ప్రతి సర్వీస్ కి ఇలా కలెక్ట్ చెయ్యాలి అని (ఇప్పటి డాక్టర్లకు, లాయర్లకు, వాళ్ల మేనేజింగ్ పార్ట్నర్ చెపితే తెలిసినట్టు) చెపితేనే గదా తెలిసింది. మరి ఆ పాక్షికతలు ఆయన గమనించడేం? సంఘాన్ని సంస్కరించాలనుకున్నవాడు, సంఘం సమగ్రావగాహన లేకుండా, ఆ ఏర్పాటుల ముందు వెనకలు తెలియకుండా, తన బయాస్ అలానే ఉంచుకుని, ఇతరుల నీతిమీద హేయత చూపటం సబబా?
అశ్లీలాలు – అవి ఏవో ఈ శృంగార కావ్యాల్లో నాకు తెలియదు. డాక్టర్లకు, బూతు perception ఇతరులకన్నా వేరుగా ఉండొచ్చేమో. వీరేశలింగం గారికి అనేక ఆసక్తులు. ఒకప్పుడు సైన్స్ మీద మోజు కలిగి, human body dissection చూడ్డానికి వెళ్లి, అక్కడ అమాంతం మూర్ఛపోతే అక్కడి వారు, వారిని బైటకు చేరేసారు. డాక్టర్లకు ఈ నాజూకులు ఒప్పవు. తెలుగు కవుల మీద, భాష మీద, పంతులుగారికి మరింత ఆసక్తి. భక్తి, నీతి విషయంలో ఆయనకు మధన జాస్తి. చాలా తెలుగు పుస్తకాల్లో ఆయన మోతాదు మించిన శృంగారం, ఉన్నదనుకున్న చోట్ల వాటిని ఎత్తి చూపారు. ఆ భాగం (అమ్మ బాబోయ్! పొరపాటున భగం అని రాసా. I think it is a dangerous word. Trump – grab her by the pussy- అంటే ఎంత గోలయ్యింది!). మాత్రమే చదివి, శృంగార ప్రియులు విరమించుకోవచ్చు. నిజంగా, ఈ బూతు/ శృంగారం distinction నాకు తెలియటం లేదు. భారద్దేశంలో శివలింగాలు చాలా చోట ఉంటాయి. ఆ రాతి స్కల్ప్చర్, స్త్రీ యోని, పురుష లింగమే కదా. అన్ని చోట్లా పబ్లిగ్గా, సెక్స్ ఆర్గన్స్ ని ఆరాధిస్తున్నప్పుడు, ఇదివరకటి, ఇప్పటి కావ్యాల్లో వాటిని వర్ణిస్తే మాత్రమేం?
ఈ నా కామెంట్ వీరేశలింగం గురించా, అశ్లీలం గురించా అంటే -కాదు కాని, తెలుగు అనువాదంలో ఏం అంశాలు ఎలా నిభాయించాడో, శ్రీ నాధుడు నైషధంలో కావ్యోపహారం లో చెప్పాడని, పంతులుగారు చెప్పగా, తర్వాత ఎందరో అదే ఆధారంగా తీసుకున్నందున, అసలు పంతులు గారి ఏ ఆలోచనలో సవ్యత లెంతెంత? అని నేను ఆలోచిస్తున్నా. అశ్లీలం అనేది ఉన్నదని, పరిహరించాలనీ అనుకోకుండా, మోరలిస్టిక్ హై హార్స్ ఎక్కకుండా, లింగ్విస్టిక్ వర్క్స్ వేరు భాష లోకి తర్జుమాలు చేసేవారు, వెనకటి వాళ్లు/ఇప్పటి వాళ్లు, ఏం రాసారో ఆ రాసింది రాసినట్లు ఇవ్వగలిగితే చాలు, అని నాకనిపిస్తుంది.
ఏల్చూరి వ్యాసం ఆసక్తికరంగా ఉన్నది. వ్యాసమే కాక మరిన్ని ఇతర పుస్తకాలు తీసి చదివాను. నారాయణరావు, షుల్మన్ ల వ్యాసం కూడా నాకు చదవాలని కుతూహలంగా ఉంది. ఇంకా చదవలేదు.
Thanks
Lyla.
PS: Acapulco ను నేను తెలుగులో రాస్తే, ఆకపూల్కో అని pronunciation.com లో విన్న విధంగా రాస్తాను. I remember reading about a young lady from Bombay who had problem correctly saying ‘José’, recognized the need, and created such a tool.
“విజయనగర రాజులు మూడు తరాలు – 14వ శతాబ్దం మధ్య నుంచి 17వ శతాబ్దం మధ్య వరకూ ….”
నాకు తెలిసినంత వరకు “తరం” అంటే generation. ఈ రోజులలో వాడుక ప్రకారం generation అంటే 25 లేదా 30 సంవత్సరాలు. కనుక పై వాక్యం లో “తరాలు” కి బదులు “శతాబ్దాలు” అనుంటే సరిపోయేదేమో?
ఈ వ్యాసానికి స్పందించటం ఇబ్బంది అయినా, చివరికి ఇలా విన్నవించుకుంటున్నాను. ఎవరూ మాట్లాడకపోతే భవిష్యత్తులో ఈ వ్యాసం ప్రామాణికమవచ్చు. దరిమిలా పాఠ్యపుస్తకాలలో జొరబడనూ వచ్చు.
౧. వెనకటికి ఓ ఆంగ్లేయుడు లేపాక్షికి వెళ్ళాడు. ఆ దేవాలయంలో అంతరిక్ష స్థంభం అని ఒకటి ఉన్నది. అంటే ’నేలకు అంటని కంబం’. ’నేలకు అంటకుండా ఎలా ఉంటుంది?’ అని తర్కించి అతను ఆ కంబానికి మోకులు కట్టి ఏనుగుతో లాగించి చూచాడు. ఆ కంబం కాస్త ఒరిగి, ఒకపక్క నేలకు అంటింది. అతను ఇంకా ప్రయోగాలు చేయబోతే స్థానికులు చెప్పారట. ఆ ఒక్క కంబమూ కూలితే, మొత్తం మండపం కూలుతుందని. ఆ ఆంగ్లేయుడు తన పనిని విరమించుకోవలసి వచ్చింది.
౨. అలాంటి మరొక ఆంగ్లేయుడు హంపి విజయవిట్ఠల ఆలయానికి వెళ్ళాడు. అక్కడ సంగీతస్థంభాలను చూశాడు. ఒకే ఆకారంలో ఉన్నప్పటికీ – ఒక్కో స్థంభం ఒక్కో నాదాన్ని ఎలా పలుకుతోందని శంకించాడు. ఆ స్థంభాలలోపల ’బోలు’ గా ఉండాలని, ఆ ’బోలుతనం’ హెచ్చు/తగ్గింపు ల మీద నాదం వేరవుతుందని ప్రతిపాదించాడు. తన సిద్ధాంతాన్ని ఋజువు చేయడానికి ఓ స్థంభపు రెండు చివరలలో విరగ గొట్టి చూశాడు. ఆ కంబం ’బోలు’ గా లేనే లేదు. ఆతని సిద్ధాంతమూ తప్పయింది, కంబమూ నాశనమయింది.
(ఇప్పటికీ అతను కత్తిరించిన కంబం ఆనవాళ్ళు అక్కడ ఉన్నై)
ఫిలిప్ వాగ్నర్ – వాళ్ళ వారసత్వంలో విజయనగర చరిత్రను అనుశీలించినట్టున్నాడు. ఈ వ్యాసానికి నా ప్రతిస్పందన నా బ్లాగులో ఇలా.
కాళిదాస కృతమో లేక శ్రీ మురళీధరరావు గారు నిర్ధారణ చేసినట్లు శ్రీ ఆర్యభట్టుల వారి విరచితమో పుష్పబాణ విలాసము నర్ధ తాత్పర్యములతో నతి సుందరముగా వివరించి శ్రీతిరుమల కృష్ణదేశికాచార్యుల వారు మూలమున కెట్టి రీతుల తీసిపోనట్టి చక్కని ఆంధ్ర పద్యప్రసూనాలను కుసుమశరుని కర్పణ జేసారు. పద్యాలు మనోహరముగా నున్నాయి. శ్రీ కృష్ణదేశికాచార్యుల వారికి అభినందన వందనములు.
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
11/19/2016 11:12 am

Yippee! I’m a poet, and I know it గురించి ఉణుదుర్తి సుధాకర్ అభిప్రాయం:
11/19/2016 2:20 am
చక్కటి పరిచయాన్ని అందించిన వేలూరి వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.
లిఖిత, మౌఖిక సాంప్రదాయాల లేదా ప్రక్రియలనడుమ మనమే సృష్టించుకున్న లక్ష్మణరేఖల్ని చెరిపేసుకుంటే బాబ్ డిలాన్ వంటి గాయకుల, గేయకారుల కవిత్వం ఉప్పొంగి ఉక్కిరిబిక్కిరి చేస్తుందని తెలుగు, ఇంగ్లీషు భాషల జోడుగుర్రాల పైన అవలీలగా స్వారీ చేస్తూ వచ్చి నాబోంట్లకు తెలియజెప్పినందుకు – మరీ ముఖ్యంగా ధన్యవాదాలు.
ఈ పరిచయ వ్యాసం చదివినవాళ్లెవరైనా ఒక గాయకుడికి సాహిత్యరంగంలో నోబెల్ బహుమతి ఇవ్వొచ్చునా, కూడదా అనే అనవసరపు వివాదంలోంచి బయటపడగలుగుతారని నమ్ముతున్నాను.
అనగనగా ఒక జైలు… గురించి శ్రీకాంత్ అభిప్రాయం:
11/18/2016 6:49 am
కథ చాలా బాగుంది. నేను మా మిత్రునికి కూడా చదవమని చెప్పాను ఈ కథను.
ఫ్రాగ్మెంట్స్ గురించి Seetha అభిప్రాయం:
11/18/2016 12:02 am
చాలా బాగుంది
రెండు కవితలు గురించి Seetha అభిప్రాయం:
11/18/2016 12:00 am
నాకు రెండోది చాల నచ్చింది. అలా కళ్ళకు కట్టీ నట్టు అందంగా వ్రాసారు.
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి lyla yerneni అభిప్రాయం:
11/17/2016 6:29 pm
సంస్కృతం లోని హర్ష నైషధం చదవలేను. కాని శ్రీ నాథుడి శృంగారనైషధము ఇదివరలో చదివాను. ఇప్పుడు ఇంకొంచెం మెరుగ్గా చదవగలను. ఎమెస్కో పుస్తకం అట్ట మీద శ్రీనాధుడు అని ఉంది. లోపల చాలా వరకూ శ్రీ నాథుడు అని ఉంది. ఈ రకం పొట్టలో చుక్కల అచ్చు తప్పులు నేను కనిపెట్టగలగటం, నా కంటి డాక్టర్లు మంచి కరెక్షెన్ చేస్తారని చెపుతుంది. ఈ తెలుగు మాటలు ఎలా రాయటం సరైనదో, నేను తప్పులు రాసినప్పుడు కొందరు స్నేహితులు చెపుతారు. కాని, నేనేం లెక్క చేసుకోను. వాదన సాగించి అలాటి అంశాల మీద చిన్న సైజు డిబేట్ లు నడపటం నాకు చాలా ఇష్టం. దరిమిలా కొన్ని తప్పులు సరిచేసుకుంటాననుకోండి.
చాలా డిబేట్ లలో ఎవరు గెలిచారనేది, స్పష్టం కాదు. ట్రంప్, హిల్లరీ క్లింటన్ ల డిబేట్లు ఎవరు గెల్చారనేది, పోల్స్ ఐతే, ప్రతి డిబేట్ హిల్లరీ నే గెలిచిందని చెప్పాయి. ట్రంప్ తనే గెలిచాడని నిక్కచ్చిగా చెప్పాడు. (ఎలక్షన్ లో ట్రంప్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందేలా గెలిచాడు. నాకైతే సువర్ణ శ్రీ, బెన్ హర్ ఛారియెట్ రేస్ చూసినట్టనిపించింది. It is a fantastic drama. I am thrilled. I congratulate the victor.)
ఏ వివాదం లోనూ ఒకరు నిక్కచ్చిగా గెలిచారనే పరిస్ధితి ఇప్పుడు ప్రపంచంలో లేదు. ఈ వ్యాస విషయం లోనూ లేదు. పొట్టలో చుక్క ఉన్న/ లేని విషయం ఆధారంగా నేను ఇద్దరు శ్రీనాథులు ఉన్నారనొచ్చు. ముగ్గురు డింఢిమ భట్టులుండగా లేంది, ఇద్దరు సర్వజ్ఞ సింగభూపాలురుండగా లేంది ఇద్దరు శ్రీనాధులెందుకు ఉండరాదు?
అసలు, ఈమాటలోనే చూడండి, ఎందరో వేంకటేశ్వరరావులు. తెలుగు దేశంలో మనవడికి తాత పేరు పెట్టే సంప్రదాయంలో, దేవుళ్ల పేర్లుంచే వ్యాపకంలో, ఒకే పేరు వాళ్లు లక్షలు లక్షలు. ఇక ఆ పేరూ ఈ పేరూ పెట్టుకుని రాసే అలవాటు కూడా ఉన్నప్పుడు, వేమ భూపాలుడు, వీర భూపాలుడూ ఒకరా, ఇద్దరా అనేదే కాక, ఈ ఇద్దరి రాజుల బదులూ డబ్బు కోసం శ్రీ నాథుడే రకరకాల కావ్యాలు రాసాడేమో అని కూడా అనుకోవచ్చు. పోనీ కావ్యంలో కంటెంట్ చూసి, రచయితను గుర్తు పడదామంటే, ఐదుగురు నల మహారాజులను ఒకేసారి చూసిన దమయంతి అవస్థ. అన్ని ప్రబంధ కావ్యాలూ ఒకలాగే ఉంటాయి. అట్టలు చూసి గుర్తు పడదామంటే, అన్నమయ్యకీ, వీరేశలింగం గారి ఆంధ్ర కవుల చరిత్రకూ ఒకే లాటి బొమ్మ వేస్తాడు డా. బాపు. అన్ని తెలుగు పుస్తకాల మీదా ఆయన బొమ్మలేనయ్యె!
వీరేశలింగం పంతులు గారు ఆంధ్ర కవుల చరిత్రము లో ‘మాతృక’ లంటే ఏమిటో, ‘పుత్రిక’ లంటే ఏమిటో చెప్పారు. పాపం, పంతులు గారు తెలుగు కవులను గూర్చి రాయటానికి, మాతృకలను సంపాదించుకోటానికి చాలా ప్రయత్నించారు. ఐనా ఇతరులు ఆయనకు అందనీయకుండా తొక్కి పట్టినట్టున్నారు. మదరాసులో లైబ్రరీ లకు వెళ్లి కొన్ని మాతృకల నుండి ‘పుత్రిక’లను ఆయనే దత్తత చేసుకున్నారు. ఆ కష్టాలు చూస్తే, అప్పుడే దొరకని తాళ పత్ర గ్రంధాలు ఇప్పుడింకేం దొరుకుతాయీ అనిపిస్తుంది. ఆయన పీఠికలు, శ్రీనాథుడి పైన వ్యాసం చూస్తే, కొత్త మెటీరియల్ దొరికినప్పుడల్లా ఆయన వ్యాసాలు upgrade చేస్తూ వచ్చాడని తెలిసింది. కవుల కథలు చాలా వరకూ అతుకుల బొంతలనీ, ఇప్పటి వీకీపీడియాల లాగానే ఏదీ 100% నమ్మేందుకు వీలు లేదనీ తెలుస్తుంది.
అలాగే, అంతకు ముందు కావ్యాలలో కూడా మెటీరియల్ తర్వాత తర్వాత చేర్చి ఉండొచ్చు. నాకూ శృంగార నైషధం చివరి లోని ‘కావ్యోపసంహారము’ out of place లాగానే అనిపించింది. Insert లాగా అనిపించింది. వేమభూపాలుడో, అంకింతం పుచ్చుకున్న అమాత్యుడో, శ్రీ నాథుడి గొంతు మీద కూర్చుని, అక్కడో పద్యం, చివర్లో వచనం, ఇరికింప చేసారా అని సందేహం కలిగింది. అలా చేసే పవర్ వాళ్లకు ఉంది.
భాషను చూసి, శ్రీనాధుడి పద్యం ఏదో చెబుదామా అంటే, పొట్టకూటికై కవి వేషం మార్చుకుంటున్నాడు, పరగణా మారినప్పుడల్లా భాష, యాస మారక తప్పదే. భాష మీద భద్రిరాజు గారి రీసర్చ్ అయ్యే లోపల, తెలుగు వాళ్లు ఎన్నో సార్లు జిల్లాలు, రాష్ట్రాలు మారి ఉంటారు. అందుకని అలా చాలా స్లోగా సంవత్సరాల మీద సాగే ఆ రీసెర్చ్ మీద నాకంత నమ్మకం లేదు.
ఇక కావ్యంలో ఉన్న అశ్లీలం పట్టి రచయిత ఎవరో నిర్ణయం చేద్దామంటే, వీరేశ లింగం పంతులు గారే ఆ ప్రయత్నంలో పరాజయం పొందారు. పోతన కవి, భోగినీ దండకం రాస్తే -భాగవతం రాసిన పరమ భాగవతోత్తముడు, అలాటి రచన రాయటమేంటని, ఆయన కక్కా మింగా లేకపోయాడు. ఒక వేశ్య, రావు సింగభూపాలుని కామించటమేమిటి? ఆయన ఆమె ముద్దు చెల్లించట మేమిటి? పైగా వేశ్యమాతను ఏనుగు ఎక్కించి ఊరేగించటమేమిటని, ఆయన పళ్లు పటపటలాడినయ్యి. అలాటి బోగం stuff/అశ్లీలం? పోతన వ్రాసి ఉండడన్నారు. కానీ ఇతరులు మందలించాక, అప్పుడు మంచె దిగొచ్చి -తనది సైన్స్ దృక్పథం, నిజం చెప్పటమే తన ధ్యేయమని, మనకు సంజాయిషీ ఇచ్చి, పోతనకు pardon ఇచ్చారు.
ఐతే శ్రీనాధుడి విషయంలో వీరేశలింగం గారు నెగెటివ్ గా విజృంభించారు. ఆయన దృష్టిలో శ్రీనాథుడు చెడిపోయినట్టు లెక్క. వేశ్యా సంపర్కం ఆయనకు గిట్టదు. పంతులు గారు -ఈ శ్రీ నాథుడికి ద్రాక్షారామం నగరం లో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్ర కులస్థులెవరూ ఊళ్లో కనపడలేదు, భోగం స్త్రీలు మాత్రమే కనిపించారని – వారి గ్రంధంలో ఉడుక్కుంటాడు. ఆ కులాలు కల్పించిన మానవ సంఘమే కదా వేశ్యా కులం కూడా కల్పించింది. వేశ్యలు వారు వారంతట వారే మొలుచుకు వచ్చారా? ఆ విషయం ఆయన ఎందుకు గమనించడు?
జాషువా కవి ‘గబ్బిలం’ ఖండకావ్యం మొదట్లోనే – నేను కడజాతిలో జన్మించిన వాడిని, భారత వీరులకు చెప్పులు కుట్టేవాడిని అని ఆయన అన్నప్పుడు, ఆ కవికే న్యూనతా భావం ఉందా? తీరి కూర్చుని నేను ఇతర తెలుగువారి కంటే తక్కువ అని తనే ఊహించుకుంటున్నాడా? లేదు. వాళ్ల అమ్మా నాన్నా, ఒరే నాయనా, మనం మాల వాళ్లంరా మాదిగ వాళ్లంరా అని చెపితేనే జాషువాకి తెలిసింది. ఇతర తెలుగులు – నువ్వు మమ్మల్ని అంటుకోకూడదురా, నువ్వు ఎడంగా ఉండు అంటే జాషువాకి తెలిసింది. ఏ కులాల వాళ్లకు కూడా, వాళ్ల పెద్దలు చెపితేనే, వారు అగ్రవర్ణాల వారనో, నిమ్నవర్ణాల వారనో తెలిసింది. భోగం కులం అనేది ఒకటి ఏర్పడి పోయాక, అందులో పుట్టి పెరిగిన భోగం పిల్లకి, వేశ్యమాత -అమ్మా, నువ్వు ఈ టక్కులు వెయ్యాలి, విటులు వచ్చినప్పుడు ఐటమైజ్ చేసి ప్రతి సర్వీస్ కి ఇలా కలెక్ట్ చెయ్యాలి అని (ఇప్పటి డాక్టర్లకు, లాయర్లకు, వాళ్ల మేనేజింగ్ పార్ట్నర్ చెపితే తెలిసినట్టు) చెపితేనే గదా తెలిసింది. మరి ఆ పాక్షికతలు ఆయన గమనించడేం? సంఘాన్ని సంస్కరించాలనుకున్నవాడు, సంఘం సమగ్రావగాహన లేకుండా, ఆ ఏర్పాటుల ముందు వెనకలు తెలియకుండా, తన బయాస్ అలానే ఉంచుకుని, ఇతరుల నీతిమీద హేయత చూపటం సబబా?
అశ్లీలాలు – అవి ఏవో ఈ శృంగార కావ్యాల్లో నాకు తెలియదు. డాక్టర్లకు, బూతు perception ఇతరులకన్నా వేరుగా ఉండొచ్చేమో. వీరేశలింగం గారికి అనేక ఆసక్తులు. ఒకప్పుడు సైన్స్ మీద మోజు కలిగి, human body dissection చూడ్డానికి వెళ్లి, అక్కడ అమాంతం మూర్ఛపోతే అక్కడి వారు, వారిని బైటకు చేరేసారు. డాక్టర్లకు ఈ నాజూకులు ఒప్పవు. తెలుగు కవుల మీద, భాష మీద, పంతులుగారికి మరింత ఆసక్తి. భక్తి, నీతి విషయంలో ఆయనకు మధన జాస్తి. చాలా తెలుగు పుస్తకాల్లో ఆయన మోతాదు మించిన శృంగారం, ఉన్నదనుకున్న చోట్ల వాటిని ఎత్తి చూపారు. ఆ భాగం (అమ్మ బాబోయ్! పొరపాటున భగం అని రాసా. I think it is a dangerous word. Trump – grab her by the pussy- అంటే ఎంత గోలయ్యింది!). మాత్రమే చదివి, శృంగార ప్రియులు విరమించుకోవచ్చు. నిజంగా, ఈ బూతు/ శృంగారం distinction నాకు తెలియటం లేదు. భారద్దేశంలో శివలింగాలు చాలా చోట ఉంటాయి. ఆ రాతి స్కల్ప్చర్, స్త్రీ యోని, పురుష లింగమే కదా. అన్ని చోట్లా పబ్లిగ్గా, సెక్స్ ఆర్గన్స్ ని ఆరాధిస్తున్నప్పుడు, ఇదివరకటి, ఇప్పటి కావ్యాల్లో వాటిని వర్ణిస్తే మాత్రమేం?
ఈ నా కామెంట్ వీరేశలింగం గురించా, అశ్లీలం గురించా అంటే -కాదు కాని, తెలుగు అనువాదంలో ఏం అంశాలు ఎలా నిభాయించాడో, శ్రీ నాధుడు నైషధంలో కావ్యోపహారం లో చెప్పాడని, పంతులుగారు చెప్పగా, తర్వాత ఎందరో అదే ఆధారంగా తీసుకున్నందున, అసలు పంతులు గారి ఏ ఆలోచనలో సవ్యత లెంతెంత? అని నేను ఆలోచిస్తున్నా. అశ్లీలం అనేది ఉన్నదని, పరిహరించాలనీ అనుకోకుండా, మోరలిస్టిక్ హై హార్స్ ఎక్కకుండా, లింగ్విస్టిక్ వర్క్స్ వేరు భాష లోకి తర్జుమాలు చేసేవారు, వెనకటి వాళ్లు/ఇప్పటి వాళ్లు, ఏం రాసారో ఆ రాసింది రాసినట్లు ఇవ్వగలిగితే చాలు, అని నాకనిపిస్తుంది.
ఏల్చూరి వ్యాసం ఆసక్తికరంగా ఉన్నది. వ్యాసమే కాక మరిన్ని ఇతర పుస్తకాలు తీసి చదివాను. నారాయణరావు, షుల్మన్ ల వ్యాసం కూడా నాకు చదవాలని కుతూహలంగా ఉంది. ఇంకా చదవలేదు.
Thanks
Lyla.
PS: Acapulco ను నేను తెలుగులో రాస్తే, ఆకపూల్కో అని pronunciation.com లో విన్న విధంగా రాస్తాను. I remember reading about a young lady from Bombay who had problem correctly saying ‘José’, recognized the need, and created such a tool.
రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం గురించి Rao Vemuri అభిప్రాయం:
11/17/2016 5:52 pm
“విజయనగర రాజులు మూడు తరాలు – 14వ శతాబ్దం మధ్య నుంచి 17వ శతాబ్దం మధ్య వరకూ ….”
నాకు తెలిసినంత వరకు “తరం” అంటే generation. ఈ రోజులలో వాడుక ప్రకారం generation అంటే 25 లేదా 30 సంవత్సరాలు. కనుక పై వాక్యం లో “తరాలు” కి బదులు “శతాబ్దాలు” అనుంటే సరిపోయేదేమో?
– వేమూరి వేంకటేశ్వరరావు.
రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం గురించి రవి అభిప్రాయం:
11/17/2016 1:18 am
ఈ వ్యాసానికి స్పందించటం ఇబ్బంది అయినా, చివరికి ఇలా విన్నవించుకుంటున్నాను. ఎవరూ మాట్లాడకపోతే భవిష్యత్తులో ఈ వ్యాసం ప్రామాణికమవచ్చు. దరిమిలా పాఠ్యపుస్తకాలలో జొరబడనూ వచ్చు.
౧. వెనకటికి ఓ ఆంగ్లేయుడు లేపాక్షికి వెళ్ళాడు. ఆ దేవాలయంలో అంతరిక్ష స్థంభం అని ఒకటి ఉన్నది. అంటే ’నేలకు అంటని కంబం’. ’నేలకు అంటకుండా ఎలా ఉంటుంది?’ అని తర్కించి అతను ఆ కంబానికి మోకులు కట్టి ఏనుగుతో లాగించి చూచాడు. ఆ కంబం కాస్త ఒరిగి, ఒకపక్క నేలకు అంటింది. అతను ఇంకా ప్రయోగాలు చేయబోతే స్థానికులు చెప్పారట. ఆ ఒక్క కంబమూ కూలితే, మొత్తం మండపం కూలుతుందని. ఆ ఆంగ్లేయుడు తన పనిని విరమించుకోవలసి వచ్చింది.
౨. అలాంటి మరొక ఆంగ్లేయుడు హంపి విజయవిట్ఠల ఆలయానికి వెళ్ళాడు. అక్కడ సంగీతస్థంభాలను చూశాడు. ఒకే ఆకారంలో ఉన్నప్పటికీ – ఒక్కో స్థంభం ఒక్కో నాదాన్ని ఎలా పలుకుతోందని శంకించాడు. ఆ స్థంభాలలోపల ’బోలు’ గా ఉండాలని, ఆ ’బోలుతనం’ హెచ్చు/తగ్గింపు ల మీద నాదం వేరవుతుందని ప్రతిపాదించాడు. తన సిద్ధాంతాన్ని ఋజువు చేయడానికి ఓ స్థంభపు రెండు చివరలలో విరగ గొట్టి చూశాడు. ఆ కంబం ’బోలు’ గా లేనే లేదు. ఆతని సిద్ధాంతమూ తప్పయింది, కంబమూ నాశనమయింది.
(ఇప్పటికీ అతను కత్తిరించిన కంబం ఆనవాళ్ళు అక్కడ ఉన్నై)
ఫిలిప్ వాగ్నర్ – వాళ్ళ వారసత్వంలో విజయనగర చరిత్రను అనుశీలించినట్టున్నాడు. ఈ వ్యాసానికి నా ప్రతిస్పందన నా బ్లాగులో ఇలా.
http://indrachaapam.blogspot.com/2016/10/blog-post.html
http://indrachaapam.blogspot.com/2016/11/blog-post.html
రవి.
సమూలాంధ్రపుష్పబాణవిలాసము గురించి గన్నవరపు నరసింహమూర్తి అభిప్రాయం:
11/16/2016 9:32 pm
కాళిదాస కృతమో లేక శ్రీ మురళీధరరావు గారు నిర్ధారణ చేసినట్లు శ్రీ ఆర్యభట్టుల వారి విరచితమో పుష్పబాణ విలాసము నర్ధ తాత్పర్యములతో నతి సుందరముగా వివరించి శ్రీతిరుమల కృష్ణదేశికాచార్యుల వారు మూలమున కెట్టి రీతుల తీసిపోనట్టి చక్కని ఆంధ్ర పద్యప్రసూనాలను కుసుమశరుని కర్పణ జేసారు. పద్యాలు మనోహరముగా నున్నాయి. శ్రీ కృష్ణదేశికాచార్యుల వారికి అభినందన వందనములు.
తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – చివరి భాగం గురించి Bharath అభిప్రాయం:
11/16/2016 3:33 pm
అద్భుతం. దీని తరవాత ఏం జరిగిందొ కూడ రాయండి.