నైషధీయచరితం ఒక్కొక్క సర్గాంతంలోనూ శ్రీహర్షుడు ‘ఆనంద’ ముద్రను నిలిపి ఉంచిన సంగతి సువిదితమే అనుకొంటాను. ఆయా సర్గాంతశ్లోకాలలో ‘ఆనంద’ శబ్దాన్ని నియతంగా ప్రయోగించటం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత సర్గాంతగద్యకు మారుగా తత్తుల్యమైన ఒక్కొక్క శ్లోకాన్ని వ్రాసి సర్గలను ముగించటం జరిగింది. తెలుగులో తిక్కన్నగారు ఈ సంప్రదాయాన్ని అనువర్తించి మహాభారతంలో ఒక్కొక్క పర్వాంతంలోనూ ‘ఆనంద’ ముద్రను నిలిపారు. ఆ తర్వాత యథావిధిగా మన సంప్రదాయం ప్రకారం ఆశ్వాసాంతగద్యను నిబంధించారు. (కొరవి గోపరాజు సింహాసనద్వాత్రింశిక కూడా ఈ ‘ఆనంద’ ముద్రాంకితమే.)
శ్రీహర్షుని నియమాన్ని గుర్తెరిగినందువల్లనే కథోపసంహార వచనం చివర శ్రీనాథుడు “సకలజనంబులు పరమానందంబు నొందిరి” అని ‘ఆనంద’ పదాంకితంగా కథను ముగించినట్లు వ్యాసాన్ని ప్రకటించిన తర్వాత నాకిప్పుడు తోస్తున్నది. ఈ ప్రయోగం అక్కడ యదృఛ్ఛాఘటితం కాదనుకొంటాను.
కథోపసంహార వచనం తర్వాత వేమభూపాలుని శ్లోకానుసారం కావ్యోపసంహార వచనాన్ని ప్రవేశపెట్టవలసిన అవసరం శ్రీనాథునికి తప్ప వేరొకరికి ఉండదు. స్వయంగా ఆయనే గ్రంథాంతంలో రెండు రకాల ముగింపులతో కలగలుపు ప్రతులను వ్రాయించటం జరిగివుండదు.
తెలుగు కావ్యాలలో పెక్కింటిని వ్రాతప్రతులతో సరిపోల్చి పునఃపరిష్కరింపవలసిన ఆవశ్యకతను ఈ సన్నివేశం మరొక్కసారి నిరూపిస్తున్నది.
శ్యామలరావు గారూ, మీ అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పినందుకు చాలా సంతోషం.
ఇకమీదట అనువాదాలలో మరింత సహజంగా ఉండేటట్లు ప్రయత్నిస్తాను.
నా వరకు సంభాషణల్లో సహజమైన భాష అనుకొనే వాడాను. రచయిత మాటలు వచ్చినపుడు మాత్రం ఉన్నది ఉన్నట్టే వ్రాశాను. ఉదా. తెలుగులో నీకు పెళ్ళి కుదిరిందా అని నేను వ్రాసినది. పంజాబీ యాస ఉన్న హిందీ కథలో తేరీ కుడుమాయీ హోగయీ అని ఉంటుంది ప్రతిసారీ. (నిశ్చితార్థం అయిందా) అలా అడగడం అసహజంగా ఉంటుందని పెళ్ళి కుదిరిందా అని మార్చాను.
అయినా మీరు చెప్పిన విషయాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తాను.
మణి గారి అభిప్రాయంతో యేకోభవించలేక పోతున్నందుకు వారు మన్నించాలి. నాదృష్టిలో అనువాదం యేమంత బాగోలేదు. నిజం చెప్పమని నిలదీస్తే, అస్సలు బాగోలేదని అంటాను.
ఇందులో లక్ష్మి గారి పొరపాటు ఎక్కువగా లేదేమో అనిపిస్తుంది. ఇంచుమించి ఇలాంటి ధోరణి అనువాదకుల్లో సాధారణం!
ఒక అనువాదం చదువుతుంటే అది ఒక అనువాదం అన్న స్పృహ అనుక్షణం మనతో ఉండేలా ఉండేలా చేసే పరిస్థితి ఉండకుండా అనువాదకులు జాగ్రత వహించటం తక్కువగా కనిపించటం విచారపడవలసిన సంగతి. కృతకమైన పదవాక్యశైలీవిన్యాసాలతో అనువాదాలన్నీ సాగవలసిందేనా అని దుఃఖం కలుగుతూ ఉంటుంది. మూలరచనలోని ప్రతిపదమూ వాక్యమూ సాధ్యమైనంతగా అలాగే తెలుగులోనికి వచ్చితీరాలని ఆరాటపడటం వలన అనువాదం చాలా కృతకమైన -సూటిగా చెప్పాలంటే- అతితరచుగా నిర్జీవమైన భాషలోనికి జారిపోతుంది.
అనువాదకులు సహజంగా చేసే ఆ పొరపాటే ఇక్కడా ఉన్నది.
మూలంలోని భావరమ్యతనూ, కథాగమనాన్నీ, శైలీవిన్యాసాన్నీ — ఇలాంటీ గుణాలని వీలైనంతగా గమనించి అవలంబించి అనుకరిస్తూ వ్రాయటం తప్పక మంచి విధానమే. కాని యథామక్షికానువాదం చేయటం ప్రమాదం. అలాచేస్తే తెలుగుచదువుతున్నట్లు కాక విచిత్రంగా ఉండి విచారాన్నీ కొండొకచో వికారాన్నీ కలిగించే అవకాశాలే మొండు.
మూలకథను తీసుకొని తనదిగా ఆవష్కరించటం ముఖ్యం. అనువాదం అన్న భావన వెంటాడితే అనువాదం సరిగా లేనట్లే. కాబట్టి అనువాదకులు తెలుగుకు సహజసుందరమైన నుడికారంలో మూలాన్ని చెప్పటాని ప్రయత్నించాలని మనవి.
అవును మణి గారూ, ప్రపంచయుద్ధ కాలంలో అప్పటి ఆంగ్లేయపాలకులకు సహాయంగా వెళ్ళిన భారతసైనికుల ప్రస్తావనతో, ఆ నాటి వాతావరణంతో, మనస్తత్వంతో కథలు తక్కువే (నేను చదివినవి). అనువాదానికి మార్కులొచ్చినందుకు సంతోషం. 🙂
మీరు దయతో రాసిన అభిప్రాయం, నేను రాసిన అభిప్రాయం తరువాత రావల్సినది. ఎందుకు తిరకాసుగా వచ్చిందని అడిగితే, కంప్యూటర్ ఇంజనీర్లు
Software Glitch అని చెప్పుతారని మీకు నేను గుర్తుచెయ్యవలసిన అవసరం లేదు. నిన్ననే మీకు వందనాలని చెప్పుదామనుకున్నాను కాని, ఇప్పటివరకూ కంటి డాక్టరు నన్ను ఏకాక్షిగా పడి ఉండమని శపించాడు.
మీ సుహృద్భావానికి ఇప్పుడు వేలూరి వేంకటేశ్వర రావు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. (అన్ని అక్షరాలూ సరిగా అచ్చయ్యాయో లేవో చూసుకునే బాధ్యత సంపాదకులది!)
భాస్కర్ గారూ,
ఎంత అందంగా ఉందండీ! మీ అనువాదం కూడా అంత అందంగా ఉంది. నిజానికి మీ అనువాదాలవల్ల వైరముత్తు అన్న గొప్ప తమిళ కవి ఉన్నట్టు నాకు తెలిసింది. అనువాదం వెనుక ఉన్న శ్రమకి ఫలితం అదే కదా!
బొమ్మల కొలువు గురించి Vanavil Kalaikoodam అభిప్రాయం:
11/12/2016 3:31 pm
Buy Bommala Koluvu Online
http://www.navarathrigoludolls.com
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
11/12/2016 2:41 pm
పెద్దలందరికి నమస్కారం!
నైషధీయచరితం ఒక్కొక్క సర్గాంతంలోనూ శ్రీహర్షుడు ‘ఆనంద’ ముద్రను నిలిపి ఉంచిన సంగతి సువిదితమే అనుకొంటాను. ఆయా సర్గాంతశ్లోకాలలో ‘ఆనంద’ శబ్దాన్ని నియతంగా ప్రయోగించటం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత సర్గాంతగద్యకు మారుగా తత్తుల్యమైన ఒక్కొక్క శ్లోకాన్ని వ్రాసి సర్గలను ముగించటం జరిగింది. తెలుగులో తిక్కన్నగారు ఈ సంప్రదాయాన్ని అనువర్తించి మహాభారతంలో ఒక్కొక్క పర్వాంతంలోనూ ‘ఆనంద’ ముద్రను నిలిపారు. ఆ తర్వాత యథావిధిగా మన సంప్రదాయం ప్రకారం ఆశ్వాసాంతగద్యను నిబంధించారు. (కొరవి గోపరాజు సింహాసనద్వాత్రింశిక కూడా ఈ ‘ఆనంద’ ముద్రాంకితమే.)
శ్రీహర్షుని నియమాన్ని గుర్తెరిగినందువల్లనే కథోపసంహార వచనం చివర శ్రీనాథుడు “సకలజనంబులు పరమానందంబు నొందిరి” అని ‘ఆనంద’ పదాంకితంగా కథను ముగించినట్లు వ్యాసాన్ని ప్రకటించిన తర్వాత నాకిప్పుడు తోస్తున్నది. ఈ ప్రయోగం అక్కడ యదృఛ్ఛాఘటితం కాదనుకొంటాను.
కథోపసంహార వచనం తర్వాత వేమభూపాలుని శ్లోకానుసారం కావ్యోపసంహార వచనాన్ని ప్రవేశపెట్టవలసిన అవసరం శ్రీనాథునికి తప్ప వేరొకరికి ఉండదు. స్వయంగా ఆయనే గ్రంథాంతంలో రెండు రకాల ముగింపులతో కలగలుపు ప్రతులను వ్రాయించటం జరిగివుండదు.
తెలుగు కావ్యాలలో పెక్కింటిని వ్రాతప్రతులతో సరిపోల్చి పునఃపరిష్కరింపవలసిన ఆవశ్యకతను ఈ సన్నివేశం మరొక్కసారి నిరూపిస్తున్నది.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
ఫ్రాగ్మెంట్స్ గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:
11/11/2016 2:47 pm
మణి వడ్లమాని గారు థాంక్యూ అండి
తెగులుకి శిక్ష గురించి k k rao అభిప్రాయం:
11/11/2016 1:48 am
శర్మ దంతుర్తి గారి కథ చాలా బాగుంది. ముఖ్యంగా ఏ.తె. చదివి హాయిగా నవ్వేను.
తన మాట కోసం గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:
11/11/2016 1:32 am
శ్యామలరావు గారూ, మీ అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పినందుకు చాలా సంతోషం.
ఇకమీదట అనువాదాలలో మరింత సహజంగా ఉండేటట్లు ప్రయత్నిస్తాను.
నా వరకు సంభాషణల్లో సహజమైన భాష అనుకొనే వాడాను. రచయిత మాటలు వచ్చినపుడు మాత్రం ఉన్నది ఉన్నట్టే వ్రాశాను. ఉదా. తెలుగులో నీకు పెళ్ళి కుదిరిందా అని నేను వ్రాసినది. పంజాబీ యాస ఉన్న హిందీ కథలో తేరీ కుడుమాయీ హోగయీ అని ఉంటుంది ప్రతిసారీ. (నిశ్చితార్థం అయిందా) అలా అడగడం అసహజంగా ఉంటుందని పెళ్ళి కుదిరిందా అని మార్చాను.
అయినా మీరు చెప్పిన విషయాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తాను.
తన మాట కోసం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
11/10/2016 10:49 am
మణి గారి అభిప్రాయంతో యేకోభవించలేక పోతున్నందుకు వారు మన్నించాలి. నాదృష్టిలో అనువాదం యేమంత బాగోలేదు. నిజం చెప్పమని నిలదీస్తే, అస్సలు బాగోలేదని అంటాను.
ఇందులో లక్ష్మి గారి పొరపాటు ఎక్కువగా లేదేమో అనిపిస్తుంది. ఇంచుమించి ఇలాంటి ధోరణి అనువాదకుల్లో సాధారణం!
ఒక అనువాదం చదువుతుంటే అది ఒక అనువాదం అన్న స్పృహ అనుక్షణం మనతో ఉండేలా ఉండేలా చేసే పరిస్థితి ఉండకుండా అనువాదకులు జాగ్రత వహించటం తక్కువగా కనిపించటం విచారపడవలసిన సంగతి. కృతకమైన పదవాక్యశైలీవిన్యాసాలతో అనువాదాలన్నీ సాగవలసిందేనా అని దుఃఖం కలుగుతూ ఉంటుంది. మూలరచనలోని ప్రతిపదమూ వాక్యమూ సాధ్యమైనంతగా అలాగే తెలుగులోనికి వచ్చితీరాలని ఆరాటపడటం వలన అనువాదం చాలా కృతకమైన -సూటిగా చెప్పాలంటే- అతితరచుగా నిర్జీవమైన భాషలోనికి జారిపోతుంది.
అనువాదకులు సహజంగా చేసే ఆ పొరపాటే ఇక్కడా ఉన్నది.
మూలంలోని భావరమ్యతనూ, కథాగమనాన్నీ, శైలీవిన్యాసాన్నీ — ఇలాంటీ గుణాలని వీలైనంతగా గమనించి అవలంబించి అనుకరిస్తూ వ్రాయటం తప్పక మంచి విధానమే. కాని యథామక్షికానువాదం చేయటం ప్రమాదం. అలాచేస్తే తెలుగుచదువుతున్నట్లు కాక విచిత్రంగా ఉండి విచారాన్నీ కొండొకచో వికారాన్నీ కలిగించే అవకాశాలే మొండు.
మూలకథను తీసుకొని తనదిగా ఆవష్కరించటం ముఖ్యం. అనువాదం అన్న భావన వెంటాడితే అనువాదం సరిగా లేనట్లే. కాబట్టి అనువాదకులు తెలుగుకు సహజసుందరమైన నుడికారంలో మూలాన్ని చెప్పటాని ప్రయత్నించాలని మనవి.
తన మాట కోసం గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:
11/09/2016 7:53 am
అవును మణి గారూ, ప్రపంచయుద్ధ కాలంలో అప్పటి ఆంగ్లేయపాలకులకు సహాయంగా వెళ్ళిన భారతసైనికుల ప్రస్తావనతో, ఆ నాటి వాతావరణంతో, మనస్తత్వంతో కథలు తక్కువే (నేను చదివినవి). అనువాదానికి మార్కులొచ్చినందుకు సంతోషం. 🙂
Yippee! I’m a poet, and I know it గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:
11/08/2016 2:41 pm
వేమూరి వేంకటేశ్వర రావు గారికి:
మీరు దయతో రాసిన అభిప్రాయం, నేను రాసిన అభిప్రాయం తరువాత రావల్సినది. ఎందుకు తిరకాసుగా వచ్చిందని అడిగితే, కంప్యూటర్ ఇంజనీర్లు
Software Glitch అని చెప్పుతారని మీకు నేను గుర్తుచెయ్యవలసిన అవసరం లేదు. నిన్ననే మీకు వందనాలని చెప్పుదామనుకున్నాను కాని, ఇప్పటివరకూ కంటి డాక్టరు నన్ను ఏకాక్షిగా పడి ఉండమని శపించాడు.
మీ సుహృద్భావానికి ఇప్పుడు వేలూరి వేంకటేశ్వర రావు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. (అన్ని అక్షరాలూ సరిగా అచ్చయ్యాయో లేవో చూసుకునే బాధ్యత సంపాదకులది!)
గూడు గురించి ns murty అభిప్రాయం:
11/08/2016 12:32 pm
భాస్కర్ గారూ,
ఎంత అందంగా ఉందండీ! మీ అనువాదం కూడా అంత అందంగా ఉంది. నిజానికి మీ అనువాదాలవల్ల వైరముత్తు అన్న గొప్ప తమిళ కవి ఉన్నట్టు నాకు తెలిసింది. అనువాదం వెనుక ఉన్న శ్రమకి ఫలితం అదే కదా!
మీకు వేనవేల అభినందనలు.
తన మాట కోసం గురించి మణి వడ్లమాని అభిప్రాయం:
11/08/2016 4:40 am
లక్ష్మి’ గారు కొత్తగా ఉంది అంటే అంతగా పరిచయం లేని నేపధ్యం.అయినా మీ అనువాదం బావుంది.