వంశీ గారు
నమస్కారం. బ్లాగు లోకం చచ్చిపోయిందని మీరనుకుంటున్నారు. నాకు తెల్సినంతలో అది బాగానే బతికి ఉంది. మరి సరిగ్గా బట్టకడుతోందా అనేది వేరే విషయం (ఈ కధ ఆ విషయం మీదే). రాసే వాళ్ళు రాస్తూనే ఉన్నారు. కొంతమంది బ్లాగులు మూసేసి వేరే వ్యాపకాలు చూసుకున్నా సరే వచ్చే కొత్త బ్లాగులు వస్తూనే ఉన్నాయి. కొంతమంది పాతవాళ్ళు ఇంకా రాస్తున్నారు; అది సంతోషించ వల్సిన విషయం.
కామెంట్లు రాకుండా (లేకపోతే) రావడానికో నా స్థాయి కిందకి దించుకుంటున్నాను అని మీరు ఎలా అనుకున్నారో నాకు తెలియదు. నేను రాసిన దాని వల్ల ఈమాట పత్రిక స్థాయి పడిపోయిందన్న మాట వల్ల అలా నా స్థాయి నేను చెప్పుకోవాల్సి వచ్చింది. నాకు తెలిసినంతలో నేను అవతల వాళ్లని మోసం చేయట్లేదు. వాళ్ళు నన్ను మోసం చేయకుండా చూసుకోగలుగుతున్నా. అంచేత నేను అమాయకుణ్ణి కాదు. తెలుగు తక్కువ స్థాయి ఉండడానికీ అమాయకత్వానికీ చాలా తేడా ఉంది గమనించగలరు.
కాళిదాసు రఘువంశం స్థాయిలోనో, విశ్వనాథ వారి వేయి పడగలు స్థాయిలోనో, శ్యామలరావు గారి స్థాయిలోనో నేను కోటి జన్మలెత్తినా రాయలేను. ఆ స్థాయి కావాలిస్తే ఏం చేయమంటారు? అసలీ స్థాయి ఎలా ఉండాలనేది ఎవరో ఒకరు చెప్పాలి కదా? అదే అడిగాను. ఇలా ఈ స్థాయిలో ఉంటే వేసుకుంటాము లేకపోతే లేదు అని ఎడిటర్ గారు నాకెప్పుడూ చెప్పలేదు. నేను రాసినవి బాగోలేకపోతే చెప్పారు వేసుకోము అని కానీ ఇదీ స్థాయి అని ఎప్పుడు చెప్పినట్టు గుర్తు లేదు. ఇప్పుడు చెప్పినా తెలుస్తుంది. అనేకానేక సార్లు చెప్పినట్టు గూగిల్ నాకో వరప్రసాదం. ఏదైనా తెలియకపోతే వెంఠనే గూగిల్ చేసి అక్కడ దొరికింది కాపీ చేసి అంటించుకుంటున్నా, అందులో కాపీరైట్ ప్రోబ్లెంస్ లేకుండా చుసుకుంటూ. ఒకవేళ ఎవరిదైనా బ్లాగులో తస్కరిస్తే వాళ్ళని ముందే పర్మిషన్ అడుగుతున్నాను. అంచేత నా దృష్టిలో నేను కనీసపు స్థాయి వాడినే. ఖఛ్ఛితంగా అమాయకుణ్ణి మాత్రం కాదు.
చివరిగా – నాకొచ్చిన తెలుగు నిఝంగా పదో తరగతి స్థాయి. అలా ఒప్పుకోవడంలో నేను కామెంట్లు రాకుండా/వచ్చేలా చూసుకుంటున్నాని మీరనుకుంటే “హ్యూమన్ కాపిటల్” అనేది ఎంత వేరైటీ గా ఆలోచిస్తుందో అనేది అర్ధమై ఆశ్చర్యం కలుగుతోంది. అంటే మీకు తట్టినది నాకు ఎప్పుడూ తట్టలేదు – కనీసం ఇప్పటివరకూ.
నేను రాసిన కథ పై కుకవి నింద (అంటే ఏమిటో అర్ధం అవ్వకే నిఘంటువు చూసుకున్నాను), స్థాయి అనే పదాలు వచ్చాయి కనుక సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. లేకపోతే కామెంట్ పెట్టి ఉండేవాడిని కాదు. ముందు ముందు మీరన్నట్టూ చూడాలి. కానీ మరి నా (రాతల) మీద మాట వస్తే సమాధానం చెప్పుకోవాలి కదా?
ఈ వ్యాస విషయాన్ని వేల్చేరు నారాయణరావు, డేవిడ్ షుల్మన్ “Srinatha: The poet who made Gods and Kings” లో నిశితంగా విశ్లేషించారు. శ్రీనాథుడు తన అనువాదాన్ని గురించి, అందుకు తను అనుసరించిన మార్గాన్ని గురించి విపులంగా ఎందుకు చెప్పవలసివచ్చిందో, అనౌచిత్య పరిహరణ ఎందుకు అవసరమైందో వివరించారు. ఆ సందర్భంలోని ఒక చిన్న భాగాన్ని ఇక్కడ ఇస్తున్నాను – Srinatha was understandably proud of his achievement. He has, indeed, closely followed the mother text, including its phono-aesthetic qualities and the various components of figuration and affect that the Sanskrit words imply. The explicit focus on the sounds of the original (శబ్దంబనుసరించియు ) points clearly to what makes this translation unique. Once the specific poetic word, శబ్ద , is taken as the basis of the translator’s endeavor, all the other elements make sense; in particular, the question of propriety assumes a heightened importance, since it is possible that sound combinations in the original could accidentally lead to false or inappropriate meanings in the target language. The original poetic word must be matched by its corresponding word, aesthetically and musically fitting, in the translation”.
ఒక సంస్కృత “కావ్యాన్ని” తెలుగులోకి అనువదించిన వారు శ్రీనాథునికి ముందు(గాని తర్వాతగాని – నాకు తెలిసినంతలో) ఎవరూ లేరు. అందువల్ల కావ్యానువాద విధానాన్ని శ్రీనాథుడు కొత్తగా నిర్మించుకోవలసివచ్చింది. అందుకే అంత విస్తరంగా తన అనువాద ప్రక్రియని ఆయన వివరించాడన్నది వేల్చేరు, షుల్మన్ ల లోచూపు. శబ్దం పునాదిగా ఎంచుకోవటంతో అనౌచిత్య ప్రసక్తి కావల్సి వచ్చింది. ఉదాహరణకి గీతగోవిందం లో “చందన చర్చిత నీలకళేబర” అన్న వాక్యం సువిదితమే. దాన్నలాగే తెలుగులోకి దించి “నీలకళేబరుడా” అంటే అనుచితార్థం రాదా? సంస్కృతానికి అది ఉచితమైన ప్రయోగమే, తెలుగుకి కాదు. శ్రీనాథుడు పరిహరిస్తానన్న అనౌచిత్యం అనువాదానికి సంబంధించింది, మూలానికి కాదు – ఇదీ వేల్చేరు, షుల్మన్ ల లోతైన విశ్లేషణ. మరీ మోటైన మరో ఉదాహరణ (అశ్లీలం మీకు నచ్చకపోతే ఈ భాగం చదవకండి)- మెక్సికోలో Acapulco అన్న పట్టణం ఉంది, దాన్ని పలికేటప్పుడు l అక్షరం silent ఔతుంది. దాన్నలాగే తెలుగులో రాస్తే అనౌచిత్యం ఔతుందా కాదా? మూలంలో ఎలాటి అనౌచితీ లేకపోయినా!
ఒక కావ్యంలో ఒక భాగం ఆ కవిది కాదు, మరెవరో అందులో చేర్చారనేది చాలా జాగ్రత్తగా చెయ్యవలసిన ప్రతిపాదన. చాలా గాఢమైన ప్రతిపాదన. దాన్ని సమర్ధించే ఆధారాలు కూడ అంతే దృఢమైనవి కావాలి. “అనౌచిత్య పరిహరణ” అన్న ఒక్క విషయాన్ని పునాదిగా తీసుకుని, అనౌచిత్యం అంటే అది మూలానికి సంబంధించిందే అయుండాలని ఊహించుకుని, మరో రకమైన అనౌచితికి తావేలేదని prove చెయ్యకుండా assume చేసుకుని, దాని ఆధారంగా శ్రీనాథుడు ఈ భాగాన్ని రాయలేదని సిద్ధాంతీకరించటం తార్కికం కాదు.
Reference: Velcheru Narayana Rao, David Shulman, “Srinatha: A poet who made Gods and Kings”, Oxford University Press, 2012.
బాగుంది. చాలా చక్కగా రాశినారు. బ్లాగు ప్రపంచం నశించి చాలా రోజులైపోయినా కూడా ఆ లోకానికి మళ్ళీ తీసుకుపోయినారు. చదివి సంతసించినాను. ధన్యవాదాలు.
పోతే, ఒక చిన్న మాట – ఎన్నో వందల సంవత్సరాలుగా మీ కామెంట్లు చదువుతున్నాను. మీరు ఏ కామెంటు రాసినా అందులో “నాకొచ్చిన తెలుగు అధమం. అన్ని తప్పులూ నావే. నాది మట్టి బుర్ర. నాకు పదో తరగతి తెలుగు మాత్రమే వచ్చు. నేను అమాయకుణ్ణి. నా రాతలు అమాయకత్వం. ఈమాటలో రాయటం నా భాగ్యం. వాళ్ళు అసలు ఎట్లా నా రాతల్ని అనుమతిస్తున్నారో ఆ భగవంతుడికే తెలియాలి…” అంటూ డిప్రెషను టు ద పవర్ ఆఫ్ 501 డిటర్జెంటు సబ్బులా తళతళా చదివేవాళ్ళను తోముతున్నారు. ఎంత మిమ్మల్ని తక్కువ చేసుకుంటే అంత అవతలివాళ్ళు సంతోషపడి మళ్ళొక కామెంటు రాయకుండా ఉంటారని మీరేసిన కుంగుబాటు ప్లాను చాలా ఇదిగా ఉన్నది. దీనికన్నా మీరసలు ఏ కామెంటు రాయకపోటం మంచిది.
దంతుర్తి శర్మగారు తెలుగుబ్లాగుల్లో తెలుగునాశనం అవుతోందీ అని బాధపడుతున్నారు. మరి ఆ దిగజారుడు తెలుగుకే విశేషమైన ఆదరణ లభిస్తున్నది. పొరపాటున మనం విభేదించామా దొంగలమన్న ముద్రకూడా వేయటానికి వెనుదీయనిది బ్లాగులోకం. అందుచేత తస్మాత్ జాగ్రత. ఇకపోతే శర్మగారి వంటివారికి నచ్చే తెలుగులో టపాలు కడితే వాటిని పట్టుమని పదిమంది కూడా చదవరని స్వానుభవం పైనే చెబుతున్నాను.
అలాగు కాలానుగుణంగానో దాని గ్రహచారానుగుణంగానో భాషకు పతనౌన్నత్యాలు సంభవిస్తాయి. ఇప్పటి కాలంలో అందరిళ్ళల్లోనూ మంచినీళ్ళకు కూడా వాటర్ అనే అంటున్న పరిస్థితి. వగచి ప్రయోజనం లేదు. అందుచేత జనబాహుళ్యం సరైన భాషనే చూసి ఇదేమి తెలుగూ అని ఇహిహీ అని పగలబడే నవ్వుతున్నారన్న నిజం మనం ఒప్పుకోక తప్పదు.
ఏది ఏమైనా ఈకథ ఒక ఆరోగ్యకరమైన చర్చకు తావిచ్చిందని సంతోషంగా ఉంది.
రాముడు, మనోహర్, లలిత, కె.కె.రావు, మోహన, జిలేబీ, శ్యామలరావు గార్లకి
నాగమురళి గారు అన్నఈ – కుకవి నింద – మీకు నచ్చినందుకు సంతోషం. నాకొచ్చిన అధమమైన తెలుగు ఎటువంటిదంటే ఈ కుకవి నింద అంటే ఏమిటో నిఘంటువులో చూసుకోవాల్సి వచ్చింది! బ్లాగుల్లో రోజూ కనబడే తెలుగు నాశనం అవుతోంది అనేది బ్లాగులు చదివే అందరికీ తెల్సినదే. ఎవరైనా ఇదేం తెలుగు అని అడిగితే నువ్వెవరివోయ్ చెవలాయ్ అనడం, లేకపోతే కామెంట్ అనుమతించకపోవడం చేస్తున్నారు. అది వాళ్ళిష్టం అనుకోండి కానీ భాష మాత్రం అలాగే ఉం(టోం)ది. అయినా పదో తరగతి తెలుగు మాత్రం వచ్చిన నేనెవణ్ణి వీళ్లకి సుద్దులు చెప్పడానికి? ఈ సుద్దులు అనేమాట కూడా ఆ మధ్య ఒకాయన నా ఈమాట కధకి కామెంట్ గా రాసారు. నా మట్టిబుర్రకి అవి గుర్తున్నా మళ్ళీ ఇలాంటివి రాస్తున్నాను. అంచేత తప్పంతా నాదే. ధన్యవాదములు+స్వస్తి
వ్యాసప్రతిపాదితార్థం మీ అనుమోదానికి నోచికొన్నందుకు ఎంతో సంతోషం కలిగింది. కావ్యోపసంహారవచనం వేమభూపాలుని మాటకు అనువర్తనమే గాని ఆంధ్రీకరణపద్ధతికి సూచకం కాదన్న అంశాన్ని నొక్కిచెప్పేందుకు నైషధీయచరితంలో అనౌచిత్యదోషారోపణ సాధ్యం కాదని వ్రాసిన మాట నిజమే. శ్రీహర్షుడు క్షేమేంద్రుని ఔచిత్యసిద్ధాంతాన్ని గుర్తెరిగి, దానిని ఆమోదించినవాడని చెప్పేందుకు నైషధీయచరితంలోనే సాక్ష్యాలున్నాయి. ఆధునికదృష్టితో చూచినప్పటి నిర్వేలములైన శృంగారవర్ణనలు తప్ప – లాక్షణికదృష్టితో అన్వయింపదగిన అనౌచిత్యాలు అందులో లేవనే ఇప్పటికీ నా అభిప్రాయం. అందులోని కథ, కథనం, శైలి, కల్పనలు మొదలైనవానిని గూర్చి సుశీల్ కుమార్ దే గారి వంటి పండితుల తీవ్రవిమర్శలన్నీ వ్యాసప్రతిపాదితానికి సంబంధించినవి కావు గనుక నేను ప్రస్తావింపలేదు.
“చింతామణీ మంత్రచింతనఫలంబు” అన్న శ్రీ రావూరి దొరసామిశర్మ గారి పాఠస్వీకారం ఎట్లాగూ (8-203) లోని పద్యానికి విరుద్ధమే గాక శ్రుతకథావిరుద్ధం కూడా అవుతుంది. శ్రీహర్షుడు తన్మంత్రసిద్ధుడని నిరూపించే కావ్యభాగాలను జీవాతు వ్యాఖ్యలో మల్లినాథుడు వేయినోళ్ళతో మెచ్చుకొన్నాడు. వాటిని అన్వయించి చెప్పాడు. “అవామా వామార్ధే” శ్లోకానికి వ్యాఖ్యాతలు వివరించిన భాగాలన్నీ చూడదగినవే. ఆయన “చింతామణీ మంత్రచింతనపరుండు” కావటం వల్లనే ఆ రచన, ఆ అన్వయం సాధ్యమవుతాయి. “తల్లిదండ్రుల చింతనఫలం” అన్న అర్థంలో ఆ అన్వయం సార్థకం కానందువల్ల వేదం వారి పాఠమే స్వీకార్యమని చెప్పాలి. దురదృష్టవశాత్తు తెలుగుదేశంలో నైషధం వ్రాతప్రతులు ఎక్కువగా బ్రతికిలేవు. పరస్పరవిరుద్ధాంశాలు ఏ వ్రాతప్రతిలో ఏ విధంగా ఉన్నాయో సరిచూస్తే కాని ఈ సమస్యను పరిష్కరింపలేము.
మీవంటి ప్రామాణికులు ఈ వ్యాసాన్ని చదివి ఉండటమే నాకు గొప్ప విషయం. మీ స్పందన నన్ను ధన్యుణ్ణి కావించింది.
పూజ్యులు డా. గన్నవరపు నరసింహమూర్తి గారికి
మనఃపూర్వక నమఃపూర్వకంగా,
ఎప్పటి వలె మేరలేని దయతో వ్యాసాన్ని చదివి, ఔదార్యంతో మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు నా ధన్యవాదాలను విన్నవించికొంటున్నాను. మీరు ప్రకటించిన పదకోశాన్ని దృష్టిలో నిలిపికొని, ఈ పర్యాయం మరింత శ్రద్దధానతతో వ్యాసరచన కావించే ప్రయత్నం చేస్తానని కూడా మనవి చేస్తున్నాను. వ్యాసప్రతిపాదితం మీ ఆమోదానికి పాత్రమైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది.
పాండిత్యప్రకర్షతో తర్కకర్కశముగా సాగిన మురళీధరరావుగారి వ్యాసము ప్రశంసనీయము. ‘మాతృక’కు శ్రీనాథుని కుపలభ్యమానమైన తాళప్రతి యను అర్థమును జెప్పుట సమంజసముగానే యున్నది. కాని ‘ప్రమాదో ధీమతామపి’ అని యున్నదే కదా! శ్రీహర్షుని కావ్యము పరిపూర్ణముగా దోషరహితమను వాదన అంత బలముగా చేయవలసియుండినది కాదనిపించుచున్నది. ఎమస్కో శృంగారనైషధప్రతికి ఉపోద్ఘాతమును వ్రాయుచు విశ్వనాథవారు ‘నిజానికి, సంస్కృతకావ్యములో కొన్ని పచ్చి బూతులవలె కనిపించునవి యున్నవి. శ్రీనాథుడు వాని నన్నిటిని పరిహరించ లేదు. కొన్నిటిని శ్రీనాథుడును వ్రాసెను. ఎన్నని పరిహరించును?’ అన్నారు. కాని ఈదోషనిర్ణయము చేయు పండితు లీకాలములో నొక్కరైన ఉన్నారా అనునది సంశయాస్పదమే. ఎమెస్కో ప్రతి సంపాదకులైన శ్రీరావూరి దొరసామిశర్మగారు పూర్వముద్రితములైన 5 ప్రతులను, తమ యొద్ద నున్న తాళప్రతిని పరిశీలించి పాఠనిర్ణయము చేసినారు. వారు ‘కవిరాజరాజి’ అన్న ప్రథమాశ్వాసంలోని సీసపద్యంలో ‘చింతామణీమంత్రచింతనఫలంబు’ అన్న పాఠమునే గ్రహించినారు. దీనివల్ల దీనిని ‘చింతనపరుండు’ అని యెంచి చేసిన మురళీధరరావుగారి వివేచన కొంతవఱకు బలహీనపడుచున్నది. సంస్కృతనైషధములో ప్రతిసర్గ చివర ‘ఆనంద’ శబ్దయుతమైన శ్లోక మున్నమాట నిజమేకాని, గ్రంథాంతమున శ్రీనాథుడు వాడిన ‘పరమానందంబు నొందిరి’ అను పదమునుకు ఇది కారణమని ఇదమిత్థముగా చెప్పలేము. ప్రతి ఆశ్వాసాంతమునందును ఇట్టిపదము లేదు గదా! ఇతరకవులును (ఉదా: ప్రభావతీప్రద్యుమ్నము) గ్రంథాంతమున ఇట్టి పదమును వాడిరి. ఏమైనను ఈ వ్యాసము తర్కకర్కశముగా నున్న దనుటలో విప్రతిపత్తి లేదు.
మీ లేఖలోని ఆరోగ్యశ్రేయోభిలాషిత ఆ అవసరం ఎంతో ఉన్న నా మనసుకెంతో ఆహ్లాదాన్ని కూర్చింది. వ్యాసాన్ని ఆసాంతం చదివి ఔదార్యంతో స్పందించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మమ్మట-శ్రీహర్షుల బంధుత్వోదంత జనశ్రుతిని మొట్టమొదట 1877లో డా. బ్యూలర్ గారు తమ Kashmir Report లో వెలుగులోకి తెచ్చారు. అది ప్రసిద్ధికెక్కింది కాని, ఆయన దానిని చారిత్రికసత్యం కాజాలదని వ్రాసిన వివరాలు మాత్రం ఎందుకనో ప్రచారానికి నోచుకోలేదు. మమ్మటుని కావ్యప్రకాశాన్ని అధికరించి మాణిక్యచంద్రుని అద్భుతావహమైన సంకేత వ్యాఖ్య క్రీ.శ. 1159-1160 లో వెలువడింది. దాని సాక్ష్యాన్ని బట్టి కావ్యప్రకాశ రచనకు ఉత్తరావధి (terminus ad quem) క్రీ.శ. 1110 అని నిశ్చయింపబడుతున్నది. ఆధునిక విమర్శకులు ఆయన క్రీ.శ. 1050-1120 ల మధ్యకాలంలో జీవించినవాడని ఊహిస్తున్నారు. శ్రీహర్షుని జీవితకాలం క్రీ.శ. 1115-1185 (±) కాగా, నైషధీయ చరితం పన్నెండవ శతాబ్ది ఉత్తరార్ధంలో (బహుశః క్రీ.శ. 1165-1175 ల నడిమి కాలంలో) రచింపబడింది. మమ్మటాచార్యుడు క్రీ.శ. 1050 ప్రాంతాల జన్మించి ఉంటే తద్రచన నాటికి కనీసం 110-120 ఏళ్ళవాడై ఉంటాడు. గౌడదేశీయుడైన శ్రీహర్షుని కాశ్మీరకునిగా నిరూపింపదలచినవారెవరో ఈ కథను కల్పించి ఉంటారు. నైషధీయ చరితంలోని ‘తవ వర్త్మని వర్తతాం’ (2-62) అన్న శ్లోకాన్ని మమ్మటుడు, “నేనైతే ఈ విధంగా సవరించి ఉండేవాణ్ణి” అని చెప్పిన సవరణ కథ కూడా ఒకటున్నది. అదే నిజమైతే, మమ్మటునికి నైషధీయం అసలు అర్థమే కాలేదనుకోవాలి. అందువల్ల మేనల్లుని కృతిని చూసి దోషభూయిష్ఠమని వ్యాఖ్యానించటం, మినపరొట్టెల కథ వంటివన్నీ వట్టి కట్టుకథలు మాత్రమే అని మనము నిశ్చయింపవచ్చును.
సంస్కృత సాహిత్యశాస్త్రచరిత్రలో మమ్మటుని కావ్యప్రకాశం తర్వాత ప్రబలిన విద్యారణ్యంలో అంతటి తాలోత్తాలమూర్తులు లేక స్వతఃప్రమాణంగా కావ్యదోషనిర్ణయం చేయగలవారు తక్కువైన మాట నిజమే. మీరన్నట్లు దోషవిచారణ చేయగలిగిన పండితులు లేకపోవడం కావ్యగుణాన్ని ఉత్కర్షించే కారణం కాదన్నమాట కూడా నిజమే. అయితే, శ్రీనాథుడు నైషధీయ చరితంలో రసౌచిత్యదృష్టితో “అనౌచిత్యపరిహారం” అవసరమని భావించిన మాట సత్యమే అయితే లోకంలో అంతకు పూర్వం ఏదో ఒక ఆధారం ఉండే ఉండాలి కదా. తానై సాహసించి మొదటిసారి ఆ మాటను అన్నాడని ఊహింపలేము. వ్యాఖ్యాతలో, లాక్షణికులో, విమర్శకులో కనీసం ఒక్కరైనా ఆ మాటను ప్రసిద్ధంగా పేర్కొని ఉండాలి. ఏవో కొన్ని అనౌచిత్యాలు ప్రచారంలో ఉండే ఉండాలి. అటువంటివేవీ కనబడవు. వ్యాఖ్యాతలు – మరీ ముఖ్యంగా చాండూ పండితుడు, మల్లినాథుడు పదే పదే ఆ కావ్యంలోని ఔచిత్యాలను తమ వ్యాఖ్యలలో ప్రశంసించటమే గాని ఒక్కటైనా అనౌచిత్యాన్ని ప్రస్తావించి ఉండకపోవటం మనకు తెలుసు. ఏవో కొన్ని అనౌచిత్యాలు ఉన్నాయని కనీసం లాక్షణికులు గాని, విమర్శకులు గాని ఇంతకాలంగా ఆ మాటను అనలేదు కదా! అని చెప్పే సందర్భంలో ఆ వాక్యప్రసక్తి ఏర్పడింది.
శ్రీ అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులవారు ‘నైషధతత్త్వజిజ్ఞాస’లో అందులోని నాయికానాయకుల భౌతికశృంగారం, రతివర్ణన, రత్యంతచిత్రణ – అనుచితము, అశ్లీలము, అసభ్యము, గ్రామ్యము అని ఎన్నో ఉదాహరణలను చూపారు. ఆ ఉదాహరణలన్నీ మారిన దేశకాలపరిస్థితుల వల్ల ఏర్పడిన అభిప్రాయములే గాని వాస్తవంగా రసదోషవిమర్శకు ఉపకరింపవు. ఆధునిక కాలంలో నైషధీయ చరితం మితిమీరిన శృంగారవర్ణనల మూలాన అనౌచిత్యాలకు పుట్టినిల్లని వ్రాసినవారి వివరాలను నేను ప్రస్తావింపలేదు.
మమ్మటునికి తర్వాత కావ్యదోషాలను సవిస్తరంగా పేర్కొన్న లాక్షణికులు ఎవరైనా ఉన్నారా? అని మీరడిగిన ప్రశ్నకు సమాధానం: కనీసం 40-42 మందికి పైగానే ఉంటారని పేర్లు స్ఫురిస్తున్నాయి. వారందరూ తత్పూర్వుల వలె మౌలికప్రతిపాదనలు చేసినవారు కాకపోవచ్చును కాని, ఉన్నారు. వేమభూపాలుని సాహిత్యచింతామణి ముఖ్యమైనదే. దేశ్యదోషవిమర్శను కలిగిన విశ్వేశ్వర దేశికుని చమత్కారచంద్రిక ఉన్నది. సర్వజ్ఞ సింగభూపాలుడు రసార్ణవసుధాకరంలో “అత్ర నలస్య దమయన్తీ కరస్పర్శహర్షేణ” అని తనకు నచ్చినందువల్ల శ్రీహర్షుని సగౌరవంగా ఉదాహరించాడు కాని, అనౌచిత్యాలను చెప్పినప్పుడు వేరే కవులను ఉదాహరించాడు. అమృతానందయోగి అలంకారసంగ్రహంలో అనౌచిత్యాలను పూర్తిగా తనదైన ధోరణిలో వివరించాడు. ఉదాహరణలను ఇవ్వలేదు. నృసింహకవి నంజరాజయశోభూషణం పైకి విద్యానాథుని అనుసరణగానే కనుపించినా, జాగ్రత్తగా చూసినప్పుడు కావ్యదోషప్రకరణంలో మునుపు లేని ఎన్నో కొత్త విశేషాలను చెప్పాడు. జయదేవ భోజరాజాది తత్పూర్వుల వైశేషికగుణ నిబంధరాంతరస్థ దోషాంకుశాదులను తన మాటలలో వ్యాఖ్యానించాడు. శబ్దగ్రామ్యాన్ని, అర్థగ్రామ్యాన్ని, అశ్లీలతను, కావ్యదోషాల దోషత్వానిత్యతను, అదోషత్వాన్ని సరికొత్తగా వివరించాడు. ధర్మసూరి సాహిత్యరత్నాకరం, అజితసేనుని అలంకారచింతామణి, కందలయార్యుని అలంకారశిరోభూషణం, కృష్ణావధూత మందారమరందం, ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రసిద్ధులు కాకపోవచ్చును గాని ప్రతివారు ఎన్నో కొన్ని తమ మాటలలో కావ్యదోషాలను నిర్వచించినవారే. లక్షణగ్రంథాలలో మూలకర్త చెప్పకపోయినా, ఉదాహరణలను ప్రదర్శించిన వ్యాఖ్యాతలు కూడా నైషధీయచరితాన్ని ప్రస్తావించినట్లు కనబడదు. వ్యాసప్రతిపాదితానికి ఈ విశేషాలతో సంబంధం లేనందున ఇంతవరకే ప్రస్తావించాను.
మీ సహృదయస్పందనకు కృతజ్ఞుణ్ణి. శ్రీమతి లక్ష్మీదేవి గారి ఔదార్యపూర్వకమైన వ్యాఖ్యకు హృదయపూర్వక ధన్యవాదాలు.
తెగులుకి శిక్ష గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
11/15/2016 9:38 am

శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి కె. వి. ఎస్. రామారావు అభిప్రాయం:
11/15/2016 2:15 am

The extract above is from Page 53.
తెగులుకి శిక్ష గురించి మాగంటి వంశీ అభిప్రాయం:
11/14/2016 7:15 pm
అయ్యా దంతుర్తి శర్మగారండి
బాగుంది. చాలా చక్కగా రాశినారు. బ్లాగు ప్రపంచం నశించి చాలా రోజులైపోయినా కూడా ఆ లోకానికి మళ్ళీ తీసుకుపోయినారు. చదివి సంతసించినాను. ధన్యవాదాలు.
పోతే, ఒక చిన్న మాట – ఎన్నో వందల సంవత్సరాలుగా మీ కామెంట్లు చదువుతున్నాను. మీరు ఏ కామెంటు రాసినా అందులో “నాకొచ్చిన తెలుగు అధమం. అన్ని తప్పులూ నావే. నాది మట్టి బుర్ర. నాకు పదో తరగతి తెలుగు మాత్రమే వచ్చు. నేను అమాయకుణ్ణి. నా రాతలు అమాయకత్వం. ఈమాటలో రాయటం నా భాగ్యం. వాళ్ళు అసలు ఎట్లా నా రాతల్ని అనుమతిస్తున్నారో ఆ భగవంతుడికే తెలియాలి…” అంటూ డిప్రెషను టు ద పవర్ ఆఫ్ 501 డిటర్జెంటు సబ్బులా తళతళా చదివేవాళ్ళను తోముతున్నారు. ఎంత మిమ్మల్ని తక్కువ చేసుకుంటే అంత అవతలివాళ్ళు సంతోషపడి మళ్ళొక కామెంటు రాయకుండా ఉంటారని మీరేసిన కుంగుబాటు ప్లాను చాలా ఇదిగా ఉన్నది. దీనికన్నా మీరసలు ఏ కామెంటు రాయకపోటం మంచిది.
భవదీయుడు
వంశీ
తెగులుకి శిక్ష గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
11/14/2016 10:55 am
దంతుర్తి శర్మగారు తెలుగుబ్లాగుల్లో తెలుగునాశనం అవుతోందీ అని బాధపడుతున్నారు. మరి ఆ దిగజారుడు తెలుగుకే విశేషమైన ఆదరణ లభిస్తున్నది. పొరపాటున మనం విభేదించామా దొంగలమన్న ముద్రకూడా వేయటానికి వెనుదీయనిది బ్లాగులోకం. అందుచేత తస్మాత్ జాగ్రత. ఇకపోతే శర్మగారి వంటివారికి నచ్చే తెలుగులో టపాలు కడితే వాటిని పట్టుమని పదిమంది కూడా చదవరని స్వానుభవం పైనే చెబుతున్నాను.
ఒక పద్యం ఉంది.
ఎవ్వతె వీవు కాళ్ళు మొగ మెఱ్ఱన హంసను యేడ నుందువో
దవ్వున మానసంబునను దాన విశేషము లేమి తెల్పుమా
మవ్వగు కాంచనాబ్జములు మౌక్తికముల్ గల వందు నత్తలో
యవ్వి యెరుంగ నన్న హహహా యని నవ్వె బకంబు లన్నియున్!
అలాగు కాలానుగుణంగానో దాని గ్రహచారానుగుణంగానో భాషకు పతనౌన్నత్యాలు సంభవిస్తాయి. ఇప్పటి కాలంలో అందరిళ్ళల్లోనూ మంచినీళ్ళకు కూడా వాటర్ అనే అంటున్న పరిస్థితి. వగచి ప్రయోజనం లేదు. అందుచేత జనబాహుళ్యం సరైన భాషనే చూసి ఇదేమి తెలుగూ అని ఇహిహీ అని పగలబడే నవ్వుతున్నారన్న నిజం మనం ఒప్పుకోక తప్పదు.
ఏది ఏమైనా ఈకథ ఒక ఆరోగ్యకరమైన చర్చకు తావిచ్చిందని సంతోషంగా ఉంది.
ఇంక పోతారనగాను గురించి ravikiran timmireddy అభిప్రాయం:
11/13/2016 3:46 pm
కనక ప్రసాద్ గారు,
ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు మీరు ఈ కొద్ది పదాల్లో.
-రవికిరణ్
తెగులుకి శిక్ష గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
11/13/2016 10:48 am
రాముడు, మనోహర్, లలిత, కె.కె.రావు, మోహన, జిలేబీ, శ్యామలరావు గార్లకి
నాగమురళి గారు అన్నఈ – కుకవి నింద – మీకు నచ్చినందుకు సంతోషం. నాకొచ్చిన అధమమైన తెలుగు ఎటువంటిదంటే ఈ కుకవి నింద అంటే ఏమిటో నిఘంటువులో చూసుకోవాల్సి వచ్చింది! బ్లాగుల్లో రోజూ కనబడే తెలుగు నాశనం అవుతోంది అనేది బ్లాగులు చదివే అందరికీ తెల్సినదే. ఎవరైనా ఇదేం తెలుగు అని అడిగితే నువ్వెవరివోయ్ చెవలాయ్ అనడం, లేకపోతే కామెంట్ అనుమతించకపోవడం చేస్తున్నారు. అది వాళ్ళిష్టం అనుకోండి కానీ భాష మాత్రం అలాగే ఉం(టోం)ది. అయినా పదో తరగతి తెలుగు మాత్రం వచ్చిన నేనెవణ్ణి వీళ్లకి సుద్దులు చెప్పడానికి? ఈ సుద్దులు అనేమాట కూడా ఆ మధ్య ఒకాయన నా ఈమాట కధకి కామెంట్ గా రాసారు. నా మట్టిబుర్రకి అవి గుర్తున్నా మళ్ళీ ఇలాంటివి రాస్తున్నాను. అంచేత తప్పంతా నాదే. ధన్యవాదములు+స్వస్తి
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
11/13/2016 8:41 am
పూజ్యులు శ్రీమదిత్యాది శ్రీమాన్ కృష్ణదేశికాచార్యులవారి సన్నిధిని
నమస్కారములతో,
వ్యాసప్రతిపాదితార్థం మీ అనుమోదానికి నోచికొన్నందుకు ఎంతో సంతోషం కలిగింది. కావ్యోపసంహారవచనం వేమభూపాలుని మాటకు అనువర్తనమే గాని ఆంధ్రీకరణపద్ధతికి సూచకం కాదన్న అంశాన్ని నొక్కిచెప్పేందుకు నైషధీయచరితంలో అనౌచిత్యదోషారోపణ సాధ్యం కాదని వ్రాసిన మాట నిజమే. శ్రీహర్షుడు క్షేమేంద్రుని ఔచిత్యసిద్ధాంతాన్ని గుర్తెరిగి, దానిని ఆమోదించినవాడని చెప్పేందుకు నైషధీయచరితంలోనే సాక్ష్యాలున్నాయి. ఆధునికదృష్టితో చూచినప్పటి నిర్వేలములైన శృంగారవర్ణనలు తప్ప – లాక్షణికదృష్టితో అన్వయింపదగిన అనౌచిత్యాలు అందులో లేవనే ఇప్పటికీ నా అభిప్రాయం. అందులోని కథ, కథనం, శైలి, కల్పనలు మొదలైనవానిని గూర్చి సుశీల్ కుమార్ దే గారి వంటి పండితుల తీవ్రవిమర్శలన్నీ వ్యాసప్రతిపాదితానికి సంబంధించినవి కావు గనుక నేను ప్రస్తావింపలేదు.
“చింతామణీ మంత్రచింతనఫలంబు” అన్న శ్రీ రావూరి దొరసామిశర్మ గారి పాఠస్వీకారం ఎట్లాగూ (8-203) లోని పద్యానికి విరుద్ధమే గాక శ్రుతకథావిరుద్ధం కూడా అవుతుంది. శ్రీహర్షుడు తన్మంత్రసిద్ధుడని నిరూపించే కావ్యభాగాలను జీవాతు వ్యాఖ్యలో మల్లినాథుడు వేయినోళ్ళతో మెచ్చుకొన్నాడు. వాటిని అన్వయించి చెప్పాడు. “అవామా వామార్ధే” శ్లోకానికి వ్యాఖ్యాతలు వివరించిన భాగాలన్నీ చూడదగినవే. ఆయన “చింతామణీ మంత్రచింతనపరుండు” కావటం వల్లనే ఆ రచన, ఆ అన్వయం సాధ్యమవుతాయి. “తల్లిదండ్రుల చింతనఫలం” అన్న అర్థంలో ఆ అన్వయం సార్థకం కానందువల్ల వేదం వారి పాఠమే స్వీకార్యమని చెప్పాలి. దురదృష్టవశాత్తు తెలుగుదేశంలో నైషధం వ్రాతప్రతులు ఎక్కువగా బ్రతికిలేవు. పరస్పరవిరుద్ధాంశాలు ఏ వ్రాతప్రతిలో ఏ విధంగా ఉన్నాయో సరిచూస్తే కాని ఈ సమస్యను పరిష్కరింపలేము.
మీవంటి ప్రామాణికులు ఈ వ్యాసాన్ని చదివి ఉండటమే నాకు గొప్ప విషయం. మీ స్పందన నన్ను ధన్యుణ్ణి కావించింది.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
11/13/2016 8:32 am
పూజ్యులు డా. గన్నవరపు నరసింహమూర్తి గారికి
మనఃపూర్వక నమఃపూర్వకంగా,
ఎప్పటి వలె మేరలేని దయతో వ్యాసాన్ని చదివి, ఔదార్యంతో మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు నా ధన్యవాదాలను విన్నవించికొంటున్నాను. మీరు ప్రకటించిన పదకోశాన్ని దృష్టిలో నిలిపికొని, ఈ పర్యాయం మరింత శ్రద్దధానతతో వ్యాసరచన కావించే ప్రయత్నం చేస్తానని కూడా మనవి చేస్తున్నాను. వ్యాసప్రతిపాదితం మీ ఆమోదానికి పాత్రమైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది.
యుష్మన్నిరంతరాశీరభిలాషి,
ఏల్చూరి మురళీధరరావు
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి desikachary అభిప్రాయం:
11/13/2016 2:42 am
పాండిత్యప్రకర్షతో తర్కకర్కశముగా సాగిన మురళీధరరావుగారి వ్యాసము ప్రశంసనీయము. ‘మాతృక’కు శ్రీనాథుని కుపలభ్యమానమైన తాళప్రతి యను అర్థమును జెప్పుట సమంజసముగానే యున్నది. కాని ‘ప్రమాదో ధీమతామపి’ అని యున్నదే కదా! శ్రీహర్షుని కావ్యము పరిపూర్ణముగా దోషరహితమను వాదన అంత బలముగా చేయవలసియుండినది కాదనిపించుచున్నది. ఎమస్కో శృంగారనైషధప్రతికి ఉపోద్ఘాతమును వ్రాయుచు విశ్వనాథవారు ‘నిజానికి, సంస్కృతకావ్యములో కొన్ని పచ్చి బూతులవలె కనిపించునవి యున్నవి. శ్రీనాథుడు వాని నన్నిటిని పరిహరించ లేదు. కొన్నిటిని శ్రీనాథుడును వ్రాసెను. ఎన్నని పరిహరించును?’ అన్నారు. కాని ఈదోషనిర్ణయము చేయు పండితు లీకాలములో నొక్కరైన ఉన్నారా అనునది సంశయాస్పదమే. ఎమెస్కో ప్రతి సంపాదకులైన శ్రీరావూరి దొరసామిశర్మగారు పూర్వముద్రితములైన 5 ప్రతులను, తమ యొద్ద నున్న తాళప్రతిని పరిశీలించి పాఠనిర్ణయము చేసినారు. వారు ‘కవిరాజరాజి’ అన్న ప్రథమాశ్వాసంలోని సీసపద్యంలో ‘చింతామణీమంత్రచింతనఫలంబు’ అన్న పాఠమునే గ్రహించినారు. దీనివల్ల దీనిని ‘చింతనపరుండు’ అని యెంచి చేసిన మురళీధరరావుగారి వివేచన కొంతవఱకు బలహీనపడుచున్నది. సంస్కృతనైషధములో ప్రతిసర్గ చివర ‘ఆనంద’ శబ్దయుతమైన శ్లోక మున్నమాట నిజమేకాని, గ్రంథాంతమున శ్రీనాథుడు వాడిన ‘పరమానందంబు నొందిరి’ అను పదమునుకు ఇది కారణమని ఇదమిత్థముగా చెప్పలేము. ప్రతి ఆశ్వాసాంతమునందును ఇట్టిపదము లేదు గదా! ఇతరకవులును (ఉదా: ప్రభావతీప్రద్యుమ్నము) గ్రంథాంతమున ఇట్టి పదమును వాడిరి. ఏమైనను ఈ వ్యాసము తర్కకర్కశముగా నున్న దనుటలో విప్రతిపత్తి లేదు.
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
11/13/2016 1:27 am
మిత్రధేయులు శ్రీ అనామకుడు గారికి