ఎంత చూసినా ఇందులో బొమ్మ ఏవిటో అర్ధం కాలేదండి. “బొమ్మలు” అన్నారు. ఒకటి కంటే ఎక్కువగా ఉన్నయా? నాకు కనిపించినది ఒకటే. 20 పక్షులు బాగానే ఉంది మరి ఆ కాళ్ళేమిటో కలగాపులగంగా? ఇంతింతై అన్నదానికి అర్ధం స్ఫురిస్తోందా అందులో? నా మట్టిబుర్రకి అందటం లేదు మరి. ఇరవై ఏళ్ళంటే మాటలు కాదు ఈ వేగమైన డిజిటల్ యుగంలో. ఏది ఏమైనా ఏమీ ప్రకటనలు లేకుండా, ఉచితంగా తెలుగు కోసం కష్టపడుతున్న నిర్వాహకులకీ, సంపాదకులకీ అభినందనలు.
మీ వ్యాసం ఆసాంతం నన్ను కట్టి పడేసింది. గణపవరపు వారి ప్రబంధరాజము మీద ఇంత విస్తృతంగా పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు.
ఇకపోతే, పద్య కవిత్వం బాగా అలవడి అదికాస్తా చిత్ర కవిత్వం పై మక్కువ గా మారింది. గర్భ కవిత్వం, ద్వ్యక్షరీ, త్ర్యక్షరి, ముక్త పదగ్రస్తం వంటి ప్రయోగాలు బాగానే చేయగలిగినా ప్రబంధరాజ కావ్యాన్ని దానిపై పరిశోధిత వ్యాసాలను చదివి మరిన్ని మెళుకువలు సాధించాలని ఆశ.
కాని ఆ పొత్తము అంగడిలో అలభ్యంగా ఉంది. అలాగే అంతర్జాలంలోనూ లభించుట లేదు. అది ఉపలబ్దమయ్యే మార్గము సూచించ గలరు.
భవధీయుడు
రాళ్ళపల్లి సున్దర రామ శర్మ
Akshara Vinyasam
Natelugu savvadi blogspot.com
+919440597260
అడవితల్లి వొడిలో సేదతీర్చుకోవాలనే ధ్యాసే కాని, పురుగూ పుట్రా ఉంటాయ్ జాగ్రత్త జయతి బిడ్డా అంటే ( అదంతా మనమేర్పరచుకున్న భయాందోళనల తప్పు అభిప్రాయాలు అంటూ నవ్విన ); జీవితం సుఖంగా జరుగుబాటు కోసం నాలుగు రాళ్లు వెనకేసుకోవద్దా అని కేకలేసే ( “How Much Land Does a Man Require?” by Leo Tolstoy కధ సదివినావు గందా అంటూ నవ్విన ); జీవన సాయంసంధ్యలో పనికొస్తుంది డబ్బులు కూడబెట్టాల బిడ్డా అంటే (
ఉదయ సంధ్య, సాయంసంధ్య, అసుర సంధ్య, గోధూళివేళ వంటి సంధ్యలను ప్రకృతి వొడిలోనుండి వీక్షణానందజనిత తన్మయత్వంతో ఉన్న జయతి బిడ్డ చిరునవ్వు తప్ప మారుమాట్లాడలేదు ).
అమరేంద్ర గారూ! కాలం నాడు ” భద్రం కొడుకో! నా కొడుకో కొమరన్న” అని విలపించిన గద్దరన్న చేత మళ్లీ భద్రం బిడ్డో! నా బిడ్డో జయతమ్మా అని సుద్దులు చెప్పించాలనిపిస్తోంది అని అన్నా సంటిబిడ్డలా నవ్వుతున్నది మీ జయతి బిడ్డ.
బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుందో సూక్ష్మంగా దంత వేదాంతం గానో, దంతుర్తి వేదాంతం గానో తెలియజేసిన శర్మ గారికి కృతజ్ఞతలతో
~ ఇప్పటికీ ఏ పనీ సరిగా రాని ఓ అడ్డగాడిద
“this old man, who habitually addressed his pupils as donkeys and traced their genealogies on either side with thoroughness”
~ from R.K. Narayan’s novel The Guide
Bhanumathi , Managalampalli Bala Murali Krishna , M .Subrahmanya Raju may also may fall in this category. Most of the work attributed to Bhanumathi , albeit ,could have been done by ghost composers such as Subrhmanya Raju. Managalampalli’s compositional work may have been restricted to Kannada films. Has any songs sung by Subramanya Raju come to your notice?
We cannot leave out Susarla Dakshina Murthy from this category. He is said to have sung in films such as Lakshmamma, [ or was it for Sri Lakshmamma Katha?] Paramnadayya sishyula katha[1950], Samsaram, Santosham, Mantri kumari [Ttamil] and Sarvadhikari [Tamil].
In the case of J.V.Raghavulu, a duet with Jikki comes to mind “Biatho baitho Naa Pellikodakaa.” This male voice is said to be that of Jetti Veera Raghavulu. Have you come across some other songs by Raghavulu? Many a journalist cite some anecdotes involving him having fainted in the process of singing for recording of some poems for an N T R film.
So is the case of S .P Kodandapani. His songs may be quite few.
Regards.
Yours faithfully,
Siddineni Bhava Narayana.
ఇంచుమించు ఒక దశబ్దం తరువాత ఈమాట ఓపెన్ చేసాను, అప్రయత్నంగా. ఏమున్నాయా అని వెతుక్కుని, పక్షపాతంతో ముందు మీ కవితే చదివాను. నా అంచనా తప్పలేదు. నా కవి ఎదిగాడే గానీ, కలుషితమవలేదు.ఇంత అందంగా పదాలని వాడడం, ఇంత నాజూకుగా భావాలని చెప్పడం మీలాంటి ఏకొద్దిమందికో చెల్లింది. పునః పునః నమస్సులు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గౌరీ కృపానందన్ అమ్మా!
( కథలు మనిషిని సానబెడతాయన్నది నా స్వీయ అనుభవం అన్న గౌరి అమ్మా!! )
ఇప్పటివరకూ సుమారుగా ఓ పాతిక తమిళ కధల వరకూ ఎంతో శ్రద్దతో, సమర్ధవంతంగా అనుసృజించిన అవినేని భాస్కర్ అనువాద కధల్లో యీ “పిలుపు” కధ (ఓ సామాన్య పాఠకుడినైన) నన్నెంతో కదిలించివేసింది. మళ్లీ, మళ్లీ చదివిస్తోంది.
తెలుగు కథాసాహిత్యం లోని అత్యంత ప్రతిభాశాలురు, సృజనశీలురు చలం, బుచ్చిబాబు, త్రిపుర, వడ్డెర చండీదాస్, రమణజీవి గారలనేకులు చూపించిన తాత్వికత, చింతన, చైతన్య స్రవంతి, ఓ భారరహిత స్థితి లాంటివి యీ “పిలుపు” కధలో అద్భుతంగా చూపిన అవినేని భాస్కర్ కి (అన్నమయ సంకీర్తనల అభిమాని, అమాయక చక్రవర్తి అని తన మిత్రులు అప్యాయంగా పిలుచుకునే భాస్కర్ కి) చేతులు జోడిస్తున్నా.
“మనసులో ఒక కనికరమూ, కృతజ్ఞతా భావమూ కలిగి నన్ను నేను సమర్పించుకునే మార్గం తెలియక తపించసాగాను. ఆ పిలుపు వెనుకనున్న కరుణను స్వీకరించాలంటే ఏదో ఒక జత పాదాలపైన శిరస్సు వుంచి వెక్కివెక్కి ఏడిస్తే తప్ప సాధ్యంకాదనిపించింది” అనే భావన మనోభావానలంలో అలసి, సొలసి, సొక్కిపోయాలా చేసి నన్ను త్రిపుర తండ్రి తలపోతల్లోకి తీసుకెళ్లాయి. అందుకూ కృతజ్ఞతలు భాస్కరియో.
నవంబర్ 2018 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
11/12/2018 3:01 pm
ఎంత చూసినా ఇందులో బొమ్మ ఏవిటో అర్ధం కాలేదండి. “బొమ్మలు” అన్నారు. ఒకటి కంటే ఎక్కువగా ఉన్నయా? నాకు కనిపించినది ఒకటే. 20 పక్షులు బాగానే ఉంది మరి ఆ కాళ్ళేమిటో కలగాపులగంగా? ఇంతింతై అన్నదానికి అర్ధం స్ఫురిస్తోందా అందులో? నా మట్టిబుర్రకి అందటం లేదు మరి. ఇరవై ఏళ్ళంటే మాటలు కాదు ఈ వేగమైన డిజిటల్ యుగంలో. ఏది ఏమైనా ఏమీ ప్రకటనలు లేకుండా, ఉచితంగా తెలుగు కోసం కష్టపడుతున్న నిర్వాహకులకీ, సంపాదకులకీ అభినందనలు.
సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2. గురించి రాళ్ళపల్లి సున్దర రామ శర్మ అభిప్రాయం:
11/12/2018 3:49 am
ఏల్చూరి మురళీధరరావు గారికి శత సహస్ర వందనాలు.
మీ వ్యాసం ఆసాంతం నన్ను కట్టి పడేసింది. గణపవరపు వారి ప్రబంధరాజము మీద ఇంత విస్తృతంగా పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు.
ఇకపోతే, పద్య కవిత్వం బాగా అలవడి అదికాస్తా చిత్ర కవిత్వం పై మక్కువ గా మారింది. గర్భ కవిత్వం, ద్వ్యక్షరీ, త్ర్యక్షరి, ముక్త పదగ్రస్తం వంటి ప్రయోగాలు బాగానే చేయగలిగినా ప్రబంధరాజ కావ్యాన్ని దానిపై పరిశోధిత వ్యాసాలను చదివి మరిన్ని మెళుకువలు సాధించాలని ఆశ.
కాని ఆ పొత్తము అంగడిలో అలభ్యంగా ఉంది. అలాగే అంతర్జాలంలోనూ లభించుట లేదు. అది ఉపలబ్దమయ్యే మార్గము సూచించ గలరు.
భవధీయుడు
రాళ్ళపల్లి సున్దర రామ శర్మ
Akshara Vinyasam
Natelugu savvadi blogspot.com
+919440597260
పుస్తక పరిచయం: అడవి నుండి అడవికి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
11/11/2018 10:24 pm
అడవితల్లి వొడిలో సేదతీర్చుకోవాలనే ధ్యాసే కాని, పురుగూ పుట్రా ఉంటాయ్ జాగ్రత్త జయతి బిడ్డా అంటే ( అదంతా మనమేర్పరచుకున్న భయాందోళనల తప్పు అభిప్రాయాలు అంటూ నవ్విన ); జీవితం సుఖంగా జరుగుబాటు కోసం నాలుగు రాళ్లు వెనకేసుకోవద్దా అని కేకలేసే ( “How Much Land Does a Man Require?” by Leo Tolstoy కధ సదివినావు గందా అంటూ నవ్విన ); జీవన సాయంసంధ్యలో పనికొస్తుంది డబ్బులు కూడబెట్టాల బిడ్డా అంటే (
ఉదయ సంధ్య, సాయంసంధ్య, అసుర సంధ్య, గోధూళివేళ వంటి సంధ్యలను ప్రకృతి వొడిలోనుండి వీక్షణానందజనిత తన్మయత్వంతో ఉన్న జయతి బిడ్డ చిరునవ్వు తప్ప మారుమాట్లాడలేదు ).
అమరేంద్ర గారూ! కాలం నాడు ” భద్రం కొడుకో! నా కొడుకో కొమరన్న” అని విలపించిన గద్దరన్న చేత మళ్లీ భద్రం బిడ్డో! నా బిడ్డో జయతమ్మా అని సుద్దులు చెప్పించాలనిపిస్తోంది అని అన్నా సంటిబిడ్డలా నవ్వుతున్నది మీ జయతి బిడ్డ.
ఆనందం గురించి తః తః అభిప్రాయం:
11/11/2018 4:18 am
అసలైన ఆనందం విచారంగా చూస్తుంది
నిజంగా ‘ఆసలైన ఆనంద’ మైతే దానికి విచారం ఎందుకుంటుంది?
తః తః
అడ్డగాడిద గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
11/10/2018 7:45 pm
బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుందో సూక్ష్మంగా దంత వేదాంతం గానో, దంతుర్తి వేదాంతం గానో తెలియజేసిన శర్మ గారికి కృతజ్ఞతలతో
~ ఇప్పటికీ ఏ పనీ సరిగా రాని ఓ అడ్డగాడిద
“this old man, who habitually addressed his pupils as donkeys and traced their genealogies on either side with thoroughness”
~ from R.K. Narayan’s novel The Guide
అడ్డగాడిద గురించి viswanadh అభిప్రాయం:
11/10/2018 1:48 am
బాగుంది శర్మగారూ!
గాయకులుగా సంగీత దర్శకులు గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
11/09/2018 8:21 am
Paruchuru Sreenivas Garu,
Bhanumathi , Managalampalli Bala Murali Krishna , M .Subrahmanya Raju may also may fall in this category. Most of the work attributed to Bhanumathi , albeit ,could have been done by ghost composers such as Subrhmanya Raju. Managalampalli’s compositional work may have been restricted to Kannada films. Has any songs sung by Subramanya Raju come to your notice?
We cannot leave out Susarla Dakshina Murthy from this category. He is said to have sung in films such as Lakshmamma, [ or was it for Sri Lakshmamma Katha?] Paramnadayya sishyula katha[1950], Samsaram, Santosham, Mantri kumari [Ttamil] and Sarvadhikari [Tamil].
In the case of J.V.Raghavulu, a duet with Jikki comes to mind “Biatho baitho Naa Pellikodakaa.” This male voice is said to be that of Jetti Veera Raghavulu. Have you come across some other songs by Raghavulu? Many a journalist cite some anecdotes involving him having fainted in the process of singing for recording of some poems for an N T R film.
So is the case of S .P Kodandapani. His songs may be quite few.
Regards.
Yours faithfully,
Siddineni Bhava Narayana.
ఆనందం గురించి Phani Dokka అభిప్రాయం:
11/08/2018 8:38 pm
ఇంచుమించు ఒక దశబ్దం తరువాత ఈమాట ఓపెన్ చేసాను, అప్రయత్నంగా. ఏమున్నాయా అని వెతుక్కుని, పక్షపాతంతో ముందు మీ కవితే చదివాను. నా అంచనా తప్పలేదు. నా కవి ఎదిగాడే గానీ, కలుషితమవలేదు.ఇంత అందంగా పదాలని వాడడం, ఇంత నాజూకుగా భావాలని చెప్పడం మీలాంటి ఏకొద్దిమందికో చెల్లింది. పునః పునః నమస్సులు.
బురద గురించి సత్యవతి అభిప్రాయం:
11/08/2018 10:02 am
అద్దం తెచ్చి మొహం ముందు పెట్టేస్తారు చంద్ర గారు
పిలుపు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
11/07/2018 7:54 pm