పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి lyla yerneni అభిప్రాయం:

    11/24/2016 4:06 pm

    “ఒక తర్కక్రమంలో ఒక్క అడుగు పూర్తిగా నిజం కాకపోయినా ఆ క్రమం అంతా దెబ్బతిన్నట్టే. ఇది తర్కంలో ఒక మూలసూత్రం.”

    డియర్ రామారావు గారు!

    (I am your fan. You are a founding father of a delightful and educating magazine, a good editor and a good essayist.)

    Nevertheless 🙂

    In the book “Being Logical” D.Q. McInerny says so in the opening paragraph.

    ” Being Logical presupposes our sensitivity to language and a knack for its effective use, for logic and language are inseparable. It also presupposes our having a healthy respect for the firm factualness of the world in which we live, for logic is about reality. Finally, being logical presupposes a lively awareness of how the facts that are our ideas relate to the facts that are the objects in the world, for logic is about truth.”

    The author of “Being Logical” wants us to read his book as we read “a sparkling little book” called The elements of Style by Wm Strunk Jr, and E.B white, which was his inspiration.

    And I want you to read this essay – even though your computer like brain rejects and expels the unbearable fact, that the essay’s conclusion can neither be proved nor disproved never, never, never – and enjoy it.

    Happy Thanksgiving! Pardon the Turkeys like me.:-)

    Lyla

  2. నా టేస్టులేనితనం గురించి శిరీష్ ఆదిత్య అభిప్రాయం:

    11/24/2016 12:02 am

    హైలైట్ ఉంది రాజన్న. మీ తరవాత తరం వాడ్ని కాబట్టి సీ.డీ ప్లేయర్ కన్నా ఇంటర్నెట్ ముంచిన కొంప బాగా తెలుసు. ఉన్నత ఆశయాలు, నీచ చేష్ఠలు. అయినా, అందరూ ఆపాదించినందుకు క్లాసికల్ పాట విని జ్ఞానం పొందేయాలనుకోవటమే కక్కూర్తేమో? దాని కన్నా ‘నీలి దేహాలు’ చూసి ముక్తి పొందటమే మన అనుభవ పరిధిలోని సత్యం.

  3. ఇంక పోతారనగాను గురించి Kuppili Padma అభిప్రాయం:

    11/23/2016 5:52 am

    మససు వణికింది కనకప్రసాద్ గారు.

  4. బాలమురళీకృష్ణ గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    11/22/2016 8:41 am

    మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఈ రోజు చెన్నైలో చనిపోయారు.

    దక్షిణభారత సంగీతంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  5. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి రంగ అభిప్రాయం:

    11/22/2016 5:20 am

    ఆచార్య రామారావు గారికి,

    నైషధాంధ్రీకరణ సందర్భంగా పరిహరింపబడిన శబ్దాశ్రయమైన అనుచితాలకి రెండు, మూడు ఉదాహరణలు మీకు కనబడినవి చూపించగలరా? (అవి Srinatha: The poet who made Gods and Kings లో ఉన్నాయేమో తెలియదు.)

    రంగ

  6. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి రవి అభిప్రాయం:

    11/22/2016 4:49 am

    కె.వి.యస్. రామారావు గారికి,

    ఏ విధంగా ఆలోచించినా మీరు ఉటంకిస్తున్న తర్కం సమగ్రంగా లేదని అనిపిస్తుంది.

    3. అనౌచిత్యం అంటే మూలంలో వున్న రసప్రాతికూల్యతే. “అసలు విషయం: మూలంలో రసప్రాతికూల్యాన్ని ఆరోపించితే గాని, అనౌచిత్యస్థాపనం జరగదు.”
    ఇందులో మూడో అడుగు తార్కికం కాదు. ఎందుకంటే, అనువాదంలో అనౌచిత్యం ఉండటానికి వేరే కారణాలు ఉండొచ్చు. ఇందుకు ఒక ఉదాహరణ, మూలభాషలోని శబ్దసమూహాలు అలాగే తీసుకుంటే గమ్యభాషలో అనుచితార్థాలు రావటం.

    ఆ మూడవ అడుగు తార్కికం అవునో కాదో కానీ అది లాక్షణిక సాంప్రదాయమండి. “అనౌచిత్యాదృతే నాన్యద్రసభంగకారణమ్” – అని ఆనందవర్ధనుడు. తార్కికమా, అతార్కికమా అన్న విషయం శ్రీనాథుని కాలాన్ని బట్టి ఊహించాలి. ఈ కాలపు మన ఆలోచనలో తర్కాన్ని శ్రీనాథునిపై ఆరోపించటం సబబెలా అవుతుంది? ఆ కాలం నాటికి లాక్షణిక సాంప్రదాయం ప్రకారం రసభంగమే అనౌచిత్యం.

    మూలభాషలో శబ్దసమూహాలు గమ్యభాషలో అనుచితార్థం అయే అవకాశాన్ని పురస్కరించుకుని, ఒక సరికొత్త లాక్షణిక సాంప్రదాయానికి, సరికొత్త మౌలిక ప్రతిపాదనకూ శ్రీనాథుడు నడుం కట్టడం అన్నది దూరాన్వయమైన విషయమండి. ఒక వేళ అలా ఊహించినా కొన్ని ఇబ్బందులు వస్తాయి.

    మూలభాష, గమ్యభాష – అని కాకుండా సంస్కృతమైనా, ప్రాకృతమైనా, ఏదేని ఒక కావ్యానికి సంబంధించి ’అశ్లీలము, అమంగళకరమూ, వ్రీడాజనకము’ అయిన శబ్దాలు పరిహార్యాలు అని మమ్మటుడు కావ్యప్రకాశంలోని దోషప్రకరణం లో నిర్దేశించాడు. పైన మీరు చెప్పిన ’గమ్యభాషలో అనుచితార్థం” అన్న విషయం మమ్మటుని దోషనిర్వచనంలో (ఇంకా నేయార్థమూ ఇత్యాది దోషాదులలో) భాగమై విలీనమవుతుంది. లాక్షణికులు తమ ఉదాహరణలలో ప్రాకృత కావ్యాలనూ ఉదాహరించారు. అందువలన వారి నిర్దేశాలు సంస్కృతానికే కాక సంస్కృతేతర భాషల కావ్యాలకూ వర్తిస్తాయి.

    మీరు చెప్పిన ఉదాహరణతోనే Acapulco ను తెనుగులో మూలభాషలో నాదానుగుణంగా యథాతథంగా అనువదించి తెలుగులో ఉపయోగిస్తే అది (సహృదయుడైన సామాజికుని దృష్ట్యా) అశ్లీలశబ్దమవుతుంది. ఇది కావ్యప్రకాశకారుడి ప్రకారం దోషం. అది వరకే ఏర్పడి ఉన్న లాక్షణిక సాంప్రదాయం.ఆ సాంప్రదాయాన్ని గుర్తుంచుకుని రచన చేసి ఉంటాడు కానీ, తిరిగి కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పే అవసరం శ్రీనాథునికి ఉండరాదు.

    అందుచేత అనువాదం కోసం ప్రత్యేకమైన ’అనౌచిత్య నిర్వచనాన్ని’ తనకు తానే శ్రీనాథుడు నిర్దేశించుకునే అవసరం లేదు. ఒకవేళ నిర్దేశించుకున్నా అందుకు మూలం ఎక్కడో ఉండాలి. లేదా ఆ విషయం గురించి సమగ్రంగా ఒక లాక్షణిక గ్రంథాన్ని వెలువర్చి, ఈ ప్రతిపాదనను సాకల్యంగా చర్చించి ఉండాలి. ఎందుకంటే సంస్కృత అలంకారిక గ్రంథాలన్నీ ఆ ధోరణిలో రచింపబడినవే కాబట్టి. అలాంటివేవీ మనకు కానరావు.

    మరొక పార్శ్వం. శ్రీనాథుని కంటే ముందు మూలఘటిక కేతన – దశకుమారచరితమ్ వచన కావ్యాన్ని తెనుగు పద్యానువాదం చేశాడు. మూలభాష సంస్కృతంలోని దండి దశకుమారచరితమ్ – పదలాలిత్యానికి, మాధుర్యాది గుణాలకు ప్రతీతి. నిజంగా అయితే శబ్దమాధుర్యాన్ని, సంస్కృతస్వరనాదాన్ని శ్రీనాథునికి ముందువాడైన కేతన పరిగణనలోనికి తీసుకొని ఉండాలని ఊహించటం తర్కబద్దం. ఎందుకంటే మూలకావ్యంలోని ప్రధానలక్షణమే ’పదలాలిత్యం’ అన్నారు కనుక. తద్వారా శ్రీనాథునికి కేతన మార్గదర్శకం కావాలి. అలా జరిగినట్టు లేదు. కేతనను శ్రీనాథుడు ఉదాహరింపలేదు.

    శ్రీహర్షుని నైషధీయచరితమ్ – శృంగారరససంచితమైన ప్రౌఢకావ్యము. ఈ కావ్యం ప్రౌఢిమకు, పాండిత్యానికి పేరు పొంది “నైషధం విద్వదౌషధమ్’ అనిపించుకున్నది కానీ, దండి కావ్యంలా పదలాలిత్యానికి, జయదేవుని గీతగోవింద కావ్యంలా శబ్దసౌందర్యానికి పేరుపడిన కావ్యం కాదని పండితుల తీర్పు. నైషధాన్ని అనుసరించిన శ్రీనాథుడు – అందులో పాండిత్యాన్ని, రసనిర్భరతను, ధ్వని మార్గాదులను గుర్తెఱిగి తెనుగున అనువదింపడానికి పాల్పడ్డం ఔచిత్యం అవాలి కానీ మీరు చెప్పిన విధంగా మూలభాషపు శబ్దనాదాన్ని పరిగణనలోనికి తీసుకోవడం అన్నది అంతగా పొసగని కారణం. అదే కారణమని భావిస్తే కూలకంషంగా మూల భాషలో కావ్యాన్ని, అందులో శబ్దసౌందర్యానికి, స్వరమాధుర్యానికి ముఖ్యకారణాలు అయిన యమక, అనుప్రాసాది గుణాలను మూలకావ్యం యొక్క శ్లోకాలలో వెతికి వాటి తెనుగు అనువాదాలను సరి చూసి సాకల్యంగా విషయాన్ని ప్రతిపాదించి శ్రీనాథుడు చెప్పిన ’అనౌచిత్యంబు పరిహరించి’ అర్థం ఇదేనని నిరూపించాలి.(శ్రీ వేల్చేరు నారాయణరావు గారు, షూల్మన్ గారు అలా చేశారో లేదో నాకు తెలియదు.) తర్కబద్ధం అన్న ఒక్కమాట తర్కానికి సమగ్రత నివ్వదు.

    ఏతావతా – ఈ విషయంలో శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి వివరణయే సముచితమని నా వ్యక్తిగత అభిప్రాయం.

  7. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి బామ్మర్ది అభిప్రాయం:

    11/21/2016 7:51 pm

    మీద చిన్న సైజు *డిబేట్* లు నడపటం నాకు చాలా ఇష్టం.

    దెబ్బలాటలు అని అర్ధం 🙂 (సర్దాగా అన్నాను లెండి.)

  8. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    11/21/2016 1:54 pm

    With all due respect to Laila, logic is not a subjective matter that needs to be decided through majority opinion. ఈ వ్యాసంలో వున్న తర్కం ఇది –

    1. శృంగార నైషథం కావ్యాంతంలో వున్న అనువాదవిధాన వివరణ “ఏ విధంగా చూసినా అన్వయింపని అర్థసంగతి”
    2. ఇందుకు ముఖ్యకారణం ఈ వివరణలో ఉన్న అనౌచిత్య పరిహరణ అంశం.
    3. అనౌచిత్యం అంటే మూలంలో వున్న రసప్రాతికూల్యతే. “అసలు విషయం: మూలంలో రసప్రాతికూల్యాన్ని ఆరోపించితే గాని, అనౌచిత్యస్థాపనం జరగదు.”
    4. మూలంలో రసప్రాతికూల్యత వున్నట్టు విమర్శకులు ఎవరూ అనలేదు. మూలంలో రసప్రాతికూల్యత లేదు.
    5. “మహాలాక్షణికుడైన శ్రీనాథుడు సందిగ్ధాంశభూయిష్ఠమైన ఇటువంటి పొందిపొసగని నిర్వచనంతో అనర్ఘమైన తన అనువాద విధానాన్ని సూచించి ఉండడు.”
    6. కాబట్టి ఈ భాగం శ్రీనాథుడు రాసింది కాదు.

    ఇందులో మూడో అడుగు తార్కికం కాదు. ఎందుకంటే, అనువాదంలో అనౌచిత్యం ఉండటానికి వేరే కారణాలు ఉండొచ్చు. ఇందుకు ఒక ఉదాహరణ, మూలభాషలోని శబ్దసమూహాలు అలాగే తీసుకుంటే గమ్యభాషలో అనుచితార్థాలు రావటం.

    ఒక తర్కక్రమంలో ఒక్క అడుగు పూర్తిగా నిజం కాకపోయినా ఆ క్రమం అంతా దెబ్బతిన్నట్టే. ఇది తర్కంలో ఒక మూలసూత్రం.

  9. తన మాట కోసం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    11/21/2016 10:19 am

    లక్ష్మీదేవిగారు నా అభిప్రాయాన్ని సానుకూలంగా తీసుకొన్నందుకు కృతజ్ఞుడిని. కథను తీసుకోండి. అవసరమైనట్లైతే కథనవిధానాన్ని కూడా తీసుకోండి. కాని మీరే మీదైన మంచి వ్యావహారికంలో మీ‌శైలిలో వ్రాయండి. మీ‌ కథలూ అనువాదాలూ మరిన్ని చదవాలని ఆశిస్తున్నాను.

  10. ఫ్రాగ్మెంట్స్ గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    11/21/2016 1:10 am

    థాంక్యూ సీత గారు